దేవుడు ప్రతి అమ్మాయికి తగిన వరుణ్ణి ఎక్కడో పుట్టించే ఉంటాడు అంటుంటారు కదా? పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అంటే ఇదే. మనం పిల్లలని రుణసృణాల బంధం అని నమ్ముతాం. ఇలా భారతీయులు ఆధ్యాత్మికతను ఆలింగనం చేసుకుంటారు. మరి అదే ఆధ్యాత్మికత ఈ గ్రంధంలో గంధంలా కలిసి గుబాళి స్తుంది. అందుకే భారతవర్ష ఆధ్యాత్మిక కావ్యం. ఆచార్య ఎన్ . వి కృష్ణారావు గారు అందుకనే భారతవర్ష ని "భారతీయ ఆత్మ" అన్నారు.
నాస్తికులు పాశ్చాత్త్య విజ్ఞానం తమకు పూర్తిగా తెలియకున్నా భారతీయ విజ్ఞానాన్ని గెలిచేస్తుంటారు. భారతీయ శాస్త్రాల ప్రకారం చెప్పే ఫలితాలు (పంచాంగం నుండి గ్రహణాలు ) ఆధునిక శాస్త్రీయ విజ్ఞాన ఫలితాలతో సరిపోతున్నాయి కదా. అందు చేత నాస్తికులు కూడా చదివి ఆనందించే గ్రంధం భారతవర్ష.
స్థూలంగా చూస్తే విదిష వర్షలది ఒక జన్మ సంబంధంగా కనిపిస్తుంది సూక్ష్మ పరిశీలన చేస్తే అంటే నవలలో వివిధ భాగాలలో ఉన్న విదిష ప్రస్థానాన్ని ఒకచోట చేర్చి చూస్తే విదిష వర్షలది ఒక జన్మ సంబంధం కాదు జన్మ జన్మల సంబంధం అని తెలుస్తుంది. అగోచర ఆధ్యాత్మిక ప్రయాణమే వారి ( అందరి)జీవితాలు. అనేక జన్మలలోంచి, దేహాలలోంచి కాలాలలోంచి, వారి ఆత్మలు ప్రయాణం చేస్తుంటాయి. ఎహే ఆత్మలు లేవు ఏమీలేవని కొట్టి పారేస్తే చెప్పలేము. ఆత్మలని నమ్మబట్టే కదా ప్రపంచంలో ప్రతి మతంలో కర్మకాండలు ఉన్నాయి. బైబిల్, కురాన్ గీత కూడా ఆత్మలున్నాయని, ప్రునర్జన్మలు ఉన్నాయని నమ్మాయి కదా! సరే నండి నమ్మాము. మరి వాటిని తెలుసుకోడం ఎలా ?
వెంటనే తెలియాలంటే కుదరదు. యోగసాధన ద్వారా ద్వారా తెలుసుకోవచ్చు. అందుకు సమయం వెచ్చించాలి, ఏకాగ్రత కావాలి, పరిపక్వత రావాలి. అన్నిటికీ మించి యోగ్యతో యోగమో ఉండాలి. సంగీత సాధన మొదలుపెట్టిన అందరికీ సంగీతం అబ్బుతుందా?
విదిషకి భవిష్య వాణి విద్య యోగ్యత ఉంది రాలేదు యోగం ఉండి వచ్చింది. తల్లి ఆత్మ కనిపించడం వెనుక ఆమె (కృషి) యోగ్యత ఏముంది? చనిపోయిన తల్లి కనిపిస్తు న్నాదని చెపితే అందరూ ఆమె మానసిక స్థితిని శంకిస్తారు. ఆమె కూడా కర్మ కాండ చేయించే బ్రహ్మగారిని ఆత్మలుంటాయా అని అడుగుతుంది. అమ్మ ఆత్మ కనిపించడం నిజం అని నమ్మడానికి కూడా ఆమెకి సమయం పడుతుంది. ఆవిషయం తెలియగానే తండ్రి కూతురిని మాతనిచేసి భవిష్యవాణి అని వ్యాపారం మొదలెట్టేస్తాడు. ఇది మామూలే కదా పేడ పిడకలకి డిమాండ్ ఉంటే బజాజ్ కంపెనీ, గాద్రెజ్ కంపెనీ అన్నే రంగంలోకి దిగుతాయి. దేనికి డిమాండ్ ఉంటే దానితోనే వ్యాపారం చేస్తారు. కానీ ఈ వ్యాపారం ఆమెకి ఇష్టం ఉండదు "అమ్మ కనిపిస్తేనే భవిష్యవాణి చెపుతాను నాకు ఏ మహిమలు లేవు" అని చెపుతుంటుంది. పరిమళ బాబా దగ్గర ఏడుస్తుంది. మెల్లగా సాధనలోకి దిగుతుంది. నిద్రాహారాలుమాని సాధనలో రోజులు, వారలతరబడి ములిగిపోతుంది.
ప్రకృతి మూడు రూపాలతో ప్రకటితమవుతుంది. మొదటిది ఇంద్రియాలతో తెలిసికోబడే స్థూల ప్రకృతి. రెండవది ఇంద్రియాలకు అతీతమైన సూక్ష్మ ప్రకృతి. ఇది అంతర్గతమైనది, అత్యంత శక్తివంతమైనది. మూడవది మూల ప్రకృతి (spirit)ఇది శాశ్వతం, స్థిరమైంది. ఇది సృష్టిలోని అన్ని శక్తులకు మూలాధారం. దీనికి వినాశనము లేదు. ఐతే అందరూ ఈ ఆధ్యాత్మిక విషయాలని నమ్మాలని లేదు. పాపులర్ అయిన విషయాలనే జనబాహుళ్యం నమ్ముతుంది. మతం బాగా పాపులర్ అయ్యింది కనుక దాన్ని అందరూ సులభంగా నమ్ముతారు. విశ్వాసాలు సమాజంద్వారా సంక్రమిస్తాయి. మతం అనేది మన పూర్వీకుల డెడ్-ఎండ్ మార్గం. ఆధ్యాత్మికత వ్యక్తిగత మైనది. హింగోరి చెప్పినట్టు మతం అంతమైనప్పుడు ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది.మతం అనేది జైలు లాటిది. ఐతే ఎత్తైన జైలు గోడను దూకి తప్పించుకునే ఖైదీలు ఎంతమంది ఉంటారు? అలాగే మతంగోడ దూకి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించే వారి సంఖ్య కూడా తక్కువ. కానీ విదిష ప్రవేశిస్తుంది.
ఆరవది ఏడవవ అధ్యాయము మార్మికదర్పణ సాధన, విదిష సాధన గురించి చాలా విషయాలు చెపుతుంది. అక్కడినుంచి విదిష వర్షలది జన్మజన్మల సంబంధం అని విదిషకి అవగతమౌతూ ఉంటుంది. యోగ సాధనలో అనేక జన్మలు ఒక లిప్త కాలం ఆమె స్మృతి పథంలో మెరిసి పోతాయి.
"బాంబుల మ్రోత బెర్లిను పట్టణమున మ్రోగుచుండగ జనులంత పరుగు దీయ
భీతి నొందగ పరుగిడి ప్రాణమొదిలె చూచిచూచిక ప్రియుని జాడలేక"
అనే తేటగీతి విదిష బెర్లిన్ లో పుట్టి చనిపోయినట్టు చెపుతోంది. పదకొండవవ శతాబ్దమందు కశ్మీర మందు మదనాభిరామ కుమార్తె గా జన్మించి బిల్హణుని ప్రేమించిన యామినీ పూర్ణతిలక గాను,1590 లో తూర్పుగోదావరి ముంగండగ్రహారం చెందిన ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన పండితుడు జగన్నాధ రాయలుని ప్రేమించిన చక్రవర్తి షా జెహాన్ కుమార్తె యువరాణి లవాంగికా గాను
ప్రాచీన గ్రీకుపురాణ వీరుడు, మానవాతీత సంగీత నైపుణ్యాలను కలిగిన ఆర్ఫియస్ ను పెళ్లాడిన యూరిడిసి గాను. (అతను గొప్ప కవీశ్వరుడు. అపోలో ఓర్ఫియస్కు తన వీణను బహూకరించెను. యూరిడిసి వివాహమైన కొలది దినము లకే పాముకాటుతో మరణించెను.)
జర్మనీదేశపు మహాకవిగా ప్రసిద్ధికెక్కిన గూఠను 1770 లో కలుసుకొని ప్రేమించిన పద్దెనిమిదేళ్ల ఫ్రెడెరిక్ బ్రియాగాను. (బ్రియా ఎదురుచూచుచు మరణించెను)
విదిష ఆత్మ ప్రస్థానం విశ్లేషిస్తే ఆమె గ్రీస్ లో ఒకసారి, జర్మనీలో రెండుసార్లు, అమెరికా లో ఒక సారి భారతదేశంలోమూడు సార్లు పుట్టిందని తెలుస్తుంది. గ్రీకు పురాణం కాలం లో 900 బి.సి లో గ్రీస్ లో ఒకసారి, 17వ శతాబ్దంలో స్ట్రోబోర్గ్ లో ఒకసారి,19వ శతాబ్దం లో బెర్లిన్ లో రెండవ ప్రపంచయుద్ధ కాలంలో మరొక సారి, 15 వ శతాబ్దంలో రాయలు ఆస్థాన నర్తకి గా ఒకసారి 16 వ శతాబ్దంలో జహంగీర్ కుమార్తె లవంగిక గా మరికసారి, 20 వ శతాబ్దంలో అమెరికాలో లో వ్యోమగామిగా ఒకసారి జన్మించిన విదిష 21వ శతాబ్దంలో మళ్ళీ భారతదేశంలోనే జన్మించింది. విదిష అన్ని జన్మలలో పండితులనే ప్రేమించింది. ఆమె పాండిత్యాన్నేవలచిందా? పండితులని ప్రేమించిందా? విదిష దేవత ఐతే చనిపోయి నట్టేనా? మరింత ఆసక్తి కరమైన భారతవర్ష -2 లో చదవండి.
Wow. Bharatavarsha II. Will they meet in Bharatavarsha II?
ReplyDeleteBharatavarsha II is not a book. It's life. I mean the readers feel like that.
ReplyDeleteVidisha paandityaanni mechchi panditulani premistundi
ReplyDelete