Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, November 27, 2021

Gone far ahead

Bharatavarsha has gone far ahead.

ఉదయం క్లాసులు, సోషల్ వర్క్ రోడ్డుపని అప్పుడప్పుడు టివి, న్యూస్ పేపర్ వర్క్,  సెమినార్లు.  అలిసిపోయి పడుకుంటున్నాను. పడుకున్నాక సంస్కృత గీతాల తరంగాలులా  తాకుతున్నాయి.  పల్లవి మెదడులోకి ప్రవేశిస్తుంది. ఇంక డెస్క్ దగ్గరకి వెళ్లి కూర్చోడమే.  నాకేంటీ బాధ అని నేను ఎప్పుడూ అనుకోలేదు.  ఆమె నన్ను ఎంచుకున్నదేమో అనిపిస్తుంది.  

అలా గీతాల సంఖ్య పెరిగింది  గీతాలు తో పాటు కథ కూడా చాలా పెంచాను. కథ రాయడానికి ప్రేరణ తులసీగారు అయితే   ఈ గీతాలు సంఖ్య పెంచడం  వెనుక  ప్రేరణ పాడుతా తీయగాలో  శ్రీ బాలసుబ్రమణ్యం గారి మెప్పు పొందిన భీమవరం అమ్మాయి చిరంజీవి శ్రీవల్లి. ఆమె తో,  వాళ్ళ అమ్మగారితో  ఫోనులో మాట్లాడేను. ధనాపేక్షలేని కళారాధకులు వారు. నా పాటలను ఎన్నో సార్లు మెచ్చుకున్నారు. ఈ గీతాలు మా అమ్మాయికి ఎంతగానో నచ్చాయి. అందుకే పరీక్షలు అవుతున్నా రాత్రులు సాధన చేసి పాడింది అని ఆడియోలు పంపారు. 

నేను ఇప్పటికే నెలల తరబడి నప్పని గాయనీ గాయకులని సంగీత దర్శకులని భరించాను. ఏసు క్రీస్తుకి ఎన్ని మేకులు పడ్డాయో తెలీదు గానీ వారితో నా వొళ్ళంతా తూట్లు పడిపోయింది. అలాటి సమయంలో ఇలాటి  గాయనీమణి దొరకడం  నా అదృష్టం. చిరంజీవి శ్రీవల్లి  పాటలను చక్కగా పాడడమే కాకుండా పాటలను ఏంతో అపురూపంగా భావించి ప్రాణం పోసింది.  ఈ గీతాలు చిరంజీవి శ్రీవల్లికే  అంకితం

                                                                    ***

ఉదయము పదిగంటలు మాలినిగారు గృహకృత్యములందు నిమగ్నమయ్యి యుండగా "అమ్మా ఎవరు వచ్చుచున్నారో చూడు"మనుచూ మంజూషతల్లి చెవివద్ద చెప్పెనుమాలినిగారు ప్రవేశ ద్వారమువైపు ద్రుష్టి సారించగా రాచకన్య ధీరత్వము నాయకత్వ ప్రతిభ మూర్తీభవించిన విగ్రహముతోముఖములో వ్యంజితముమగు అప్సరకళతో అపూర్వ నూపురనాదములతో తరలివచ్చు నందనమువలె నగుపించిన అరుణతారకు  ఎదురేగి మీరు కబురు పంపిన మీరున్న చోటుకి వచ్చెడివారమని అనుచూ మాలినిగారు ఆమెను  స్వాగతించి లోనికి తోడ్కొని పోయిరి.

 “నాకు విమానాశ్రయమునకు బోవుటకు సమయమున్నది. మీతో మద్యానం వరకు ఉండుటకు వచ్చితిననగా విని సంతసించిరి.  కేశవుడు పరుగున వచ్చి అరుణతారను నల్లుకుపోయెనుఅట్లు లోనికి పోవుచూ మండువాగది గుమ్మమువద్ద దామినిని చూసి అరుణతార అచ్చెరువొందెను.  వార్తాపత్రిక చూసి తెలుసుకొనుటయే గాని నీవు నాకు చెప్పితివా అని దామిని మూతిముడిచెను. నిన్నవిశ్వవిద్యాలయములో  కార్యక్రమమునకు  వచ్చిన తెలిసెడిది.  

మాలిని వద్ద  కొంత సేపు గడిపి తరువాత నీవద్దకు  వచ్చుటకు నిర్ణయించుకొంటిని. అని చెప్పుచున్ననూ దామిని బింకము వీడదాయెను. అరుణ దామిని చెవి పుచ్చుకొని మెలివేయ సాగెను.

అయ్యో వొదలవే జడల బఱ్ఱె అని గింజు కొనుచుండెను. నన్ను జెడలబర్రె అందువా నీ పేరు వేలుముడి అని అందరికీ చెప్పమందువా అని తార అనెను. చెప్పవలెను చెప్పవలెనని మంజూష మధ్యలో చొ రకొనగా అందరూ నవ్వుకొనిరి.మాలిని నీవు పరిచయము చేసిన నేస్తమే కదా!   ఆమె పరిస్థితి ఏమైనా తెలుసు కొంటివా?అదియునూ పత్రికలలో చూసి తెల్సుకొందువా! ”అని దామినినడిగి చెవివదిలెను. దామిని చెవి రాసుకొంటూ అన్నీ తెలుసుకొంటిని అందుకే ఇచ్చటికి వచ్చితిని. బైరెడ్డి దుమ్ము దులిపినావు కదా అని  ముసి ముసి నవ్వులు నవ్వెను. అందరూ నవ్వుచుండగా మంజూష విలవిల లాడెను. అందరూ లోనికి ప్రవేశించిరి. పిదప ఆమెను వర్ష చదువుకొని గదిలోనికి గొనిపోయి సోఫాపై కూర్చొండబెట్టిరి అచ్చటనున్న విదిష నమస్కరించి ఒక ప్రక్కగా నిలబడి ఉండగా అరుణతార ఆమెను పిలిచి ప్రక్కన కూరొండబొట్టుకొనెను

అరుణతార సుదీర్ఘ  వృత్తాంతమును (చంద్రమతి కేశవ  గౌడసోదరుల కథను, భర్త  నిర్వాకమును) వివరించిన పిదప

                                        

"అమ్మ వంటపూర్తి అయినద"ని మంజూష అనగా ఇంకా ఆలస్య మెందులకు  అందరమూ కూర్చొనవచ్చ”ని మాలిని గారనిరి. మాలినిగారు వడ్డన చేయబోగా ఆమెను కూర్చొనబెట్టి  మంజూష, విదిష వడ్డన చేసిరి.  బోజనములైన పిదప అందరూ మండువాగదిలో కూర్చొనిరి. అరుణమ్మమనసు మెత్తబరుచుటకు భారతవర్ష వీణావాదనము మొదలిడెను.

స్వాగతమే స్వాగతమే అంబరమున మెరిసెడి తారకు సంబరమే సంబరమే ఆనంద నిలయములొని.  పాడుచుండగా నిగర్వియైన తార వలదని వారించెను వర్షుని కత్తికి రెండు వైపులా పదునునున్నది. అతడు అరుణను దుర్గగా భావించి ఒక ద్వంద్వార్థ గీతమునాలపించెను

 

త్రిమూర్తి ప్రేరిత,  త్రిభువన విలసిత  త్రినేత్ర భూషిత మాతా

శుంభ - నిశుంభ హారిణి ద్వాదశరూపిణి మాత

చండ ముండ సంహారిణి  నిశ్చలరూపిణి మాత

త్రిగుణవర్జిత  గంగాజనిత  విచలిత  రసన  మాతా  

అంబకమునకందక  అంబరమున

సంబరముగ శోభిల్లు మాతా

సంకటములు బాపుటకు తరలొచ్చిన మాతా

మామనసులె ఆనందనిలయమీ వేళా

ఆనందనిలయమునకు సంబరమీ వేళా

విలంబము సేయక విడంబము వీడగా

దుష్కర్మున కంకకకరణము మొనర్చిన  తారా

ధరలోని ధర్మాన్ని నెలకొల్పిన తారా

నృత్యప్రియ శివప్రియ జనప్రియ

దిగంబర పరంపర సాగించుహేలా

దిగంబర పరంపర సాగించుహేలా

జనయిత్రి ప్రసవిత్రి సావిత్రి మాతా

వరవినుత గుణరహిత తపో జ్వలిత మాతా

త్రిమూర్తి ప్రేరిత,  త్రిభువన విలసిత  త్రినేత్ర భూషిత  మాతా

షుమ్బ  నిషుమ్బ  హారిణి ద్వాదశరూపిణి మాత

చండ ముండ సంహారిణి  నిశ్చలరూపిణి మాత

త్రిగుణవర్జిత  గంగా జనిత  విచలిత  రసన  మాతా  

విలంబము సేయక విడంబము వీడగా

దుష్కర్మున కంకకకరణము మొనర్చిన  తారా

ధరలోని ధర్మాన్ని నెలకొల్పిన తారా

నృత్యప్రియ శివప్రియ జనప్రియ

దిగంబర పరంపర సాగించుహేలా

దిగంబర పరంపర సాగించుహేలా

త్రివేణి సంభవి శాంభవి మహిషాసుర మర్ధిని శాంభవి

కైలాసవాసిని శాంభవీ సింహవాహిని శాంభవి

దుర్గతినాశినీ శాంభవి  శాంభవి శాంభవి శాంభవి.

వర్షుడు పాట ముగించిన పిదప ప్రేమ, సంతోషము, ఆశ్చర్యము  అరుణతారను ముప్పిరిగొన్నవి. వర్షుని ఆశీర్వదించి ఆమె తన  బంగారపుటుంగరమును బహుమతిగా ఇవ్వబోగా వర్షుడు నిరాకరించి, ఒక పుష్పమిచ్చిన చాలుననెను. కానీ పుష్పము వాడిపోవునుకదా యని అరుణతార అనగా  విదిష"అట్లెన్నటికీ కాదు  బాధ్యత  నాది ఇచ్చి చూడ" మనెను. అరుణతార పుష్పమును ఇచ్చుచుండగా విదిష  చకచకా  చిత్రమును గీచిచూపగా  అచ్చెరువొంది విదిషను ముద్దాడెను.   విమానాశ్రయమునకు బయలుదేరుచుండగా మాలినిగారి చిరు కంటి సైగతో మంజూష పళ్ళెములో చీర జాకెట్టు పసుపు కుంకుమతో వచ్చెను.

ఇప్పుడివన్నీ ఎందులకమ్మా అనుచుండగా ఇంటికొచ్చిన అతిథి  దుర్గతో సమానము గంధము పూసి గౌరవించుట మన సంప్రదాయమని  చెప్పి మాలినిగారు పీట వేసి మంజుష వైపు చూసి ఇచ్చట కూర్చొన్నది దుర్గమ్మ అని చెప్పెను. మంజూష కళ్ళలో ఆనందము తొణికిసలాడెనుమంజూష అరుణతార పాదములవద్ద కూర్చొని పసుపు రాయుచుండెను. విదిషకి  కూడా ఆమె పాదములు తాకవలెనని మనసు తహతహ లాడుచుండెను. అరుణతార ఆమెవంక చూసి అంగీకార సూచకముగా మందహాసము చేసెను. విదిష ప్రేమ కెరటమై ఆమె పాదములనందుకొని మంజూష తో  కలిసి  మంగల చర్చర్చనము చేయసాగెను. మాలినిగారు పాడుచుండిరి

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా

ఈ దీనుల లోగిలి లోకి  అడుగిడరావమ్మ

నీ అడుగుల సవ్వడి వినగా  చెట్టు చేమ వికసించెనమ్మా 

నీ పాద ముద్రలు పడగా ధర్మం ధరలో  విలసిల్లేనమ్మా

నే  చేసిన పుణ్యము కొలది

నిను కొలిచెడు  భాగ్యము పొందితి నోయమ్మా 

ముష్కర మూకల భంజించి 

విషమును దీసి విదిషను నిలిపితివి

ప్రతప్త మానస దీనులకు ధీమా నిచ్చి ధీటుగ నిలిపితివి

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా

పసుపు రాయుచున్నంత సేపు మాలినిగారట్లు పాడుచుండిరి. ఆడపిల్లలిద్దరూ తన్మయత్వముతో పసుపురాయగా మగపిల్లలు పారవశ్యముతో చూచుచుండిరి. పిదప మంజూష బొట్టుపెట్టి చీర జాకెట్టు నిచ్చి గంధము పూసెను.  అరుణతార మనసుపులకరించి   సరస్వతి నిలయమునకు వచ్చు భాగ్యము నాదమ్మా అనుచూ మాలినిగారిని కౌగలించుకొనెను. కాలినడకనబోవుచున్న ఆమెను చూచి ఒక యోగినివలె నున్నదని అందరు అనుకొనిరి

                                                                         ***

2 comments:

  1. Bharatavarsha mee kriyaseelataku, kalatrushnaku nidharsanam. Maalanti pamarulaku kuda paandityam meeda
    aasakti kalgela chesaru.

    ReplyDelete
  2. మీరు చదివి ఆనందించారు చాలా సంతోషం మీరు నిజమైన రసాస్వాదకులు.

    ReplyDelete