ధర్మవిధులు గుడివాడ రామారావు గారు , భాషాకోవిదులు తెలుగు కాడమీ చైర్ పర్సన్ డా లక్ష్మీ పార్వతి గారు, పండిత పారంగతులు ఆచార్య కృష్ణారావుగారు , జ్ఞాన తేజోమూర్తులు సామ్యులు ఆనంద్ (ఐ . ఏ. ఎస్ ) గారు ఇందరు సరస్వతీ మూర్తులు అలంకరించిన వేదికపై నేను ఉండటం గొప్ప అదృష్టం. తెలుగు కాడమీ చైర్ పర్సన్ డా లక్ష్మీ పార్వతి గారి చేతిమీదుగా భారతవర్ష విడుదల కావడం ఒక గొప్ప వరం. ఆవిడ అంత గొప్ప వ్యక్తి తరలివచ్చారు.
"శ్రీ కృష్ణుడంటి పతి కుత్కృ ష్ట మైన సతి, జిలుగు చీరలు కట్టని తెలుగు బిడ్డ
నినుచూసి మురిసేను తెలుగు గడ్డ. గతముకాని గతము ఘనమైన గతముతో
దృతమైన లక్ష్మికి నుతమైన పార్వతికి ఘన స్వాగతం.. ఘన స్వాగతం "
ఇంత కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు భూరి దాత గుడివాడ రామారావుగారు వారిని సన్నానించుకుంటూ
"సత్కార్య స్ఫూర్తి, చైతన్యమూర్తి , భాషానురక్తి, ధర్మాదిశక్తి, దైవభక్తి,
గుండెనిండ మెండుగున్న తెలుగోడా తొణకని నిండుకుండ గుడివాడ
వాడవాడల నీ కీర్తి పొదలాడా బెజవాడలో గుడివాడ ..
సీమపన్నీరము నీ శిరమున చిలకరించ శ్రీరాము దయ నీపై కురిపించ.."
"మత్తేభంబై వచ్చి సవిత్తుకుత్తేజంబునిచ్చి ఆచార్య శ్రీ కృష్ణ కృపనిచ్చి
తెలుగుకు తేజంబునిచ్చి నన్నుమెచ్చి దీవించి నా కవితలో జీవించి సభకు
జీవంబు నొసగె .....వందనం వందనం ఆచార్యదేవులకు వందనం
భూపేష్టంబిది రాయలు మెచ్చిన తెలుగు రత్నాల వెలుగు
చెలిమికి చోటిచ్చి తెలుగుకి దీటిచ్చి మెలుగు శివరత్న కిరణుడు
నిలిపిన వెలుగు. భారతవర్షంబున నీ కీర్తి ప్రజ్ఞాన కిరణమై చెలగు.
బాల్య మిత్రుడు దూసి మూర్తి తో పూలబాల |
దూసిగాడినిటు బిలిచి దుశ్శాలువాగప్పి ధూపమేసి దుర్వార వాసమొసగి
వాసికత్తెలు వచ్చి లేశము పూసి రాసిసేయరే దూసి దూకలడగ
(దుర్వార = ఎదురులేని; వాసము = వస్త్రము వాసిగత్తె = అందగత్తె
రాసిసేయు = పొగడ దూకలి = శ్రమ అడగ = అణగ)
No comments:
Post a Comment