ఒక గొప్ప వ్యక్తి నాతో ఒక చిన్న పని పడి నన్ను వారి ఇంటికి రమ్మన్నారు. సరే నని వెళ్ళాను. ఆయన ఈ టీ వీ లో నా కార్యక్రమం చూసారు. వారికి భారతవర్ష గురించి తెలుసు. కలెక్టర్ గారికి మీ భారతవర్ష చూపించి ఏమైనా సహాయం కోరవచ్చు అని చెప్పారు. ఈ రోజు వారింటికి వెళ్లి హాల్లో కూర్చున్నాను నన్ను పిలిచిన డాక్టరుగారి కోసం ఎదురు చూస్తూ. అక్కడ ఒకాయన మాస్క్ ధరించి ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాను. నన్ను పిలిచిన డాక్టర్ గారు వచ్చారు. ఒక ఐదు నిమిషాలు మాట్లాడేక. " నా పని ముగిశాక కలక్టరుగారి వద్దకు తీసుకు వెళతారా అని అడిగేను. మీరుమాట్లాడుతున్నదికలెక్టర్ గారితోనే"అని డాక్టర్గా రన్నారు. కలెక్టర్ గారు మాస్క్ తీశారు. నేను ఆశ్చర్యపోయాను.
నా ఆశ్చర్య స్థాయి నీకు తెలుస్తుంది. ఆశ్చర్యాన్ని వెయ్యితో హెచ్చ వెయ్యి. ప్రత్యేకించి నాకోసం కలక్టరుగారు వచ్చారు అంటే ఎవ్వరైనా పకపకా నవ్వుతారు.కానీ వచ్చారు. రావడమే, కాదు నాతో చాలా సేపు మాట్లాడారు. భారతవర్ష లో కొన్ని పేజీలు చదివారు. ఏదైనా సహాయం చేస్తాను అడగమన్నారు. పుస్తక విడుదల కార్యక్రమానికి మీరు వస్తే అదే నాకు పదివేలన్నాను. వేయి మాటలెందుకు ఆయన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అబ్దుల్ కలాంగారిని కలిసినట్టుంది. అంతటి నిరాడంబరమైన వ్యక్తిని మళ్లీ చూస్తానా?
సాహిత్యానికి స్నేహహస్తం అందిస్తున్న కలక్టరుగారికి కృతఙ్ఞతలతో
శా. చూపే చల్లని దీవెన స్థలపతే చూపంగ కావ్యంబు నే ఆపేక్షే యది చూడమానసము నందౌదార్య మేపొంగ డా బేపొక్కించక వాక్యములన్ జదివెన్ వీణాస్వనంబేల గన్ రూపేమారును పెద్దలిట్లు చనగా లోకాలు వ్యాపింప గన్
Collect sir and Poolabala sir, both are great personalities - Sahitya
ReplyDeleteGreat
ReplyDelete