పూతచంద్రము గదిలె పుణ్యములు గదిలె
కోటిపడగలు నొదిలి కొమ్మలు కదిలె
తిరుకొళంబులో తిమిత పద్మములు కదిలె
తిరువెంకటాధీసు దీవెనలు బడసె
సంగీత కొలనందు చెంగలించు చెంగల్వలు |
శా. గానశ్రా ణతనీ కుఅక్ష యముగా కగారా లగండ శైలా
గాన్ధార స్వరమం తకంఠ మునఇం కగానీ కచ్చపి స్వనం
బేనాలిం చివిన బ్రమంది మనసే విరాజి ల్లిరాసి చ్చెయా
వీణాపా ణిసుతుం డుభూరి కవితా భివాద మ్ముగార మ్ముతో
గాన శ్రాణత = గాన పరిపక్వత ; నీకు అక్షయము గాక ; గారాల గండశైలా = ముచ్చటైన కోకిలమ్మా
గాన్ధార స్వరమంత = మధుర స్వరము; కంఠమున ఇంకగా = గొంతులో ఇంకగా;
నీ కచ్చపి స్వనంబే = (సరస్వతి వీణపేరు కచ్ఛపి) ఆ వీణా తంత్రుల నాదము (వంటి స్వరము)
నాలించివిని = శ్రద్దగా విని అబ్ర మంది = అబ్బుర మంది ; మనసేవిరాజిల్లి = మిక్కిలి ఆనందించి
రాసిచ్చెయా ; వీణాపా ణిసుతుండు = సరస్వతీ పుత్రుడు; భూరి కవితాభివాద మ్ము = కవితా ప్రణామము
గార మ్ముతో = గౌరవముతో
శార్ధూల గణ మత్తేభ యతి : 14 అక్షరము
గానశ్రా ణతనీకు అక్షయము గాదె గారాల గండశైలా
గాన్ధార స్వరమంత కంఠమున నిండగా నీ కచ్చపి
స్వనం
బే నాలించి వినంగ ముగ్దుడయి నీ ప్రభే మెచ్చి నీకిచ్చ యా
వీణాపాణి సుతుండు భూరి కవితా నివేద మ్ముతోమా లగన్
Soooooper sir...
ReplyDelete👍👍👌👌💐💐🙌👏....
ReplyDeleteSuper👌👌
ReplyDeleteభారతవర్ష లిఖిత, సరస్వతీ మానసపుత్ర నమస్సుమాంజలి
ReplyDeleteశార్దూలాలతో, మత్తేభాలతో ఆడుకుంటున్నారు మీరు.
పామరులకు కూడా పాండిత్యం మీద ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.