మన ధర్మం ఏమిటో మన సాహిత్యం చెప్పలేకపోతే
మన ధర్మానికి మన సాహిత్యానికి కూడా విలువవుండదు
మన భాష లో ఉన్నత పదజాలం మనకి తెలియకపోతే
నీచమాయాజాలంలో చిక్కుకుంటే మధురభావాలు మనకి
దక్కకుంటే మన భాషకి మన బ్రతుకుకీ కూడా విలువుండదు.
భూపేయంబిది రాయలు మెచ్చిన తెలుగు రత్నాల వెలుగు రాజధానిలోని రమణుల కరముల వెలుగు. |
ఉన్నత మైన ఆలోచనలు ఉన్నవారే ఉన్నతులు
మాట్లాడి, వెలకోసం వెంపర్లాడితే వెలయాళ్ల సమాజం మిగులుతుంది
ఉన్నకాలు నరుక్కుని పెట్టుకున్న కొయ్యకాలు మెరుస్తున్నాదని
మురిసిపోయే తల్లితండ్రులు, కార్లుంటే కాళ్ళెందుకనే ప్రభుత్వాలు
తెలుగు ఎలా వెలుగుతుంది ? పక్కింటివాడి దీపం ఉంది కదా అని
విషపు మాటలు విడిచిపెట్టి ఎదో ఒకలా తెలుగు మాట్లాడుతున్నానని
సర్దుకుపోక స్వచ్ఛ మైన తెలుగు భాషని ఆస్వాదించి చూడు.
మన ధర్మం మన భాషతోనే మొదలౌతుంది , మన సంస్కృతి మన భాషలోనే బ్రతుకుతుంది.
"భారతవర్ష" గ్రంధం మన భాషా సంస్కృతి ధర్మాలగురించి మధురంగా చెపుతుంది.
Bharatvarsha reached to Delhi. Congratulations
ReplyDeleteThank you. It has to reach its destination in October
ReplyDelete