శ్రీనాథుడు , గౌడ డిండిమ భట్టు , ధూర్జటి కాళహస్తీ శ్వర శతకం , వసుచరిత్ర , గ్రీకు పురాణాన్ని పోలిన పీ బీ షెల్లీ అరితూసా అనే ఆంగ్ల పద్యం దానిని పోలిన విశ్వనాథవారి కిన్నెరసాని పాటలు, ఫ్లాబో అనే ప్రెంచ్ రచయిత వ్రాసిన మదాం బోవారి , టాల్స్టాయ్ వ్రాసిన వార్ అండ్ పీస్ అన్నకేరినీనా , షేక్స్ పియర్ సొనెట్స్
భారతవర్ష లో సాహిత్య కథలు -1
చందాల కేశవదాసు తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసినది ఈయనే. శ్రీకృష్ణతులాభారం నాటకానికి చందాల కేశవదాసు 22 పాటలు రాశారు. ఈ పాటలతో నాటకాన్ని ‘మైలవరం బాలభారతి నాటక సమాజం’ వారు చాలాసార్లు ప్రదర్శించారు. ఈ పాటల్లో బలే మంచి చౌక బేరము, మునివరా, కొట్టు కొట్టండిరా అనే మూడు పాటలువిశేష జనాదరణ పొందినవి . 1935, 55, 66 సంవత్సరాల్లో తీసిన మూడు సినిమాల్లోనూ ఈ మూడు పాటలున్నాయి. పైడిపాల రాసినట్లుగా సినిమాల్లోకి ఎక్కాయి. కేశవదాసు కుమారులు కృష్ణమూర్తి... రామానాయుడు మీద ఖమ్మం కోర్టులో కేసు గెలిచిన ఫలితంగా 1966లో సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా టైటిల్స్‌లో కేశవదాసు పేరు చేర్చడం జరిగింది.
భారతవర్ష లో చరిత్ర కథలు -2
కథానాయకుడు భారతవర్ష ఇంగ్లిష్ వారి గొప్ప సంస్కృతిని పొగుడుతున్న తన ఆజ్ఞాన మిత్ర బృందానికి కళ్ళు తెలిపించడానికి చెప్పే కథ
7 వ హేన్రీ కి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఆర్థర్ చిన్నకొడుకు 8 వ హేన్రీ. పెద్ద కొడుకు కి బాగా కట్నం పుచ్చుకుని కేథరీన్ ఆరగాన్ తో వివాహం చేస్తాడు . వివాహమైన ఐదు నెలలకే ఆర్థర్ చనిపోడంతో, మావ గారే కోడలిని ( కేథరీన్ ) వివాహం చేసుకోబోతాడు. వియ్యకుండు తో చివాట్లు తిని తన చిన్న కొడుక్కి ( 8 వ హెన్రి )ఇచ్చి వివాహం చేస్తాడు .
8 వ హేన్రి కి 10 ఏళ్ళు ఆమెకు 16 ఏళ్ళు అందుకే పో ప్ ఒక ఐదేళ్లు ఆగమంటాడు. 5 ఏళ్ళ తరువాత వివాహం జరుగుతుంది. వివాహమైన తరువాత మగపిల్లలని కన లేదని ఆమెకు విడాకులు ఇవ్వాలని చూస్తాడు. అప్పటికీ అనుమతి ఆలస్యం అవుతుండడంతో చర్చ్ లను నన్నరీలను మూయించి చర్చిపై రాజుదే అధికారం అని ప్రకటించి తనకు తానే అనుమతి ఇచ్చుకొని ఆన్ బోలియన్ ను వివాహం ఆడేస్తాడు. ఆమె కూడా ఆడపిల్లని (ఎలిజబెత్)కనడంతో అక్రమసంబంధం దేశద్రోహం అంటగట్టి తలతీయించేస్తాడు.
ఆరుగురి భార్యలని వాహం చేసుకుని , ఇద్దరికీ శిరచ్చేదం , ఇద్దరికీ విడాకులు ఇవ్వగా ఒకామె ( జే న్ సెమూర్ ) పురిటిలో చనిపోతుంది. చివరి కి కేథరీన్ పార్ అనే మరో ఆమెను చనిపోయే ముందు చేసుకుని రాజ్యాన్ని ఆమె హస్తగతం చేస్తాడు. నిజంగా ప్రేమించిన వాళ్లకి మగ సంతానాన్ని ఇవ్వ నందుకు శిరచ్చేదం చేయిస్తాడు. ఆర్థర్ పెళ్లి కి అతడి వయసు 7 సంవత్సరాలు , హెన్రి 8. పెళ్ళికి అతడి వయస్సు 15 ఏళ్ళు. బాల్య వివాహాలు వరకట్నాలు మగపిల్లలని కనన్నందుకు మరణ దండన అని ఇంగ్లాండ్ రాజకుటుంబాల కథలు భారతీయులు ఎవరైనా చెప్పడం విన్నారా ?
No comments:
Post a Comment