ఆ సరస్వతీ దేవే పంపిందా లేక ఆ సరస్వతే వచ్చిందా అని ఎంతో అపురూపంగా అనిపించింది.
ఆమె అమెరికన్ అయినంత మాత్రాన గొప్ప విశేషం ఏమీలేదు
90 పుస్తకాలు వ్రాసిన ఒక గొప్ప రచయిత్రి అది చాలా విశేషం.
నేను 60 పుస్తకాలు వ్రాసిన ఒక రచయితని అని గొప్ప గా చెప్పుకోడానికి
అవకాశంలేని ఒక గొప్ప విశేషం.
200 సోనెట్స్ తో కూడిన "ఇండియన్ సోనెటీర్స్" అనే పుస్తకం వ్రాసాను. ఇండియన్ సోనెటీర్ కి ముందుమాట విదేశీ ప్రొఫెసర్ చేత వ్రాయించమని ఇక్కడ ప్రొఫెసర్స్ ముందుమాట వ్రాస్తే దానికి అంత విలువ ఉండదు అని విదేశీయులు చెపితే నే భారతీయులు వింటారు అని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా చెప్పేసిన తరువాత. నేను ఆలోచనలో పడ్డాను, కానీ వాగ్దేవి ముంగిట్లో ముత్యాలు కురిపించింది. కేథరిన్ మదోక్స్ నా సొనెట్స్ కి ముందుమాట వ్రాస్తారు. నాకు ఆమె ఒక యూనివర్సిటీ కంటే ఉన్నతంగా కనిపించారు.
Super sir
ReplyDeleteSuper sir
ReplyDelete