అప్పుల్లో కూరుకుపోయిన నా స్నేహితుడు అప్పు చేసి సినిమా తీసాడు. సినిమాలు చూసే పిచ్చి ఉంటేనే చికాకు పడతాము. ఇతనికి సినిమా తీయాలని పిచ్చి పట్టింది. తాను ఒక మంచి కథ రాసాడట. కథ ఏంటంటే హీరో తండ్రి ని చంపినవాడి పై పగ సాధించబోయి వాడి బ్లాక్మయిల్ కి లొంగి దగ్గరే కిల్లర్ గా చేరతాడు. ఆ ఇష్టం గానే హత్యలు చేస్తూ ఉంటాడు. అలా సినిమా మొత్తం హత్యలు హింస. చివరికి పెళ్ళాం చేతిలో చచ్చిపోతాడు. ఇది హిట్ అవుతుందని అతని ఆశ. ప్రజలు హింస నే ఆదరిస్తారని అతని వాదన. డబ్బంతా ఖర్చు అయినా సినిమా పూర్తి అవ్వలేదు. మళ్లి అప్పుల కోసం వేటలో పడ్డాడు.
నాకు అనేక మంది ఇలాటివాళ్ళు తగిలారు. తమ వెకిలి ఆలోచనలు పదోక్లాస్ తప్పిన వాళ్ళు రాసేటట్టు డైలాగులు. ( ఫాదర్ జయంట్, ఫేమిలీ జాయంట్ ప్రాస కుదిరితే చాలు ) వ్యర్థ పదార్ధం లా కుళ్ళి కామెడీ చూపించి ఇవి అద్భుతమైన ఆలోచనలుగా చెపుతున్నారు .
దీనికి ఒక కారణం ప్రజలు పిచ్చి వెధవలనే నమ్మకం. రెండవ కారణం కొంతమంది డైరెక్టర్లు గుడ్డి గుఱ్ఱం తాపు గా ఒకటి రెండు విజయాలు సాధించి వింధ్య పర్వతాలని వంచేసిన అగస్త్యులలా సంవత్సరాల తరబడి మీడియాలో సెలిబ్రిటీస్ లా చలామణీ అవుతున్న ఫేక్ సెలిబ్రిటీస్ వారి మానసిక రుగ్మతలను యువతరం మీద రుద్దడం. మన పెద్దలకి ఇలాటి ఆలోచనలే వస్తున్నాయి. వాళ్ళ బుర్ర ఇలాగే పనిచేస్తున్నాది. వాళ్ళు బతికి బాగు పడాలంటే పిల్లలు చెడిపోవాలి. వాళ్ళు పిల్లలని బాగుపడనివ్వరు. ఎందుకంటే మీడియా ని, సినిమాని, సెల్ ఫోన్ ని పక్కన పెట్టడం పెద్దలకే సాధ్యపడడంలేదు.
No comments:
Post a Comment