Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, August 25, 2022

P.B. Siddhartha College Telugu department

ఈనాడులో "తెలుగు నవలకు ప్రపంచ రికార్డు" అని  వచ్చిన వార్త చూసి  "భారతవర్ష  నవల పై అవగాహన" అనే కార్యక్రమాన్ని సిద్ధార్థ కళాశాలవారు  నిర్వహించడం ఎవ్వరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  తెలుగు భాషే వద్దు పొమ్మని అంతా  గేట్లు మూసేస్తుంటే వీరు తెలుగు నవల మీద అవగాహన అని శీర్షిక పెట్టారంటే ఆశ్చర్యం కలగకమానదు.   (ఈ రోజుల్లో  రికార్దులని , స్పూర్తిగా తీసుకుని భాషను పక్కన పడేసే వాళ్లనే ఎక్కువ చూశాను.)

సిద్దార్థ కళాశాల తెలుగు విభాగధిపతి డాక్టర్ పూర్ణ చద్రరావుగారు భారతవర్ష నవల అవగాహన కార్యక్రమంలో ప్రారంభోపన్యాసంలో కార్యక్రమం ఉద్దేశ్యాన్నితెలియజేస్తూ స్వయంగా లిఖించిన అక్షర సుమాల జల్లులను కురిపించారు. ఆయన మనసు  మరుమల్లె తోట అయితే  ఆయన స్వరం గంగా ప్రవాహం.  ఆయన స్వర మాధుర్యాన్ని సొక్కి పులకరించిన  నా మనసు స్పందన 


ఉ. కోవిదు లోష్ఠముల్   కదప    కోవలు పారును     భాషగం ధమై 

       తావులు   వీనులన్   దగల   తాళము దీటుగ  తాండవిం చ గన్   

కోవిదు  లేమిజె  ప్పినను   కోవెల గంటవ   లెధ్వనిం చుచున్

భావము హారతై   వెలుగు   బాగుగ   నొప్పును  పూర్ణచం ద్రమై





                                   

 భారతవర్ష ఇతివృత్తం, గద్య పద్య సామరస్యం నవరసాల పద్యాల పాడి వినిపించాను , భారతవర్ష లో చరిత్ర , సాహిత్యాలగురించి వ్రాసిన చిన్న కథలు (నా పంచకట్టు కూడా)  విద్యార్థులను ఆకట్టుకున్నాయి. రెండు గంటల పాటు విద్యార్థులు గోలచేయ కుండా మైమరచి విన్నారు. కొంత మంది విద్యార్థులు నా  పంచ కట్టుని కూడా ఇష్టపడి  ఫోటోలు  తీసుకున్నారు.  

తెలుగు తల్లి చేతిలో చెంగల్వ డాక్టర్ పూర్ణ చంద్రరావుగారు వేగుచుక్కై  వెలుగుతూ తెలుగువారి గుండెల్లో గుడిగంటగా మ్రోగుతుండాలని కోరుకుంటున్నాను.

                                                                 ***   

I thought I was introducing my novel Bharatavarsha to the world. In fact recently I realized that the novel Bharatavarsha is introducing me to the world. The feeling is Amazing !!!! 

Bharatavarsha Telugu gave my life a good turn. The English Version of Bharatavarsha is underway. I hope the English version gives a better turn to my life.  

Bharatavarsha is a missile delivered by love. Bharatavarsha is the communication between two lovers. The whole world doesn't know that it is a whisper of two hearts. I missed the inauguration function of Telugu Bharatavarsha. But at any cost, I will attend the inauguration function of the English Version of Bharatavarsha. says the heroine of the novel. I will be glad to introduce the lady behind the novel if she is so willing.  You will hear the true love story.

                                      

1 comment: