మూడురోజులక్రితం ఒక ఫోన్ వచ్చింది " తెలుగు మాతృబాష దినోత్సవం నాడు దూరదర్శన్ లో మాతృభాషపై కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము అని. వస్తున్నాను అని నేను సమాధానం చెప్పగానే " తెలుగు అనగానే మీరు గుర్తొచ్చారు అని చెప్పి ముగించారు. ప్రతిసంవత్సరం ఇలాటి ఆహ్వానాలు అందుకున్నప్పటికీ ఇది మరుపురాని ఆనందం కదా. ప్రతిసంవత్సరమే కాదు ప్రతినిత్యం దివ్య అనుభూతిని కలుగజేస్తున్నది సరస్వతి మాత, ఆ తెలుగు తల్లి.
భారతవర్షకు సన్మానం . భారతవర్ష గ్రంధం విడుదలైనప్పటినుంచి ఇప్పటిదాకా ప్రతి ఏడూ భారతవర్షకు సన్మానం జరుగుతూనే ఉంది.
2022 ఫిబ్రవరి లో సిద్ధార్థ మేనేజ్మెంట్ , ఫార్మసీ కళాశాల చాలా ఘనము గా చేశారు.
2022 మే లో స్కాట్-స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో భారతవర్ష సాంస్కృతిక కార్యక్రమము,
2022 లో మార్కాపురం లో భారతవర్ష సాహిత్య పరిచయం సాంస్కృతిక కార్యక్రమం జరిగాయి.
2023 ఫిబ్రవరి లో ప్రభుత్వ సన్మానం మాతృబాష సేవా శిరోమణి బిరుదు కూడా వచ్చింది.
2023 ఫిబ్రవరిలో అదే రోజు ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో లో సన్మానం
2023 మార్చ్ లో వుయ్యూరు లో సరసభారతివారి ఉగాది సన్మానం.
2023 మార్చిలో పామఱ్ఱు ఘంటసాలపీఠం వారి ఉగాది సన్మానం.
2023 ఏప్రిల్ లో అనంతపురం జిల్లా గణిగెర లో నేను లేకున్నా గ్రంథానికి సన్మానం
2023 ఆగస్టు 23 న ఉషోదయ పాఠశాల లో భారతవర్ష సాహిత్య సన్మానం
No comments:
Post a Comment