ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథ రచయిత్రి నిమ్మగడ్డ వరలక్ష్మి
సాటివాడికి సాయపడడం లో జీవితానికి అర్థం ఆనందం వెతుక్కునే వారు ధన్య జీవులు. అలాటివారు చరిత్ర పుటలలోనే కాక సాటివారి హృదయాలలో నిలిచిపోతారు. ఆకోవకి చెందినవారే శ్రీమతి నిమ్మగడ్డ వరలక్ష్మి. ఆధ్యాత్మిక ధార్మిక గ్రంధాలను రచించడం అనువదించడం ఈమె కు హాబీ . ఉమాసహస్రం , రామ కృషుని ఆంతరంగిక శిష్యులు , స్వామి జ్ఞానానంద , సంక్షిప్త వచన సుందరాకాండ వంటి పెద్ద సంస్కృత గ్రంథాలను ఈమె తెలుగులోకి అనువదించారు. దేశవిభజనకు ముందు తరువాత ఆర్ ఎస్ ఎస్ వారు చేసిన సేవను వివరించే న పూల్ చడే న దీప్ జలే హిందీ పుస్తకాన్ని తెలుగు లోకి అనువదించారు.
60 దాటినా ఒక పక్క రచనలు చేస్తూ రహదారులపై గుంతలు పూడుస్తూ సామాజిక సేవ చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు వరలక్ష్మి . ఈ మధ్య వరలక్ష్మి పూణే సందర్శనకు వెళ్లి నప్పుడు ఒక హోటల్ లో బసచేశారు . ఆ హోటల్ లో భాగ్యశ్రీ అనే ఒక స్త్రీ సేవకురాలిగా పనిచేస్తున్నారు. భాగ్యశ్రీ బహుభాషి ఆమె హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మరాఠీ మాట్లాడుతుంది. భాగ్యశ్రీ గది శుభ్రం చేయడానికి వచ్చినప్పుడు భాగ్యశ్రీ ప్రతిభను తెలుసుకుని సత్కరించి కొంత డబ్బు ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు అందుకుగాను వరలక్ష్మి గారు తన పర్యటనలో కొంత భాగాన్ని రద్దుచేసుకోవాల్సి వచ్చింది.గొప్ప ధార్మిక రచనలు చేయడమే కాక గొప్ప మనసున్న స్త్రీ వరలక్ష్మి.
No comments:
Post a Comment