Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, August 9, 2024

వింటే ఫిదా పాటకు జీవం పోసిన గాయని

ప్రముఖ సంగీత విద్వాంసులు ఎన్‌సీహెచ్‌ బుచ్చయాచార్యులు వద్ద కర్ణాటక సంగీతంలో నేర్చుకుని  అనేక  సంగీత కార్యక్రమాలలో పాడి  శ్రోతల మనసులను గెలుచుకున్న ఈ గాన సరస్వతి   పేరు రుగ్వేదం పద్మశ్రీ. 2024 లో మార్చి 8 వ తారీకున విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని  పురస్కరించుకొని స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో  పద్మశ్రీ నాన్‌ స్టాప్  గా  116 మంది తెలుగు సినీ నేపధ్య గాయనీమణులు ఆలపించిన గీతాలను ఏకగళంతో ఆలపించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు విదేశాల్లోను కూడా తెలుగు పాటలను వినిపించి కీర్తి గడించిన ఈమె  భారతవర్ష పాటలను అద్భుతంగా ఆలపించిశ్రోతలను అనేక సార్లు  మంత్రం ముగ్దులను చేశారు.  పద్మశ్రీ  గారు  భారతవర్ష పాటలకు ప్రాణం  పోశారు  ఆమె భారతవర్ష పాటలు  పాడడం నిజం గా నేను చేసుకున్న అదృష్టం అన్నారు భారతవర్ష గ్రంథ రచయిత పూలబాల.


దుర్గమ్మను చూచిన అనుభూతి కలిగించే - కృష్ణశ్రీ  పాట. 

 భారతవర్ష గ్రంథానికి  అందం, కీర్తనలకు కీర్తి  - కృష్ణశ్రీ .  

పిన్న వయసులోనే  దుర్లభమైన  గాత్ర  మాధుర్యాన్ని, కీర్తిని  ప్రతిష్టలను ఆర్జించిన గాయనీ మణి కృష్ణశ్రీ.   ఈ గాయని గురించి రెండు మాటల్లో చెప్పాలంటే  గొంతులో నిండా తీయని రాగాలు,  ఇంట్లో నిండా  బంగారు పతకాలు అదే  మన ఋగ్వేదం కృష్ణశ్రీ.  అక్కతో కలిసి వచ్చి భారతవర్ష లో శాస్త్రీయ గీతాలని పాడి పులకరించే లా చేస  ప్రతిభ ఆమెకు ఉంది.   గొంతు లో రాగాలు , ఇంట్లో పతాకాలు చాలా మందికి ఉంటాయి గుండెల్లో ప్రేమ  లేకపోతె ఒక చిన్న లైక్ కూడా కొట్టలేము.  ఇక్క డ అమ్మాయి చిన్న పిల్ల. నాన్న అనుమతి లేనిదే ఆ అమ్మాయి అగ్గిపెట్టి కూడా అందించదు.    

"పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి ...   ఈ డైలాగు ఎక్కడో విన్నటుంది  కదూ.  ఈ డైలాగుని వేదికపై చెప్పడం  గొప్పకాదు   విని చప్పట్లు  కొట్టేసి తమ పని చూసుకోడం గొప్పకాదు.   నేటికాలంలో అలాంటి వాళ్ళే  ఎక్కువ  ఆ మాటను మనసులో పెట్టుకుని ఆచరణలో పెట్టేవాళ్లు బహు తక్కువ  వాళ్ళే మహానుభావులు,  కర్మ యోగులు.  అటువంటి వారిలో ఒకరు ఋగ్వేదం కిషోర్ గారు.   కృష్ణ శ్రీ  నాన్న గారు.  వేద సంప్రదాయాలను  , సనాతన ధర్మాన్ని డైలాగుల్లో కాకుండా  చేతల్లో చూపించే మనిషి.   "అందుకే భారతవర్ష గ్రంథంలో  శాస్త్రీయ సాహిత్యాన్ని తన చేయి అందినంతవరకు పైకెత్తారు." అన్నారు రచయిత పూలబాల. 

సనాతన ధర్మానికి  సనాతన భాష, సాహిత్యం, సంప్రాయాదాయం చాలాముఖ్యం. అలనాటి పురాతన సంస్కృత కావ్య సంప్రదాయమే  ప్రబంధం.   భారతవర్ష  అనే తెలుగు గ్రంథం  ఈ కోవకుచెందినదే. ఉన్నత బాష  కథా విలువలున్నదే  ప్రబంధం.  భారతీయ సంస్కృతి ఇందులోనే దాగి ఉంది.    

నేటి తరం దారి మళ్లిన  హింస్మాత్మక ఆంగ్ల చిత్రకథల నకళ్లను చూసి దిగజారిపోతున్నాదని  భారతవర్ష ప్రబంధం వ్రాయడమేకాక   ఒక జీవిత ధ్యేయంగా   పెట్టుకుని  దానిని తెలుగు వారికి  చేరడానికి  కృషి చేస్తున్నారు వెంకట్ పూలబాల.   సినిమాతీస్తే మరో శంకరా భరణం లా ఉంటుంది. తెలుగు వారు ఆదరిస్తే అంత  కన్నా బాగుంటుంది.   

 నాటి శాస్త్రీయ సాహిత్యాన్ని   శాస్త్రీయ సంగీతాన్ని ఆదరిస్తారా ?  

ఇంకా అలాటి మనసున్న మహానుభావులున్నారు. 

ఎందరో మహానుభావులు  అందరికి వందనాలు.         

No comments:

Post a Comment