శ్రీ పల్లి నాగేశ్వరరావు శ్రీమతి కనకదుర్గ పుణ్య దంపతుల పుత్రుడు గురుభక్తి తో భక్తి సాహిత్యం వర్ధిల్లాలని కోరి అక్షరాలా పదివేలు ఇచ్చాడు. ఆ చిరంజీవి శతాయువై వర్ధిల్లాలని తన స్టైల్ లో కవితా నీరాజనం ఇచ్చాడు పూలబాల.
ధనచక్ర విషవలయ బంధంబులన్ జిక్కి విషయవాంచా బద్ధులై, సంసారబద్ధులై , భీతచేస్కులై , మందచేతస్కులై, క్రూరచేతస్కులై, ప్రజాకోటి పరంబె రుగక పాపఘ్న పాపకార్యంబులన్ బరిభ్రామ్యమాణాత్ములై, నెరుపగా, మృక్కటి జనులన్ విడివడి ఉద్దాములై నీ జననీ జనకుల్ దానధర్మంబుల్ పుణ్యకార్యంబుల్ జరిపి యంబుజోదరున్ అగ్గించి వేడంగ ఆ నైర్మల్య యాగమంబులన్ దానధర్మంబులన్ పుణ్యకార్యంబులన్ ప్రాప్తించి దదంతర్గతజ్యోతి వై, యస్వంతువై, యస్వంతు భక్తుండవై వర్ధిల్ల యా జస్వంతుడే నీకొసగె గురుభక్తి విద్యాశక్తి సత్కర్మలన్ జేయు యుక్తి , మాతృవర్గ పితృవర్గ సంస్కారముల్, ఆచార్య దీవెనల్ బడసి కమలాక్షు చక్షువులంబడి విజ్ఞానచక్షుండవై విలసిల్ల వే, జ్ఞాన తరంగమై యున్నతిన్ బొందవే , వేదం శబ్దంబువై విఖ్యాపనే జెంది జగద్గీతకీర్తీ నొందేవే యస్వంత యోగీశ వైరాగ్య జ్ఞాన విజ్ఞాన ముల్ , పూర్ణంబుగా గ్రోలి సౌఖ్యోన్నతిన్ సోలి యోగీశ్వర సత్తమ సవిత్తు శ్రేణికిన్ సహకారి వై మెలిగి, చక్రి మానస సరోవరమునన్ చక్రాంగమై మెదలవే, వెలుగవే యా చక్రి బింబితంబై.
No comments:
Post a Comment