పిల్లల పుస్తకాలతో మొదలుపెట్టిన ప్రయాణం ప్రపంచ రికార్డులతో ఆగిపోక పీ హెచ్ డీ దాకా...
పూలబాల రచనలు పీ హెచ్ డీ విద్యార్థుల రీసెర్చ్ కి ఉపయోగపడుతున్నాయి అంటే కారణం వీరే
ఎన్ టీ యార్ అకాడెమీ అధ్యక్షులు అట్లూరి కృష్ణసతీష్ గారు, తెలుగు సాహిత్య ప్రాధాన్యతను గ్రహించి పూలబాల భారతవర్ష నవలకి ఆర్ధిక సాయంచేయడమే కాక పూలబాల రచించిన కాళహస్తీశ్వర శార్ధూల శతకాన్ని విని ఆస్వాదించి, మెచ్చి అట్లూరి మీడియాలో మరియు 360 డిగ్రీస్ ఛానల్ లో అవకాశం వచ్చేట్టు చేశారు. "అదే ప్రోత్సాహంతో నేను సరస్వతీ శతకం రాశాన" ని రచయిత పూలబాల అట్లూరి కృష్ణ సతీష్ గారికి కృతఙ్ఞతలు తెలియజేసారు.
రచయితలని ఆరోజుల్లో రాజులు. ఈరోజుల్లో మనసున్న మారాజులు ప్రోత్సహిస్తున్నారని అందరికి వందనాలని పూలబాల తెలిపారు. భక్తి , శృంగార, విప్లవ, మరియు (విదేశీ భాషల నుంచి)అనువాద సాహిత్య రచయిత ఫాస్ట్ న్యూస్ పాఠకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసారు.
ఎంత గొప్ప రచయితైనా, రాజైనా నిలబడడానికి భూమి కావాలి. భూమి అంటే ఆధారం. రాజుకి సైన్యం రచయితకి అభిమానం కరువైననాడు, రాజు రాజు కాడు , రచయిత రచయితా కాడు. మిలిలేది వల్లకాడు.
సమాజం ఒక వనం రచయితలూ కవులు, మొక్కలు తోటలు. తోటలు పూతోటలుగా మొక్కలు వృక్షాలుగా ఎదిగితే మంచిదే. "ఈ మొక్క వృక్షంగా ఎదిగితే నాకేంటి ?" అనుకోకూడదు. వనాలు వృక్షాలు అందరికీ పుష్పాలని ఫలాలని అందించి నట్టుగా అనేక రచతలు కూడా అందిస్తారు. వారందరికీ వందనాలు. ముఖ్యంగా పుస్తాకాలని ఎన్నడూ అమ్ముకొని రచయిత పూలబాల నిజమైన సాహితీ సేవకుడని సాహిత్య వృక్షం అని చెప్పచ్చు.
ఒక రచనా ప్రాణాన్ని ఒక మొక్క తో పోల్చాడు పూలబాల. ఒక మొక్క ఎదగడానికి సాయం చేయడం చాలా మంచి పని. మొక్కలని తుంచడం వృక్షాలని నరకడం పాప కార్యం.
చాలామంది దృష్టిలో సినిమాలకి రాసినవారు గొప్పకవులు. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పినట్టు సినిమాలకి రాస్తేనే గొప్పకవి కాదు. నేడు పూలబాల అనువాద రచన ఏదేశమేగినా ( 1881 లో ఏచే గరే రాసిన నోబెల్ బహుమతి పొందిన ఎల్ గ్రాన్ గాలెయేతో అనే నవల పీ హెచ్ డీ విద్యార్థులకు రీసర్చ్ కి ఉపకరిస్తోందని చెప్పారు. మరిన్ని నోబెల్ సాహిత్య బహుమతిని పొందిన నవలలను పూలబాల తెలుగులోకి అనువదించాలని కోరుకుందాం. మరోసారి నోబెల్ ప్రైజ్ భారతదేశానికి రావాలని మంచి మనసుతో కోరుకోండి.

No comments:
Post a Comment