8వ తరగతి విద్యార్ధులకు పీజీ క్లాసులు నిర్వహిస్తున్న పూలబాలను చిత్రం లో చూడవచ్చు.
కాలం వేగంగా పరిగెడుతోంది కాలంకంటే ముందు పరిగెడు తున్నారు నేటితరం విద్యార్ధులు ఇది నిజం .
లేకుంటే 8 వ తరగతి విద్యార్దులకు పిజీ క్లాసు లేంటి? అని ఆశ్చర్య పోతున్నారు కొంతమంది. ఇంత చిన్నవయస్సులో తప్పు అంటున్నారు. పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? అంటున్నారు మరి కొంత మంది. ఇంతకీ విషయం ఏంటంటే పీ.జీ అంటే Polyglot [ P.G]
నరసారావుపేట కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఆరు విదేశీ భాషల్లో [French, German, Spanish, Italian, English, Japanese] శిక్షణ పాఠశాలకు ఒక ప్రత్యేక ఆకర్షణ, విద్యార్దులకు గొప్ప అవకా శము. భాషా నైపుణ్యాల శిక్షణ విషయంలో వేలాది అంతర్జాతీయ పాఠశాలల కంటే మిన్నగా ప్రపంచ స్థాయి గుర్తింపుకి అర్హమైన కృషి చేస్తున్నది.'
No comments:
Post a Comment