తెలుగు కోసం ఏంచేసాడు ?
1265 పేజీల భారతవర్ష కావ్యం,1265 పేజీల కాపీ ఒక్కటీ 2000 చొప్పున్న 100 కాపీలు అంటే రూ 2,00,000 ఖర్చు చేసి ముద్రించి ఉచితంగా పంచాడు . దేశ భక్తి గురించే. భారతవర్ష అంటేనే భారతదేశం. ఉచితంగా ఇస్తూ, ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నది దేశ భక్తి సత్పవర్తన మాతృభాష గురించే.
.
భారతవర్ష కావ్యం చెప్పే కథ, భాష, మనసుకి. గొప్ప అనుభూతిని కలిగిస్తాయి పుస్తకం చదవలేము అంటారు. సినిమా తీయలేను అంటాను నేను.
.
చాలా మంది రెండూ చెప్పేది కథలే కదా! అంటారు. సినిమా చూడగలిగి చదవలేని తరానికి ఇలాటి కావ్యాన్ని ' అందించడానికి ప్రయాస పడుతున్నాను. వారు కనీసం ఈ వ్యాసం చదివగలరని ఆశిస్తున్నాను.
చాలామంది అభిమానంతో సినిమా తీస్తే బాగుం టుంది కదా అని అడుగుతుంటారు. వారికి ఒకటే చెప్తాను ఇప్పుడు చౌకబారు నవలలు మాత్రమే సినిమాలుగా తీస్తున్నారు కావ్యాలని సినిమాగా తీయడం లేదు. ఉత్తమ వ్యక్తులు ఉత్తమ భాష బదులు చెత్తభాష , చెత్త హీరోలు ఇవే నేటి సినిమా లు. డబ్బిచ్చి తలనొప్పి కొనుక్కుని ఏడుస్తున్నారు.
.
వంద ఉత్తమ చలన చిత్రాలకు సమానం ఒక కావ్యం. కావ్యం ప్రభావం జీవిత కాలం ఉంటుంది సినిమాకి కావ్యానికి వెలయాలికి ఇల్లాలికి ఉన్నత తేడా ఉంది.
.
సభ్యమైన భాషని వదిలి, సవ్యమైన ఆలోచనలని వదిలి, పెడదారి పట్టిన సినిమాకి తెలియదు. శాంతికి, సభ్య ప్రవర్తనకి మంచి భాష మంచి సాహిత్యమే నాందని. ఈ విషయమ డబ్బులున్న వాడి బుర్రకి ఎక్కలేదు. ఎక్కి ఉంటే చిత్తశుద్ధితో కళాదృష్టితో సినిమా సృష్టి జరిగేది. ధన వృష్టి కొరకు కామదృష్టి తో కమర్షియల్ సినిమాలు తీసి ప్రజల బలహీనతలతో, మతంలో పురాణాలతో చరిత్రతో ఆడుకుంటున్నారు. తలకి హృదయానికి బంధం తెంచుకొని బరితెగించి బతుకుతున్నారు.
.
అశ్లీల భాష అసభ్య ప్రవర్తన సినిమాకి రెండు కళ్ళు. అశ్లీల బాష, అసభ్య ప్రవర్తనను పట్టించుకోకుండా దుస్తులు నాగరికంగా ఉంటే చాలని చూపిస్తుంది సినిమా. ఆధునిక సినిమా ప్రజలని క్షోభపెట్టినట్టుగా మరేదీ క్షోభ పెట్టదు.
.
సినిమా నటులకు తెర మీద డ్రామా నే అలవాటై పోయి వారి నిత్య జీవితంలో కూడా అసభ్య వాగుడు పిచ్చి ప్రవర్తన ప్రభలిపోతున్నాయి.
.
పుట్టగొడుగు ల్లా మొలిచిన తెలుగు వెబ్ వార్తల పోర్టల్స్ వార్తల పేరుతో దొంగల్లా మన మొబైల్స్ లో, కంప్యూటర్స్ లో జొరబడి మనుషుల మనసులని అశాంతితో రగులు స్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే భారతవర్ష పుస్తకంగా ఉంటేనే బాగుంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు.
.
మనసుకి హత్తుకునే శాస్త్రీయమైన అందమైన తెలుగు భాషలో వ్రాసిన భారతవర్ష మీ మనసు మైదానం పై వర్షమై కురుస్తుంది. మీ మనసులో ఆనందం పచ్చని పంటై పండుతుంది. భారతవర్ష చదివేదాకా కావ్యం చదవడానికి నవల చదవడానికి ఉన్న తేడా తెలియదు,
తెలుగులో నిజమైన మాధుర్యం తెలియదు. ఆనందం ఆకుపచ్చగా ఉంటుందని అసలే తెలియదు. చదవగలను అనే వారందరికీ ఉచితంగా ఇస్తునే ఉన్నాను.
No comments:
Post a Comment