సరస్వతీ దేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతున్న దేవత అలాంటి దేవత గురించి వెంకట పూలబాల వంద పద్యాలు రాసి దేవిని ఘనంగా పద్య పుష్పాలతో అందునా కందాలతో అందంగా అలంకరించాడు. గ్రంథారంభంలోనే "అమ్మకు దయకలిగినచో కమ్మని తేనెల తలంపు కలమున బుట్టున్" అలాగే "నెమ్మిక గలిగిన మదిలో అమ్మయె కొలువ యియిండు నన్నియు తానై" అన్నాడు. పూలబాల దేవిని వర్ణిస్తూ "తెల్లని హంసను యెక్కిన చల్లని మాతను దలంచి చక్కటి విద్యన్, యుల్లము నిండ నిమ్మని యల్లన వేడెద చదువుల నన్నియు నిచ్చున్" అన్నాడు. ఈపద్యం చూస్తుంటే పోతన మహా భాగవతంలో రచించిన "శారద నీరదేందు...గల్గు భారతీ" గుర్తొస్తుంది. పోతన ఆ దేవిని అన్నీ తెల్లని వస్తువులతో అద్భుతంగా పోల్చాడు. ఇంకా ఎన్నో పద్యాలు రసగుళికల్లా అమృత పానం చేయిస్తాయి పాఠకులను. ఈ శత సరస్వతీ స్తుతి చదివి అమ్మ కృపకు పాత్రులు కమ్మని కోరుకుంటున్నాను. వెంకట్ పూలబాల పద్య రచనలో తన నైపుణ్యాన్ని, ఛందోరీతులను దిద్దుకునే తుదిదశలో ఉన్నాడు. ఇంకా మరికొన్ని పద్య కావ్యాలను వెలయించాలని కోరు కొంటున్నాను.
No comments:
Post a Comment