జర్మన్ రైమ్స్ లేదా డోయిచ్ఛ రైమ - కొత్త నీరు
పూలబాల ఇప్పుడు కొత్తగా రైమ్స్ ఎందుకు రాసారో కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
పాతరైమ్స్ అర్థాలు తెలిస్తే షాక్ అవుతారు కొత్తనీరు అవసరం అంటారు.
జర్మన్ లో నేను చిన్న పిల్లలకి రైమ్స్ రాసాను అని స్నేహితుడికి తెలుగులో చెపితే "ఆ దేశస్తులు ఎవరో రాసిన వాటిని సేకరించి ముద్రిస్తున్నాన్నావా ?" అన్నాడు ఎవరో రాసిన వి కాదు నేనే జర్మన్ రైమ్స్ రాసాను అన్నాను. ఏంటి నువ్వే రాసావా ? అన్నాడు. "ఎవరో రాసిన రైమ్స్ ని ప్రచురించలేదు. సొంత గా రైమ్స్ రాసాను " అని చెప్పాను. అప్పుడు అర్థం అయ్యింది. నేను రైమ్స్ రాశానని.
చాలామందికి రైమ్స్ ఎందుకు రాయడం? అనిపిస్తుంది . రైమ్స్ ఇప్పుడు రాయడమేమిటి ఎప్పుడో రాసినవి ఉన్నాయి కదా ? అనిపిస్తుంది. అప్పటి రైమ్స్ అర్థాలు వాటి వెనుక ఉన్న కథలు తెలుసుకుంటే కొత్త రైమ్స్ అవసరం ఉందనిపిస్తుంది.
ప్లేగు, మధ్యయుగాలనాటి పన్నులు, మతపరమైన హింస, వ్యభిచారం: చిన్న వయసులో పరిచయం చేయాల్సిన అంశాలు కావు. రైమ్స్ వెనక ఉండే కథలు ఇవే. నేటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల ఈ నర్సరీ రైమ్‌లను పాడుతున్నారు. పాఠశాలలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ విషయాలను తెలుసుకోలేకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది?
మీరు రైమ్స్ ని కొంచెం లోతుగా తవ్వితే, ఆశ్చర్యకరమైన కథలను బయటకొస్తాయి. చెట్ల నుండి పడిపోయే పిల్లలు సెంట్రల్ లండన్‌లో తలలు నరికివేయబడుతున్న వాళ్ళు, జంతువులను సజీవంగా వండడం ఈ అంశాలను పసిపిల్లలతో పాడించడం సముచితకాదు.
“బా, బా, బ్లాక్ షీప్” అనేది 1275లో ప్రవేశపెట్టబడిన ఉన్నిపై పన్ను గురించి. కొన్ని పాఠశాలలు తరగతి గదులలో దీనిని పునరావృతం చేయకుండా నిషేధించారు కూడా.
గూసీ గూసీ గేండర్ ఇలాటి రైమ్ రాస్తారనిఊహించడం కూడా కష్టం
Goose-a goose-a gander, Where shall I wander? Up stairs and down stairs,
In my lady's chamber; There I met an old man, Who wouldn't say his prayers,
So I took him by his left leg, And threw him down the stairs
అక్కడ నేను ఒక వృద్ధుడిని కలిశాను అతడు ప్రార్థనలు చేయడు, కాబట్టి నేను అతని ఎడమ కాలు పట్టుకుని పట్టుకు అతన్ని మెట్లపై నుండి క్రిందికి విసిరేశాను
కొంతమంది ఈ పద్యం Priest holes సూచిస్తుందని చెపుతారు - రాజు హెన్రీ VIII, అతని పిల్లలు ఎడ్వర్డ్, క్వీన్ ఎలిజబెత్ కింద హింసల సమయంలో కాథలిక్ పూజారులు దాగునేవారు . ఒకసారి పూజారిని ఇంటి నుండి బలవంతంగా తీసుకెళ్లి మెట్లపై నుండి విసిరివేసేవారు.
దీని వెనుక మరో కథ ఏంటంటే ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XVI మరియు అతని భార్య మేరీ ఆంటోయినెట్ , వీరిద్దరూ రాజద్రోహానికి పాల్పడినట్లు తేలింది మరియు తరువాత శిరచ్ఛేదం చేయబడ్డారు.
4. లండన్ వంతెన పడిపోతోంది 1744
“లండన్ వంతెన పడిపోతోంది” అనేది 1014 వైకింగ్ దాడి లేదా పాత వంతెన పడిపోతుందని నిజంగానో భయంతో ఆరోజు పరిస్తుతులను భయాలను రైమ్స్ రూపంలో రాసుకున్నారు. అవి ఇప్పటి తరాలకి , అందునా మన పిల్లలకి అవసరమా ?
5. మేరీ, మేరీ, కాంట్రరీ - 1744
మేరీ, మానసిక రోగని వర్ణించడానికి ఒక పదం . మేరీ, మేరీ, కాంట్రరీ తోటపని సలహా లాగా ఉండే ఈ ప్రసిద్ధ ఆంగ్ల నర్సరీ రైమ్ వాస్తవానికి ఇంగ్లాండ్ క్వీన్ మేరీ I ( బ్లడీ మేరీ) యొక్క నరహత్య స్వభావాన్ని వివరిస్తుంది. ఆమె 1553 నుండి 1558 వరకు రాణిగా వందలాది మంది ప్రొటెస్టంట్లను ఉరి తీయించింది . (వెండి గంటలు మరియు కాకిల్ షెల్స్ వాస్తవానికి హింస పరికరాలు, తోట పని పరికరాలు కాదు.)
6. త్రీ బ్లైండ్ మైస్ // 1805
త్రీ బ్లైండ్ మైస్” అనేది బ్లడీ మేరీ పాలనకు మరొక చెప్పవచ్చు, ప్రొటెస్టంట్ బిషప్‌ల హ్యూ లాటిమర్, నికోలస్ రాడ్లీ మరియు కాంటర్‌బరీ ఆర్చ్ బిషప్, థామస్ క్రాన్మర్— లు సజీవంగా దహనం చేయబడ్డారు త్రీ బ్లైండ్ మైస్ అనే పేరు లో అంధత్వం వారి మత విశ్వాసాలను సూచిస్తుంది.
7. హియర్ వుయ్ గో రౌండ్ ది మల్బరీ బుష్ // 1840
“హియర్ వుయ్ గో రౌండ్ ది మల్బరీ బుష్” తరచుగా పిల్లల ఆటలో భాగంగా పాడతారు. ఇంగ్లాండ్‌లోని వేక్‌ఫీల్డ్ జైలు మాజీ గవర్నర్, . డంకన్, ఈ పాట మల్బరీ చెట్టు చుట్టూ వ్యాయామం చేసే మహిళా ఖైదీలతో ఉద్భవించిందని సూచించారు.
8. రింగ్ అరౌండ్ ది రోజీ - 1665
పద్యం లండన్‌లోని గ్రేట్ ప్లేగును సూచిస్తుంది. “రోజీ” అనేది కప్పి ఉంచిన దద్దుర్లు, వారు “పోసీలతో నిండిన జేబుతో కప్పడానికి ప్రయత్నించేవారు .” ప్లేగు దేశ జనాభాలో దాదాపు 15 శాతం మందిని చంపింది, పద్యంచివర్లో —“యాషెస్! యాషెస్! మనమందరం కిందపడిపోతాము”—అలా దాచవద్దని చెప్పేవారు .
అందుకే నేను రాసిన రైమ్స్ లో అమ్మ నాన్న , చంద్రుడు, సూర్యుడు , మేఘం , సీతాకోకచిలుక , వంటి ప్రకృతి అంశాలను ఉపాద్యాయుడు , స్నేహితులు స్కూల్ వంటి సామాజిక అంశాలను చక్కటి అంత్య ప్రాసతో పాడుకోడానికి వీలుగా రాసాను. స్వస్తి.
No comments:
Post a Comment