నిదించాల్సింది మీడియాను కాదు
నరకాల్సింది చెట్టు కొమ్మలను కాదు వేళ్ళను
పురుషులు కామపీడితులుగా ఎలా మారారు?
నేటికి కూడా మనని పీడిస్తున్న ప్రాచీన పాపాలు
స్త్రీని ఒక విలాస వస్తువులా చూసే జబ్బు ఎలా చేసింది?
ఒక సబ్బుబిళ్ళ గా చూసే జబ్బు సమాజానికి. ఎలా చేసింది?
నేడు సోషల్ మీడియాలో ప్రతి పది పోస్టులలో 8 పోస్టులలో స్త్రీ ల నగ్న చిత్రాలే . శృంగారం అంటే ఏంటి ? ఆడది మగాడి నుంచి కోరుకునేది ఏంటి ?
ఆడది మగాడికి ఎందుకు లొంగుతుంది ? వంటి శీర్షికలతో ఎదో అవగాహన కలిపిస్తున్నట్టు శృంగారం , కామం పెనగలిపి స్త్రీల నగ్న చిత్రాల ను జోడించి పోస్టు వండితే లైకులపంట పండుతోంది.
చాలా పోస్టులు స్త్రీలకి సంబంధిచినవి కాకపోయి నప్పటికీ స్త్రీల నగ్న అర్థ నగ్న చిత్రాలు సర్వసామాన్యం అయిపోయాయి. ఉదాహరణము చిత్ర కల అంటారు స్త్రీ నగ్న చిత్రాలు గీస్తారు ఒంటిమీద నూలు పోగు లేకుండా అంగాగాన్ని చూపుతారు ఏమైనా అంటే కళ అంటారు. ఎవరైనా మూసుకు కూర్చో వాల్సిందే. బూతు, అస్లీలత అనరు. ఎన్నో విప్లవావాలొచ్చాయి. ఈ బూతు చిత్రాలకి వ్యతిరేకంగా ఎందుకు విప్లఅవాలు రావు ?
ఎందుకంటే ప్రజలు నగ్న చిత్రాలకి అలవాటు పడిపోయారు. ఇది వ్యసనమే . ఈ వ్యసనం ప్పటిదికాదు. తరతరాలుగా నరనరాలలో జీర్ణించుకుపోయింది . మైఖేలాంజెలో, బెన్వెనుటో సెల్లిని, జియోవన్నీ బెల్లిని, లెనార్దో దా విన్సీ ఇంకా అనేక చిత్రకారులు మనకి తెలుసువీరంతా కళ పేరుతొ ఏంచేశారు? నగ్న చిత్రాలను అద్భుతంగా గీశారు
నిత్యం మాధ్యమాల్లో వేలాదిమందికి స్త్రీ నగ్న చిత్రాలు దర్శనమిస్తాయి ప్రజలు ఏంచేస్తారు? లైక్ కొడతారు. అద్భుతం అందం అంటారు. అసభ్యత అని ఎవరైనా అంటారా? వీరికి వ్యతిరేకంగా ఏ విప్లవమూ రాదు. ఎందుకు? ఎందుకంటే ఇది వ్యసనమే కాదు పురుష బలహీనత.
కళ ద్వారా నేరుగా మైథునాన్ని చూపిస్తారు. తప్పు అని ఎవరైనా అంటారా? సృష్టికార్యం అంటారు. తప్పేముంది అంటారు. స్త్రీని ఒక వినిమయ వస్తువు క్రింద ఒక విలాస వస్తువులా చూసే జబ్బు చేసింది. సమాజానికి. ఒక బానిసలా సబ్బుబిళ్ళ గా చూసే జబ్బు చేసింది.
ఈ జబ్బు ప్రపంచమంతా ఉంది. దేశదేశాల్లో, తరతరాలుగా శిల్పులు, చిత్రకారులు, కవులు కామపీడితులై స్త్రీ నగ్న దేహాన్ని చిత్రించడంలో ప్రజ్ఞను చూపించారు. స్పెయిన్ లో వేలాది అందం పేరుతొ కామాన్ని ప్రేరేపించే వివిధ రకరకాల భంగిమల్లో స్త్రీ మానాన్ని సైతం చూపిస్తూ చిత్రాలు గీశారు. 1640 లోనే స్పెయిన్ కోర్ట్ స్త్రీ నగ్న దేహాన్ని చూపించడం ఇల్లీగల్-గాప్రకటించింది.
ఏంతో మంది ప్రఖ్యాత చిత్రకారులు వేసిన చిత్రాలు కూడా చూసేవాళ్ళని కామ బానిసలుగా చేస్తున్నాయని "ఇన్వెన్షన్స్ అఫ్ డెవిల్"గా ప్రకటించ బడ్డాయి. చార్లెస్ III "అసభ్యకరమైన చిత్రాలను" సేకరించి వాటిని వెంటనే కాల్చమని ఆదేశించాడు. కానీ ఎక్కువ మంది రాజులు వీటిని ప్రోత్సహించి ఆదరించారు. మొత్తానికి రాజుల పాపాలు ప్రజలకి తగిలి ప్రజలు కామ పీడితులుగా మారిపోయారు. రాజులు నగ్న చిత్రాలు చూడడం వల్ల ప్రజలు కూడా అదేబాటలో నడిచారు. నడుస్తున్నారు యాధారయాజా తథా ప్రజా అన్నారు కదా! ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని ఈ బూతు బొమ్మల భరతం పట్టాలి.
.jpeg)
No comments:
Post a Comment