#పూలబాల — #తెలుగుతనం# ఉట్టిపడే #బహుభాషి
.
విదేశీభాషలపై పట్టు సాధించి వాటిద్వారా బతుకుతున్నా తెలుగు భాషకు నిత్యం నీరాజనాలు ఇచ్చే పూలబాల రచనా ప్రతిభతో ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్న రచయిత, కవి మరియు భాషా సైనికుడు . ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన జీవన విధానం ఆదర్శం.
.
పూలబాల భక్తి , శృంగార ,ప్రబంధాలను రాసే అరుదైన రచయిత. ఆయన బ్రతకడానికి మాత్రం సంపాదిస్తూ విలాసాలు ఆస్తులపై ఆశలేని సేవాతత్పరుడు . మీరు రావాలి అని పిలిస్తే ఎంతదూరమైనా ప్రయాణించి తన శ్రమనంతా ఉపయోగించి మన తెలుగుపిల్లలకి తన ప్రతిభను అందజేయాలనుకునే మంచి మనిషి.
.
పోలిగ్లాట్ గా పూలబాల పెద్ద పదవులనలంకరించినా , ప్రభుత్వం పెద్ద వాహనాల ననుమతించినా నిరాడంబరంగా తన టు వీలర్ పైనే తిరిగి ప్రభుత్వానికి డబ్బు ఆదా అవ్వాలని కోరుకునేవారు రచయితగా అద్భుతమైన ‘#భారతవర్ష వంటి ప్రబంధ కావ్యం రాసినా ‘#ఇండియన్ సోనెటీర్ వంటి ఇంగిలీషు పద్య కావ్యాలు రాసినా ‘#మహాకవి వంటి విప్లవ రచనలు చేసిన అన్నింటి వెనుక ఉన్నది దేశభక్తి , భాషనురక్తి మాత్రమే!
లైకులు కోసం దిగజారి రచనలు చేయని, డబ్బులకోసం పుస్తకాలు రాయని నిజమైన రచయిత పూలబాల .తెలుగునేలకు తన ప్రతిభను అంకితం చేస్తున్న పిల్లలకు కొత్త నైపుణ్యాలతో దేశభక్తితో చైతన్య పరుస్తున్న పూలబాల నవయుగ వైతాళికుడు

No comments:
Post a Comment