తాను పట్టు సాధించిన 6 విదేశీభాషలను శ్రమ, సమయం వెచ్చించి రాష్ట్ర నలుమూలల పర్యటిస్తూ చిన్నపిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్న నిత్య పర్యాట కుడు "నవయుగ వైతాళికుడు" పూలబాల.
పాటలు పాడుతూ రాజుని మేలుకొలిపే గాయకుడుని వైతాళికుడు అనేవారు నవయుగ వైతాళికుడు అంటే కొత్త యుగాన్ని మేలుకొలిపేవాడని అర్థం.
అక్టోబర్ 27 28 29 తేదీల్లో మూడురోజులపాటు సాగిన గ్లోబల్ కమ్యూనికేషన్ వర్క్ షాప్ లో విజయవాడ కు చెందిన పోలీగ్లాట్ రచయిత, రెండు ప్రపంచ రికార్డుల విజేత పూలబాల వాసవి వరల్డ్ స్కూల్ విద్యార్థులకు ఫ్రెంచ్ , జర్మన్, స్పానిష్, ఇటాలియన్ , జాపనీస్ , ఇంగ్లిష్ - 6 విదేశీ భాషలలో శిక్షణ ఇచ్చారు.
ఆటపాటలతో విద్యార్థులకి వారి భవిష్యత్ కి అవసరమయ్యే విదేశీ భాషలలో ఆటపాటలతో శిక్షణ ఇచ్చి నేర్పించగా వారు నేర్చుకున్న భాషల్ని పిల్లలు చక్కగా ప్రదర్శించారు. ఉపాధ్యాయులు వాటిని వీడియోలు తీసిన ఉపాధ్యాయులు ఇదంతా నమ్మ సఖ్యంగాలేదు అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
మూడో రోజు జరిగిన వీడ్కోలు సభలో వాసవి వరల్డ్ స్కూల్ ( నిర్మల్ ) యాజమాన్యం మరియు ఉపాధ్యాయులచే నవయుగ వైతాళికుడు పూలబాలకు ఘనంగా జరిగింది.
ఆ సభలో మాట్లాడుతూ "అందరూ ట్రెండ్ ని అనుసరిస్తారు . కొంతమంది రాబోయే ట్రెండ్ ని ముందుగా గుర్తించి అగ్రగామిగా నిలుస్తారు. ఫారిన్ లాంగ్వేజెస్ అవసరాన్ని గుర్తించిన వాసవి వరల్డ్ స్కూల్ ని ఇలా ముందు చూపు కలిగిన విషనరీ." అన్నారు . పిల్లలు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని కోరుకునే తల్లితండ్రులు ఉండడం సహజం. స్కూల్స్ అలా కోరుకోడం అరుదు. అలాటి అరుదైన స్కూల్స్ లో వాసవి వరల్డ్ స్కూల్ ప్రథమంగా నిలుస్తుంది. అన్నారు పోలి గ్లోట్ పూలబాల.
.
వాసవి వరల్డ్ స్కూల్ లో ప్రతివారిలోనూ,ముఖ్యంగా టీచర్లలో నేర్చుకోవాలనే తపన కనిపించింది. టీచర్ల నన్ను వెన్నంటి ఉండి పిల్లలను కంట్రలో చేస్తూ నేను చెపుతున్న అన్ని విషయాలనూ అర్ధం చేసుకుంటూ వాళ్ళు కూడా నోట్స్ రాసుకు నేవారు. వాసవి వరల్డ్ స్కూల్ నాకు ఆనందాన్ని సంతృప్తిని మిగిల్చింది మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు. అన్నారు పోలి గ్లోట్ పూలబాల.

No comments:
Post a Comment