డబ్బుకి నో చెప్పి సొంతపనులు పక్కన పెట్టి
సమాజానికి సమయాన్ని శ్రమని వెచ్చించి
భాష నేర్ప ని చదువు చదువు కాదు అంటూ....
విదేశీ భాషల ద్వారా తెలుగు భాష గొప్పతాన్ని సాహిత్య మహాత్యాన్ని నేటి తరానికి చెపుతూ దేశభక్తిని చాటే భాషా సైనికుడు పూలబాల. మన అవసరం లేకపోతే మన ఫోన్ కాల్ కూడా తీయని రోజుల్లో తన సొంత పని పక్కన పెట్టి దూరప్రదేశమైన నిర్మల్ వచ్చారు. వాసవి వరల్డ్ స్కూల్ లోపిల్లలని ఆటపాటలతో అలరిస్తూ భాషానైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నారు. ఏ విద్యలో దేశ ఔౌన్నత్యం ఉండదో అది విద్య కాదు. ఏ నీతిలో దేశభక్తి ఉండదో అది నీతి కాదు. భాష నేర్ప ని చదువు చదువు కాదు. అన్నారు పూలబాల
పిల్లలకి భాషసాహిత్యం రెండూ
అవసరమే అన్నారు
ఆయన. నేటి
చదువులో భాషని
అటకెక్కించి ఇంజనీరింగ్ మెడిసన్
కలలు అమ్ముతూ
సమాజాన్ని చంపుతున్నారు. మానవ
వికాసానికి అవసరమైన
భాషని ఉద్యోగ
అవకాశాల కోసం
అవసరాలకి మాత్రం
నేర్పుతుంటే విద్య
మార్కులకి పరిమితమై విద్యావంతులు
కూడా పిచ్చి
సినిమాలు చూస్తూ
అమెరికా వెళ్ళినా ఆకు రౌడీల ప్రవర్తనే
చూపిస్తూ సినిమాలలో అంట కాగుతూ పుస్తక
పఠనాన్ని విలువలని పోగొట్టు
కున్నారు. అందుకే
ఈ దశలో
భాషా సాహిత్యం చాలా
అవసరం అన్నారు
పూలబాల
మనిషి ఆలోచనలను, అనుభూతులను,
భావోద్వేగాలను మలచి
మానవతను వెలుగులోనికి తెచ్చేది
సాహిత్యం. సమాజం
యొక్క ఆత్మ,
సంస్కృతి, చరిత్రకు ప్రతిబింబం
సాహిత్యం. .
సాహిత్యం మనిషిని చీకటి నుండి వెలుగుకు తీసుకువెళ్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, నీతి బోధిస్తుంది, ఏ నీతిలో దేశభక్తి ఉండదో అది నీతి కాదు. ఏ విద్యలో దేశ ఔౌన్నత్యం ఉండదో అది విద్య కాదు. దేశభక్తిని మానవ హృదయంలో నింపుతుంది.
తెలుగు సాహిత్యంలో నన్నయ
నుండి నేటి
దాకా అనేక
మహానుభావులు తమ
రచనలతో సమాజాన్ని మేలుకొలిపారు.
వారి రచనలు
మన సంస్కృతి, మన చరిత్ర, మన విలువల సాక్ష్యాలు.
అంతిమంగా, సాహిత్యం లేకపోతే జీవితం నిస్సారంగా మారుతుంది. మనిషి ఆత్మను ప్రేరేపించే శక్తి సాహిత్యంలో ఉంది. మనసుకు శాంతి నిచ్చే దివ్య ఔషదం జీవితానికి దిశనీ చూపించే దివ్య దీపం దేశానికి రక్షణ కవచం సాత్యం. అందుకే నేటి ట్రెండ్ అయిన ఫారిన్ లాంగ్వేజెస్ ద్వారా పిల్లలకు మాత్ర భాష మాతృభూమి గొప్పతాన్ని కూడా వివరిస్తున్నాను అన్నారు పూలబాల

No comments:
Post a Comment