Sunday, February 1, 2026

ఇలాంటి మాస్టారిని నేను చూడలేదు.

లూథరన్ పాఠశాల - శనివారం  జనవరి 31,  2026 

లూథరన్ పాఠశాలలో   - శనివారం  జనవరి 31 2026  పిల్లలతో  కార్యక్రమం చేయడానికి  పాఠశాల వ్యవస్థాపకులు   రత్నకుమార్ గారు నిర్ణయించి ఆహ్వానించారు.  భాషా  నైపుణ్యాల పై  పిల్లలకు శిక్షణ ఇవ్వడం  నేను జీవిత  లక్ష్యంగా పెట్టుకున్నాను.  చిన్న పెద్ద , ప్రభుత్వ పైవేటు పాఠశాలలు, కాలేజ్ లు  యూనివర్సిటీలు దగ్గర దూరం అనకుండా తిరుగుతుంటాను. 

 నా బ్లాగ్ లు చూస్తే  పదేళ్లనుంచి ఇదే పనిలో ఉన్నానని  తెలుస్తుంది.   

జనవరి 31 , చేస్తున్న పని ఆపి ఉదయాన్నే 7.00 గంటలకు నరసరావుపేట బయలుదేరాము. 



విశాలమైన  ఆటస్థలం , సాధారణ మైన  తరగతిగదులు లతో  హృదయం అనే గదికి దగ్గరగా ఉంది లూథరన్ పాఠశాల .  ఆధునికత ముసుగు లేని  సహజమైన వాతావరణంతో    నేను చిన్నప్పుడు చదువుకున్న బడి లా అనిపించి మనసు పులకరించింది. 

                                       

 విద్యార్థులందరూ విశాలమైన ఆడిటోరియంలో ఆకుపచ్చని తివాచి పై కుర్చీలలో కూర్చున్నారు  వర్క్ షాప్ ప్రారంభై అయ్యింది. పిల్లలని ఆనందపరచటానికి ఫారిన్ లాంగ్వేజెస్ లో  మాట్లాడేను. కొద్ధి  సేపు శిక్షణ అనంతరం పిల్లలు పేదరికంలో ఈదుతూ అజ్ఞానం అనే అలలతో పోరాటం చేస్తున్నారు. శిక్షణ ఎన్ని ప్రశ్నలు అడుగుతూ  సమాధానం చెప్పిన వారికి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ పిల్లలని వీలైనంత ప్రోత్సహిస్తూ ముగించాను పాటలు పద్యాలతో అలరిస్తూ ముగించాను. మిగిలిన పుస్తకాలు లైబ్రరీకి బహుమతిగా ఇచ్చేను. 


పిల్లల స్పందన రగాలని  మౌనంగా కూర్చున్న పిల్లలకి చెపుతూ   గట్టి వార్నింగ్ ఇచ్చారు. సినిమా పాటలకి డాన్స్ చేయాలంటే మీరు చాలా ఉత్సాహం చూపిస్తారు  ఆ ఉత్సాహం ఇక్కడెందుకు లేదు అన్నారు  నా జీవితంలో ఎప్పుడూ వినని ఒక మాట...నాకు ఆనందం కలిగించే మాట  

"ఈ స్కూల్ లో సినిమా డాన్స్ లు బంద్ ఇక పై చక్కగా స్టేజ్ ఎక్కి   చదువుకున్నారో  ,  నేర్చుకున్నారో అవి చెప్పండి చాలు. విద్యా ప్రతిభ లేనప్పుడు సినిమా ప్రతిభ ఎందుకు?"  

  ఇలాంటి మాస్టారిని   నేను చూడలేదు. 








నా   పని  షరతులు లేని సేవ.  సేవాభావంతో  బోధన చేస్తే మనసు వికసిస్తుంది.  విద్యార్థుల, శ్రేయస్సు  కోరి పని చేస్తే   ప్రతిఫలం కంటే తృప్తి వస్తుంది.  తరచుగా ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఈ విద్యా సేవ చేయడం కోసం  సమయం మరియు వనరులను త్యాగం చేయవలసి ఉంటుంది. ఐతే సరస్వతి ఆశీస్సులు, మనుషుల ప్రేమ ప్రతిఫలంగా పొందుతుంటాను. 

నటనకు దూరం.  నడతే  ప్రాధాన్యం ఆయనకు. మానాన్న గారి మాట ఇలాగే ఉండేది.  చిన్నపుడు మాబడి  ఇలాగే ఉండేది.   లూథరన్ పాఠశాల  నరసరావుపేట నా బాల్యాన్ని గుర్తుచేసింది 

టీచర్స లో కొత్త విషయాలు  నేర్చుకోవాలనే ఉత్సాహం  కొట్టొచ్చినట్టు కనిపించింది.  విద్య పట్ల శ్రద్ధ  అతిధి పట్ల ఆదరణ వారికి  ఆకర్షణ గా నిలిచాయి.     



చ . మనిషికి  విద్య  నిచ్చిన  సుమాలకు  తావిని   జేర్చినట్లగున్     

 మనమున  పుట్టు  భావములువాడ నితావులుకావె  మాటలన్     

వినమరి   సేదతీర్చుచుచు   వీనుల   విందులుచేయు  చేతలన్     

కనమరి  నిండు  నీతిగల  వాడికి  నీడ యె  విద్య చూడగన్   



 మనిషి   కివిద్య  నిచ్చిన  సుమాల  కుతావి   నిజేర్చి నట్లగున్     

 మనము నపుట్టు  భావము  లువాడ నితావు   లుకావె  మాటలన్     

వినుమ  రిసేద  తీర్చుచు  చువీను  లవిందు లుచేయు  చేతలన్     

కనమ  రినిండు    నీతిగ     లవాడి   కినీడ   యెవిద్య చూడగన్   

No comments:

Post a Comment

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...