Friday, February 20, 2026

మాస్టర్ ఆఫ్ ఎ నోబుల్ మిషన్ - పూలబాల

 మాస్టర్ ఆఫ్ ఎ నోబుల్ మిషన్ - పూలబాల

ఒంగోలు బి. వి. ఎస్ . ఇంజనీరింగ్ కళాశాలలో
గ్లోబల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
విదేశీభాషల వెనుక గొప్ప లక్ష్యం ? ఏంటది ?

ఫిబ్రవరి 18న పాలిగ్లాట్ పూలబాల BVS ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. విదేశీ భాషల ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో తమ విద్యార్థులకు గ్లోబల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలపై ఇంగ్లీష్ మరియు విదేశీభాషలలో శిక్షణ ఇవ్వడానికి ఒంగోలు కి చెందిన BVS ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఒక పరిచయ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రముఖ విదేశీభాషల నిపుణుడు బహుళ గ్రంథకర్త పూలబాలను ఆహ్వానించారు.



ఈ సెషన్‌ను BVS ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతాప్ కుమార్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ కోటిరెడ్డి, ఒంగోలు కి చెందిన ప్రముఖ యోగాచార్యులు బాలు ప్రారంభించారు. ఈ సెషన్ లో ఇంగ్లీష్ మరియు విదేశీ భాషలపై అవగాహన కలిగిస్తూ ఎలా పట్టుసాధించాలో వివరించారు.


ఇంగ్లిష్ సహజంగా ఎలా మాట్లాడాలో వివరిస్తూ ఫొనెటిక్స్ ను పరిచయం చేసి శిక్షణ ఇచ్చారు.
విజయవాడ వాసి పూలబాల , ఢిల్లీ హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ గా బ్రాడ్ కాస్టర్ గా పనిచేసిన తన అనుభావాన్ని విద్యార్థులకోసం ఉపయోగించడం ఆనందంగా ఉందని అన్నారు.

స్పెల్లింగ్ , ప్రొనన్సియేషన్, ఇంటోనేషన్ , వాయిస్ మాడ్యులేషన్, ఏక్సన్ట్ వంటి అనేక విషయాలను తాను రచించిన "డైనమిక్స్ అఫ్ ఇంగ్లీష్ స్పీచ్" అనే పుస్తకాన్ని ప్రొజెక్టర్ పై చూపిస్తూ విద్యార్థులకు శిక్షణను ఇచ్చారు. ఉదయం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షణ అనంతరం కాలేజీ యాజమాన్యానికి "డైనమిక్స్ అఫ్ ఇంగ్లీష్ స్పీచ్" అనే పుస్తకాన్ని అందజేసారు.



ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్ మరియు జపనీస్, భాషల పై 3 రోజుల వర్క్‌షాప్ కోసం ఇది ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మాత్రమే అని విజయవాడ నుంచి ఒంగోలు వచ్చిన పూలబాల మళ్లీ ఒంగోలు రావలసి ఉందని అన్నారు. బి వి ఎస్ కాలేజీ యాజమాన్యం వారి గౌరవ మర్యాదలు విద్యార్థులలో ప్రతిబింబిస్తున్నాయి అని అన్నారు
నన్ను కాలేజీ వారికీ ఇతర స్కూల్స్ కి పరిచయం చేసిన ప్రముఖ యోగాచార్యులు బాలు గారి ధన్యవాదాలు తెలియజేసారు. కేవలం సేవా భావంతో రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న పూలబాల బాషలు లేక సంస్కృతికి , సంస్కృతి ధర్మం దేశభక్తి విద్యతో పాటు కాక మాతృ భాషతో పాటు వస్తాయని మాతృ బాషా లేనిదే మనకు మనుగడలేదని. విదేశీ భాషలు బోధించిన పిదప మాతృబాష ను నేటి తరం విద్యార్థుల గుండెల్లో నాటడమే తన లక్ష్యమని తన లక్ష్యాన్ని తెలియజేసారు. మాస్టర్ ఆఫ్ ఎ నోబుల్ మిషన్ పూలబాల ఒక గొప్ప లక్ష్యం తో నేటి తరానికి సేవచేస్తున్నారు

No comments:

Post a Comment

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...