Monday, November 29, 2021

మీకు తెలియని మీనాక్షి కథ

అంగయార్ కన్నె: నీకంత కొడుకు కలడా! నీవట్లు కనిపించవు. 

మీనాక్షి: కొలది సంవత్సరములుగా నేనే విశాఖపట్నము పోయి అచ్చటనే వాడిని చూచివచ్చుచున్నాను. మొదటిసారి  నాదగ్గరకు వాడు వచ్చినాడు.   విధి వ్రాతెట్లున్నదో చూడుము. జరగకూడనిది జరిగిపోయెను. వినకూడని దేదైనా వాడు విని యుండునేమో! నా గురించి ఏమను కొనునో?

అంగయార్ కన్నె: ఈ పాఠశాలలో నీ గురించి నాకు తప్ప ఎవరికీ  తెలియదు. నీవతడిని పెళ్లి చేసుకొనదలచితివి కదా! త్వరగా అతడిని చేసుకొనిన ఇట్టి సమస్యలుండవుకదా!

మీనాక్షి:  ఒకప్పుడు పెళ్లి అనిన భయము వేసెడిది. ఇప్పుడు మగవారి ఊసెత్తిన భయము కలుగుచున్నది.  పరిచయస్తులతో స్నేహము పెంచుకొనుట  నాదే తప్పు.

కన్నె: ఇప్పుడేమాయెను? అతడేమిచేసినాడు? అతడెట్లు పరిచయము?

మీనాక్షి: ఆరేళ్ల క్రితము నేను విశాఖను వీడి మా సొంతవూరైన తంజావూరు పోవుటకు నిశ్చయించుకొంటిని. విక్రముడు రాజమండ్రి లో రైలులో నాకు పరిచయమయ్యి చెన్నపట్టణమువరకు నాతో ప్రయాణించెను.  అతడే ఈ పాఠశాలకు పరిచయముచేసెను. రైలుదిగినవెంటనే వారిని మరిచి పోయిన ఎంత బాగుండెడిది .

కన్నె: సూదంటురాయవలె నీ అందము ఆకర్షించిన అంటుకొనక ఏమగును.  మీనాక్షి: ఛీ! అంగ యార్ కన్నేనా ఇట్లు మాట్లాడుచున్నది.

కన్నె: రైల్లో కనిపించినవాడు ఇల్లిచ్చి ఉద్యోగము చూపి వదలకున్నాడన్నఏమనవలెను? చూపులు కలిసియుండును. పిదప నవ్వులు ఆపై మనసులు కలిసియుండును.  అట్లనుచున్న కన్నె వీపుపై ఒక్కటి చరిచి "ఆపవే వేళాకోళమునకు హద్దుండవలెను. అతడు తల్లితో కలిసి ప్రయాణించుచున్నాడు. వారిది చాలా పెద్ద  కుటుంబము." అని మీనాక్షి చెప్పగా  అయినచో పెద్ద కథే  నన్నమాట. చెప్పు చెప్పు అనెను.

మీనాక్షి: ఆరు సంవత్సరముల కథ ఒక్కసారి ఎట్లు చెప్పమందువు?

కన్నె "ఇప్పుడు కొంచెము చెప్పి సమయమున్నప్పుడు మొత్తము చెప్పుము. కన్నె ముఖములో కుతూహలము స్పష్టముగా  కనిపించుచుడెను. అది చూసి మీనాక్షి మందహాసముచేసి ప్రారంభించెను.     

“కోరమాండల్ రాజమండ్రలో ఆగిన పిదప ఒక తెల్ల చీరధరించిన ఒకామె తనకొడుకుతో రైలులోకి ప్రవేశించెను. అతడి చేతిలో రెండు సంచులున్నవి. విశాఖపట్నములో నేను ఎక్కునప్పుడు ఖాళీ గాఉన్న పెట్టె రాజమండ్రి లో నిండినది. నేను కిటికీ వద్ద కూర్చొని యుంటిని  "ఆరక్షణ (reservation)యున్నదా ? లేనిచో తొలగమని చెప్పెను. ఏరక్షణ లేదని చెప్పి  నేను లేవబోవుచుండగా అతడి తల్లి నన్ను అచటనే కూర్చొమ్మని సైగచేసి ఆమె నాప్రక్కనే కూర్చొనెను.  ఆమె పేరు  నమక్కల్  జయంతి  అయ్యర్, ఆమె కొడుకు పేరు  అని  మీనాక్షి ఇంకనూ చెప్పబోవు చుండగా  “విక్రమన్  అతడి అన్న కనిష్కన్, అతడి తండ్రి   నమక్కల్  నరసింహన్ అయ్యర్” అని కన్నె గడగడా అప్పచెప్పెను. "ఇవన్నీ నీకెట్లు తెలియున"ని మీనాక్షి ఆశ్చర్యపోయెను. కన్నె“తమిళనాట పుట్టిన ఎవరికైననూ తెలియును. నరసింహన్ అయ్యర్ తమిళనాడు ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం కళైమామిని బిరుదును, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీతకళానిధి బిరుదును పొందిన గొప్ప వాయులీన విద్వాంసుడు.” మీనాక్షి “అయినచో ఇంకా నీకు చెప్పవలసిన దేమున్నదని?” అనెను.  కన్నె కోపముగా  “నీ కథ చెప్పుము. నీకు విక్రమన్ కి మధ్య జరిగిన కథ.”

మీనాక్షి “నాకు జయంతిగారి  పరిచయము చాలా కష్టకాలమందు జరిగెను. అప్పటికి నరసింహన్ గారు పరమపదించి కొద్ది  రోజులాయెను. ఆయన పుట్టినూరు రాజమండ్రి కావున ఆయన అంత్యక్రియలు రాజమండ్రిలో జరిగినవి. ఆ పని ముగిసిన తరువాత వారు చెన్నపట్నము తిరిగి వచ్చుచున్నారు. రాజమండ్రిలో మాపరిచయము చెన్నపట్నము చేరుసరికి స్నేహముగా మారెను. మేమిద్దరమూ పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకొనుచుండగా విక్రముడు దూరముగా వేరొక కిటికీవద్ద కూర్చొనెను.  కన్నె “అట్లయిన మీకు స్నేహము ఎట్లు  కుదిరెను ?”

 నా స్నేహము జయంతిగారితో నే విక్రమునితో కాదు. ఆమె తన విషయములన్నియూ నాకు చెప్పి నా నాభర్త గురించి అడగగా "లేడ"ని చెప్పితిని. మా పూర్వీకుల వూరు తంజావూరుపోవుచున్నాని చెప్పగా ఆమె మేము వేలచేరి లో నివసించుచున్నాము. ఒక్కసారి తనవద్దకు రమ్మనెను. ఆమె ఒంటరితనము నాకర్ధమైనది.  ఆమెను ఒక్కసారి కలిసి పిదప తంజావూరు పోవలెనని నిర్ణయించుకొంటిని.

కన్నె: మీది మద్రాసు కదూ, తంజావూరు మీ సొంతూరు ఎట్లాయెను?

మీనాక్షి: మా తాత ముత్తాలది తంజావూరు. మా ముత్తాత తాతగారు సంస్కృతాంధ్ర మున పండితులు. నాటి నాయక్ రాజుకొలువులో పని చేసెడివారు. చరిత్ర చదివిన నాయకులు కళాపోషకులని సాహిత్యమునాదరించినారని అర్థమగును. కాలక్రమేణారాజ్యములంతరించి, వారు కాలము చేసిన పిదప మా నాన్నగారు మద్రాసు మకాము మార్చిరి. “మీ పూర్వీకులకు ఇంత గొప్ప చరిత్ర ఉన్నచో నాకేల  చెప్పలేదు!”

మీనాక్షి: వారిగురించి నాకు కొంతయే తెలియును. పైగా అట్లుచెప్పుకొన్నచో ఎవరైననూ ఏమనుకొందురు? .

కన్నె: చెట్టుపేరుచెప్పికాయలమ్ముకొన్నటుండునని నీవనుకొనుచున్నావు. అట్లనుకొను వారు మూర్ఖులు. వారి మాడు పగులగొట్టవలెను. కీర్తికెక్కిన మన పూర్వజులను స్మరించుకొనుట మనకు గర్వకారణమే కాక బాధ్యత. అట్లు చెప్పుకొనకపోవుటవలనే మనకీదాస్యమబ్బినది. ఎవరో ఏదో అనుకొందు రట.. ఇంత మెత్తదనము పనికిరాదమ్మా అందులకే నీమొగుడు .. ...అట్లనుచుండగా మీనాక్షి ముఖము నిస్తేజమగుచుండెను.

మౌనముగా బాధపడుట  దూరముగా తొలగిపోవుట ఈ మీనాక్షి  లక్షణములని మనసున తలచిన కన్నె “ నీ మనసెంత సున్నితము!  నీ గతమెంత ఘనము!!  పువ్వు కంటే సున్నితమైన మనసు,మంచుకొండ వలే ఉన్నతమైన గతము”అనెను.అంగయార్ కన్నె గొంతు బరువెక్కెను.  అది చూచి మీనాక్షి చలించెను. ఆ మంచంతయూ కరిగిపోయినదని మీనాక్షి హాస్యమాడుచుండగా కన్నె “మంచు కరిగిపోయిననూ గౌరవము తరిగిపోవలెనా? వారి గూర్చి నాకు చెప్పుము.” అని మరల మరొక కాఫీ చెప్పి తరువాత తరగతి మన ఇద్దరికీ లేదు కదా  “అలా పచ్చికలో కూర్చొని మాట్లాడుకొందుమని” చెప్పెను. ఇద్దరూ మౌనముగా కాఫీ సేవించిరి.

ఫలహారశాల నుండిబయల్వెడలి యాసంగీత లలామలు జోడు గుఱ్ఱములవలె సాగుచుండ యా కింకిణి సమ్మేళన మూర్ఛనంబు  మేఖల కన్యకా ప్రవాహ  లావణ్యమును  తలపించుచూ  చూపరులకు నయనానంద మగుచుండెను. కన్నె, మీనాక్షి పచ్చికలో కూర్చొనిరి.   కన్నె"నీకు మీ పూర్వీకుల గూర్చి ఎవరు చెప్పినారు?"

మాతాత గరికిసోమయాజులుగారు చెప్పగా నాకు తెలిసినది.  నా బాల్యము మద్రాసులోనే గడిచెను (ఇప్పుడు చెన్నపటము అయినది గానీ అప్పుడు మద్రాసనెడివారు). మానాన్న గారికి మద్రాసు విశ్వవిద్యాలయమందు పరీక్షా నిర్వహణాధికారిగా ఉద్యోగము వచ్చుటతో తంజావూరు నుండి ఇచ్చటకు వచ్చి స్థిరపడినవారు.   మాతాతగారు బ్రతికి ఉన్నంతకాలము నేను తంజావూరు పోవుచుండెడిదానను. ఆ మూడు మేడల భవనము మాదే. ఆయనకు చరిత్ర  పై మంచి అవగాహనుండెడిది సాహిత్యముపై మంచి పట్టు ఉండెడిది.  జీవితముపై పట్టు ఉండవలెనన్న చరిత్ర సాహిత్యములావశ్యకమని ఆయన చెప్పుచుండెడివారు.

ఆరెండు లేకనే నేడు అధికులు ఆంగ్లేయుల గొప్పతనమును కీర్తించుచూ బ్రతుకుచున్నారు. అని చెవొగ్గి వినుచున్న గయార్ కన్నెఅనెను. మీనాక్షి గలగలా నవ్వెను. “ఆ మూడు మేడల భవనము మీదేనా. ఇప్పుడది గ్రంధాలయమునకు ఇచ్చివేయబడినది కదా! నేను గత ఏడాది  తంజావూరు పోయినప్పుడు అక్కడున్న ముఖ్య ప్రదేశములలో అదొకటని నాకు చూపినారు. మీ తాత గరిక సోమయాజులు  గారి చిత్రపటము నేను చూచితిని.   అప్పటికి మనమింకనూ దగ్గరకాలేదు. నువ్విట్లు నవ్వు చుండుము తల్లీ”అని కన్నె అనగా “అటులనే పద పోయెదము అగస్త్యుడేమిచేయుచున్నాడో” అని మీనాక్షి ఆందోళన చెందుచుండెను.

నీ కొడుకేమైనా పసివాడా అట్లు బెంగ పెట్టుకొనుటకు. “అతడికీ విషయములు చెప్పినావా?” అని కన్నె అడిగెను.  మీనాక్షి మరల గలగలా నవ్వెను.  “సరియన సమయము రాలేదు కానీ చెప్పుటకు ప్రయత్నించితిని. "ఇంత  కాలమునుండి ఈ విషయములు  చెప్పుటకు సమయము లేదా అని అంగయార్ కన్నె అచ్చెరువొందెను." 

"మా అమ్మమ్మ చనిపోవు  సమయమునకు నాకు పెళ్లి కాలేదు. నా పెళ్ళైయిన ఐదేళ్లకి మా అమ్మ చనిపోయినది, అప్పటికి అగస్త్య చిన్నవాడు. తరువాత వాడికి అర్ధము చేసుకొని వయసు ఉన్ననూ ఇంటి వాతావరణము ప్రతికూలముగానున్నది. మేము విడిపోయిన తరువాత మా నాన్న గారు కాలం చేసినారు. అప్పుడు అగస్త్య ఇచ్చటకి వచ్చినాడు అప్పుడు చెప్పుటకు ప్రయత్నించితిని.  నాలుగు వందలయేళ్ళ చరిత్ర తెలుసుకొనిన నాకేమి ఒరుగునునని మాట్లాడినాడు.నని మాట్లాడినాడు.  యువకులకు  చలనచిత్రములు, ఆడపిల్లలు పెద్ద ఆకర్షణలుగా నుండును.    భారతవర్షయనొక స్నేహితుడు సాహిత్యప్రేరణ కలిగించగా చలన చిత్రప్రభావము అంతమొందెను. ఇప్పుడు చూడవలె."  “జాతి సంపదవలే అలరారుచున్నమీ వంశస్తుల గూర్చి వినుటకు నీకొడుక్కి అదృష్టముండవలెను. అతడూసుమాని నాకు చెప్పుము. నాకు వినవలెననున్నది” మీనాక్షి మరల చెప్పదొడిగెను. 

తంజావూరు చోళుల పాలనలో రాజధానిగా  గొప్ప  ప్రాముఖ్యతను సంతరించుకొనెను. చోళుల పతనం తరువాత, ముత్తరైయర్ రాజవంశం, పాండ్యులు, విజయనగర రాజులు, మదురై నాయకులు, తంజావూరు నాయకులు, తంజావూరు మరాఠాలు మరియు బ్రిటిష్ సామ్రాజ్యం వంటి వివిధ రాజవంశాలచే పాలించబడెను. నాయక్ రాజులు  సాహిత్యము ఆదరించిన వారిలో ప్రముఖులు. చెవ్వప్ప నాయక్ కృష్ణదావరాయల ఆధ్వర్యంలో పాలనాధికారిగా పనిచేసెడివాడు.  

చెవ్వప్ప నాయకుని భార్య మూర్తిమాంబ అచ్యుత దేవరాయలకు కోడలు మరియు విజయనగర రాణి తిరుమలాంబ సోదరి. చెవ్వప్ప తంజావూరు రాజ్యాన్ని అచ్యుతదేవ రాయ నుండి స్త్రీధన (కట్నం)గా పొందెనని ప్రతీతి. మాముత్తాత తాత కంఠంభట్టు ఆయనవద్ద పనిచేసినారు. ఆయన అరుణాచల దేవాలయ చరిత్రను తాళపత్రములపై లిఖించెను. ఆయన మనవడు మా ముత్తాత వ్రాసిన “వైదిక చరిత్ర” “ఆర్యులచరిత్ర” అముద్రితంగా చేతివ్రాతనున్నవి. ఇట్టి ప్రాచీన గ్రంధములను చరిత్ర పరిశోధకులు, ప్రభుత్వము తరలించుకు పోయిననూ ఇంకనూ మా పూర్వీకులు వ్రాసిన పలు గ్రంధములు ఆ ఇంటిలో ఉండెడివి. నేను పన్నెండు చదువుచుండగా మా తాతగారు కాలము చేసినారు.   పిదప మా అమ్మమ్మ సోమిదేవమ్మను ఒప్పించి మద్రాసు తెచ్చి అంత్యకాలమందు మా అమ్మే చూచుకొన్నది. ఆమె చివరి రోజులలోనాకు సంగీతమునందు శిక్షణ నిప్పించినది. అదే నాకిప్పుడు బ్రతుకుతెరువైనది. అంగయార్  కన్నె ఛ.. ఛ..అది నీవంటి వారనవలసి  మాట కాదని నొచ్చుకొనెను. మా అమ్మమ్మ మరణించిన పిదప వారు నివసించిన భవనమును గ్రంధాలయమునకు ఇచ్చివేసినారు.

కన్నె: మీనాక్షి వైపుకు అపురూపముగా చూచుచూ నిన్ను తాకుటకైననూ అదృష్టముండవలెను. నీ చెయ్యందుకొని ఏడడుగులు నడిచి ఇట్లు చేయుట… ఛీ..ఛీ అని కన్నె చీదరించుకొనెను.  “పురుషులు కామము నకు లొంగి ఏమైననూ చేతురు.  నామొగుడు వేరొక పిల్లని వలచి నాతో చీటికీ మాటికీ గొడపడుచుండెడివాడు. ఆ పోట్లాటలలో అగస్త్య ఎప్పుడూ తల్లిపక్షమే వహించుచుండెడి వాడు.

 వాడు ఏడవ తరగతిలో ఉండగా  ఒక నాడట్లు తండ్రితో గొడవకు దిగి తన్నులు తిని ఇల్లువదిలి పారిపోయి పదిరోజుల తరువాత పోలీసులకు దొరికినాడు.  ఆ సంఘటన తర్వాత కొద్ది కాలము నా భర్త ఇంటికి రాక ఎచ్చటనో ఉండెడివాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చిననూ వాగ్వివాదము లు చెలరేగెడివి. అగస్త్య పాఠశాల చదువు చక్కగా సాగుచుండెను. అందుచే అతడి చదువుకి అంతరాయము కలుగకుండా అతడిని ఇంటి వాతావరణమునకు దూరముగా వసతి గృహము నందుంచితిని అతడు పెండ్లి చేసుకొనుటకు విడాకులు కోరగా  అనుమతించితిని.   అతడు పెళ్లి చేసుకొనువరకూ అచ్చటనే ఉంటిని. అగస్త్య పదవ తరగతి లో నుండగా అతడు పెండ్లి చేసుకొనెను. పిదప అచ్చట ఉండుట అనవసర మనిపించెను. నీకు చాలా ఆస్తి ఉన్నది కదా ఇట్లు పనిచేయుటకు అవసరమేమున్నది?

ఆస్తి కొరకు నేను పట్టు పట్టక అతడికే వదిలివేసితిని.

అంగయార్ కన్నె తలపట్టుకొనెను.  కొంతసేపాగి విక్రమునకేమొచ్చెను?

చెన్నపట్టణములో దింపి ఈ పాఠశాలకు పరిచయము చేసెను. “విక్రముడు చక్కటివాడు సుమీ!” అని కన్నె అతడిని మెచ్చుకొనెను. చిరుద్యోగిగా యున్నప్పుడు దక్షిణామూర్తి కూడా మంచివాడే. డబ్బు వచ్చిన పిదపనే  మనుషులు మారిపోదురు.   

Sunday, November 28, 2021

Youth earning in lakhs

He is an Electrical Engineer and Self made man. He has the wit and wisdom and he is the synonym of dynamism. He kicked out the despair of unemployment and kick started his own career. Kudos!!


He started a high-tech mobile Ice cream parlor that looks like a Tokyo bank on wheels. His name is Vinod.  With sheer self confidence he triumphed over the existing grim unemployment situation which otherwise should be distressing. 

Mr. Vinod in his mobile ice-cream parlor


 This outspoken entrepreneur told me that he has invested 10 lakhs to construct his own kingdom (business). Yes he is the king. He doesn't slave out his time at a multi-national like many others engineers do. He stays on the wheels as long as he wants and  drives off his parlor when it is dull and boring. He earns Rs 60,000 every month in winter and in summer it is usually between one and two lakhs. 


Mr. Vinod uses 3 fridges. One normal and two deep refrigerators that can keep things super cool for 24 hours once charged for four hours. He used 3kv battery and his brains to design the entire set up. 

I had a jaunt ( pleasure drive) with my wife on Sunday the 27th Nov 2021. I was so pleased to stop at his parlor. His knowledge about world, courtesy and kindness touched my heart. He gave us good time and shared delicious ice creams of his own make. 

They are sweet like him. He is an Exemplary Entrepreneur.  

Lakuma Accident

I expanded the single line from Old Bharatavarsha  into eight pages .                                              

పాత భారతవర్షలో లకుమ కారు ప్రమాదానికి గురి అయినదని ఫోన్ వస్తుంది.  ప్రమాదం ఎలాజరిగిందో వర్ణన ఉండదు. కొత్త భారతవర్ష లో లకుమ కారు ప్రయాణ ప్రమోద ప్రమాద ఘట్టాలు ఇలా వర్ణించడం జరిగింది.   



                                                                        ***

This is the situation  

"తక్కడితోం, గిడ తక్కడితోం,  తద్ది తక్కడతోం థళాంగ్ థథ..థరికిట ." కేశవుడు కన్నులరమూతలై  ఆనంద పారవశ డై  గాలి షడ్జమమై, పక్షులు పంచకమై కేశవుడు శివాత్మకమై చేయు మృదంగవాదనా ధ్వని యందు అరుణతార మనసు మయూరమై మైమరచి నర్తించెను. "గోపాలుని గీతా భోదవలె ఈ మృదంగ నాదము అలౌకికా నంద మును  కలిగించి చిత్తనిర్వికార మొనర్చినది.  భావోద్వేగములను మకిలి వస్త్రములతో పాటు బుట్టదాఖలు చేసి, వేడినీటిబుగ్గ ఆవిరుల స్నానమాచరించి నిర్మలత్వము బొంది గృహాచ్ఛాదనములు ధరించి వంటజేయుచూ లకుమకొరకు ఎదురు చూడసాగెను. .. 

Here Arunatara receives a phone call

ట్రింగ్.. ట్రింగ్ .. మరల దూరవాణి మ్రోగుచుండెను. పరికరము నుండి మాట్లాడు సాధనమును లేపి సందేశము విని నివ్వెరపోయెను. “అమ్మా  ఏమైనది?” అని కేశవుడడిగెను, “లకుమ వాహనమును నడుపుచుండ ప్రమాదం సంభవించెను.  This read line is described in New Bharatavarsha.

                                                                        ***

గచ్చిబౌలి నుండి  యాబదిరెండు కిలోమీటర్ల దూరములో నున్న షాద్నగర్ వైపు కృష్ణవర్ణ  హ్యుందాయ్ టెర్రాకాన్  దూసుకుపోవుచున్నది.   నల్లని రబ్బరు  చక్రములల్లన తిరుగుచుండ   వాహనము మందగమన మున సాగుచుండెను. వాహన చక్రము (steering)వెనుక పల్లవి యనొక చేప కళ్ళ చిన్నది కూర్చున్నది. ఆమె పేరుకేగాక  చూచుటకు కూడా పల్లవమువలెనున్నది.  ఆమె తన  కోమల హస్తములు తో చక్రమును చేకొని తమలపాకుల వంటి పాదములతో ప్రవేజకము(acceletor) నొత్తుచు ఎదురొచ్చు వాహనములు చూచి తత్తరపడుచుండెను.   అదిచూచి  వాహనంలో ఆమె ప్రక్కనే యున్న లకుమ వెనుక నున్న సురభి, శ్రావణి, మాధురి పరిహాసమాడుచుండిరి. 

ఇంతలో ఒక యువకుడు రివ్వున పిచ్చుకవలె ద్విచక్ర వాహనంపై వెంట్రుకవాసి దూరమునుండి టెర్ర కాన్ ను రాసుకొని వారిని దాటుకు పోయెను. ఒక లిప్త ఎడమకు వాల్చి మరు లిప్తలో మరల కుడికి వాల్చి పిదప ముందు చక్రమునెత్తి కొంత దూరము పోనిచ్చి ఆపై వెనుక చక్రమునెత్తి మరికొంత దూరము పోనిచ్చి ఆపై  మోకాలు తగులునంత వరకూ బండిని వాల్చి ఇట్లనేక విన్యాసములు చేసి చూపి ముందుకు సాగుచుండెను. ఆ షోకిల్లా వేగమును చూసి బిత్తరపోయి తన గుండెలపై తు.. తు.. అని ఉమ్ముకొని పల్లవి వాహనమును ఎడమ ప్రక్క నిలిపి రొప్పుచుండెను. 

చెంగావి రంగు మేక్సీ నంటిపెట్టుకొనియున్న ఆమె పడుచు గుండెలదురు చుండెను. వీడి పీచమడుచుటకు  కొంచము దూరములో  వేగనిరోధక మున్నది   అచ్చట వీడు చతికిల బడుట ఖాయమని సురభి అన్నది కానీ వారందరినీ నిరుత్సాహపరుచుచూ అతడు అక్షోహిణీ యందు అభిమన్యుని వలె  చెలరేగి వేగమింకనూ పెంచి  తన ద్విచక్రికను రెండడుగుల పైకెగిరించి మరీ  వేగనిరోధకమును  దాటుకుని పోయినాడు. మాధురి  కనురెప్పలను  అల్లల్లా డించుచూ “ ట్చు  ట్చు.. ట్చు.. ఎంతటిఘనుడో! ఎంత ధాటి యో! రాకెట్ కేంద్రమందు ఉద్యోగమిచ్చిన రాణించున”నెను.  “రహదారిపైనున్న వేగనిరోధకమును దాటుట సులభమే. జీవితమునున్న పెళ్లి అను వేగనిరోధకమును ఎంత ధాటి యున్ననూ దాటలేక చతికిలపడుట ఖాయమ”ని పల్లవి అనెను. నిజమా అని మాధురి సంశయించుచుండగా  పల్లవి “ సందేహమెందులకు షాద్నగర్ లో జాతీయ అంతరిక్ష గ్రాహక  కేంద్రము (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) కలదు. అచ్చట భూఉపరితల కేంద్రము (గ్రౌండ్ స్టేషన్) భారతీయ మరియు విదేశీఉపగ్రహాల నుండి సమాచారమును సంగ్రహించును.”అని చెప్పుచుండగా “అదందరికీ తెలిసినదే కదా ఎందుకు  చెప్పుచున్నావ”ని లకుమ చిరాకుపడెను.

“మీకు తెలియనిది మరొకటుంది మానాన్న అందు శాస్త్రజ్ఞుడిగా పనిచేయుచున్నాడు.  అతడు అంతరిక్షంలో గుండుసూది పరిమాణము నుండి గ్రహ పరిమాణము వరకూ నున్న ఏ వస్తువునైననూ ద్రవ్యరాశి పరిమాణము ఇతర గ్రహములనుండి  దూరము మున్నగునవన్నియూ లెఖించు (telemetry) నిపుణుడు.  కానీ ఆ అమ్మతో చీరలు కొనుటకు పోయిన ఎంత సమయముపట్టునో లెక్కించలేడు. కొన్న సరుకుల సంఖ్య ధరలు చెప్పలేడు వేయేల పొయ్యిమీద పోపుకూడా చూడలేడు. మా అమ్మ చెప్పినదానికి ఊ కొట్టుచూ ఉపగ్రహములను చూచుమానాన్న ఉపగ్రహమువలె మారి మా అమ్మచుట్టూ తిరుగుచుండున”ని ముగించెను. 

“ఎంతవారులైన వేదాంతులైన గానీ..” శ్రావణి పాడెను. అందరూ నవ్వుచుండగా, ఆరుణీకృతవదన  వినీత నేత్ర, వియత ముఖ లకుమ షటప్ అని బిగ్గరగా అరిచి వాడి పెళ్లి అగువరకూ ఆగవలెనా? లేక వాడికి సంబంధము చూడవలెనా? అనరిచెను.  సురభి “వాడిపై పోలీసు కేసుపెట్టవలెన” నెను.  శ్రావణి “ఆమ్మో పోలీసు కేసులా! వాటి జోలికి పోకుండుటే మంచిద”నెను.” మాధురి “మా అమ్మకి చెప్పకుండా వచ్చుచున్నాను అంతదూరం ఎందులకు పోవుచున్నారని నాకు తలంటును”నెను.  లకుమ “ఆమ్మో పోలీసు కేసులా”యని శ్రావణిని అనుకరించి, వెక్కిరించి అట్లు మాట్లాడుటకు సిగ్గుండవలెను. వాడికి తగినబుద్ది మనమే చెప్పవలెను అని పల్లవిని త్రోసి సారధ్యమును స్వీకరించి ప్రవేజకమును బలముగా నొత్తెను. మరునిమిషము వాహనము ప్రళయ వేగమున దూసుకొని పోవుచుండెను. ప్రభంజనుడు(wind) వాయునిరోధకమును(windshield) గుద్దుకొని  ఈ దుష్కృతము నాపుట కన్నటు వికృతముగా కేకలువేయుచుండెను. అందరు ప్రాణములర చేతిలో పెట్టుకొని కూర్చొనిరి. 

కొద్దినిమిషములో నారింజ వర్ణ ద్విచక్రిక గోచరించెను. వాయువేగమున అతడి బండికి నూలువాసి దూరము నుండి పోనిచ్చి వాహనమును ఎడమకు త్రిప్పుచూ అరోధము నొత్తెను. ఆరోధ రంభము(breakdrum) నుండి  కీచుమను కరాళ ధ్వని వెలువడుచుండగా తూర్పుకు పోవుచున్న వాహనము పడమరకు గవ్వవలె తిరిగి ద్విచక్రికకు ఎదురు నిలిచెను. దానితో ఆయువకుడు చేష్టలుడిగి బిక్క చచ్చెను. సంయోక్తము (గేర్ )ను మధ్యస్థముగా (న్యూట్రల్ ) గా నుంచి  ప్రవేజకమును నొత్తి  టెర్రా కాన్ యంత్రము నుండి ప్రళయ నాదమును పుట్టించెను. ఆ  నాదము యువకుని గుండెలలో  విజయనగర యుద్ధబేరివలె మ్రోగి అతని గుండెలు గలగలలాడినవి. అతడు ద్విచక్రికను నేలపారవేసి  "ఆయువు యందు వాయువులు కపాలమును తాకినవ"ని చేతులెత్తి నమస్కరించెను. లకుమ అతడిని మిర్రి మిర్రి చూచుచూ "సంయోక్తము సంధించిన కపా లమోక్షమగును. వదిలివేసితిని పొమ్ము " అనెను. ఆ యువకుడు  విగత జ్ఞానుడై  ద్విచక్రికను తోసుకొని పోయెను.

అతడికేమైనా అయినచో పోలీసు కేసులు లగును మనకెందులకీ వ్యర్ధ ప్రహసనము అని శ్రావణి భీతిల్లుచుండగా “పోలీసు కేసులైనచో  మా అమ్మ  చూసుకొనును. ఈ రాష్ట్రములో మా అమ్మను  తెలియనివారుఎవరు కలరు?నీవు పోలీసు కేసుల గూర్చి బెంగమానకున్న నీ జడ కత్తిరించెదను. వాహనంతో నేరుగా గుద్దిన నూ నన్నెవ్వరూ ఆడువారులేరు. పిచ్చుకపై బ్రహ్మాస్త్ర మెందులకని నేనే ఊరకుంటిని.” లకుమ అదోదంతిని (low gear)యందు   వాహనమును త్రిప్పి,  పోనిచ్చు చుండెను. 

కొంచెము దూరము పోవుసరికి వారికి ఒక కూడలివద్ద  ఒక శ్వేత వాహనము కనిపించెను. అందు నలుగురు  యువకులు కలరు.  లకుమ వారి వాహనము వెనుకగా పోయి శృంగమును మ్రోగించెను. రహదారంతయూ ఖాళీగా యున్ననూ పక్కకిపోక లకుమట్లు శృంగమును మ్రోగించుచుండగా శ్వేత వాహనము లో వారద్దములు దింపి వెనుకకు కోపముగా చూసి పోనిచ్చుచుండిరి. నీవు శృంగ ప్రియ(హార్న్ కొట్టుట) వనుకొందురు చాలించుమని పల్లవి అనెను.  ఇంతలో శ్వేత వాహనము నిలిచి పోయెను. లకుమ కూడా తన వాహనమును నిలిపి ఈ యువకులు వృద్ధులు వలెనున్నారనెను. ఇంతలో పల్లవి "శ్వేతవాహనమందు చాలకుడు మారెన"నెను "కొత్త సారధి దూకుడు గిత్త వలే నున్నాడ”ని శ్రావణి అనెను. “వాడు దూకుడు గిత్త అయినచో లకుమ పోట్ల గిత్త అని మరువరాద”ని మాధురి అనెను. ముందునున్న వాహనము కదిలి క్రమముగా వేగము పుంజుకొనెను. లకుమ కొద్దిక్షణములలో తన వాహనమును వారికి సమాంతరంగా నిలిపెను. ఇరువాహనములు ప్రక్కప్రక్కనే జోడుగుఱ్ఱముల వలె  సాగుచున్నవి.

పండుగకు కేరళ  పంపా తీరమునున్న అరన్మూలలో నౌకాస్పర్ధను చూచితిని. నేడదే ప్రమోదము నందుచున్నాన "ని సురభి అనెను. కేరళలో కృష్ణుని గుడి వద్ద జరుగు నౌకాస్పర్ధ లందు పురుషుందురు ఇచ్చట స్త్రీలు కలరు."అని లకుమ అనగా “నీకెట్లు తెలియును? నీవు కేరళ పోయినావా?” అని మాధురి అడిగెను. లకుమ మందహాసము చేసెను. పల్లవి "వాళ్ళ నాన్నగారు కేరళవారే"అని చెప్పుచుండెను కానీ లకుమ ద్యాసఅంతయూ రహదారిపైనే యున్నది. శ్వేత, కాల వాహన స్పర్ధ మొదలాయెను. క్షోణి కంపించునట్టు రెండు వాహనములు పరిగెడు చున్నవి.  

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...