Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, January 20, 2017

హొమ్ అలోన్ - యదార్థ గాథ

మా ఆవిడ ఇంట్లోలేదు, 15 రోజులు రాదు. అంటే హొమ్ అలోన్. అన్నాను.
అదేంట్రా అదేదో హొమ్ లోన్ అన్నట్టు మొహం అలా పెట్టేవు. అన్నాడు నా ఇంటికి వచ్చిన ఫ్రెండ్.
"నా సిట్యు ఎషన్ అర్ధం చేసుకోకుండా ... " మూలిగాను .
 "నా నా సిట్యు ఎషన్ ఏంటో నాకే అర్ధం కావడం లేదు. సరే చెప్పు ఏంటి నీబాధ?" అన్నాడు .
 "ఏంలేదురా , భోజనం సమస్య" అన్నాను. 
"ఏం, హోటల్ లో మింగొచ్చుగా?" అన్నాడు. 
"మింగొచ్చు అనుకో కానీ టైం లేదు" అన్నాను.
 "అవునులే టేబుల్ మీద పళ్ళెం పెట్టి పది సార్లు గుర్తు చేసి ,తినక పోతెతిట్లు తిడితే అప్పుడు తినే వాడివి. ఆ తిట్లు లేక పొతే నువ్వు తిండి తినలేవు. అంతేనా ?" అన్నాడు .
"ఛి అదెంకాదురా, పెట్టుకుని తినడమే కష్టం అనుకునేవాడికి వండుకోవాలంటే ఎంత కష్టమో ఆలోచించు ?" అన్నాను.
" కుక్కర్ ఉంది కదా వండుకోడం ఎంతసేపు చెప్పు, బద్ధకం కాకపొతే" అన్నాడు.
" నాగాలి తీయకురా, మోటివేట్ చేయరా " అన్నాను. 
"మోటివేట్ చేస్తాను " కుక్కర్ ఇలా పట్రా" అన్నాడు. బియ్యం కడిగి ఇందులో నీళ్ళు పోసి పెట్టు అన్నాడు . నాకు కోపం వచ్చింది , ఎన్ని నీళ్ళు పోయ్యలమ్మా అన్నాను. ఇందులో కొంచం , అందులో కొంచం. నాకు కాలింది. నీళ్ళు పొయ్యాలి అని నాకూ తెలుసు, కానీ ఎన్ని పోయాలో తెలీక ఆగిపొయాను. అన్నాను. ఎనో కొన్ని పొసయ్, అన్నాడు. ఇలాగే గత సంవత్సరం ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ సలహా మీద వంట చేసి , నానా బాధలు పడ్డాను. అ కుక్కర్ ఎంత మాడి పోయిందంటే అది మార్చేసి కొత్తది కొనాల్సి వచ్చింది. కుక్కర్ నేను పెడతాను అన్నాడు, లండన్ లో విరగాదీసాను అన్నాడు. నిజమే అనుకున్నాను. అన్నయ్య బెల్ట్ ఉందా అన్నాడు . ఒకటే ఉంది అన్నాను నడుముకి ఉన్న బెల్ట్ చూబిస్తూ. అది కాదన్నయ్య కుక్కర్ బెల్ట్ అన్నాడు. బాబూ దాన్ని బెల్ట్ అనరు అన్నాను. కుక్కర్ లో నీళ్ళు తక్కువ పోసాడు. అన్నం బిస్కట్ల లా కోసి పెట్టాడు. సంవత్సరం తరువాత మళ్ళీ ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదు. పకింటి ఆవిడని అడుగుదాముకున్నాను " ఎన్ని నీళ్ళు పోయ్యలని , ఛీ ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చి నట్టు , మా ఆవిడకి ఫోన్ చేసాను, తియ్యలేదు. ఛి ఛి చిరాకేసింది. అదే సమయంలో మా ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది. వాడు బయటి వెళ్ళాడు. నేను తెగించి కుక్కర్ పెట్టీసాను.
పావుగంట తరువాత కూడా కుక్కర్ సైలెంట్ గా ఉన్ది. దగ్గరకెళ్ళి చూసారు. కాస్సేపు నిలబడ్డాను. ఏమీ మార్పు లేదు. వెనక్కి వచ్చిGerman బ్లాగ్ లో పోస్ట్ పూర్తి చేసాను. అప్పుడు వినిపించింది చిన్నపిల్లవాడు ఏడుపు, కాస్సేపట్లో అర్ధం అయ్యింది అది కుక్కర్ లోంచి వస్తోంది అని. చాలా ఆశ్చర్యం. అప్పుడే ఫోన్ ముగించి వచ్చిన ఫ్రెండ్ కూడా ఆశ్చర్య పొయాడు. కుక్కర్ లోంచి మళ్ళీ అదే ఏడుపు వినిపించింది. ఏంచేద్దాం ? కుక్కర్ ఆపెదామా ? అన్నాడు. పక్కింటి ఆవిడని పిలుద్దామా ? అన్నాను. ఈ టైం లోనా, వాళ్ళ ఆయన ఏమనుకుంటాడు? నిజమే చాలా దరిద్రంగా ఉంటుంది , పోనీ ఆయననే పిలిస్తే అన్నాడు వాడు. పరమ ఛండాలంగా ఉంటుంది అన్నాను. కానీ ఎందుకు ఇంత వింత గా చిన్నపిల్ల ఏడుస్తున్నట్టుగా శబ్దం ఎలా వస్తున్నాది? అన్నాను. కుక్కర్ కి దయ్యం పట్టింది అన్నాడు. తుళ్ళి పడ్డాను. నీకు పిచ్చి పట్టింది అన్నాను. ఎం కారుకి దయ్యం పట్టాగాలేంది, కుకర్ కి పట్టకూడ దా ? అన్నాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది వాడు ఫోను మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ హొమ్ అలోన్.


No comments:

Post a Comment