Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, June 16, 2019

శివలయం - పాట - పూలబాల

నరమేధం ( నరసంహారం) కొరకు ప్రకృతి శివుని ప్రార్ధిస్తూ పాడే  రోదన గీతం



















ప్రకృతి : బిలబిల బిలబిల బిలబిల మంటూ పాకేసింది నరజాతి భూమంతా
బిలబిల బిలబిల బిలబిల మంటూ పాకేసింది నరజాతి భూమంతా
చెట్టూ పుట్టని చెండాడి, చమురు వనరులు పీల్చేసి, ప్రకృతినంతా
వికృతి చేస్తూ, విలువలనన్నీ విడనాడి  విలయ తాండవం చేసేస్తోంది
నరజాతి ముష్కరజాతీ హర హర శంభో మహాదేవ మూడోకన్ను తెరిచేయరా
ఈ సర్పజాతిని మట్టుపెట్ట పట్టుపట్టి  రారా   కందర్ప దర్ప హర

రోగం లేదు యుద్ధం లేదు లక్షలలో చావులు లేవు
నింగిలోని పక్షిలేదు , నీటి లోని చేప లేదు , రాత్రి లేదు
పగలు లేదు వినోదానికి  పొద్దేలేదు విధ్వంసానికి హద్దే లేదు
ఈ సర్పజాతిని మట్టుపెట్ట పట్టుపట్టి  రారా   కందర్ప దర్ప హర
హర హర శంభో మహాదేవ మూడోకన్ను తెరిచేయరా
ముష్కరజాతి ని మట్టు  పెట్ట విలయ తాండవం చేయగరారా

 నరుడు :'జంతూనాం నర జన్మ దుర్లభం' అని ఆది శంకరుడు అనలేదా
(అంటే  84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప
జన్మ, దేవతలు కూడా మానవ జన్మ కోసమే పరితపిస్తుంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. )

శివవాణి : ఎవడురా ఆది శంకరుడు , అసలు శంకరుడి కంటే గొప్పవాడా?

నరుడు : భక్తి ముక్తి ఫలం తస్యా తులస్యా పూజయేద్యయి
జపాకుసుమా పూజాతు శత్రూణాం మృత్యుదాస్మృత
శమీప తైస్తథా ముక్తి ప్రాప్తయే పురుషేణచ మల్లికాకుసుమైర్థతే
స్త్రీయం శుభతరం శివః  అనలేదా ?

ప్రకృతి: విన్నావా ఈ  నీచుని మాట దేవుని కంటే గొప్పోడట వీడూ
భుక్తి కోసం పెనుగులాట , విలాసాలకు వెతుకులాట
కపటం, చౌర్యం, హింస, మోసం  జీవితమంతా అబద్దం
హర హర శంభో మహాదేవ మూడోకన్ను తెరిచేయరా
ఈ సర్పజాతిని మట్టుపెట్ట పట్టుపట్టి  రారా   కందర్ప దర్ప హర

ఢమరుక నాదం తో శివ తాండవం మొదలయి సంపూర్ణ నరసంహారం తో ముగుస్తుంది
ఢమరుక ధ్వని " టుట్టు  టు టూ ,  టుట్టు  టు టూ,  టుట్టు  టు టూ,  టుట్టు  టు టూ"
puisque tu tues tout ce que je te tue , puisque tu tues tout ce que je te tue,
అనే ఫ్రెంచ్  మాటలని పోలి , నరసంహార కారణాన్ని  శివధర్మాన్ని తెలియజేస్తుంది




9 comments:

  1. శివ లయం ..రోదన గీతం అద్భుతం

    ReplyDelete
  2. Human's Ego Destroys Nature & it's resources by over exploitation (Greed).
    So the Balance has to be maintained , where Shiva comes into picture (as he's mentioned as Destroyer in Puranas).

    Thought Provoking Poem indeed

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Reading this is like imaging the scene there.

    ReplyDelete
  5. Shiva do aananda tandava, rudra tandava. Prakruti ( nature ) calling for vilaya tandava as it is unable to bear these anthropogenic factors affecting it. Terrorism, diseases, climate change etc. Author concern for society, environment and finally addressing it to God ( Shiva) who is the creator & destroyer. Very nice article sir.

    ReplyDelete
  6. Hidden talent I'm in you sir🙏. Really a thought provoking one indeed.

    ReplyDelete
  7. It seems after listening to this ROODHANA GEETHAM Lord shiva started dancing in December.Its very 1st impact is coronavirus. Later floods, storms, earthquakes,oil leakage in oceans ,rivers turning to red, wildfires, there is no food in many countries , Armenia-Azerbaizan war which caused over 5500 deaths...etc . Ozone hole in Antarctica is slowly recovering, dolphins finally appeared after longtime in ganga river . If this is the just 1st wave of lord Shiva's dance effects . What would be the impact of his coming waves! OM NAMAH SHIVAYA 🙏🏻

    ReplyDelete