Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, June 19, 2019

సముద్రంలో కాకి రెట్ట - తెలుగు సినీ సాహిత్యం లో మంచి


దాదాపుగా యాభై ఏళ్ల నుంచీ సినిమా పాటల్లో “ప్రేమ” "మొహం" ప్రథమ స్థానం లో ఉంటాయి , ప్రేమ పాటల భావజాలాన్ని అంటువ్యాధిలాగ వ్యాపింపజేయటమే కాకుండా , సినిమా రైటర్లు సిగ్గులజ్జ వదిలేసి శృంగారం పేరుతో పచ్చి బూతులు రాస్తున్న బుద్ధి జ్ఞానం లేకుండా ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు ?
వ్యక్తి పూజ ఎక్కువ, వ్యక్తిత్వం తక్కువ, సెలిబ్రిటీస్ అన్నా బ్రాండ్స్ అన్నా పడిచస్తాం. నేను ప్రేమ పాటలు పక్కన పెట్టి మొహం గురించి రాస్తున్నా. మొహం గురుంచి రాయాలంటే సిగ్గులజ్జ వదిలేయాలి. కామాన్ని వ్యక్తపరిచే పాటల్లో ముఖ్యమైనది ప్రియురాలి అందాలని వర్ణించడం , ఆమె పై కామాన్ని, వర్ణించడం , రమ్మని పిలవడం ఉదాహరణకు ఎదురులేని మనీషి లో ఎం టీ ఆర్ వాణిశ్రీ యుగళ గీతం " కసిగా ఉంది కసి గా ఉంది కలవక కలవక కలసినందుకు కస్సుమంటోంది, నీ కండలు చూస్తే గుబులు పుడుతోంది , నీ ఛాతీ చూస్తే నిన్న రాత్రి గుర్తుకు వస్తోంది" సెక్స్ కోరికల్ని తీర్చుకుందామని ప్రతిపాదించడం సాధారణమే అన్నట్టు రాసేశారు " సోగ్గాడు చిత్రం లో చలి వేస్తోంది చంపేస్తోంది రారా కప్పుకుందాం" అనే పాట వింటున్నప్పుడు శోభన్బాబు జయసుధ వాన విన్యాసాలు , హావ భావాలు చూస్తున్నప్పుడు ఇదంతా మంచిసాహిత్యం , కళ అనే అనుకోవాలా ?

పాత పాటల్లో సెక్స్ కి బదులుగా వలపు అని రాసే వారు , ప్రకృతిని పూవులు తుమ్మెదలని ఉపమానాలు గా తీసుకుని మోజు ( కామ కోరిక) రతి క్రీడని వర్ణించేవారు. గూడుపుఠాణి లో పాట "తనివి తీరలేదే నా మనసు నిండ లేదే .. విరిసిన అందాల లోతులో చూసిననూ అంటూ క్లాస్ టచ్ ఇచ్చారు. తరువాత కాలం లో వానొచ్చిందంటే వరదొస్తాది, వయసొచ్చిందంటే వలపొస్తాది, నువ్వు రెడి రెడి... నేను రెడి రెడి చెలియా పడి పడి... చేద్దాం హడావిడి. .శోధించనా పరిశోధించనా... ఒంపుల్ని హరిచందనా .. పరువాల పారాయణా …సాగించనా కొనసాగించనా... మృదువైన మదనార్చనా ఇటువంటి మాటలతో పచ్చి బూతు ను పండించారు. పచ్చిగా వర్ణించడం ఇది కాదా?
మొదట్లో ఆడా మగా మొహాన్ని ఇలా వ్యక్తపరిచేవారు ..రాంబా ఊర్వశి తలదన్నే రమణీ లాలామె ఎవరీమె … ఇంద్రుడి చంద్రుడి అందాలు; మధువొలకబోసే నీ చిలిపి కళ్ళు; హాయ్ రే హాయ్ జాం పండు రో, అంటూ డోస్ పెంచారు. కొన్ని పాటల్లోఅందాలను సున్నితం గా వర్ణిస్తే మరికొన్ని పాటల్లో… పడుచు గుండె బిగువులు సడలిపోనివ్వనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధ అని సూటిగా ఘాటుగా ( పచ్చిగా )వ్రాసారు. ఆకులు పోక లు ఇవ్వొద్దు , నానోరు ఎర్రగా చేయద్దు నాలో ఆశలు రేపొద్దు అని ఒక తరం లో, మరో తరం లో బండగా , నీ కళ్ళు పేలిపోను చూడకే ఆలా హాయ్ హాయ్ హాయ్ . చివరకి "కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ, అలవాటు లేని సుఖమా" అంటూ ఈ బూతు పతాకస్థాయికి చేరి అందరికీ అదే సుఖం అనిపించేలా తయారయ్యింది తెలుగు సినీ సాహిత్యం. జల్లెడకన్నీ కన్నాలే అన్నట్టు తెలుగు పాటల్లో సింహ భాగం బూతులే. మంచి పాటలు లేవని కాదు సముద్రంలో కాకి రెట్ట. చరిత్రపూర్వ కాలం లోకి పోయి లోతుగా ఆలోచిస్తే శృంగారం లో సహజత్వమే కనిపిస్తుంది , సృష్టికి మూలమైన శృంగారాన్నితూలనాడడం నా ఉద్దేశం కాదు.  ఇంగ్లిష్ సినిమాల్లో   సెక్స్ బహిరంగంగా చూపుతారు. ప్రాచీన కాలంలో శిల్పకళ  లో శృంగారాన్ని స్పష్టంగా చూపినా అంతా గొప్పగా చూసారు. ఈరోజకి వాటిని ఎవ్వరూ కూల్చలేదు. భాషలో సున్నితత్వం ఉండాలి . శృంగారాన్ని అంగీకరించని మనిషి ఉండడు. 

6 comments:

 1. Conclusion part : manchi paatalu levu Ani kaadu.....samudram lo kaaki retta....😃😃😃. Humourous + critically examined + poetic phrases.Multiple facets of author is evident in this article. A poet, A critic with humourous touch. A combo. Nice article sir.

  ReplyDelete
 2. your thoughts and insights are inspiring over Telugu literature

  ReplyDelete
 3. What you have said is absulitly write about our telugu film industry. It has become a faction to show such ugly scenes in movie.
  I olden days the songs which they sung are very meaning full. But now a days every one attracted to high lofer songs and sex movie.

  ReplyDelete
 4. What you have said is absolutely write sir.
  Our film industries are more interested to show more bad. Our ansisters have given us good and meaningful songs to us and this is implemented in our daily life. The song which they sung are analyzed by their own from nature. But now a days it's poets are writing as their wish in many bad forms..

  ReplyDelete
 5. ఇప్పటికి కొన్ని పాటలకి అర్ధం తెలియక అలవోకగా అందరి ముందు పాడేస్తున్నాంsir..... కానీ నిజమైన అర్ధం తెలిసాక సిగ్గుగా ఉంది, అరె ఇంత చక్కని అర్ధాన్ని తెల్సుకుకోలేకపోయనే అనిపిస్తుంది. మీరు చెప్పిన విధానం బాగుంది. సముద్రంలో కాకి రెట్ట ఈ పోలికలోనే మీ విమర్స లోతు తెలుస్తుంది. ఇది విమర్శ కాదు సార్ నేటి కాల౦లొ దిగజారిపోయు మంచాన పడి ఉన్న సాహిత్యానికి ఒక చిన్న పరామర్స. చాల చక్కగా చెప్పారు.ధన్యవాదాలు

  ReplyDelete
 6. నిర్మాతలకు, దర్శకులకు కావాల్సింది బూతే. ఒక పెద్దాయన కడుపు మండి ఒక వ్యాఖ్య చేశారు, అదేమంటే "పాతకాలంలో వేశ్యా గృహాలుంటూండేవి. వాటిని ప్రభుత్వం నిషేధించగానే ఆ నిర్వాహకులంతా సినీరంగంలోకొచ్చి పడ్డారు. అందుకే చలనచిత్రాలు దిగజారిపోతున్నాయి" అని.అప్పట్లో వారిని తిట్టిపోసినా నిజమేకదా అనిపిస్తోంది.

  ReplyDelete