నేను జీవితం లో కష్టాలని దాటుకుంటూ నా గమ్యాన్ని ఎలా చేరుకున్నానో " జానపద
గీతం" రూపం లో రాసుకున్నాను. పోతన కూర్చిన గజేంద్రమోక్షంలోని పద్యం కృష్ణదేవరాయలను ఎంతగా అకర్షించిందో దాన్ని తన ఆముక్తమాల్యదలో అనుకరించారు. అలాగే "కొండొండొరి చెరువు కింద చేసిరి ముగ్గురు యెగసాయం"
ఈ పాట రాయడానికి నాకు పట్టిన సమయము వారం రోజులు, 30 గంటలు. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోడానికి 30 గంటలు వెచ్చించలేక మధ్యలో వదిలేస్తుంటారు. నేను ఒక్క భాషలో ఒక పాట కి వెచ్చిచే సమయము. పాటలు కాకుండా , పద్యాలు, ఆర్టికల్స్ , నాటికలు అన్ని నాకొచ్చిన భాషల్లో వ్రాస్తుంటాను. చివరిగా నేను చెప్పేదేమిటంటే " భాషారాని వాడు పరమ బద్దకస్తుడు" నీవు దేన్నైనా ప్రేమిస్తే అది నీజీవితంలో అంతర్భాగం అయిపోతుంది. అది జీన్ పాంట్స్ , మొబైల్ , ఒక వ్యక్తి లేదా భాష కూడా కావచ్చు.
అనే జానపద గీతం అన్ను ఎంతగానో ఆకర్షింది. ఆ గేయంలో తాళాన్ని అనుసరించి నేనొక జానపద గీతాన్ని వ్రాసాను. అయితే నా జానపద గేయం అనుకరణ కనే కాదు తాళాన్ని కూడా కొద్దిమాత్రం గానే తీసుకున్నాను. "కొండొండొరి" ప్రభావం తో రాయబడిన జానపద
గీతం అని ఖచ్చితంగా చెప్పగలను.
రచయితగా నేను చెప్పదలచుకున్నది అయిపొయింది
, ఇంక టీచర్ గా చెప్పవలసింది చివర్లో ఉంది , చదవగలరు
1.బెజ్జం వాడ లంకలోన అవ్వారోరి మిద్దెమీద
ఊరు లేక పేరు లేక, కొంపా లేక గోడీ
లేక
సేసిరి జంటగా ఆలు మగలు – ఎగసాయం
2. కుంచనపల్లి కమతాల్లోనా మంగళగిరి
మాన్యాల్లోనా
కొక్కిరి బిక్కిరి దారుల్లోన కామందోరి కమతాల్లోనా
సేసిరి జంటగా ఆలు మగలు -
ఎగసాయం, ఎగసాయం.
3.కాలికి బలపం కట్టుకొని గట్టుపుట్ట
దాటుకొని
అన్నం మూట పట్టుకొని
తలుపుకు గొళ్ళెం బెట్టుకొని-
సేసిరి జంటగా ఆలు మగలు -
ఎగసాయం, ఎగసాయం
4.రాయి రప్ప తట్టుకొని కిందపడ్డ,
మీదపడ్డ
జబ్బు పడ్డ, పిడుగుపడ్డ సేసిరి జంటగా ఆలు మగలు
ఉక్కిరిబిక్కిరి - ఎగసాయం, ఎగసాయం.
5.రెక్కలు ముక్కలు సేసుకొని సెమటలు
బొచ్చెడు కక్కుకొని
రేతిరికింటికి సెరుకొంటే కంటికి నిద్ర రాదు మనసుకి
శాంతి లేదు
నిద్ర రాకున్నా శాంతి లేకున్నా తప్పదు ఉక్కిరిబిక్కిరి - ఎగసాయం, ఎగసాయం
6.పంటలు ఉంటె పనులుండెను
, రెక్కాడిత్తే డొక్కాడే
ను
రెక్కా ఆగినా, డొక్కా మాడినా మిద్దెకద్దె కట్టకుంటే,
వల్లకోడు
బుగతోడు వల్లకోడు, వల్లకోడు
బుగతోడు.
7.ఎండల గాడుపొచ్చినా
, వానల ఏడుపొచ్చినా
అలుపు లేక
సొలుపూ లేక రెక్కలు ముక్కలే సేసు కుంటూ
సేసిరి
జంటగా ఆలు మగలు -
ఎగసాయం, ఎగసాయం
8.వయసు పెరిగిన కూలిగిట్టదు కాలు వంగిన భారం తగ్గదు
కూలి గిట్టినా నాలి గిట్టినా మూడు మిద్దెలు
ఎక్క కుండా
ఇల్లు
సేరదు పేణం ఇల్లు సేరదు-
9. దూరం తగ్గిన, భారం పెరిగిన తప్పదు మూడు మిద్దెల ఎగసాయం
ఆగి ఆగి ఎక్కుతుంటే , సేమాటలింకా కక్కుకుంటా
ఆడికి , మెగ
సాయం మగకి
ఆడ సాయం -
10. ఒక్కరేతిరి సుక్కలు మింగి ఆవులించే ఆకాశం నాల్గు దినాలు గడవక ముందే
గాండ్రించ గాలి కమతం కొట్టుబాయెనే, సెట్టు నెల కొరిగే కమతం పోయినా సెట్టు
కూలినా
సేసిరి జంటగా
ఆలు మగలు
- ఎగసాయం, ఎగసాయం
11.బెజ్జం వాడ లంకలోన అవ్వారోరి మిద్దెమీద
రెండే వడ్ల గింజలు జల్లి
సేసిరి ఎగసాయం కొక్కిరి బిక్కిరి దారులమరచి కామందోరి
కమతాలిడిచి
ఎగసాయం ఆడికి , మెగ సాయం మగకి ఆడ సాయం
12. వడ్ల గింజలు ఒక్కటయ్యి మొక్కై మొలవ
ఆలు మగలు ఒక్కటయ్యి మొక్కను కొలువ
మూడేళ్ళకే మొక్క సెట్టు అయ్యింది ఆరేళ్లకే ఆకాశం అందు కున్నది ఐనా చెట్టుకి వేర్లు లేవు,
కాండం లేదు, వేరు కాండం లేని చెట్టు వేల పండ్లతొ వేడుకజేసె -
ఎగసాయం ఎగసాయం
13.ఉరకలు లేని పరుగులు లేని రాళ్ళూ లేని రప్పలు లేని
కొక్కిరి బిక్కిరి దారుల్లేని ఎగసాయం మిద్దె
మేనే ఎగసాయం
ఆడికి , మెగ సాయం మగకి ఆడ సాయం
. బంగారు
ఫల సాయం
14. కళకళలాడే సెట్టుని జూడ నిత్యం వచ్చే మంద
ఐనా చెట్టుకి వేర్లు లేవు, కాండం లేదు
వేర్లు లేని కాండం లేని చెట్టుని సూసిరి సులకనగా
మందకి వింతా రైతుకి చింతా
15. చెట్టుని జూసి జనులొచ్చే పండ్లని జూసి పాములు వచ్చే
కొన్ని తెల్ల పాములు కొన్ని నల్ల పాములు
పాములు తెచ్చే గండాలు కొన్ని చిన్న గండాలు కొన్ని పెద్ద గండాలు,
దుర్గమ్మకు దండాలు. నవ్విన నాపేసేనే పండింది , చెట్టే దుర్గం అయ్యింది, పండే స్వర్గం అయ్యింది.
దుర్గమ్మకు దండాలు, వానకి దండాలు , వరదకి దండాలు , అందరికీ దండాలు.
---------------------------------------------------------------------------------------------
రైతే రేడు అయి సేసే పెపంచ బాసా పయనమే ఈ జంట సేస్తున్న ఎగసాయం....సదువులమ్మకి పూల దండ కోసం పూల బాలా దంపతుల పలు బాసా మొక్కల పెంపకమే ఈ ఎగసాయం
ReplyDeleteNo one can better understand the hidden feelings like you Hemant garu💘
DeleteWhole heartedly written... Fantastic sir😍.
DeleteLalithambika, Your love of language and enthusiasm to respond is ideal. I wish you became a good writer and speaker. You are an ideal role model to the language learners.
Deleteచివరిగా నేను చెప్పేదేమిటంటే " భాషారాని వాడు పరమ బద్దకస్తుడు" నీవు దేన్నైనా ప్రేమిస్తే అది నీజీవితంలో అంతర్భాగం అయిపోతుంది. అది జీన్ పాంట్స్ , మొబైల్ , ఒక వ్యక్తి లేదా భాష కూడా కావచ్చు.... Hattsoff Venkatji
ReplyDeleteExcellent sir. Hats off to your hard work and dedication
ReplyDeleteOne of the hearttouching anthem about cultivation...I admirred by the passion you have about the mothertongue ....Really hatsoff to you Sir🙏🙏🙏
ReplyDeleteSir hats off to your hard work and dedication iam really proud because to say this iam your student
ReplyDeleteచాల బాగా చెప్పారు సార్ భాషారాని వాడు పరమ బద్దకస్తుడు కష్టపడడం వలన ఫలితం వస్తుంది
ReplyDelete