Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, October 7, 2019

బ్లాక్ రెస్టారెంట్ - చిన్న కథ - పూలబాల

ఇది ప్రతి ఊరిలో ఉండే రెస్టారెంట్. అందరికీ తెలియదు. ఇది నిజమా ? చదివితే మీకే తెలుస్తుంది.

మిట్ట మధ్యాహ్నం  సమయం 1.00 కావస్తోంది. ఒక పోష్ లొకాలిటీ , అందులో ఒక విశాలమైన వీధి,  ఆ వీధిలో ఒక అందమైన స్త్రీ నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. 
"అమ్మ ఆటో కావాలా ?" "లేదయ్యా వీధిలో భోజనం హోటల్ ఉంది అంటే వచ్చాను"
"కొంచెం ముందుకి వెళితే అదుగో అక్కడుందమ్మ"
ఆ స్త్రీ ( ఓ అనామిక) కొంచెం ముందుకి వెళ్ళగానే టోక్యో బాంక్ లా  ఐవరీ కాసల్ లాగా అందంగా కనిపిస్తుంది హోటల్. అబ్బా ఎంతబాగుందో హోటల్. తింటే ఇక్కడే తినాలి అనుకుంటూ హోటల్ లోకి అడుగు పెడుతుంది. అక్కడ ఒకావిడ ఫ్లోర్ మ్యాపింగ్ చేస్తూ లోపలి రమ్మన్నట్టు  పక్కకి తప్పుకుని  నవ్వుతుంది. ఏదైనా  కంపెనీ చైర్మన్ భార్య అయ్యుండాలి. ఖరీదైన నగలు , చీర  అబ్బో  అనుకుంటూ   హోటల్ లోపలకి చూసింది అంతా  తెల్లని దుస్తులు ధరించి మగవారుఅంతా   పిచ్చెకిస్తున్నారే అనుకుంటూ లోపలకి ప్రవేశించేంతలో లోపలివారంతా బైటికి హడావుడిగా వచ్చి ఫోటో లు ఫోటో లు అంటూ కలియబడ్డారు .  వారందరూ చాలా గ్రూప్ ఫోటోస్ తీసుకున్నారు.

పక్క ఆకలి వేస్తున్నా  ఇదంతా చాలా వింతగా ఉండడం తో స్త్రీ ఏమీ ఎదురు చెప్పకుండా వారితో సహకరించింది వారంతా లోపాలకి వెళ్లిపోయాకా ," చాలా ఫోటోస్ తీసుకున్నారు మీ సెల్ఫీ ఒకటీ తీసు కొండి " అక్కడ తుడిచే చైర్మన్ గారి భార్య. ఎందుకూ అని కళ్ళతోనే చూసి, చూపుతోనే ప్రశ్నించింది .

కాష్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకుని చుటూ చూసింది.  అందంగా అలంకరించబడిన  పెద్ద హాలు , తెల్లని ఫ్లోరింగ్ మీద బంగారు పూవులు తాపడం చేసినట్టు డిసైన్. మొత్తం ఆరు టేబుల్స్ ఉన్నాయి . ఐదు  టేబుల్స్ వద్ద మనుషులున్నారు. ఆశ్చర్యం అంతా  మగవారే , తెల్ల దుస్తులలో ... ఇందాక అనిపించలేదు గానీ  ఫెక్షనిస్టుల్లా ఉన్నారు  అనుకుంది. ఒక వ్యక్తి మాత్రం ఒక ఒక ఎత్తైన సింగల్ టేబుల్ దగ్గర కూర్చుని తింటున్నాడు. అతడు నల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు , జుట్టు నెరిసి ముగ్గు బుట్టలా తెల్లగా ఉంది. ఖాళి గా ఉన్న టేబుల్ వద్ద కూర్చుంది.

 బాయ్ వచ్చి టికెట్ తీసుకుని భోజనం తెచ్చాడు. ఎదురుగా మరో హోటల్ కనిపిస్తోది "హోటల్ శ్రీరామ్" అయ్యో నేను చూడనే లేదే , ఇంతకీ ఈ హోటల్ పేరేంటి ? బోయ్ ని అడుగుదామనుకుంది, ఛా.. బాగోదేమోలే ... అనుకుంటుండగా ఒకాయన  పంచకట్టులో   వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. ఇందాకా చూసాను అందరూ లుంగీల్లో ఉన్నారు , యితడు మాత్రం పంచ కట్టుకున్నాడు. ఇంతకముందు చూసిన వ్యక్తి కాదు. సర్లే ఎవరైతే తనకెందుకు అనుకుని భోజనం చేయసాగింది. ముద్దా నోట్లో పెట్టుకుంటుండగా తలపైకెత్తి చూసింది , అతడు తనవైపు చూసి నవ్వాడు .
గబగబా భోన్చేసి బైటకుపోవాలి  అనుకుని రెండు ముద్దలు నోట్లో పెట్టుకుంది , బాగోలేదు . అవును భోజనం బాగోలేదు స్త్రీ మొహం లో అసంతృప్తి చూసి మరో సారి నవ్వాడు, సారి కోపంగాచూసిందితలతిప్పుకున్నాడు.  పప్పు బాగోలేదు , కూర ట్రై చేద్దాం అనుకుని కోర కలుపుకుంది .. కూరా ఆంతే , విషయాలు తెలుకోడానికి ఎంతసేపు పట్టిందో తెలియదు ఇంకా తినలేను అని అనుకుంది . వాషబాసిం ఎక్కడ అని అడిగింది బాయ్ సమాధానం చెప్పకుండా " తినండి మేడం " అన్నం పారేయ కూడదు " అన్నాడు . వీడెవడు నాకు చెప్పడానికి , తినేలా ఉందా భోజనం  వెధవ .. ప్రతివాడూ చెప్పేవాడే అనుకుంది.
లేవబోతుంటే " తినండి " అన్నాడు ఎదురుగా కూచున్న పెద్దమనిషి. " తినాల్సిందే అన్నట్టు ఉంది స్వరం. అప్పుడు వచ్చింది అసలైన కోపం , పోరా గొట్టం అనుకుని వాష్ బేసిన్ వైపు నడిచింది.  వాష్ బేసిన్ వైపు వెళ్లొద్దు అనేక ఖంఠాలు . అది వాషబేసిన్ నా లేకా సిన్ నా. ఆమె రెండు అడుగులు వేయగానే అడ్డంగా నిలబడ్డారు తెల్ల బట్టలేసుకున్న పెద్ద మనుషులు.
ఆకలితో వెళ్లొద్దు , భోజనం పారేయ కూడదు , అన్నం పరబ్రహ్మ స్వరూపం .... చాలా నీతులు చెప్తున్నారు. " మీకేంటి సమ్మందం నేను నా భోజనం నా ఇష్టం , నా ఆకలి నా ఇష్టం , కావాలంటే తింటాను , లేక పొతే పస్తుంటాను.” అంది . నీతులు డోస్ పెరిగింది తప్ప ఎవ్వరూ తగ్గలేదు. “ ఎదురుగా హోటల్ ఉంది కదా అందులో తింటాను లెండయ్యా , నచ్చని భోజనం చేయమని నన్ను ఇబ్బంది పెట్టకండి అంది”. అంతా చుట్టుముట్టి వాదనకి దిగారు . వాదన కాస్త దౌర్జన్యం లోకి దిగే లా ఉంది. చైర్మనుగారి భార్య ( ఫ్లోర్ మ్యాపింగ్ లేడీ ) వారివంక చూస్తుంది ఆమె చెవిలో ఇయర్ ఫోన్స్ .. మ్యూజిక్   వింటోంది. గోడగడియారావంక చూస్తూ ఉండిపోయింది. 
తెల్ల ముగ్గుబుట్ట , నల్ల బట్టలాయన్ని కలవాలనుకుంది , అయ్యో  కాళ్ళు ముందుకు సాగటం లేదు  నేలకు అంటుకుపోయాయి. ఆయన్ను  పిలవాలని అనుకుంది , గొంతు పెగలలేదు. గోడగడియారం వేగం పెరిగింది , సీలింగ్ ఫ్యాన్ తో పోటీపడి తిరుగుతోంది. అనామిక స్త్రీ కి బుర్ర తిరుగుతోంది.  ఇది హోటలా ? చెప్పండి ఇది కసాయి కొట్టా?
తెల్ల ముగ్గుబుట్ట , నల్ల బట్టలాయన్ని కలవాలనుకుంది , అయ్యో  కాళ్ళు ముందుకు సాగటం లేదు  నేలకు అంటుకుపోయాయి. ఆయన్ను  పిలవాలని అనుకుంది , గొంతు పెగలలేదు. గోడగడియారం వేగం పెరిగింది , సీలింగ్ ఫ్యాన్ తో పోటీపడి తిరుగుతోంది. అనామిక స్త్రీ కి బుర్ర తిరుగుతోంది.  ఇది హోటలా ? చెప్పండి ఇది కసాయి కొట్టా ?

తనయెదురుగా కూర్చుని భోజనం చేసిన వ్యక్తి రింగ్ లీడర్ లా కనిపించాడు . అతడు  మరీ దౌర్జన్యం గా ప్రవర్తిస్తున్నాడు. అతడి చెయ్యి స్త్రీ  పీకమీదకి చేరుకుంటూ న్నది.  ప్రాణ భీతి తో ఆ మొఖం  పాలిపోయింది , అతడి చెయ్యి ఆమె పీక పైన బిగుస్తోది . ఈ లోగా ఆమె  పెద్ద గా కేకపెట్టి హోటల్ బైటకి పరిగెత్తింది. నేను ఇలా ఉన్నాను ఏంటి అంది ఆ అనామిక తన ముడుతలు పడ్డ దేహం చూసుకుంటూ.  "రూపం  ఒక్కటే చూసుకుంటున్నావు నీ లో జీవ కళ ఎంత తగ్గి పోయిందో చూసుకో ?" అంది చైర్ మన్  గారి భార్య.  "ఎలాఉండేదానివో తెలుసా ?" " తెలియదు నారూపం నావ్యక్తిత్వం అన్నీ మర్చిపోయాను కానీ ఇప్పుడు అర్ధం అయ్యింది నువ్వు నన్ను సెల్ఫీ ఎందుకు తీసుకోమన్నావో ?" అంది అనామిక . She lifted her head up casually just then a gust of wind had blown up the saree covering the hotel sign board. The name of the restaurant was revealed." పెళ్లి రెస్టారంట్" అనే  అక్షరాల చూసి  అనామిక మౌనంగా కూలబడింది. 

3 comments:

  1. Sir,really you are a good analyzer.You read the minds of the people and society.You described the lives of some suppressed women here

    ReplyDelete
    Replies
    1. Thank you for your response Sahitya priya. How is the story?

      Delete
  2. Your analysation of the society is superb sir and the way you described the lives of some suppressed women is awesome.

    ReplyDelete