ఎక్కడిదానివే సక్కని భామ
అందా చందాలున్న పొందికైన భామా
ఉసిరి తోటకాడ ఊపులు సూపి
జామ తోటా కాడా జంకుతావేలాII
జంకు గొంకు గాదు జాంగలికుడాII
నిమ్మతోటా కాడ తుమ్మ ముళ్ళు గుచ్చే
కారుమబ్బులు కమ్మి సీకట్లలమంగాII
బళ్లబాటలో ముళ్ళు కాలిలో కొచ్చే
కూసోయే కుదురుంగా నీ ముల్లు నే దీత్త.
కవటాకు లాంటి పాదాలలోకి తుమ్మ
ముళ్ళుదూర చెమ్మగిల్లే కళ్ళు.
ఉసిరి తోటకాడ కసిరి సూపు ఇసిరాను
వయసు కాడవు నీవు నిను నమ్మలేను
జామతోటాకాడ నీనాగలేను
బారెడు జుట్టు దాన నేరేడు కళ్ళ దాన
జామాతోటాకా జారీపోతావేలా
అందా చందాలున్న పొందికైన భామా
కసిరికొట్టకుండా దింపవే నీ కుండ
ముల్లు దీత్తే నీవు లేడి పిల్లవేగాదా
ముల్లు తెసేటోడికి అందాసందాలెందుకు
జామతోటాకాడ నీనాగలేను
వయసు కాడవు నీవు నిను నమ్మలేను
ఈడైనదానా వాడైనాదానా నా గుండెల్లో సేపల్ల ఈదేటిదానా
వక్క వాడుకాడ ఒక్కదెబ్బతో నే ఎలుగుని గొట్టంగా
నక్కి నక్కి జూసి జక్కలించిన భామ నా సత్తా నీకెరీకే
మెట్లగుంటకాడ మూడుకుంట్ల భూమి నా సొత్తు నీకెరీకే
నీ సొత్తు నాకొద్దు నీ పొత్తు నాకొద్దు
ఎక్కడి వాడివో ఓ వేటగాడ
నిన్నెన్నడు నేనెరుగ ఓ వన్నె కాడా
అయ్యా జూసాడంటే రచ్చ రచ్చౌతాది
ఎల్లిపోవయ్యా నాయెంట బడక
అందా చందాలున్న పొందికైన భామా
కూసోయే కుదురుంగా నీ ముల్లు నే దీత్త.
బాణం లోపల దించి లాగేత్తానే ముల్లు
బాధగా ఉంటె ను మూసుకోయే కళ్ళు
ముల్లు తెసేటోడికి అందాసాదాలెందుకు
జామతోటాకాడ నీనాగలేను
వయసు కాడవు నీవు నిను నమ్మలేను
అయ్యా జూసాడంటే రచ్చ రచ్చౌతాది
ఎల్లిపోవయ్యా నాయెంట బడక
వలపు గత్తె వు నీవు పులుపెందుకే భామా
అరకదున్నుకుంటా మెరకమీదుంటానే
ఎరికలోవారిమే వయ్యారి భామ
రచ్చా గొచ్చు లేదు మీ అయ్యా మెచ్చాడు
బరాత మిచ్చాడు సాపుగా నన్ను సూసుకో మల్ల
పాట చాలా బాగుంది సార్ జానపద పాటలు చాలా బగుంటయి
ReplyDelete