Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, December 20, 2019

జీవితాన్ని ఎలా అలంకరించుకోవాలి ?

డిసెంబర్ 19 తెల్లవారింది , తెల్లవారితే పని పని పని పక్కమీంచి లేవగానే కనిపించేది పని . పక్క ని చుట్టి పక్కన పెట్టినట్టు , పనిని చుట్టి పక్కన పెట్టేసాను.  2019 వెళ్ళిపోతోంది, పెళ్లిచేసి కూతుర్ని అత్తారింటికి పంపుతున్నట్టుగా అనిపిస్తోంది.
దూరదర్శన్ కోసం చేస్తున్న ఫ్రెంచ్ కార్యక్రమం శిక్షణ లో పాల్గొన్న పిల్లలు 
ఈ శుభసమయంలో ..
 నాజీవితాన్ని స్నేహ సౌరభాలతో అలంకరించుకోవాలి అని నిర్ణయించుకున్నాను. స్నేహితుడితో గడిపిన  ఆ తీపి అనుభవాలతో హృదయం నింపుకోవాలి అనుకున్నాను. సంవత్సరాలు మారుతున్నాయంటే సంబరాలు...
 అంతా ఇళ్ళు , షాపులు అలంకరించుకుంటారు. స్వీట్స్ తో నోరు తీపి చేసుకుంటారు  మరి జీవితాన్ని ఎలా అలంకరించుకోవాలి ?

స్నేహ సౌరభం , సేవా పరిమళం, జ్ఞాన కాంతులు , వెరసి జీవిత మాధుర్యం గా మిగులుతాయి అందుకే వాటితోనే జీవితాన్ని అలంకరించుకోవాలి .అందుకే మిత్రుడు , స్నేహాభిలాషి , జ్ఞానాభిలాషి పామర్రు వాసి హేమంత్ కి ఫోన్ చేసి పామర్రు వస్తున్నాను అని చెప్పి పామర్రు బయలుదేరాను.

(నాకు భోదన ద్వారా సేవ చేసే అవకాశం ఇస్తే చాలా సంతోషం. కొంతమంది గేలి చేస్తుంటారు. నీకెందుకు నీ పని చూసుకోక అని.  వారి మానసిక స్థితి అది.   దూరం భారం కాదు  అంగీరకారమే . పల్లెటూరు ఐన , పట్నమైనా , చిన్న స్కూల్ అయినా , కాలేజీ అయినా , యూనివర్సిటీ అయినా ఏదైనా ఒకటే.  జ్ఞానాభిలాషులు కొద్దిమందే .. జనాభిలాషులు కొద్దిమందే

సేవలో ప్రేమ మిళితమై ఉంటుంది. ఇంట్లో వాళ్లకి , తల్లి తండ్రులకి కూడా సేవ చేయలేని స్థితిలో కొంతమంది ఉంటారు. ముక్కూమొఖం తెలియని పెక్కు  మందికి మక్కువతో  సేవ చేయడమంటే ప్రేమించడమే. ఇదే యూనివెర్సల్ లవ్. చాలామందికి ఇది నమ్మబుద్ధి కాదు. ఇదో దుస్థితి.  ఎవరి స్థితి వారిది.

టెక్స్ట్ పుస్తకం కూడా చదవడం దండగ అని , పరీక్షలకి ముఖ్యమైన ప్రశ్నలు , పరీక్షముందు చదువుకునే వాడి చదువు దండగ. చాలామందికి  ఈ స్థితిలోనే  ఉన్నారు  ఇదో దుస్థితి.  ఆటలో మోసం చేసి నెగ్గే వాడి గెలుపు దండగ కాదా ? )

ముందుగా  టీచర్లతో ఒక  చర్చ ప్రార్రంభించాను  30 మినిషాల పాటు ఈ చర్చ కొనసాగింది. విద్యకి సంబంధించిన 10 ప్రశ్నలకి నిజాయతీ గా సమాధానం చెప్పడమే ట్రుథ్  అండ్ ఫిలాసఫీ అనే చర్చ. మధ్యాహ్నం లంచ్ తర్వాతా  పిల్లలకు ఫ్రెంచ్ కార్యక్రమం మీద శిక్షణ ఇచ్చాను.
ఫ్రెంచ్ భాషాభిలాషి  గీతిక  ఫ్రెంచ్ కార్యక్రమం వివరాలతో  
దూరదర్శన్ కోసం చేస్తున్న ఫ్రెంచ్ కార్యక్రమం బోర్డు పై రాసి పిల్లకి కార్యక్రమం పై అవగాహన కల్పించానుసాయంత్రం 4.00 గంటలవరకు హితం స్కూల్ పామర్రు లో గడిపి విజయవాడ బయలుదేరాను. ఈ మధుర స్మృతులతో నా జీవితాన్ని అలంకరించుకో గలిగాను. టీచర్లకి ధన్యవాదాలు , పిల్లలకి జేజేలు . హేమంత్ కి  ఏం చెప్పాలో  తెలియదు. 2019 నా నుదుట పెట్టిన తీపి ముద్దు ఎప్పటికీ మరువలేను 2019 నా మొహాన్న పూసిన రంగులు ఎప్పటికీ వెలిసిపోవు.

11 comments:

 1. Good morning sir... Am srinivas from karimnagar, unexpectedly I could see your profile in Facebook, awesome sir you are giving a very valuable education service to society, your language skills should mondetary to next Generation youth to lead the world. Advance Happy New Year2020

  ReplyDelete
 2. Its so valuable and we got much information about that sir.Thank you so much sir

  ReplyDelete
 3. మీరు ఒక నిరంతర విద్యార్థి.జ్ఞాన పిపాసి.జ్ఞానాన్ని సముపార్జించటమే కాకుండా దానిని నలుగురికి పంచడంలో ఆనందాన్ని వెతుక్కునే మీ మంచి మనస్సుకు నమస్సుమాంజలి.ఈ సంవత్సరాన్ని ఇంత బాగా సాగనంపిన మీకు వచ్చే సంవత్సరం మరిన్ని విజయాలను, సంతోషాలను తీసుకురావాలని ఆశీస్తూ రాబోయే నూతన సంవత్సరానికిగాను ముందుగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను

  ReplyDelete
 4. Always share fun n knowledge boundless with u sir....we r very fortunate to be with u for a whole day sir

  ReplyDelete
 5. Hat's of your dedicated work sir.i wish you all the best for 2020.🙏

  ReplyDelete
 6. Dear Sir. HITAM and Hemanth are both fortunate to have you associated with us. The linguistic knowledge you possess is exemplary. More so is your zeal to share it with like minded people n hence HITAM is very very lucky to gain your knowledge. We wish you good luck and all the very best in each step you take in the days to come in making a great knowledge society and we will be proud to walk with you till we last.

  ReplyDelete
 7. A day spent well with a year spent well.

  ReplyDelete
 8. Wonderful moments with you sir
  Hope the days comeback

  ReplyDelete
 9. మీరు grate సార్. మీ దగ్గర ఉన్న జ్ఞనన్నీ అందరికీ పంచలనీ మీ ఉద్దేశ్యం గొప్పది సార్ మీరు రాసిన పుస్తకాలు పధ్యలు ద్వారా change రావలి సార్
  ReplyDelete
 10. "జీవితాన్ని అలంకరించికోవడం" చాల కొత్తగా ఉంది sir...... అసలు ఇదే అవసరం అని నాకు ఈ మధ్యే తెలిసింది. కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మధురానుభూతులు.... వయసు తో సంవత్సరాలు,మైళ్ళ కొద్ది దూరాలు పెరిగిపోయాక కాలం తీసుకురాలేని కొందరిని జ్ఞాపకాలే తెచ్చి చేతిలో పెడతాయు. నాకు తెలిసి అటువంటి ఎన్నో జ్ఞాపకాలు మీరు పోగేసుకున్తున్నారు....వాటితో మీ జీవితాన్ని మరింత అందంగా అలంకరించుకున్తున్నారు....

  ReplyDelete