Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, March 2, 2020

కుక్కర్ కి దయ్యం పట్టింది


పాత్రలు – సీతాపతి - రచయిత , మారుతి - సీతాపతి స్నేహితుడు, బంగార్రాజు - వెనకింటాయన
మిలట్రీ శంకర్రావు - బట్టలకొట్టు కన్నబాబు - దుర్భిణి –  స్మిత – చీమల రావు - పర్వతాలు

వంటగదిలో సీతాపతి వంట చేస్తూ  తనలో  తాను మాట్లాడుకుంటూ  ఉంటాడు.  గిన్నెలు , కుక్కర్ బియ్యం డబ్బా వైపు మార్చి మార్చి చూస్తూ  వంట ఎలా ప్రారంభించాలో తెలియక స్వగతం లో……

సీతాపతి : హు ఈ వంట  పెద్ద  తంట, మా ఆవిడ ఎప్పుడుచూసినా సభలు , సమావేశాలు , పుస్తకావిష్కరణలు అని  ప్రయాణాలలో ఉంటుంది, నాకా వంటరాదు ఆవిడ నామాట వినదు ఈవిడా , కుక్కర్ కూడా    నా మాట వినదు.  రాత్రి 7.00 అవుతున్నాది… కుక్కర్ లో రైస్ ఎలా వండాలబ్బా ?  అన్నం కుక్కర్లో ఎలా వండాలి అని చేతిలో  టాబ్ లో  గూగుల్ లో సెర్చ్ చేస్తే పోలా? ఎవరో వస్తున్నారు  ఎవరూ ? మారుతి నువ్వా రా రా..

మారుతి: ఎరా సీతాపతి  .. మీ ఆవిడ ఊర్లో లేనట్టుంది.
సీతాపతి: అనరా   అను మిగితాది కూడా అనేసెయ్.. సీతాపతి చిప్పే గతి అని కూడా అనేసేయ్
మారుతి:   అవేం మాటలురావంటగదిలో వంటరి మగాడు.” అంతే  
సీతాపతి: బాబు నువ్వు సినిమా రచయితవని తెలుసు  కానీ సినిమా టైటిల్సు . సినిమాలకి పెట్టుకో నాజీవితానికి పెట్టకు, అసలే బుర్ర తోచక చస్తుంటే ...
మారుతి: ఎందుకురా ఆముదం తగినట్టు పెట్టావు  మొహం
మా ఆవిడ ఇంట్లోలేదు, వారం  రోజులు రాదు. అంటే హొమ్ అలోన్.
మారుతి:  అదేంట్రా అదేదో హొమ్ లోన్ అన్నట్టు మొహం అలా పెట్టేవు.
సీతాపతి : నా సిట్యు ఎషన్ అర్ధం చేసుకోకుండా ... మూలిగాను .
మారుతి:   నా నా సిట్యు ఎషన్ ఏంటో నాకే అర్ధం కావడం లేదు. సరే చెప్పు ఏంటి నీబాధ? .
సీతాపతి : ఏంలేదురా , భోజనం సమస్య అన్నాను.
మారుతి: ఏం, హోటల్ లో మింగొచ్చుగా? అన్నాడు.
సీతాపతి : మింగొచ్చు అనుకో, కానీ టైం లేదు అన్నాను.
మారుతి:   అవునులే టేబుల్ మీద పళ్ళెం, తిడితే అప్పుడు తినే వాడివి. తిట్లు లేక పొతే నువ్వు తిండి తినలేవు. అంతేనా ?   రచయితల జీవితాలు ఇంతే రా టేబుల్ దగ్గరే తెల్లారిపోతుంది తిండి ఉన్న లేకపోయినా పట్టించుకోము, నువ్వు రచయితవి , మీ ఆవిడ రచయిత్రి, ఇంట్లో ఇద్దరు రచనా రంగంలో ఉంటె ఇంతే, ఈ విషయంలో నేను మాత్రం అదృష్టవంతుడిని  నేను రచయిత నైనా మా ఆవిడ గృహిణి 
సీతాపతి : నా దురదృష్టం గురుంచి నేను ఏడుస్తుంటే నీ అదృష్టం గురుంచి చెప్తావేం? నాకు సాయం చేసే మార్గం ఆలోచించు.
మారుతి:  సరే సర్లే , మీ ఆవిడ తిట్టే తిట్లేవో నేను తిడతాను లే
సీతాపతి : ఛి అదెంకాదురా, పెట్టుకుని తినడమేకష్టం అనుకునేవాడికి వండుకోవాలంటే ఎంత కష్టమో ఆలోచించు ?
మారుతి:    కుక్కర్ ఉంది కదా వండుకోడం ఎంతసేపు చెప్పు, బద్ధకం కాకపొతే
సీతాపతి : నాగాలి తీయకురా
మారుతి:  కుక్కర్ ఇలా పట్రా,  బియ్యం కడిగి ఇందులో నీళ్ళు పోసి పెట్టు. కుక్కర్ గిన్నిలో కొంచెం నీరు పొయ్యి అలాగే బియ్యం గిన్నిలో కూడా
సీతాపతి : నాకు కాలుతోంది. నీళ్ళు పొయ్యాలి అని నాకూ తెలుసు, కానీ ఎన్ని పోయాలో తెలీక ఆగిపొయాను.
మారుతి:     ఎనో కొన్ని పొసయ్.
సీతాపతి : ఇలాగే గత సంవత్సరం ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ సలహా మీద వంట చేసి , నానా బాధలు పడ్డాను. కుక్కర్ ఎంత మాడి పోయిందంటే అది మార్చేసి కొత్తది కొనాల్సి వచ్చింది. కుక్కర్ నేను పెడతాను అన్నాడు, లండన్ లో విరగాదీసాను అన్నాడు. నిజమే అనుకున్నాను. అన్నయ్య బెల్ట్ ఉందా అన్నాడు . ఒకటే ఉంది అన్నాను నడుముకి ఉన్న బెల్ట్ చూబిస్తూ. అది కాదన్నయ్య కుక్కర్ బెల్ట్ అన్నాడు. బాబూ దాన్ని బెల్ట్ అనరు అన్నాను. గేస్కట్ అంటారు అన్నాను
మారుతి:     నాగరాజు గాడేనా, హ హ హ  హ హ హ  పోయి పోయి వాడినే నమ్మావన్నమాట
సీతాపతి : కుక్కర్ లో నీళ్ళు తక్కువ పోసాడు. అన్నం గట్టిగ రాళ్ళలా తయారయ్యింది  అన్నం బిస్కట్ల లా కోసి పెట్టాడు. సంవత్సరం తరువాత మళ్ళీ ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదు.
మారుతి:     నాన్ను నమ్మవా , నాసంగతి తెలియదు నీకు
సీతాపతి : వాడూ ఇలానే అన్నాడు
మారుతి:     మరిప్పుడేంచేద్దాం?
సీతాపతి :  ఐడియా ! పకింటి ఆవిడని అడుగుదాము " ఎన్ని నీళ్ళు పోయ్యలని ,
మారుతి:      ఛీ ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చి నట్టు , అయినా చెట్టంత మగాడ్ని ఇక్కడ పెట్టుకుని
సీతాపతి :  వద్దు రా బాబు చెట్టంత మగాడి కన్నా పిట్టంత ఆడది నయం . చక్కగా నేను మా ఆవిడకి ఫోనుచేసి కనుక్కుంటాను  
సీతాపతి : ఫోన్ చేస్తాడు
మారుతి:   ఎంగేజా?
సీతాపతి: కవరేజ్ ఏరియాలో లేదు.  
మారుతి:   ఐడియా !
సీతాపతి: ఇప్పుడు నీకొచ్చిందా? సరే ఏంటో చెప్పిచావు
మారుతి:  ఇటు పక్కింటాయన్ని అడగొచ్చు , ఇంకా  వెనకింటిఆయన్ని అడగొచ్చుకదా !
సీతాపతి: పక్కింటాయన ఊసెత్తు పర్వాలేదు , వెనకింటాయన ఊసెత్తకురా బాబు.
మారుతి:  వాడికి సినిమా పిచ్చిరాబాబు.
మారుతి:  బాగా సినిమాలు చూస్తుంటాడన్నమాట నాలాగా
సీతాపతి: సినిమాలు చూస్తే పర్వాలేదు.
మారుతి:  మరి , సినిమాలు తీస్తాడా ?
సీతాపతి: కాదు తీస్తానని చెప్పి బుర్రలుతింటాడు. కానీ వంటలు బాగా చేస్తాడు
మారుతి:  అది చాలు ఇక చూస్కో
సీతాపతి: ఒరేయ్ మారుతి వెళ్లొద్దురా నా మాట వినరా.
**************************************************************************

బంగార్రాజు ఇంట్లో….

మారుతి:  నేను  సీతాపతి స్నేహితుడ్ని నాపేరు మారుతి.
బంగార్రాజు: ఓహో హో హో ప్రొడ్యూసర్  మీరే నన్నమాట,
 మారుతి:  నేను ప్రొడ్యూసర్ ని కాదండి రచయితని.
బంగార్రాజు: నాకు ప్రొడ్యూసర్ కావాలి రచయిత కాదు
మారుతి:  నేనొచ్చినా పని వేరు
బంగార్రాజు: చూడండి మీరు ఏపని మీద వచ్చినా , నాపని ఒక్కటే  ఎలాగైనా  సినిమాతీయడమే నా లక్ష్యం   దొరికితే ప్రొడ్యూసర్ కావాలి లేకున్నాపర్వాలేదు నేనే ప్రొడ్యూసర్ ని అవుతాను. ప్రొడ్యూసర్, కమ్ డైరక్టర్ కమ్ రైటర్, నాపేరు బంగార్రాజు. 
మారుతి: తెలుసు మీ గురించి సీతాపతి అంతా చెప్పేడు
బంగార్రాజు: చెప్పేడా , అంతా చెప్పేసేడా ? అతడికి ఇంకేంపని లేదు 
మారుతి: బంగార్రాజు ఎందుకయ్యా నీకు సినిమాల గోల సినిమా తీసే ఆలోచన మానుకోవయ్యా.
బంగార్రాజు :మీరు ఏమైనా చెప్పండి వింటాను సినిమా మాత్రం తీసే తీరతాను. నా కద మీరు వినాల్సిదే , కాదనకండి. అప్పుడే మీరు ప్రొడ్యూసర్ కాగలరు అంటే ధైర్యంగా పెట్టుబడి పెట్టగలరు.
మారుతి: అబ్బా నేను ప్రొడ్యూసర్ ని కాదయ్యా. నేను ఒక్క సారె చెప్తాను , వందసార్లు చెప్పలేను  
బంగార్రాజు: నేను వందసార్లు చెప్తాను ,మీరు పెట్టుబడి పెట్టకపోయినా పర్వాలేదు, వినండి చాలు ప్లీజ్
మారుతి: ఫిక్స్ అయిపోయవన్నమాట సరే కానీ.
ఇంతలో బట్టల కొట్టు కన్నబ్బాబు అక్కడికి వచ్చాడు.
బంగార్రాజు :హలో కన్నబాబు ఏంటి ఆలస్యం , రారా కూచో
కన్నబాబు :  బంగార్రాజు కధ కుమ్మేసావయ్యా , హీరో ఒంటి చేత్తో బస్సుని ఎత్తేయడం, కాలితో కార్లని ఫుట్ బాల్ లా, తన్నడం సూపర్ డైలాగులు మాత్రం అధిరిపోవలయ్యా, ఇంత కీ ఈయనెవరో
బంగార్రాజు : సీతాపతి స్నేహితుడు ఈయన పేరు మారుతి
మారుతి: నేనెదుకొచ్చానంటే , 
కన్నబాబు :  చూడండి మీరెందుకైనా రావచ్చు , వచ్చిన తర్వాత మా బంగార్రాజు తీయబోయే సినిమా కద వినితీరాల్సిందే
మారుతి: అబ్బా విన్నాను కదండీ
కన్నబాబు :  మరైతే చెప్పండి కద ఎలావుందో?"
మారుతి:  కధ అంతా అతిశయోక్తులు అవాస్తవాలు లా ఉంది అన్నాను.
కన్నబాబు :  ప్రజలు కోరుకునేది మనం అందించాలండి, కావలసినట్టుగా సినిమా తీసుకోవడం కాదు.
బంగార్రాజు, అయినా మరీ అంత మసాలా
మీరు అలాగే అంటారు అండి విలువలు విలువలు అంటే విశ్వనాధ్ గారిలా కూర్చోవాల్సి వొస్తుంది.
కన్నబాబు : డైలాగులు రాస్తున్నాను అన్నావు కదా , ఏది ఒక డైలాగు చెప్పు
 బంగార్రాజు : XXXXXXXXXXXXXXX ( music)
మారుతి:  ఛీ..
కన్నాబాబు:  ప్రజలకి అవే ఎక్కుతాయి కిళ్ళీ కొట్టు నుంచి బట్టలకొట్టు దాకా ఎదిగా నాకు తెలుసు ప్రజలగురించి, మళ్ళీ మళ్ళీ చూస్తారు డైలాగులకోసమే.
బంగార్రాజు : ప్రజలకి కావలసింది. " అంతే"  కన్నబాబు.
మారుతి:  ఏంటి బూతులు ప్రగల్భాలున్నా?
కన్నాబాబు : ఇప్పుడొచ్చే సినిమాల్లో ఇంతకన్నా గొప్పగా ఏముంది ? ఇవే డైలాగ్స్ ని రింగ్ టోన్స్ గా పెట్టుకునే ప్రజలు ఉన్నారు, ఇంతకూ మీ కేం కావాలి?
మారుతి:  నాకేమీ అక్కరలేద్దు అండి  
కన్నాబాబు:  మీ కేమీ అక్కరలెద్దా, అయితే ఎందుకొచ్చారో చెప్పండి.
మారుతి:  నేను ఎందుకొచ్చానో మర్చిపోయాను
పగలబడి నవ్వేడు బంగార్రాజు.
**************************************************************************
ఛీ టైమంతా వేస్టు , సీతాపతి చెప్తూనే ఉన్నాడు  బుద్ధిలేక నేనే బంగార్రాజు దగ్గరికి వచ్చాను
మారుతి సీతాపతి ఇంటికి వెళుతున్నాడు  రోడ్డు మీద నడుకుంటూ
మన్మధరావు :ఏంటి చూడకుండా వెళ్ళిపోతున్నావు
అరె మన్మధరావు, నువ్వా ? ఏంటి ఇక్కడ?
ఇదే మా ఇల్లు, ఎక్కడికెళుతున్నావు
ఎందుకడుగుతావులే , ఆ బంగార్రాజు గాడింటికి వెళ్లేనా బుర్ర తినేశాడు , ఎందుకెళ్లానో మర్చిపోయాను
ఎక్కడికెళ్లాలో గుర్తుందా అదీ మర్చిపోయావా?
సీతాపతి ఇంటికి వెళ్ళాలి నాకోసం ఎదురుచూస్తుంటారు.
అబ్బా వెళుదువు గానిలే  ఒక్కసారి మా ఇంటికి రా.
మన్మధ బ్యూటీ పార్లర్ - అని వ్రాసుంది, ఇది బ్యూటీ పార్లర్ కదా మీ ఇల్లు అంటావేంటి.
మా ఇల్లే ముందుగది లో బ్యూటీ పార్లర్ పెట్టాం. మా ఆవిడ బ్యూటిషన్.
పెట్టాం అంటున్నావ్ , ఏంటి కధ?
మన్మధరావు :అంటే ఇద్దరమూ నడుపుతుంటాము. మా ఆవి డే  బ్యూటిషన్.
అంటే నువ్వు జనాలని తోలుకొస్తుంటావా? (మనసులో) 
మన్మధరావు : దుర్భిణి , ఎవరొచ్చారో చూడు
దుర్భిణి : మారుతన్నయ్య, అప్పుడు మా పెళ్లి కొచ్చావు అన్నయ్య మళ్ళీ ఇదే రావడం,
 రా అన్నయ్య , ఇదే మా పార్లర్
మారుతి:  ఇదే మా ఇల్లు అంటావు అనుకున్నాను (మనసులో) 
మన్మధరావు :ఇక్కడ ప్రత్యకేత ఏంటో తెలుసా?
మారుతి:   ఫేషల్ అనుకుంటాను
దుర్భిణి : అన్నయ్య భలే జోక్స్ వేస్తాడు
మన్మధరావు : చ అది కాదు, ఇక్కడ జెంట్స్ కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది
మారుతి:  అయితే ఇప్పుడు నన్నేమన్నా చేయించుకోమంటాడేమో (మనసులో) 
దుర్భిణి : కూర్చోండి అన్నయ్యగారు
మారుతి:  అబ్బా పార్లర్ కుర్చీలో ఎందుకమ్మా? ఇంట్లోకి  పోదాం , ఇంట్లో కూర్చుందాం.
మన్మధరావు :నీకో నిజం చెప్పనా ఇంట్లో కంటే పార్లర్ డీసెంట్ గా ఉంటుంది ,
మారుతి:  ఇంకో నిజం కూడా చెప్పు , నాకు మేకప్ వేస్తారని (మనసులో) 
దుర్భిణి : మంచినీళ్లు తీసుకో అన్నయ్య
మారుతి:  మంచినీళ్లు తాగి పెట్టేసరికల్లా మొఖం మీద పేస్టు కళ్ళ మీద చక్రాలు ఎలా వచ్చే సాయి ?
దుర్భిణి : ఏంటన్నయ్య, ఫెషల్ మన దగ్గర స్పెషల్ అని ఆయన చెప్పలేదా?
మారుతి:  ముఖానికి సబ్బు రుద్ది అది ఫేష లా ? (మనసులో) 
మారుతి:  ఇంతకీ మీ ఆయన , అదే మన్మధుడు కనిపించడేం ?
దుర్భిణి : ఆయన రోడ్డుమీదే ఉంటారు, వచ్చేస్తారు ఉండన్నయ్యా.  ఫెషల్  ఇంకొంచెం సేపు ఉంచాలన్నయ్య!
మారుతి:  టైం అయిపోతున్నాదమ్మా ఇంక నేను బయలుదేరతానమ్మా
దుర్భిణి : అదిగో  మాటల్లోనే వచ్చేసారు
మారుతి:  నామొహంమీద సబ్బునరుగ ఉండాలి ఏది ?
దుర్భిణి :  ఛీ అది సబ్బు నురుగు కాదన్నయ్యా  అది ఫేషల్
మారుతి:  అవునమ్మా ఫేషల్
దుర్భిణి : టైం లేదన్నావు కదా, కడిగేసాను
మన్మధరావు : అబ్బా ఎంతబాగుందో మొఖం , కళకళ లాడిపోతోంది !
మారుతి:  అవును సబ్బు పెట్టి రుద్దితే ఎందుకు బాగోదు (మనసులో) 
మన్మధరావు : ఇదిగో ఈవిడ విమలగారు ..
మారుతి:  చార్జెస్ అద్దం ముందు పెట్టేను , కుక్కర్ లో రైస్ ఎలాపెట్టాలో అడుగుదామని అనుకుంటుండగా నువ్వు  ఫేషల్ మొదలెట్టేసావు రైస్ కుక్కర్ లో నీళ్లు ఎన్నిపొయ్యాలి ఎలా పెట్టాలి చెప్పగలవా ?
దుర్భిణి : స్మిత , స్మిత (గట్టిగా అరిచింది) పక్కవాటా తలుపు తెరుచుకుంది
దుర్భిణి : పక్క వాటాలో ఉంటున్నది మా చెల్లె , పేరు స్మిత  కుక్కర్ లో రైస్ ఎలాపెట్టాలో అన్నయ్యకి చెప్పవే
వెళ్ళన్నయ్య. ఇదిగో వచ్చా విమలగారు మీకు చక్కటి ఫేషియల్ చేస్తాను .
************************************************************************************************
స్మిత : రా అన్నయ్య లోనికి రా కూర్చో చీరలు చూడన్నయ్యా హి హిహి 
అమ్మ నాకు టైం లేదు , నేను వెళ్ళాలి , ఇప్పుడు నేను చీరలు చూడలేను
స్మిత : హి హిహి  హిహిహి చీరలు చూడన్నయ్యా మంచి ఆఫర్స్ లో ఉన్నాయి హి హిహి 
ఇప్పుడు కాదమ్మా మరోసారి వస్తాను , ఇప్పుడు తొందర్లో ఉన్నాను
చీమల రావు: ఆలా అనకండి సార్ కొనపోయినా పర్వాలేదు , చూడకపోతే ఫీల్ అవుతుంది , జస్ట్ చూసి వెళ్ళండి
హి హిహి  ఒక ఐడియా ఉంటుంది కదా అన్నయ్య , ఇదిగో అన్నయ్య ఆకుపచ్చ రంగు చీర హి హిహి  , ప్యూర్ సిల్క్ఇంకా చాలా రంగులు ఉన్నాయి , ఎంత వెయ్యి రూపాయలే ఇది అస్సాం సిల్క్ అన్నయ్య , కస్తూరిచందేరి , షిఫాన్ , వాయల్ డైలీ వెర్ కి ఇలా మొత్తం 30 రకాలు ఉన్నాయి హి హిహి 
మారుతి:  ఒక రకం చూబించావు కదమ్మా చాలు . మొత్తం ముప్పై రకాలు చూబిస్తుందేమో (మనసులో) 
ఆగండాగండి సార్ , ఇంకా డ్రెస్ మెటీరియల్స్ , చుడీదార్లు , బేడీషీట్స్ కూడా ఉన్నాయి.
మారుతి:  ఇప్పుడు అవన్నీ  చూబిస్తారా ఏంటి? హి హిహి 
చీమల రావు: భలే జోక్స్ వేస్తారండీ, ఇప్పుడే చెప్పను కదా కొనక్కరలేదు చూస్తే చాలు అని ఎంతసేపు ఐదు నిమిషాల్లో అన్నే చూబించేస్తాను
మారుతి:  ఆబ్బె ఎందుకండీ మీకు శ్రమ , మళ్ళి మీరు అన్నీ సద్దుకోవాలికదా పై నుంచి అనీ ఎందుకు దింపడం?
స్మిత : హి హిహి  హిహిహి.. రాత్రంతా నిద్దరొచ్చే దాకా సద్దుకుంటాము
భోజనాలు , మరి వంట చేసుకోరా, నేనొచ్చినా పని చెప్పాను కదా?
ఇంతకీ ఎచీరలు సెలెక్ట్ చేసుకున్నావు అన్నయ్య?
చీమల రావు: అలా ప్రత్యేకించి అడుగుతావేంటి స్మిత , అన్నయ్య చేతులో రెండు చీరలు ఉన్నాయి కదా అంటే ఆ రెండు సెలెక్ట్ చేసుకున్నాడనే కదా అర్ధం
మారుతి:  చూడమ్మా నేను డబ్బులు తేలేదు అందుకే
చీమల రావు: చ ఊరుకోండి సార్ , మీ మొబైల్ నెంబర్ మాదగ్గర ఉంది కదా. మీ అడ్రెస్స్ ఇచ్చి వెళ్ళండి , చాలు మావాళ్లు  నెలకింత అని వసూలు చేస్తారు . ఒకే  సారి డబ్బు అంతా కట్టక్కరలేదు. ఇది మీ సౌకర్యార్ధమే. ఎలా ఉంది సార్?
మారుతి:  కడుపులో తెమిలేస్తున్నది సార్ , బయలుదేరతాను ఇంకా తప్పేటట్టు  లేదు కాబట్టి ఈ రెండు తీసుకుంటున్నాను.
చీమల రావు: పర్వతం పర్వతం ఒకసారి అర్జెంట్ గా రా,  ఇతడు దుర్భిణి ,  స్మిత ల అన్నయ్య
మారుతి:   నిజంగా  ఒక పర్వతం వచ్చినట్టుంది (మనసులో )
చీమల రావు: ఈయన మా బావమరిది మా రెండు  కుటుంబాలకి వంట చేసేది ఈయనే
మారుతి:  ఈయన ఇన్సూరెన్స్  ఏజెంట్ కదా?
చీమల రావు: అరె మీకెలా తెలుసు ?
మారుతి:  ఇప్పుడే బుర్ర పనిచేయడం ప్రారంభించింది లెండి
పర్వతం: రండి  సార్ కుక్కర్ ఎలా పెట్టాలో చెబతాను
పర్వతం: అరె, అరె పారిపోతున్నారు
చీమల రావు: అదేంటి పారిపోతున్నారు
పర్వతం: పారిపోతే వదులుతామా
చీమల రావు: పారిపోయేవాళ్లను ఏంజేస్తాం?
పర్వతం: ఇంటికొస్తే గానీ తగులుకోలేని పరిస్థితి మీది పారిపోయినా వదలలేని పరిస్థితి మాది.
**********************************************************************
మారుతి సీతాపతి ఇల్లు చేరుకున్నాడు .. సీతాపతి ఇంట్లో
 ఒరేయ్ మారుతీ ఇప్పుడా రావటం ఇప్పుడు 9.00 అయ్యింది 7.00 గంటలకు వెళ్ళేవు.
ఇంత ఆలస్యం దేనికి , ఓహో చేతులో కవర్ ఉంది అంటే ఎదో పార్సెల్ కట్టించి తెచ్చావన్నమాట
సీతాపతి : ఇదేంపనిరా అద్దరాత్రి మద్దెల దరువు అని  చీరలు తెచ్చేవు 
నువ్వోద్దన్నా వినకుండా వెళ్లినందుకు ఆ బంగార్రాజుగాడు నాబుర్ర తినేసాడురా ( ఏడుస్తూ  )
సీతాపతి :  ఒరేయ్ ఏడువకురా,
మారుతి:  అదొక్కటే అయితే పర్వాలేదు, సబ్బుతో ఫేషియల్ , అక్కర్లేని చీరలు , అంతే కాదురా అక్కడ ఒక అనకొండ కూడా తగిలిందిరో అదృష్టవశాతూ తప్పించుకుని వచ్చేసాను. నువ్వేం చేస్తున్నావు రా ఇంతసేపు
సీతాపతి :  నువ్వు ఇంతకీ రాపోయేసరికి నేను తెగించి కుక్కర్ పెట్టీసాను రా.
మారుతి:  వెరీ గుడ్ , ఎంతసేపయ్యింది 
సీతాపతి :  ఒక అరగంట అయ్యింది
మారుతి:  ఎవరో చిన్నపిల్లవాడి ఏడుపు వినిపిస్తున్నది .
సీతాపతి :  అరె నిజమే , ఎక్కడినుంచి వస్తోంది?
మారుతి:  అది కుక్కర్ లోంచి వస్తోంది అని నా అనుమానం.
సీతాపతి :  ఛా ఊరుకో కుక్కర్ లోంచి చిన్నపిల్లవాడు ఏడుపు ఎందుకువస్తుంది
మారుతి:  కుక్కర్ లోంచి మళ్ళీ అదే ఏడుపు
మారుతి:  వింటున్నావా ? అవునురా ఇదేదో వింతగా ఉందిరా , కుక్కర్ మూత తీసి చూద్దాంరా
సీతాపతి :  అయ్యో మూత చాలా టైట్ గా ఉంది గా , ఎంత ప్రయత్నించినా రావటం లేదు
మారుతి:  అలాక్కాదు రా ముందు వెయిట్ తీసేయాలి
సీతాపతి :  అబ్బా వెయిట్ కూడా రావటం లేదు
 మారుతిఇక తప్పదు పక్కింటావిడ  సాయం కావాలి
సీతాపతి :  పక్క ఇంట్లో స్త్రీ టీ వీచూస్తోంది, కిటికీ అద్దం లోంచి ఆమె ఆకారం కనిపిస్తోంది. చుటూ తిరిగి వెళ్లే  టైం లేదు గోడదూకి వెళతాను  
మారుతి:  ఒరేయ్ గోడ దూకద్దు ఆమె చూస్తే బాగోదు, ఆవిడ చూడనే చూసింది , ఒరేయ్ సీతాపతి
దొంగ దొంగ .. కేకలు   అరవకండి నేను… నేను .. నేనండీ. నోరు పెగల్లేదు.
సీతాపతి : జనం పోగయ్యే లా ఉన్నారు.
సీతాపతి :  దీని దుంపతెగా రోజు  ఎవరి మొఖం చూశానో.. పరిగెత్తడం మినహా వేరే గత్యంతరం లేదు.
ఎవరో నలుగురు పరిగెడుతున్నట్టున్నారే, ముందు ఈ ఇంట్లో ఏదో ఒక ఇంట్లో దూరేద్దాం
ఆమ్మో ఇది మిలట్రీ శంకర్రావు ఇల్లు లావుందే, ఆ ఏదో ఒక ఇల్లు రెండు నిమిషాలు గడిపేస్తే పోలా
(సరిగ్గా అప్పుడే కేరంటూ పోయింది.)
సీతాపతి :   ఇప్పుడే కేరంటూ పోవాలా
ఎవరూ , (మిలట్రీ గొంతు వినిపించింది),
సీతాపతి :  ఈ మిలట్రీ గొంతు శంకర్రావుదే, హలొ నేనండీ సీతాపతిని , అబ్బా మొహమ్మీద టార్చ్ లైట్ ఆపండి సార్. కుక్క అరుపు  బో భో, కుక్కని పట్టుకోండి సార్ మీదపడి పీకేసేలా ఉంది
శంకర్రావు : ఇంత చీకట్లో వచ్చారేంటి
సీతాపతి :  ఏవండీ మీ ఆవిడ ఉందా ? ఛీ ఛీ మీరున్నారా ?
శంకర్రావు గారు మీరు వంటలు అదరగొడతారని విన్నాను ,
శంకర్రావు: ఎం మీ ఇంటికొచ్చి గాని వంట చేయమంటావా ?
సీతాపతి : అది కాదు  సార్ కుక్కర్లోంచి  చిన్న పిల్ల వాడి ఏడుపు వినిపిస్తోంది, కుక్కర్ మూత రావడం లేదు పైగా
శంకర్రావు: ఏవయ్య అద్ద రాత్రి  చీకట్లో కథ లేంది, పైగా  మా ఇంట్లో నేనే  వంట చేస్తాను అని నీకు చెప్పిన గాడిదెవడు.?
సీతాపతి : ఆబ్బె ఎవరూ చెప్పలేదండి
శంకర్రావు: నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు , పక్కింటి ప్రసాదు గాడే  చెప్పి ఉంటాడు.
సీతాపతి : అభ్హే అదేం లేదండీ, నిజంగా  కుక్కర్ మూత రావడం లేదు, కావలిస్తే వచ్చి చూడండి సార్, అబద్దం అయితే మీ గన్ తో కాల్చేయండి సార్,
శంకర్రావు:  ఇప్పుడు నా తుపాకీ గొడవెందుకురా , నేను మిలట్రీ లో మేజర్ ని కాదని వంటవాడినని, నా దగ్గర ఉన్న తుపాకీ ఉత్తుత్తి తుపాకీ అని  ఆ ప్రసాదు గాడు ప్రచారం చేస్తున్నాడు అనుకున్నాను , ఇప్పుడు నా గన్ చూడాలి అంతే కదా , ఇక్కడే ఉండరా , ఇప్పుడే గన్ పట్టుకొస్తాను
సీతాపతి : వామ్మో నాయనోయ్ ఈ మిలట్రీ వాడు నన్ను అపార్ధం చేసేసుకున్నాడు , ఇప్పుడు నన్ను పేల్చినా పేల్చేస్తాడు , పరిగెత్తకపోతే ప్రాణాలు దక్కేలా లేవు 
*********************************************************************
పావుగంట తరువాత కూడా కుక్కర్ సైలెంట్ గా ఉన్ది. దగ్గరకెళ్ళి చూసారు. కుక్కర్ లోంచి మళ్ళీ అదే ఏడుపు వినిపించింది.
ఏంచేద్దాం ? ఎందుకు ఇంత వింత గా చిన్నపిల్ల ఏడుస్తున్నట్టుగా శబ్దం ఎలా వస్తున్నాది?
మారుతి :  కుక్కర్ కి దయ్యం పట్టింది అన్నాడు.
తుళ్ళి పడ్డాను. నీకు పిచ్చి పట్టింది అన్నాను.
మారుతి :  ఎం కారుకి దయ్యం పట్టాగాలేంది, కుకర్ కి పట్టకూడ దా ?
 ఛీ మళ్ళి ఇప్పుడే కరెంటు పోవాలా దేవుడు నాతో  ఆడుకుంటున్నాడురా.
ఈ చీకట్లో కూర్చునే బదులు బైయటకు పోతే మంచిది బైట చక్కటి  వెన్నెల ఉంది
దేవుడంటావేంటిరా ఓపక్క దయ్యం అంటూంటేను.
దయ్యాలున్నాయంటావా ?
నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు
దయ్యాలుంటాయా  అనే సబ్జెక్ట్ మీద గూగుల్ లో సెర్చ్ చేస్తే బెటర్
ఇంట్లో ఏదో ఆకారం కదులుతోంది, ఇక అనుమానం లేదు రా ఖచ్చితంగా దయ్యమే
పదరా వెళ్లి చూద్దాం , కేరంటూ రానిదే నే చస్తే రాను
ఫోను మోగుతున్నది, వెళ్లి చూద్దాం పదరా
అదిగో  కరెంటు వచ్చేసింది.
మారుతీ ఫోన్ తీయరా
మారుతీ : హలొ , ఎవరూ
ఫోనులో స్వరం : సీతాపతి గారున్నారా ?
మారుతి : నీకేరా , ఎవరో తెలీదు .
సీతాపతి : ఎవరు ?
ఫోనులో స్వరం : నేను కేరేజ్ బోయిని సార్   మీ శ్రీమతి గారు , ప్రతిరోజు లంచ్ , డిన్నర్ అందజేయమన్నారు . సారీ సార్ రోజు  లంచ్ తెలెకపొయాను , రేపటి నుంచి లంచ్ కూడా ఇస్తాను. ఉంటాను సార్.

సీతా పతి : హమ్మయ్య. ఇంట్లో దయ్యం లేదని తేలిపోయింది
మారుతి : ఒరేయ్ సీతాపతి కుక్కర్ మూత వచ్చేసిందిరా
సీతా పతి : కుక్కర్లోకూడా దయ్యం లేదని తేలిపోయింది
మారుతి : కానీ ఇంకొకచోట దయ్యం ఉందిరా
సీతా పతి : ఇంకొకచోటా  దయ్యమా ! ఎక్కడుందిరా  దయ్యం?
మారుతి : నీ మనసులోరా , నీ మనసులో దయ్యముంది
సీతా పతి : సరిగా అర్ధమయ్యేట్టు చెప్పారా

మారుతి : చిన్న విషయాలని జీవితం లో పక్కన పెట్టకూడదని , చిన్న ఆనందాల్ని నిత్యజీవితంలో విస్మరించగూడదని వాటిని ఆస్వాదించడమే జీవితమని ఎన్నో కధలు రాసిన నువ్వు ఏంచేస్తున్నావ్ ? వంట నేర్చుకోడం  చాలా  చిన్న విషయం అందుచేత దాన్ని విస్మరించావు , చాలా మంది ఇంతే రా!  డబ్బు సంపాదన కి అవకాశం ఉన్న  జావా ప్రోగ్రాం నేర్చుకోడానికి  టైం ఖర్చు చేస్తారు, జీవితానికి అవసరమైన వంట నేర్చుకోడానికి ఇష్టపడరు. అంతే కాదురా   ఇంట్లో రాత్రి భోజనాల వేళలో కూడా వ్యాపారాలు , బ్యూటీపార్లర్  దుర్భిణి , చీర వ్యాపారం స్మిత ఎవరైనా కానీ,  తిండి టైంకి తినడం కూడా చిన్న విషయం, తిండి, విశ్రాంతి కూడా లేకపోతే ఇంకెక్కడుందిరా జీవితం?

సీతా పతి : బాగా అర్ధమైయ్యిదిరా , దయ్యం కుక్కరికి పట్టింది అనుకున్నాను , దయ్యం నా మనసుకే పట్టింది , కానీ నా మనసుకి పట్టిన దయ్యాన్ని నువ్వు వదిలించావురా

2 comments:

  1. The play you written is very nice sir. The way you portrayed the play make me feel like I am seeing the play directly. I have some fun while reading this. And what you said is right that everything is important in our life whether it is small or big.

    ReplyDelete
  2. Thanks for your feedback Mounika.

    ReplyDelete