ప్రతిబింబాలు
విజయవాడ అల్ ఇండియా రేడియో లో ప్రసారమైన నా మొదటి రేడియో నాటిక ఇది.
ఈ నాటిక 2017 జులై నెలలో ప్రసారం చేయబడింది. చదివే ఆసక్తి ఉన్నవారు చదవచ్చు, వినే ఆసక్తి ఉన్నవారికొరకు 2017 జులై 15 న యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడింది. ఆ లింక్ ను కూడా ఈ బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను.
మనందరికీ
మంచి సమాజంలో నివసించాలని ఉంటుంది. మరి ఆ మంచి సమాజాన్ని నిర్మించాలంటే మంచి పౌరులని
నిర్మించాలి. మంచి పౌరులే మంచి సమాజం. మంచి పౌరులను ఎవరు నిర్మించాలి? పాఠశాలలా? కళాశాలలా
? లేక తల్లి తండ్రులా? నేటి వాస్తవ పరిస్థితులకు
అద్దం పట్టి అందరినీ ఆలోచింపజేసే నాటికే ఈ ప్రతిబింబాలు: పాత్రలు
రాజేశ్వరి – భిక్షపతి : ప్రశాంత్ , సిరి :: నల్లపింజెరు - విశాలి : ప్రతాప్ లావణ్య.
ప్రతాప్: అమ్మా, అమ్మా .. ఎక్కడున్నావమ్మా, కాలేజీ
కి టైం అయిపోతోంది ..అమ్మా త్వరగా రా అమ్మా.
విశాలి: అబ్బబ్బబ్బా ఏంటిరా నీగోల, నీ కేకలు
? కాలేజీ కి టైం అయిపోతే వెళ్ళచ్చు కదా. ఈ అరుపులు
దేనికి ?
ప్రతాప్: అమ్మా ( నసుగుతూ)
విశాలి: ఏంటిరా ఆ నసుగుడు , చూడబోతే నీకు కాలేజీ కి టైం అయినట్టు లేదు .
ప్రతాప్: అమ్మా అమ్మా
విశాలి: ఒరేయ్ ప్రతాప్ నీకు కాలేజీ టైం కి వెళ్ళాల్సిన అవసరం లేక పోతే
పోయింది నేను మాత్రం తప్పక
పెరట్లోకి వెళ్ళాలి. (వెనక నుంచి పనిమనిషి గొంతు … అమ్మగారు ...)
విశాలి: అమ్మా ..
విశాలి: నాకు పనుంది . నసపెట్టి చంపక చెప్పారా!
ప్రతాప్: ఈరోజు
నాపుట్టినరోజు అనే సంగతి మర్చిపోయావా?
విశాలి: అందుకే కదరా నీకు కొత్త బట్టలు కొనిపెట్టింది.
ప్రతాప్: ఊ ..కొత్త బట్టలు ఉంటె సరిపోతుందేంటీ ? డబ్బులు ఉండద్దా ?
విశాలి
: ఎంతగావాలిరా?
ప్రతాప్: ఒక ... రెండువేలు
విశాలి: రెండువేలా! - పోనీ రెండువేలు కాక పోతే వెయ్యి రూపాయలు.
ప్రతాప్: నిన్ననే కదరా ఐదువందలు ఇచ్చ్చాను . అది పెట్రోల్ కి ... సరిపోయింది
విశాలి: ఆ అప్పుడే పెట్రోలా?
విశాలి:
నాది బులెట్ అమ్మ? నాన్న జీప్ లో వెళుతుంటే నేను బులెట్ మెంటైన్ చెయ్యద్ద?
లావణ్య:
తండ్రి పేరు నిలబెట్టడానికి నువ్వు పడే అవస్థ నాకు అర్ధం అవుతున్నది రా, అన్నయ్య
విశాలి: నువ్వు ఎప్పుడు
లేచావే లావణ్య. అయినా ఏంటే ఇంత ఆలస్యంగానా నిద్రలేవడం ?
అర్ధరాత్రిదాకా ఇంటర్నెట్ లో కూచోడం, ఆలస్యంగా పడుకొడం! ఆలస్యం గా లేవడం!!( విసుగ్గా)
ప్రతాప్: అమ్మా.
లావణ్య:
పాపం వాడి కాలేజీ కి టైం అయిపోతున్నాది అని తెగ బాధ పడిపోతున్నాడు ముందు వాడి
సంగతి చూడమ్మా , తరవాత నన్ను తీరిగా తిడుదువుగాని.
విశాలి: ఇంతకీ ఏమంటావ్ రా?
ప్రతాప్: పెట్రోల్
ఖర్చుకి ఇచ్చి దాంతో పుట్టినరోజు జరుపుకోమంటే ఎలా అమ్మా?
విశాలి: హూ.. అది పెట్రోల్ కి ఇది పై ఖర్చుకి ... నాదగ్గర లెవ్.
ప్రతాప్: అమ్మా
మెల్లగా! విశాలి: ఎం? ఎందుకురా?
ప్రతాప్: ఈవూర్లో
మోతుబరి నల్లపింజెరు
దగ్గర డబ్బులు లేవు అంటే
నవ్వుతారు అమ్మా..
విశాలి: ఎవరు రా నవ్వేది ఆయ్!!!
ప్రతాప్: అదిగోనమ్మా పనిపిల్ల నవ్వుతోంది.
విశాలి: ఏమే, మంగి నవ్వుతున్నావా?( లేదు అమ్మగారూ నేను పాట పాడుకుంటున్నాను.)
విశాలి: వీడికి బండి కొని ఇవ్వడం పొరపాటయ్యిది. ఇదిగోరా ఐదువందలు
ఇంతకన్నా అడగొద్దు ఇవ్వలేను
లేవు.
ప్రతాప్: ఐదువందలా!
విశాలి: అయ్యో మొహం చూడు ఎలాపెట్టాడో! ఎం వద్దా ? వద్దకపోతే
ఇలా ఇచ్చేయ్.
లావణ్య:
అదేంటమ్మా అన్నయ్యకి ఎంత చిన్నతనంగా ఉంటుంది.
విశాలి: అవునవును నాన్న పరువు కాపాడాలి కదా
లావణ్య: అమ్మా అమ్మా ఇప్పుడు విషం అది కాదు
బీ టేక్ ఫైనల్ ఇయర్ కి వఛ్చిన కొడుకు … రేపు పొద్దున్న..
విశాలి: ( అంటుండగానే మధ్యలో తల్లి ), బాగా కట్నం తెచ్చ్చే కోడల్ని తెస్తాడంటావ్.
లావణ్య: ఆ ఆ ( పెద్దగా, ఆశగా ) కట్నాల ఊసు ఎత్తితే చంపేస్తాను.
లావణ్య:
కట్నం లేకుండా కోడలిని తెస్తే నాన్న
చంపేస్తాడే! షటప్
లావణ్య:
అమ్మా రేపు నాపుట్టినరోజు కీ ఇలానే అంటావా ? షటప్ అని
ప్రతాప్: అలా ఎందుకంటుందే? కూతురంటే ప్రేమ లేదనుకుంటున్నావా?
విశాలి: అంటే
మీ ఇద్దరూ తోడుదొంగలా ? వాడికి డబ్బిమ్మని నువ్వు సిఫార్స్ చేయడం .. నీకుడబ్బు
ఇమ్మని
వాడు సిఫార్స్ చేయడం.. మీనాన్న పొలం నుంచి
వచ్చే టైం అయ్యింది ఆయనవస్తే ఈ ఐదువందలు కూడా దక్కవు.
ప్రతాప్: ఇలా
ఇయ్యమ్మా చచ్చినోడి పెళ్లికి వచ్చిందే దక్కుడు, ఇలా ఇయ్యమ్మా.
విశాలి: బాబూ
ప్రతాప్ ఈరోజు నీ పుట్టినరోజు( ఏడుపు స్వరంతో) మీకొసం కాకపోతే ఎందుకురా నేను బ్రతుకుతున్నది.
లావణ్య:
ఏంటన్నయ్యా! పుట్టినరోజు నాడు అమ్మని ఏడిపించావ్…
ప్రతాప్: సారీ అమ్మ ఇంకెప్పుడూ అలా మాట్లాడను.
విశాలి: చూడండి
మీ ఇద్దరికీ ఇదే చెప్పడం, పైకి ఎదో గొప్పలు పోతాడు గానీ
నాన్న రాజకీయాల్లో పోటీ చేసి ఉన్నదంతా ఆర్పేసి , నిండా అప్పుల్లో ములిగి ఉన్నాడు. ఫైనల్ ఇయర్ లోకి వచ్చ్చావ్ బాగా చదువుకో బాబు
చదువులేకపోతే
మీ నాన్నలాగా పేక ని, రాజకీయాలని నమ్ముకొవాల్సి వస్తుంది
ప్రతాప్: అలాగే బాయ్ అమ్మ… బాయ్ చెల్లి! లావణ్య:
బాయ్ అన్నయ్య.
ఈ లింక్ క్లిక్ చేసి ప్రతిబింబాలు నాటిక మొత్తం చూడవచ్చు
రాజేశ్వరి …ఏంటా చప్పుడు .. ఏంలేదండి చెయ్యి జారి గ్లాసు నేలమీద పడిందండి
భిక్షపతి
: గ్లాసు వాడు విసిరి కొట్టాడని చెప్పొచ్చు కదా ఎందుకా అబద్దాలు ..
రాజేశ్వరి: ఎందుకా మీవల్లే. వాడు డైనింగ్ టేబుల్ దగ్గరనుంచి లేచి ఎందుకు వాడి రూంలోకి వెళ్లపోయాడో తెలియదా మీకు.
భిక్షపతి
: ప్రశాంత్,
అలిగి అన్నం మానేస్తే బండి వచ్చ్చేస్తుందా? మన దగ్గర డబ్బులు ఉండొద్దా?
ప్రశాంత్: ఇంకెప్పుడు ఉంటాయ్ నాన్న మనదగ్గర డబ్బులు?
రాజేశ్వరి: ఇంకెప్పుడు కొంటారండీ వాడికి బండి ? అలాగడుగమ్మా?
భిక్షపతి
: నేను పెట్టుకొన్న లోన్ శాంక్షన్ అవ్వగానే అందాకా?
రాజేశ్వరి: చాల్లేనండీ
సంబడం మూడేళ్లనుంచి మీరు ఈ మాట చెప్తూనే ఉన్నారు మేము వింటూనే ఉన్నాము
భిక్షపతి : రాజేశ్వరి .. భిక్షపతి
నాపేరు, లక్షాధి కారి కాదు , నేను చేసేది ఆర్ టీ సి లో బస్సు డ్రైవర్ , నేనేమీ పైలెట్ అనుకున్నావా?
రాజేశ్వరి: ఓ యబ్బో నా మొహానికి అంత అదృష్టం కూడానా!
సిరి: నాన్నకేమి తక్కువ ?
కూతురుని చక్కగా చదివించారు, కొడుకుని కూడా చదివిస్తున్నారు.
ఒరేయ్
తమ్ముడు నాన్నని వేదించకురా, నేను జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. రాగానే వాయిదాల పద్ధతి
లో స్కూటీ కొనిపెడతాను
భిక్షపతి
: నాతల్లే సిరి, నీకు నాన్న అంటే ఎంత ఇష్టమే ?
నిన్ను పెళ్ళి చేసి అత్తవారి ఇంటిపంపిస్తే ఈ నాన్నకి ఎంత కష్టమే!?
ప్రశాంత్: నాన్న ఇప్పుడు విషయం పెళ్ళిళ్ళగురించికాదుకదా ,
సిరి:
అవునురా, నీ హంగ ర్ స్ట్రైక్ ని మేము పాడు చేస్తున్నాము. ప్రశాంత్ అని పేరు పెట్టినందుకైనా నువ్వు ప్రశాంతంగా
ఉండరా
రాజేశ్వరి: వూరేగవే నాన్న నాన్న అని , నీకు రేపు ఏ ఆర్ టీ సి డ్రైవెర్ నో తెఛ్చి కట్టబెట్టాడు.
ఒక్క బంగారు గాజుల జత కోసం పదేళ్లనుంచీ ఎదురు చూస్తున్నాను, మూడేళ్లనాడు చేయిస్తాన్న చైన్ కి
గతిలేదు. ఇలాంటి మొగుణ్ణి కట్టుకుని నేనేం బావుకున్నాను.
భిక్షపతి
: రాజేశ్వరి పిల్లలముందు ఏంటి ఇవన్నీ విననివ్వండి ఎం నేను చెప్పాపోతే మాత్రం వాళ్ళకి తెలీదా?
ప్రశాంత్: నాన్న అమ్మ ఇప్పుడు మీరు ఇలా గొడవ పడడం ఏంబాగోలేదు.
సిరి:
అవును
ఏంబాగోలేదు . ఓ గొడవలో మరొక గొడవ కలిసిపోతున్నది.
ప్రశాంత్: ఏయ్
సిరి నువ్వు నోర్ముయ్.
ఒక్క
సారి సిన్సియర్ గా ఆలోచించు నాన్న , పెద్దక్కకి పెళ్లి , నానమ్మ ఆపరేషన్ ఇవి నీవు బరువు అనిపించలేదు. దీనిపెళ్లికి
డబ్బు దాస్తున్నావ్ అదీ నీవు బరువనిపించలేదు. నాకు బండి కొనమంటే నీకు బరువనిపిస్తున్నాది. వాడికి , ఆ ప్రతాప్ గాడికి బులెట్ నేనేమో లెఫ్ట్ రైట్ కొట్టుఉంటూ , ఉసూరంటూ నడుచుకుని పోవాలి.
సిరి:
నడుచుకుని ఎందుకురా సైకిల్ ఉందికదా?
ప్రశాంత్: ఛీ దీనికి కూడా ఎంత వేళాకోళమైపోయింది నా బతుకు..
రాజేశ్వరి: అయ్యో అయ్యో
మొగుడు ముండా అంటే మాధవ్కోళం వాడు కూడా ముండా అన్నాడుట
భిక్షపతి
: ఇంక ఆపండి
, ఎవరి బ్రతుకులు నాశనం అవ్వక్కరలేదు. తలతాకట్టైనా పెట్టి రేపటికి డబ్బు పట్టుకొస్తాను కానీ ఒక్కమాట ఆ ప్రతాప్ గాడితో మాత్రం తిరుక్కురా.
ప్రశాంత్: ఆబ్బె వాడేం చెడిపోలేదు
నాన్నా.
భిక్షపతి
: అవునురా వాడెన్నడూ
చెడిపోడు అది నాకు తెలుసు నిన్ను చెడగొడతాడు. సరే నేను బయలుదేరతాను. నువ్వు భోంచెయ్యి
.
రాజేశ్వరి: వెళ్ళండి వెళ్ళండి
బస్సు ఎదురు చూస్తూ ఉంటుంది మీకొసం.
ప్రశాంత్: యాహు నాకు బైక్
వచ్చేస్తుంది…
***
నల్లపింజెరు: వైశాలి వైశాలి తలుపు తలుపు..
విశాలి :
ఆ వస్తున్నానండి! ఏమండి ఇంత ఆలస్యంగా వచ్చారా టైమ్ పది అవుతున్నది. భోజనానికి రాకుండా ఎక్కడ
తిరుగుతున్నారు? మీలాగే పిల్లలుకూడా…
నల్లపింజెరు: గోరుచుట్టుమీద రొట్టిపోతంటే ఇదే పేకాడి డబ్బు పోగొట్టుకుని
వస్తే ఇంటికి రాగానే వాయింపుడు
నేను కాస్త పడుతున్నది ఎవరికోసమే వాళ్ళకొసమే కదా…
విశాలి :
సరే సరే భోజనం చేద్దురు రండి.
నల్లపింజెరు: నేను బయట తిని వచ్చాను. పిల్లల్ల్లు తిన్నారా?
విశాలి :
ఎక్కడండీ వాళ్ళసలు ఇంటికి వస్తే కదా తినడానికి?
నల్లపింజెరు: ఏంటి లావణ్య ఇంకా రాలేదా?
విశాలి :
లావణ్య ఇప్పుడే వచ్చింది. ఫ్రెండ్స్ తో పార్టీ ఉందని సిటీ కి వెళ్ళొచ్చింది. నల్లపింజెరు: ఓహో ..
విశాలి :
కొడుకు గురించి అడగరా? మీరస్సలు వాడి గురించి పట్టించుకొవడంలేదు. వాడు చెడు తిరుగుళ్ళు
తిరిగి చెడిపోతాడనే భయం తో చస్తున్నాను
నల్లపింజెరు: హా హా హా…
నాకు భయం గా ఉంటె మీకు నవ్వుగా
ఉందా ,
నల్లపింజెరు: నవ్వుగాక మరెంటే?
విశాలి : వాడు మీలాగే తయారవుతున్నారు. చెడిపోతాడేమో అని భయంగా ఉంది ?
నల్లపింజెరు: ఈ నల్ల
పింజెరు కొడుకు చెడిపోవడమా ? పైగా మగాడికి శీలం ఏంటే పిచ్చిదానా?
విశాలి : మగాడికి కూడా కేరక్టర్ అవసరమే , నీతికి
ఆడ మెగా బేధమేముందండి?
నల్లపింజెరు: మగాడు తిరక్క చెడతాడు ఆడది తిరిగి చెడుతుంది !
విశాలి : వాడూ ఇలాగే, మీలాగే మాట్లాడుతున్నాడు.
బుల్లెట్స్ సౌండ్.
విశాలి : అదిగో వచ్చినట్టు ఉన్నాడు. ఏరా చదువు మీద ద్యాస ఉంటె ఇంత లేట్ గా నా ఇంటికి రావడం.
ఎగ్జామ్స్ దగ్గిర పడుతున్నయి కదా.
ప్రతాప్:
తెలుసమ్మా ఎగ్జామ్స్ గురించి తలుచుకుంటుంటేనే టెన్షన్ వచ్చేస్తున్నది.
విశాలి :
అంత భయం ఉన్నవాడివి ఈ అద్దరాత్రి దాకా తిరుగుళ్ళు ఎందుకు , పెందరాడే ఇంటికి రావచ్చు కదా
ప్రతాప్: టెన్షన్ పోగొట్టుకొడానికే సినిమా కి వెళ్లాను అమ్మా.
విశాలి :
మీ నాన్న పేకాట బుద్దులు , పేకాట సమాధానాలే నీవూ వస్తున్నాయ్
నల్ల పింజెరు గారు, నల్ల పింజెరు గారు,
నల్ల పింజెరు : ఎవరూ ? నారాయణ లా ఉన్నాడే? ఇంత లేటుగా వచ్చేడేంటి ?
విశాలి :
మీరు ఎప్పుడొచ్చినా ఉండరు, డబ్బిచ్చిన వాడు ఎందుకొస్తాడు, వసూలు చేసుకొడానికి వస్తాడు. నల్ల పింజెరు : సరే నేను లేననని చెప్పాయ్. విశాలి :
నేను ఎలా చెప్పనండి?
ప్రతాప్: నేను చెప్తాను నాన్న.. నాన్న వూళ్ళో లేరు నారాయణా పనుండి
హైదరాబాద్ వెళ్లారు రెండురోజులకి
గానీరారు
అదేటిబాబు పొద్దున్న ఊర్లోనే ఉన్నారుగా ...
ప్రతాప్: అవును నారాయణ మజ్జాన్నుంచి బస్సెక్కారు
సరే రెండురోజుల తర్వాతే వస్తాను.
విశాలి :
ఒరేయ్ ఏంటిరా పెద్ద చిన్న లేకుండా , నారాయణా అంటూ పిలుస్తున్నావు
నల్ల పింజెరు : ఆబ్బె నారాయణగారూ రండి కూర్చోండి అని కుర్చీ వెయ్యవే ... ఒరేయ్ ప్రతాప్ బాగా చెప్పేవ్ రా. మల్లి రెండురోజులదాకా ఆ నారాయణ గాడి గొడవ లేదు .. కానీ
ఒరేయ్ ఆ చెప్పేదేదో ఓ వారం రోజులదాకా రారు అని చెప్పేస్తే పోలా .
ప్రతాప్: ఈ సారి అలాగే చెప్తాను నాన్న మీరే దగ్గరుండి వాడిని చెడగొడుతున్నారు
నల్ల పింజెరు : చెడగొట్టడం
ఏంటే లోక జ్ఞానం నేర్పుతున్నాను
విశాలి :
వాడికి
ఇంకిత జ్ఞానమే లేదు ఇంకా లోక జ్ఞానం కూడానా?
ఇంకితజ్ఞానమా?
ఇంకితజ్ఞానం అంటే ఏంటో
విశాలి :
ఇంగిత జ్ఞానం అంటే కామన్సెన్స్.
కామన్సెన్స్
అంటే
కామన్ గా అందరిదగ్గరా ఉంటుంది అనుకుంటారు కానీ కామన్సెన్స్
బహు అరుదు ఏ కొద్దీ మంది దగ్గరో ఉంటుంది.
ఇంగిత జ్ఞానం లేనివారు తమకు ఇంగిత జ్ఞానం
ఉందనే అనుకుంటారు. జ్ఞానం అనేది లోతుగా అన్వేషిచాల్సినదని , పైపైన దొరికే చెత్తకాదని తెలియని వారంతా
ఇంగిత జ్ఞానం లేనివా రే, ఆత్మవంచన చేసుకునే వారని చెప్పవచ్ఛు.
ఏడు
ఖండాలపేర్లు చెప్పలేనివారు , నాలుగు వేదాల పేర్లు చెప్పలేనివారు , పురాణాలకీ , ఇతిహాసాలకీ తేడా తెలియని వారు, ప్రపంచం లో జరిగిన ఏ విప్లవం గురించి ,ప్రపంచ చరిత్ర గురించి అవగాహన లేనివారు, తమ దేశచరిత్ర గురించి తెలియనివారు , సాహిత్యం రుచి తెలియనివారు, ఏ భాష
మీదా పట్టులేనివారు , పట్టుమని పది పుస్తకాలు చదవనివారు, తమగురించి తమకు ఏమీ తెలియని నిర్భాగ్యులకు కూడా
సినిమా జ్ఞానం ఎక్కువగా ఉంటుంది.
ప్రతాప్: అమ్మ, నన్నే తిడుతున్నట్టుం దే ఇవేవీ నాకు తెలియవు
విశాలి :
జ్ఞానం అనేది పైపైన దొరికే చెత్తకాదని తెలియనివారు, ఇంగిత జ్ఞానం లేనివారు వీరే.
లావణ్య:
వాడికి క్లాస్ పుస్తకాలు చదవడానికే తీరికలేదు ఇంకా వేరే పుస్తకాలు ఎం చదువుతాడు?
నల్ల పింజెరు : పుస్తకాలు
చదవాపోతేనేం టీ వీ చూస్తున్నాడుగా
విశాలి : మీరిలాగే ప్రోత్సహించండి రేపు కాలేజీ కి వెళ్లకపోతేనేం పేకాటకి వెళుతున్నాను కదా అంటాడు.
నల్ల పింజెరు : ఎం చదవక పోతే ఏమే , ఈ సంవత్సరం ఆడు బీటెక్ పూర్తి చేసాడనుకో ...
ప్రతాప్: మనకున్న పలుకుబడి ఉపయోగించి నాన్న నన్ను ఏ కంపినీలోనో బేక్ డోర్ నుంచి తీసుకెళ్లి కూచో బెట్టేయడూ!? అప్పుడు నన్ను అందరూ సాఫ్ట్ వెర్ ఇంజినీర్ అంటారు.
అంతేకానీ ఇంకితజ్ఞానం ఉన్న సాఫ్ట్ వెర్ ఇంజినీరా లేక ఇంకితజ్ఞానం లేని సాఫ్ట్ వెర్ ఇంజినీరా అని అడగరు
విశాలి : చదువు అనేది పొట్టకూటి కోసమే అనుకునేవాడు జ్ఞానానికి ఏమాత్రం విలువ ఇవ్వడు. ఏదోఒక నైపుణత సాధించి పొట్టపోసుకుంటాడు. మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇలాంటి వారందరూ
డిగ్రీలు
అడ్డు పెట్టుకుని విద్యాహీనులు
చదువుకున్నవాళ్ళగా చలామణి అయిపోతారు.
నల్ల పింజెరు : అయ్యబాబోయ్ దీన్ని కదిపి చాలా తప్పు చేసాము ఇంకితజ్ఞానం అంటే ఏంటి
అన్నందుకు ఇంత ఉపన్యాసమా?
విశాలి : ఎంత ప్రాగ్మాటిక్ గా తయారయ్యారా?!
నల్ల పింజెరు : ప్రాగ్మాటికా
అంటే .. నీకేవన్నా తెలుసా ?( కొడుకుతో)
అమ్మ లావణ్య, ప్రాగ్మాటిక్ అట నీకేవన్నా తెలుసా
అమ్మ?
లావణ్య:
నాకేం తెలీదు నాన్న , నువ్వే ఎడంచేత్తో ఎక్కడో
పెట్టేసి ఉంటావ్
విశాలి : హహహ అంటే ప్రాక్టికల్ అని అర్ధం
నల్ల పింజెరు : బాబోయ్ ఈ చదువుకున్న వాళ్ళతో ఇదే చిక్కు
లావణ్య:
నాన్న .. (కోపంగా
అలిగినట్టుగా)
నల్ల పింజెరు : ఎంతల్లి .. ఎందుకు కోపం
లావణ్య:
మేమూ కూడా చదువుకుంటున్నాము
నల్ల పింజెరు : అవునురా
కానీ మీ రూటే వేరు…
విశాలి : మీరూటు మహా కానట్టు మీదీ అదేరూటు కదా
నల్ల పింజెరు : నేనే కాదె అందరూ తల్లితండ్రులు ఇంతే . డిగ్రీ ఉందా అని చూసిఉంటారు అంటే కానీ .. పుస్తకాలు చదువుతున్నాడా ? కనీసజ్ఞానం .. ఏంటది , విశాలి : ఇంకితజ్ఞానం
నల్ల పింజెరు : ఆ అది ఉందా అని ఎవ్వరూ ఆలోచించడం లేదు
విశాలి : టిప్ టాప్ గా బట్టలు వేసుకుని మొబైల్ పట్టుకుని తిరుగుతుంటే ఇంకితజ్ఞానం పని ఏముంది?
ప్రతాప్: బాబోయ్ మళ్ళి ఇంకితజ్ఞానం
?
నల్ల పింజెరు : చూసావా పిల్లలు ఎలాపారిపోతున్నారో ఇప్పటికే చాలా పొద్దు పోయింది పోయి పడుకుందాం
***
మేఘాలలో తెలిపోతున్నది , తుఫానులా రేగిపోతున్నది..
ప్రతాప్: ఒరేయ్ ప్రశాంత్ ఏంటిరా కొత్త బండి కొన్నేసావా అసాధ్యుడివి రా?
ప్రశాంత్ : అవునురా , మా నాన్న అప్పుచేసి
మరీ కొన్నాడు
ప్రతాప్: అది యువ
శక్తి అంటే ఏంటో నిరూపించావు , కంగ్రాట్స్ కమాన్ క్యాచ్
సిరి:
ఒరేయ్ అన్నయ్య వెనకాల నేను ఉన్నాను
ఎందుకురా అంత స్పీడ్. సిరి స్లోగా పోడానికి
నేను ముసలోణ్ణి గాను నాబండి ఏమీ మోపెడ్ కాదు. బులెట్ .. దూసుకు పోవాల్సిందే వాడు చూడు
దూసుకు పోతున్నాడో.
సిరి:
ఇదేమన్నా పందెమా. ప్రశాంత: ఎస్ లైఫ్ ఐస్ ఏ రేస్ నేను నెగ్గి తీరాల్సిందే
సిరి: ఒరేయ్ స్పీడ్ పెంచేస్తున్నావ్ . ఏంటిరా ఇలా తిప్పేస్తున్నావ్
ఇది రాంగ్ రూట్ రా.
ప్రశాంత్ : ఏంపర్వాలేదు , ట్రాఫిక్
లేదుగా వాడి కంటే మనమే ముందు వెళ్ళాలి
సిరి: ట్రాఫిక్ లేదు కానీ ట్రాఫిక్ పోలీస్ లు
ఉన్నారు
విజిల్
.. విన పడుతుంది . పోలీస్: ఏయ్ మిస్టర్ బండి ఆపు. ప్రశాంత్ : సార్
సార్ ..
పోలీస్:
ఇది వన్ వే అనితెలియదా చదువుకున్తున్నావు ట్రాఫిక్ సైన్ బోర్డు చదువుకోలేవా
ప్రశాంత్ : సారి సార్ ఏందో తొందర్లో .. చూసుకొలేదు. ఇదుగోసార్ ఇది ఉంచండి
పోలీస్: ఏంటి వంద ఇస్తున్నావ్.. ఫైన్ ఐదువందలు
ప్రశాంత్ :
ప్రస్తుతానికి
ఇంతే ఉంది సార్ . పోలీస్: లంచం ఇవ్వడం నేరం అని తెలియదా?
ప్రశాంత్ :
ఐదు
వందలు లేవు సార్ , ఫైన్ కొర్టులో కూడా కట్టచ్చు.
ప్రశాంత్ :
సార్
సార్ కోర్టులు కేసులు ఎందుకుసార్ ఇదిగో 500
పోలీస్: ఎవరీ అమ్మాయి?
ప్రశాంత్ : మాచెల్లి సార్.
పోలీస్: చూడమ్మా
మీ అన్నయ్యకి ఇకమీద వన్ వే లో నడపొద్దని చెప్పు
సిరి: ఒరేయ్ నీకెక్కడివిరా ఐదువందల రూపాయలు
ప్రశాంత్ :
నాన్న
ఎక్సమ్ ఫీజు కని ఇచ్చినవి
సిరి:
అయ్యో ఎక్సమ్ ఫీజు కి ఇచ్చినవి ఫైన్ కట్టడానికి వాడేశావా ?
ప్రశాంత్ :
ఛీ
అంతా నీవల్లే , సిరి ని తీసుకెళ్ళు సిరి ని
తీసుకెళ్ళు అని నాన్న తింటే నిన్ను తీసుకొచ్చాను. మొట్టమొదటిసారి బండి నిన్నెక్కించుకుని
బండి నడుపుతుంటే ఏంజరిగిందో చూడు?
ప్రతాప్
బండి చప్పుడు. ప్రతాప్: మొత్తానికి నువ్వే
నెగ్గావురా!
ప్రశాంత్ :
ఒరేయ్
ప్రతాప్ .. చూసావా ఏంజరిగిందో ?
ప్రతాప్
: ఒరేయ్ ప్రశాంత్ నేనంతా చూసానురా , ఈ మాత్రం దానికేనా అంత బాధ పడిపోతున్నావు?
ప్రశాంత్ :
అదికాదురా
ఎక్సమ్ ఫీజు ..
ప్రతాప్
: హమ్ .. ఒరేయ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం
ఉంది. ప్రస్తుతానికి పార్టీ ఇవ్వడానికి డబ్బులు ఎలాగో అది చూడు. ప్రశాంత్ : నాదగ్గర
ఇంకేమీ మిగల్లేదురా .
ప్రతాప్
: ఛీ ఛీ షేమ్ షేమ్ , బులెట్ వేసుకుని తిరగ్గానే
సరికాదురా జేబులో 500 లేకుండా బండి తీస్తే పరువు పోతుందిరా .
ప్రతాప్
: సిరి, నీదగ్గర ఎంతుంది? సిరి: నాదగ్గర వంద ఉంది ప్రతాప్ , కానీ ఈ వందా నేను
మా వీణ టీచర్ కి ఇవ్వాల్సిన ఫీజు. నేను డబ్బు ఇవ్వలేను.
ప్రతాప్
: వీణ నేర్చుకున్తున్నావా సిరి . చదువు అయిపోయింది పెళ్లి కావాల్సిన దానివి నేర్చుకొ
నేర్చుకో.
లావణ్య
గిటార్ నేర్చుకుంటున్నాది. ఇదే లావణ్య అయితేనా
అన్నయ్యకొసం ఎదో ఒకటి చేసి పార్టీ కి ఒక వెయ్య రూపాయలైనా సద్దేది. ఇదేరా బేసిక్ గా వీణకి
గిటార్ కి ఉండే తేడా. వీణ బ్యాచ్ ఎప్పుడూ ఇంతే ... మీది గ్రౌండ్
ఫ్లోర్ లెవెల్ అమ్మా మీరంతే . పార్టీ విలువ తెలియదు.
సిరి:
మాది గ్రౌండ్ ఫ్లోర్ అయితే మీది ఎబిస్.
ప్రతాప్
: ఒరేయ్ నేను సద్దుతానులేరా ప్రశాంత్ నా ఫ్రెండ్ వంద రూపాయలతో పార్టీ ఇస్తే నాకు అవమానం.
ప్రశాంత్ :
రా
సిరి నిన్ను డ్రాప్ చేస్తాను. అక్కరలేదు నేను ఇంకెప్పుడూ నిబండి ఎక్కను.
ఎబిస్
అంటే .. పాతాళం దాని అర్ధం నీకు తెలియదు.
ఇంగ్లీష్
నాకు రాదు. ఎం ఇంగ్లిష్ వస్తేనే గొప్పా?
సిరి:
కనీసం గుర్తు పెట్టుకుని నిఘంటువు అయినా చూసి తెలుసుకొలేవు
ప్రతాప్
: నిఘంటువు అంటే? సిరి: ఇంగ్లిష్ రాదన్నావుకదా తెలుగు వచ్చేసా? నిఘంటువు అంటే డిక్షనరీ
పదరా,
తాను వెళ్లి పావుగంట అయ్యిం ది .
బండి స్టార్ట్ చెయ్యి
***
సిరి: ఒరేయ్ ప్రశాంత్, మెడమీద వంటరిగా కూర్చుని
ఎం చేస్తున్నావ్? ఈ మధ్యన ఎక్కువ వంటరిగా కూర్చుంటున్నావు ఏంటిరా? ప్రశాంత్: ఏంలేదు సిరి నువ్వెళ్లు నేనొస్తాను
సిరి: పరీక్షా ఫలితాలు వచాయి కదా ఏమయ్యింది రా. ఇక్కడే ఊచున్నావేంటిరా నీ రిజల్ట్ ఏమయ్యిందో తెలుసుకొవా? ఒరేయ్ ఎందుకురా అలా ఉన్నావు. చాలారోజులనుంచి చూస్తున్నాను ఎందుకురా అదోలా ప్రాణం లేనివాడిలా ఉంటున్నావు.
ప్రశాంత్: నాకు ప్రాణం లేని వాడిలాలా కాదు సిరి, నా ప్రాణం పోయినా బాగుండును.
సిరి: ఛీ ఛీ ఎందుకురా ఆ దిగులు
ఎగ్జామ్స్ బాగా రాయలే దని బాధా ? పాసవ్వనని
భయమా?
ప్రశాంత్: ఆ రెండూ కాదు . సిరి: ఇంకెందుకురా?
ప్రశాంత్: నా ఫలితాలు నాకెప్పుడో తెలుసు . నేను పాసవ్వనని
ఎందుకంటే నేను ఎక్సమ్ ఫీజు కట్టలేదు.
సిరి: నిజమా అవును ఆనాడు మోటార్
సైకిల్ కి ఫైన్ కట్టినతరువాత, మళ్ళీ నాన్నని
ఎక్సమ్ ఫీజు ఎలా అడగాలో తెలియలేదు. సిరి: అయ్యో,
చాలా తప్పు చేసావురా. అడిగి ఉండాల్సింది.
ప్రశాంత్: ఎలా అడుగుతాను సిరి బ్రేక్ఫాస్ట్
తినడం మానుకొని, నాన్న చెప్పులు కూడా
కొనుక్కోకుండా డ్యూటీ కి వెళుతుంటే. ప్రతాప్ నీ ఫీజు నేను కడతాను అని ప్రామిస్ చేసాడు.
కానీ వాడికి పార్టీల మీద ఉండే శ్రద్ధ , పరీక్షలమీద, ఫీజు మీద ఎందుకు ఉంటుంది ? నాన్న
చెప్పినప్పుడు వింటే ఇప్పుడు నాకీగతి పట్టేదా?
రాజేశ్వరి: అయ్యో , అయ్యో , (
రాజేశ్వరి కేకలు పెడుతుంది)
సిరి: అమ్మ ఇక్కడే ఉందిరా. నావెనకాలే వచ్చినట్టుంది. అంతా వినేసింది .
రాజేశ్వరి: నాన్న వస్తే నేనే చెప్పాలిరా! ఆ ప్రతాప్ గాడిని కడిగి
పారేస్తాను
పిల్లాడిని ఇంత మోసం చేస్తాడా?
నమ్మించి గొంతు కోస్తాడా?
ప్రశాంత్: నేనేమీ చిన్న పిల్లాడిని కాదు వాడేమీ నాగోతు కోయలేదు. నాగొంతు నేనే కోసుకున్నాను
రాజేశ్వరి: మీ నాన్న వస్తే నేనే చెప్పాలిరా!
ప్రశాంత్: నువ్వేమీ సంజాయిషీ ఇచ్చుకొనక్కర లేదమ్మా. ఆ బాధ
నేనే పడతాను.
***
మాకరీనా .. పాట .. ఆడపిల్లలమాటలు, నవ్వులు
ఆ పాట నీకెలా వచ్చింది . అది డిస్కోథెక్ లో ప్లే చేసినది కదా . ఆ డీజే నా మొబైల్ లోకి ట్రాన్స్ఫర్ చేసాడే
లావణ్య సూపర్ గా డాన్స్ చేసావే డిస్కోథెక్ అదరగొట్టేసావే.
ఏంటే ఇంత హుషారుగా ఉన్నావు ..
లావణ్య: సీరియస్ ఆన్సర్ కావాలా ఫన్నీ ఆన్సర్ కావాలా?
లావణ్య: మొదట ఫన్నీ ఆన్సర్ .. ఆ ఏంలేదు రజనీ లా డల్ గా ఉండలేక
రజిని ఎందుకే అంత దిగులు
సరదాగా ఎంజాయ్ చేసి బాధ పడతావెందుకు ?
రజిని:
ఏంలేదు ఎప్పుడు ఇంటికి ఇంత లేటుగా వెళ్ళలేదు. మా అన్నకి ఫోన్ చేసాను
లావణ్య:
హ హ హ మొదటిసారి అలాగే ఉంటుందే.
హహ
హ అందరూ నవ్వులు . ఇప్పుడు సీరియస్ ఆన్సర్ చెప్పవే..
లావణ్య:
మానాన్న
పేకాటలో యాభై వేలు గెలిచాడే.. ఇది కూడా ఫన్నీ గా ఉంది.
లావణ్య: అంతే లైఫ్ ఐస్ జస్ట్ ఫన్
రజిని:
ఎందుకో నాకు లైఫ్ ఫన్ కాదు
అనిపిస్తున్నది
ఇప్పుడు అర్ధ రాత్రి అయ్యింది మీ అందరి ఇల్లు ఈ ఊరిలోనే.. నేనే
కాదే బస్సు ఎక్కి పక్కూరు వెళ్ళాలి..
రజిని:
బస్సు వద్దే ట్రైన్ కి
వెళితే
మీ ఇంటికి అడ్డతోవలో 5 నిమిషాల్లో
నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు
లావణ్య:
సరే
సరే , నాకులేని భయం మీకెందుకు.. రజిని: ఎందుకా ఆడపిల్లవి కాబట్టి
లావణ్య: నాన్సెన్స్ , ఆడపిల్ల అయితే
... గిరి గీసుకుని కూచోవాలా హద్దులు గీసుకుని ఉండాలా?
రజిని:
ఆడా మోగా ఇద్దరూ హద్దుల్లో ఉండాలి హద్దు దాటితే
అష్టాలు ప్రమాదాలు ఇద్దరికీ తప్పవు.
లావణ్య:
నువ్వు
వంటింటి గబ్బిలాయిలా మాట్లాడుతున్నావు.
స్టేషన్
కి వచ్చేసాం గొడవలు ఆపి రైలు వెళ్లిపోయిందేమో
కనుక్కోండి ( ఓ ఆడ గొంతు )
రజిని:
నువ్వు కూడా వంటిటి గబ్బిలానివే కాకపోతే నీకు ఒప్ప్పుకునే ధైర్యం లేక మోడర్న్ గా మేకప్
వేసుకుని మోడర్న్ గా నటిస్తున్నావ్, ఆ డీ జె
ఫోన్ ఫ్రీ గా ఇస్తే ఎందుకు తీసుకోలేదు తన రూమ్ కి
ఆహ్వానిస్తే ఎందుకు వెళ్ళలేదు. మనం
అబ్బాయిలకి మన ఫోటోలు అడిగినా ఇవ్వము , వారితో ఫోటోలు దిగము , ట్రిప్స్ కి వెళ్ళము
అంటే మన జాగ్రత్తల్లో మనం ఉంటున్నట్టే
కదా
లావణ్య: తల్లి నీతో పెట్టుతుంటే ఈ రాత్రి
శివ రాత్రే , నేను స్టేషన్ లోకి వెళతాను
రజిని:
అదిగో మా అన్నయ్య వచ్చాసాడు. కార్ సౌండ్
.. డోర్ సౌండ్ . రజని .. అన్నయ్య,
రజిని:
లావణ్య నువ్వుకూడా కారెక్కు మీవూర్లో మీ ఇంటికి డ్రాప్ చేస్తాను, ఇరవై కిలోమీటర్ లే కదా.
రైలు
కూత. అదిగో మా వూరు వెళ్లే రైలు వచ్చ్చేసింది. నేను వెళతాను. బై.
***
హమ్మయ్య. రైలు దిగేసాను . ఒక ఐదు నిమిషాలు ఈ అడ్డ తోవలో నడిస్తే ఇల్లు చేరుకోవచ్చు . ( కీచురాళ్ళ ధ్వని) ఆమ్మో , ఇంత నిర్మానుష్యం గా ఉంది. రజని అన్నయ్య డ్రాప్ చేస్తానంటే వద్దన్నాను ఒప్పుకుని ఉండాల్సింది. పోనీ చుట్టూ తిరిగి
రోడ్డు మీంచి వెళితే , దూరమైనా కొన్చమ్ బాగుంటుందికదా. అక్కడమాత్రం మనుషులు ఎవరూ ఉండరు
కదా. ఎవరో ఇటే వస్తున్నారు. బాబోయ్. దొరక్కూడదు
. అమ్మా
లావణ్య నేను నాన్నని , ఆగు తల్లి పరిగెత్తకు. అయ్యో భగవంతుడా నా బిడ్డ నన్ను చూసి ఎవరో
రౌడీ అనుకోని పరిగతిడుతున్నాది . అమ్మ ఆగు తల్లి. ఇంతకన్నా పరిగెత్తలేను , అరవలేను తల్లీ. అయ్యో రైలు పట్టాలవైపు పరిగెడుతున్నాది.
అమ్మ ఆగు తల్లి. ఆ.. పెద్ద అరుపు.
***
ఈ హాస్పిటల్ అంతా ఇంతా రద్దీ గా ఉందేమిటి సిరి, ప్రశాంత్ ఎక్కడున్నాడు
వచ్చిన తోవే మర్చిపోయావా అమ్మ! ఇలా రా ఇటునుంచి, ఇలా, ఇలా
అయ్యో
ప్రశాంత్ ఎలా ఉన్నాడో
విశాలి : అధైర్య పడకండి రాజేశ్వరిగారూ.
రాజేశ్వరి: ఈవిడ ఎవరు? నేను ప్రతాప్ తల్లిని నాపేరు విశాలి.
రాజేశ్వరి: అయ్యో చెట్టంత బిడ్డ. (ఏడుపు) పరీక్ష రాయలేకపోయాడని పురుగులమందు తాగేశాడు. వాడు మాకు దక్కకపోతే నేనుండలేను వదినగారూ. (ఏడుపు)
సిరి: అమ్మా , ఇది హాస్పిటల్ , గట్టిగా ఏడవకూడదే.
విశాలి : వదినగారు మీ అబ్బాయికి ఏమీ భయంలేదు. మాఇంట్లో ముగ్గురు ఈ హాస్పిటల్ లోనే ఉన్నారు
మా అబ్బాయి ప్రతాప్ , మా అమ్మాయి లావణ్య మా వారు, ముగ్గురూ ఈ హాస్పిటల్ లోనే ఉన్నారు. నేనెంత బాధపడాలి చెప్పండి?
సిరి : లావణ్య కి ఏమయ్యింది అండీ?
విశాలి: ఎవరో ఒకాయన లావణ్య స్నేహితురాలి అన్నయ్యట “మీ అమ్మాయి కారులో డ్రాప్ చేస్తాను అంటే వద్దని వంటరిగా రైల్లో వస్తున్నది. ఆమెను స్టేషన్ కి వచ్చి ఇంటికి తీసుకెళ్లామని” ఫోన్ చేసి చెప్పాడు. ఈయన అడ్డ తోవలో స్టేషన్ కి వెళుతుంటే ఎవరో రౌడీ అనుకుని
తప్పించు కోడానికి
పరిగెడుతూ
కంగారు లో పట్టాలమీదకి పరిగెత్తింది. అదృష్ట వశాత్తూ మా ఆమ్మాయికి పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. ట్రైన్ తగిలి తూలిపడింది. కవుకు దెబ్బలు తగిలాయి. ఇకపోతే మా ఆయన…
రాజేశ్వరి: ఎవరు నల్ల
పింజెరు గారేనా.
విశాలి : అవునమ్మా ఆయనే. మా అమ్మాయికి
ఎదో అయ్యిందనుకొని స్పృహ కోల్పోయారు. ఇంక నిజంగా బండిమీద సర్కస్ చేసి నిజమైన దెబ్బలు
తగిలించుకొన్నది మాఅబ్బాయి ప్రతాప్ .
బిక్షపతి: రాజేశ్వరి మన అబ్బాయి ప్రశాంత్ కి స్పృహ
వచ్చింది డాక్టర్ గారు రమ్మన్నారు
రాజేశ్వరి:
ఏవండీ మన అబ్బాయికి, ప్రశాంత్ కి స్పృహ
వచ్చిందా
రాజేశ్వరి:
విశాల వదిన గారు ఈయన మా ఆయన. బిక్షపతి: నమస్కారం , నాపేరు బిక్షపతి.
డాక్టర్ గారు వస్తున్నారు… డాక్టర్ గారు వస్తున్నారు…
డాక్టర్: చూడండి బిక్షపతి గారు మీ అబ్బాయికి ఏ ప్రమాదమూ లేదు. సాయంకాలం ఇంటికి తీసుకెళ్లవచ్చు.
చూడండి విశాలి గారు మీ ఆయన్ని మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి . మీ అబ్బాయి ప్రతాప్ మాత్రం ఇంకా హాస్పిటల్ లో ఉండాలి. నల్ల పింజెరు గారికి స్పృహ వచ్చింది వెళ్లి మాట్లాడవచ్చు.
నల్ల పింజెరు: మా అమ్మాయి డాక్టర్: మరేంపర్వాలేదు క్షేమంగా ఉంది
నల్ల పింజెరు: డాక్టర్ గారు మా బాబు బ్రతుకుతాడా? ఏమీ ప్రమాదంలేదు కదండీ.
డాక్టర్: హాస్పిటల్ లో ఉన్నంతవరుకు ఏమీ ప్రమాదం లేదండి.
నల్ల పింజెరు: ఆ తరువాత .. చెప్పండి డాక్టర్ , చెప్పండి సందేహించ కండి.
డాక్టర్: అదే నండీ , ప్రమాదమంతా మీ వల్లే , అర్ధమయ్యింది డాక్టర్ ...
ఏమిటి అర్ధమైంది సెలవిస్తారా ? నల్ల పింజెరు: ఇంకితజ్ఞానం ఉండాలి అని. విశాలి: ఎవరికి ?
నల్ల పింజెరు: నాకు. విశాలి: కాదండీ తల్లి దండ్రులకందరికీ.
ప్రతాప్: తల్లిదండ్రులకే కాదు నాన్న పిల్లలకి కూడా
ఇంకితజ్ఞానం అవసరమే. విశాలి: బాబు ప్రతాప్!
ప్రతాప్: అవునమ్మా ఇంకిత జ్ఞానం లేనప్పుడు లోకజ్ఞానం
ఉండి ప్రయోజనం ఏముంది?
లావణ్య:
నీకేకాదు అన్నయ్య నాకు కూడా ఆ ఇంకిత జ్ఞానం లేకే నన్ను నేను తెలుసుకోలేకపోయాను
నాన్నకి ఎంతో మనస్తాపం కలిగించాను. అర్ధరాత్రి నాకోసం అడ్డతోవలో చీకట్లో పరిగెత్తేలా
చేసాను. నన్ను క్షమించండి నాన్న.
అమ్మ లావణ్య నువ్వు మాకు దక్కేవు మాకు ఇది పండగరోజే.
ప్రశాంత్: లావణ్య నువ్వు క్షమార్హురాలివి కానీ నేను
క్షమార్హుడిని కాను , చదువు అంతా నాసినం చేసిన మూర్ఖుడిని.
రాజేశ్వరి:
ప్రశాంత్ , నువ్వు మూర్ఖుడివి కాదురా మారి మనిషివి అయ్యావు. ఏవండీ వాడిని క్షమించగలరా?
బిక్షపతి: వాడిని ఎప్పుడో క్షమించేసాను. నువ్వు
ఫీజు కట్టలేదనే విషయం నాకు అప్పుడే తెలుసురా. నేను కావాలనే ఊరుకున్నాను. మూడేళ్లనుంచి
చెప్పి చెప్పి అలిసిపోయాను. నువ్వు స్వానుభవం ద్వారా మాత్రమే పాఠం నేర్చుకుంటావని నేను
కావాలనే ఊరుకున్నాను
రాజేశ్వరి:
ఏవండీ మీరు పిల్లాడిని
మందలించి ఉండాల్సింది. ఒక సంవత్సరం చదువు పాడయ్యేది
కాదు
బిక్షపతి: అవును రాజేశ్వరి చదువు పాడయ్యేది కాదు
జీవితమే పాడయ్యేది. ఇంకితజ్ఞానం లేనప్పుడు చదువు వాడిని ఎం కాపాడుతుంది?
విశాలి: బాగా చెప్పేరు అన్నయ్యగారు పిల్లలు కళాశాలలనుంచి, ఉపాద్యాయులనుంచి జ్ఞానం,
నైపుణ్యం నేర్చుకుంటారు, స్నేహితుల దగ్గరనుంచి పేషన్స్ నేర్చుకుంటారు. ప్రవర్తన
మాత్రం తల్లిదండ్రుల నుంచే నేర్చుతుంటారు. పిల్లలు తల్లిదండ్రుల ప్రతి బింబాలు.
No comments:
Post a Comment