Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, June 27, 2020

Anveshana 2020 scene 19

The next day the sun was lazy. The sky was cloudy. The weather was cold but Regina's heart was burning hot. She was driving the jeep steadily. The road was smooth, the run of the jeep as well. Her mind is rough. Karthik is rocking her mind. Nemali is not only coquetry but also voluptuous and promiscuous.  She was driving the jeep alone in the forest. Nemali looked  more villainous then James and more dangerous than the tiger. She looked back to find if Kartheek is following her. There was no trace of Kartheek.  "Ah  I will follow you like shadow he said, now what happened to those words?"  She accidently uttered those words loudly. She then slipped into soliloquy. The melancholy was gushing out.
               
Should I trust him or doubt him?
Should I trust my trust or doubt it?
did he fail the trust or my trust failed me?
what brought him to her house at the dark hour?
should I trust my logic or trust my feelings?
love is not science or math to follow logic 
love is only a matter of trust and trust is love.  
trust depends on attitude and rules the relations.
oh wicked mind  don't trouble my little heart.
what should I do when I meet him ?
should I pretend as if everything is just  fine?
should I  show my suffrance or indeference ?

Finally she quelled her contending mind with contentment of her  self-counsel  “when there is no visible dirt why should I wash my hand” She invoked forbearance and spontaneity the ultimate weapons in the battle of love

ఆలోచనలలోంచి  బైటకి రాగానే పరిసరాల్ని గమనించిందిఇది నేను వచ్చేమార్గంకాదుఈరోజు మనసు మనసులో లేదు.  గజరాజు ఘీంకారం వినిపించింది.   కొంత మంది టూరిస్టులు ఏనుగుల పై కూర్చుని రోడ్డు దాటుతున్నారు.   తోవలో ఒకసారి జేమ్స్ తీసుకొచ్చాడు  వాళ్ళు వెళ్లి పోయాక మళ్ళీ నిదానంగా ముందుకి పొనిచ్చిందితిన్నగా వెళితే టెంపుల్ వచ్చిందిమొదటిరోజు గిరి తీసుకువచ్చిన ప్రదేశంజీప్ ఆపి దిగి నడుస్తున్నదిపూర్తిగా నిర్మానుష్య ప్రదేశం , చేతిలో బేగ్ తో ఎర్ర మట్టి మీద నడకకొంచెం దూరం నడవగానే  పెద్ద చెట్లు గుడి కనిపించాయిబేగ్ గుడి దగ్గర కిందపెట్టి , చేతితో  పెరబోలిక్ మైక్రోఫోన్ తీసుకుని మెడలో హెడ్ ఫోన్స్ , బైనాక్యులజ్ తగిలించుకుని నడవసాగింది . పిట్ట మనిషి  లేడు  ఆకు అలికిడి లేదు.   పక్షుల అరుపులు ఆలాపనలా వినిపిస్తున్నాయిబినాకులస్ లోంచి చూసింది.  పిడికెడంత పిట్ట చిటారుకొమ్మన కూర్చుని పాడుతోందిహెడ్ ఫోన్స్ ధరించగానే పెరబోలిక్ మైక్రోఫోన్సౌండ్ సిగ్నల్స్ ని చెవులకి విన సొంపుగా అందిస్తున్నాది.   మధురమైన రాగాలతో మది నిండిపోతోందికాస్సేపు తిరిగి రికార్డింగ్ చేసిన తరువాత చూస్తే తాను చెట్లమధ్యలో ఉంది , గుడి దూరంగా కనిపిస్తోంది.  గుడి దగ్గర తాను పెట్టిన బేగ్ కనిపిస్తోందిబేగ్ లో కాఫి ఉందిపోయితాగాలని అనుకుని గుడి వైపు అడుగులేస్తుండగా గుడివెనక ఎవరో నక్కి తన బాగ్ వైపు చూస్తున్నారువెంటనే ఒక ఆలోచన ఉరుములా తాకింది.   బేగ్ పట్టుకుపోతేవెంటనే రెండవ  ఆలోచన పిడుగులా తాకింది . నన్నే పట్టుకుపోతే?  వెంటనే అడుగులు ఆగిపోయాయి , కొద్దీ వెనకన అడుగుల  చప్పుడుతాను ఆగగానే  వెనకనే అడుగుల చప్పుడు ఆగిపోయింది.
రెజీనా మళ్లీ  అడుగులు వేయడం ప్రారంభించింది. వెనక మనిషి  అడుగులు జాగ్రత్తగా వింటే  వినగలుగుతున్నాది. తాను ఆగితే అవి ఆగుతాయి. ఎదురుగా చూసింది నల్ల  బట్టలు,  నల్ల బూట్లు వేసుకుని ఉన్న ముసుగు మనిషి ఇంకా గుడి చాటునుంచి పోలేదు . ఒక్కసారి తల బైటకు పెట్టి మళ్ళీ  వెనక్కి వెళ్ళిపోయాడు. ఈలోగా వెనక వస్తున్నా ముసుగు మనిషి రెండు నిమిషాల తర్వాత ఒక్కసారిగా బైటకి వచ్చి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించాడు. త్రి రౌండ్స్ అయ్యాక ఆపాడు. వెనక నుంచి వస్తున్నా ముసుగు మనిషి  ఒక్కసారి ఎగిరి ఒక బుష్ మీద పడ్డాడు . బుష్ వెనకనుంచి గుడి వైపు త్రి రౌండ్స్ కాల్చాడు.  ఫైర్ ఓపెన్ అవ్వగానే రెజీనా గుడి వైపు నుంచి చెట్ల  వైపుకి పరిగెడుతున్నది. ముసుగు మనిషి కూడా ఆమె వెనక పరిగెడుతున్నాడు.  గుడి వెనక నుంచి ఇద్దరినీ చూస్తున్న వ్యక్తి మళ్లీ  ఒక రౌండ్ ఫైర్ చేసాడు.  బులెట్ కార్తీక్ కాలిలో కి దూసుకుపోయింది.  "రెజీనా నేను ! కార్తీక్ ని , వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు జీప్ తీసుకుని బంగళాకి వెళ్ళిపో !" అరిచాడు కార్తీక్ . రెజీనా పరిగెత్తడం ఆపేసి కార్తీక్ అంటూ వెనక్కి కార్తీక్ దగ్గరికి వచ్చేసి కార్తీక్ వెనక నిలబడింది. కార్తీక్ రివాల్వర్ ని  తనవైపు వస్తున్న ముసుగు మనిషి వైపు గురిపెట్టి నిలబడ్డాడు.  కార్తీక్ ఎదురుగా ఉన్న ముసుగుమనిషి , ఫ్రెండ్ ఫ్రెండ్ అని అరుస్తూ రెండు చేతులు ఎత్తి కార్తీక్ దగ్గరికి వచ్చి , తన జేబులోంచి పిస్తోల్ తీసి కార్తీక్ చేతిలో పెట్టేడు. " ఎవరు నువ్వు ఎందుకు ఆమెని ఫాలో అవుతున్నావు ?"  నేను నీకు  ఫ్రెండ్ ని కానీ ఇక్కడ వివరాలు అడక్కు, " అన్నాడు. " సమయం వచ్చినప్పుడు అన్నీ తీరిగ్గా చెపుతానంటావా ? " అంది రెజీనా వెటకారంగా. "ఇందాకా నువ్వు ఒక బుష్ వెనుక దాగున్నావు కదా అది ఏది ?"అన్నాడు ముసుగు మనీషి . "ఏం తిక్క తిక్కగా ఉందా ఒకటి అడిగితే ఇంకోటి చెబుతున్నావు ఫ్రెండ్ అయితే నన్ను ఎందుకు షూట్  చేసావుముసుగు ఎందుకు వేసుకున్నావు ?"  అన్నాడు కార్తీక్ .  రెజీనా అంది " వీడెవడో మీ అన్నలా ఉన్నాడు  నీలాగే ఒకటడిగితే మరొకటి చెప్తున్నాడు. కార్తీక్ పిస్తోల్ ముసుగుమనిషి  తలమీద పెట్టేడు. ఆశ్చర్యం ముసుగుమనిషి తన దగ్గరున్న పిస్తోలుని  కార్తీక్ చేతిలో పెట్టి  ," రెజీనా  ని కిడ్నాప్  చేయడానికి  ఒక కెమాఫ్లాజ్ (camouflage) ఎక్సపర్ట్  , ఒక సైకో క్రిమినల్ తిరుగుతున్నాడు, కార్తీక్ ఒక్క సారి తల పక్కకి తిప్పిచూడు పొద రూపంలో, పొదలా కూర్చున్న వాడు ఇప్పుడు పారిపోయాడు." అన్నాడు . మళ్ళీ ముసుగు మనిషే అన్నాడు  "వాడు ఇక్కడే ఎక్కడో నక్కి ఉండొచ్చు కూడా."  కార్తీక్ తన జేబులోంచి కారం పొడి పొట్లం తీసి గాల్లోకి నలువైపులా జల్లేడు. వెంటనే ఒకడు తుమ్ముతూ  ఒక పొద ను తన మీద నుంచి  తీసేసి కింద పారేసి పారిపోతున్నాడు . కార్తీక్ తన చేతులో ఉన్న పిస్తోల్ రెజీనా చేతిలో పెట్టి , కదిలితే కాల్చిపారేయి అని సైకో క్రిమినల్ వెనక పరిగెత్తాడు. కార్తీక్ వద్దు వాడు దొరకదు అని అరుస్తున్నాడు ముసుగు మనిషి. కాసేపట్లో కార్తీక్ వెనక్కి వచ్చాడు. వాడి కాళ్ళకి యాంటీ  గ్రావిటీ స్ప్రింగ్ షూస్ ఉన్నాయి ,వాటిని జంపర్ షూస్ అంటారు. అంతబలమైన షూస్ ని  నేను ఎక్కడా చూడలేదు సార్ అన్నాడు కార్తీక్. రెజినా షాక్ అయ్యింది కార్తీక్ ముసుగుమనిషిని సార్ అని సంబోధించడం తో. ఇంకా పిస్తోల్ ఆయన మీదకి  ఎందుకు గురిపెట్టడం. అన్నాడు కార్తీక్ రెజీనాతో . రెజీనా చేతిలోంచి పిస్తోల్ తీసుకున్నాడు. ఇంకెదుకుసార్ ముసుగు వాడు పారిపోయాడు కదా అన్నాడు కార్తీక్. రేజీనాకి ఒక్కసారి చూబించి మళ్ళి  తగిలిచేసుకున్నాడు. "సార్ మీరా ???" అంది రెజీనా  జీప్ ఎక్కిన తరువాత ముసుగు తీసి చెప్పేడు మన ఉన్న ఏరియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సీసీ కెమెరాలు ఉన్నాయి,  ముసుగు ఎందుకు వేసుకున్నారు , ముసుగు ఎందుకు తియ్యరు అన్నవుగా  ఇందుకే  , ఇప్పుడు తీరేయా నీ డౌట్స్ ? అన్నాడు జగపతి.  అన్నీ  తీరిపోయాయి సార్. అంది రెజీనా.  రెజీనా నీకు ఇంకా ఒక ఆఖరి  డౌట్ ఉంది కదా  అది కూడా  తీర్చేస్తాను అన్నాడు కార్తీక్. నేను కొద్దీ నెలలనుంచి అడవిలోనే ఉంటున్నాను.  నువ్వు రాక ముందునుంచే  నెమలి ఇంట్లో పశువుల షెడ్ దగ్గర ఉన్న వెనక గదిలో ఉంటున్నాను.  నేనువచ్చింది సైకో క్రిమినల్ గురించే. వీడు నెమలి తమ్ముడు. అన్నాడు. రెజీనా సడన్ బ్రేక్ వేసి జీప్ ఆపేసింది. పక్కనున్న కార్తీక్ వెనకనే కూర్చున్న జగపతి తూలిపడ్డారు. పాపం జగపతి నిజంగానే కంట్రోల్ చేసుకోలేక ముందుకి పడితే , కార్తీక్ తెలివిగా పక్కకి పడ్డాడు. రెజీనా ఎదమీద పడి అలాగే కాస్సేపు ఉండిపోయాడు    
                                                     
                           

3 comments:

  1. Superb! Really thrilling and unexpected twists! Simply marvelous!!??

    ReplyDelete
  2. Excellent sir.The entry of Jagapathi in the scene unexpected. Eagerly waiting for the next scene

    ReplyDelete
  3. Please know that you have such talent and your words not only touch me , but so many here sir
    what a writing
    what a expressing
    great sir.

    ReplyDelete