Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, June 30, 2020

Anveshana 2020 Scene 22

సాయంకాలం 6 గంటలు. రెజీనా ఫైనల్ రిపోర్ట్ తయారుచేసింది. ఒక్కాసారి ఫైల్ ఇది తాను ప్రమాదం అంచులలో పరిగెడుతూ సాధించిన ఫలం అడవి ఫలం. కార్తీక్  నిన్న  ఉదయం నుంచి , కాదు కాదు మొన్న  రాత్రినుంచి నిద్ర పోకుండా పడుతున్న శ్రమ గుర్తొచ్చింది. నేను ఇప్పుడు హాయిగా రూమ్ లో కూరుచున్నాను, బంగాళా చుట్టూ పోలీస్ భద్రత  కార్తీక్ మాత్రం ఇంకా సైకో క్రిమినల్ వేటలో అడవిలోనే ఉన్నాడు. చీకటి పడేటప్పటికీ కార్తీక్ ఇంటికి చేరుకుంటే పండగే. తాను చెప్పేడు ఉదయం నుంచి బంగళాలో ఏంజరిగింది, నెమలి ఇంటినుంచి బంగళాకి పరుగు పరుగున నాకోసం వచ్చి  పిచ్చివాడిలా నాకోసం ఎలా గాలించాడో

 ఉదయం 7. 00 గంటలు. కార్తీక్ బంగాళా కి చేరిన తరువాత రెజీనా! , రెజీనా!!  అని అరుస్తూ బిల్డింగ్ అంతా కలియతిరుగుతుంటే , సత్య వచ్చి మేడం రికార్డింగ్ కి వెళ్ళేరు అని చెప్పేడు.    "ఇదేంటి ? బాలసుబ్రమణ్యం రికార్డింగ్ కి వెళ్ళేరు అని చెప్పినంత  సులభంగా చెప్పేసావు , ఇదేమన్నా స్టూడియో కి వెళ్లడమా?" అని అరిచాడు కార్తీక్.  " మేడంకి సార్ కిడ్నాప్ అయిన సంగతి తెలియదు , నేనే చెప్పదన్నాను. " అన్నాడు సత్య.  "ఓహో!  ఇది నీ డైరెక్షనా? సరే జగపతిగారి బెడ్ రూమ్ చూబించు." అన్నాడు కార్తీక్.   సత్య బిలియర్డ్స్ రూమ్ పక్కన ఉన్న జగపతి బెడ్ రూమ్ చూబించాడు. లోపల తాళం వేసిఉండగా మనిషిని కిడ్నప్ చేశారు అంటే తలుపు పగలగొట్టక తప్పదు అన్నాడు కార్తీక్ . సత్య గున్నపం తెచ్చి ఇచ్చాడు. కాస్సేపటిలో  తలుపు తెరిచాడు కార్తీక్.   తలుపు తీసేటప్పడికి నెమలి ఇంటినుంచి మెల్లగా నడుచుకు వచ్చింది అనసూయ.  డబుల్ కాట్ ని  పక్కకి నెడితే దానికింద చెక్క తలుపు ఉంది "అనసూయా , కూపర్ని తీసుకురా."  అన్నాడు కార్తీక్ . అనసూయ కూపర్ని తీసుకొచ్చింది . " దీనికి తిండి దండగ అనుకున్నాను, ఆమ్మో సార్ మామూలోడు కాదు ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాడు." అన్నాడు సత్య   " భౌ భౌ  భౌ  భౌ " అరిచింది కూపర్. చెక్కతలుపు తెరిచి కూపర్ని తీసుకుని సొరంగంలోకి ప్రవేశించాడు.

                                                                 *** 

సాయింకాలం 6 గంటలు అయ్యేసరికి 2 పోలీస్ జీప్స్ రెండు పోలీస్  వేన్లు వచ్చి బంగాళా ముందు ఆగాయి. ఒక కంపెనీ  పోలీసులు తో వస్తున్నా కార్తీక్ ని చాలా వింతగా చూసారు  గ్రామస్థులు. " వెళ్లండయ్యా వెళ్ళండి " వారిని బంగాళా ముందునుంచి క్లియర్ చేస్తున్నాడు ఒక కానిస్టేబుల్. జగపతి దిగి బంగాళాలోకి వెళ్లాడు. కొంతమంది గ్రామస్థులు లోపాలకి వెళ్ళడానికి ప్రయత్నించారు . పోలీసులు వారిని నెట్టేస్తున్నారు.  ఆ బాబుని సూడనియ్యండి  బాబు అని పోలీసులతో  బేరాలాడుతున్నారు కొంత మంది గ్రామస్థులు. వెల్లడయ్యా చెప్తుంటే మీక్కాదూ.  నెట్టేస్తున్నారు పోలీసులు.    అనసూయ మోహంలో ఆందోళన నిండి ఉంది. " రెజీనా ఇంకా రాలేదు " అని చల్లగా చెప్పింది. బాంబ్ పేలినట్ఠయ్యింది, కార్తీక్కి. రాత్రి 7 గంటలు అయ్యింది పోలీసులు ఫారెస్ట్ లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.    8 గంటలవరకూ కంపెనీ  అంతా అంటే 134 మంది వెతుకుతున్నారు. ఒక జత కళ్ళు చెట్టులో కలిసిపోయి వెతుకుతున్న ఇద్దరు పోలీసులకేసి చూస్తున్నాయి. ఒక్కసారిగా వారిమీద పడి  మట్టు  పెట్టాడు ఆ సైకో. మళ్లీ  అలాగే పొదచాటున నక్కి మరో ఇద్దరు పోలీసులని చంపబోయాడు. పోలీసులు తప్పించుకున్నారు.
కార్తిక్ ఫైర్ చేసాడు. వాడు దుమకడం ప్రారంభించాడు. కార్తీక్ వాడి వెనుక పరిగెడుతున్నాడు. పోలీసులు టార్చ్ వేసుకుంటూ వెనక పరిగెడుతున్నారు. క్షణాల్లో మాయమైపోయాడు , సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి"సార్ చూసారా వాడేసుకున్న  జంపింగ్ షూస్, వాటి సాయంతో వాడు 12 అడుగుల ఎత్తు ఎగరగలడు 10 అడుగుల నుంచి 20 అడుగులకు ఒక అంగ పడుతున్నది వాడిది.  సార్ వాడేసుకున్నవి మామూలు బూట్లు కావు, వాటిని కంగారు షూస్ అంటారు. అన్నాడు సబ్  ఇన్స్పెక్టర్. " అవి వేసుకున్నోడు కూడా మామూలోడు కాడు " అన్నాడు కార్తీక్.  " అర్ధం కాలేదు" అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. వాడు కెమాఫ్లాజ్ ఎక్స్పర్ట్ , యిట్టె పరిసరాల్లో కలిసిపోయి దాక్కోగలడు అందుకే అందరికీ ఒక విషయం చెప్పాలి అన్నాడు కార్తీక్. ఇదిగో సార్ అంటూ మెగాఫోన్ ఇచ్చాడు సబ్ ఇన్స్పెక్టర్. ఇది మైకుల్లో చెప్పేది కాదు అని చెవిలో చెప్పాడు . అతను  ఇంకొక పోలీస్ చెవిలో చెప్పాడు. కొద్దీ సేపట్లో అక్కడ పోలీసులు ఎవరూ లేరు.
                                                                 ***     
  
 ఉదయం 8 గంటలు అయ్యింది , వాన కురుస్తుండడం తో రాత్రంతా మేలుకునే ఉంది ,  చుట్టూ నాలుగు కొండల మధ్య లోతైన ప్రదేశంలో పడి  ఉన్న రెజీనా తలెత్తి చూసింది పైన ఎదో శబ్దం అయ్యింది. ఏమీ కనిపించలేదు. కాస్సేపు తర్వాత చప్పుడు వినిపిస్తున్నది.  ఆకాశం లోంచి ఏదో తెల్లని వస్తువు తన వైపు రాసాగింది. అది డ్రోన్ , అది కార్తీక్ పంపేడు అని గ్రహించడానికి ఎక్కువ సేపు పట్టలేదు. కొద్దిసేపు డ్రోన్ రెజీనా మీద తిరిగి  వెనక్కి వెళ్ళిపోయింది. ఒక అరగంటలో కార్తీక్ పెద్ద మోకుతాడు  నడుముకి కట్టుకుని పోలీసుల సాయంతో రెజీనాని బయటకు తీయడానికి లోయలోకి  దిగాడు.  కొండమీద నుంచి తాడు ఒక కొస  పోలీస్లు  పట్టుకుని ఉన్నారు.  రాత్రంతా వానపడుతున్నాదా  అని అడిగాడు కార్తీక్.  అవును ఇక్కడికి ఒక పెద్ద  ట్రక్ కూడా వచ్చింది. ఈ నాలుగు  కంటైనర్ల లో ఒక దాన్ని తీసుకెళ్లింది. కార్తీక్ చూసాడు , నెల మీద హెవీ ట్రక్ టైర్ మార్క్స్ ఉన్నాయి. వాన పడడం వల్ల మార్కులు  క్లియర్ గా ఉన్నాయి.  అక్కడ బైటకి వెళ్ళడానికి దారి ఉంది కానీ మూసివేసారు . ఒక బండరాయి తో దాన్ని కప్పేశారు. అక్క డా మూడు పెద్ద కంటైయినెర్స్ ఉన్నాయి. అవి ఆర్మ్స్ డంప్  అని తెలుసుకున్నాడు.
  " ఆపిల్ ఆఫ్ డిస్కార్డ్ , ది రూట్ కాజ్ అఫ్ అల్ ప్రోబ్లెమ్స్ " అన్నాడు. రెజీనా అయోమయంగా ఏమీ అర్ధం కానట్టు మొహం పెట్టింది . " ఈ అడవిలో జరిగే అనేక అరాచకాలకు మూల కారణం ఈ ఆయుధాల డంప్ " అని వివరించాడు కార్తీక్. రెజినా ఒంటిమీద గాయాలు చూసాడు. అయ్యో రెజీనా ఈ గాయాలేంటి అసలెలా వచ్చావు ఇక్కడికి ? తన నడుం కి కట్టి  ఉన్న మోకు తాడుని విప్పుతూ.   జేమ్స్, గిరి సత్య అందరు చెప్పారు   వాటర్ ఫాల్స్ దాటివెళ్ళద్దు ప్రమాదం  అని , కానీ ప్రమాదం అంటే ఇలా ఉంటుంది అని  తెలియదు,  నిన్న వ్వాటర్ ఫాల్స్ దగ్గరకి వచ్చేసరికి మద్యానం అయ్యింది  చాలా కొత్త పక్షులు రావడంతో ఈ లోతులోకి దిగేను ఈలోయలోకి   దిగేటప్పుడు సులభంగా దిగిపోవచ్చు కానీ ఎక్కడ చాలా కష్టం. నిన్నసాయంకాలం వాన కురిసింది, ఎక్కడానికి చాలా సార్లు ప్రయత్నించాను , రెండుసార్లు పడిపోయాను. సాయంకాలం హెల్ప్ హెల్ప్ అని పిచ్చిదానిలా అరిచాను.  రాత్రంతా  వాన పడుతూనే ఉంది. ఈ చెట్లకొమ్మలకింద తలదాచుకున్నాను. కార్తీక్ రెజీనా వంక జాలిగా చూస్తూ తాడు ఇద్దరి నడుములకి కడుతున్నాడు. ఆ  పెద్ద బండరాయిని ట్రక్ లోంచి వచ్చిన ఒక మెకానికల్  ఆర్మ్ పక్కకి తొలగించింది , అలాటి ట్రక్ నేనెప్పుడూ చూడలేదు అంది రెజీనా , దానిని సెల్ఫ్ లోడింగ్ కంటైనెర్ ట్రక్ అంటారు. అంటే ట్రక్ లోనే క్రేన్ ఆర్మ్ ఉంటుంది. అన్నాడు కార్తీక్. అలాంటి ట్రాక్ పెద్ద కంటైనర్ ని తనంత తానూ లోడ్ చేసుకోగలదు. అంటూ తాడు ఒక కొసని ఇద్దరి నడుములకి ముడి వేయడం పూర్తి చేసాడు. సమంగా ముడి పడిందా అని చెక్ చేసాడు. గాయాలు ఉన్న చోటులంతా చేతులతో తడిమి చూస్తున్నాడు. "ఇన్స్పెక్టర్ ఏంటిది?" అంది . ఇన్స్పెక్టర్ కాదు కార్తీక్ అన్నాడు.
తాడు రెండవ కొస పైన పోలీసుల చేతుల్లో ఉంది. జేబులోంచి విజిల్ తీసి ఒకసారి ఊదాడు. మెల్లగా పైనించి వాళ్ళు తాడుని లాగుతున్నారు , కిందనుంచి  కార్తీక్, రెజినా కొండ ఎగప్రాకుతున్నారు.  కొండ ఎగుడు , జారుడు పెరిగింది , కాళ్ళు చేతులలో పట్టు తప్పుతోంది , తాడుతో టెన్షన్ పెరిగింది , పైనుంచి వాళ్ళు గట్టిగా లాగుడు మొదలుపెట్టేరు . ఈ తాడు లేకపోతే , పైనుంచి సహాయం లేకపోతే ఎక్కడం అసాధ్యం అనిపించేలా ఉంది. దూరం డ్రోన్ వీరిద్దరినీ చూస్తోంది డ్రోన్ కంటిలో  రెండు చీమలు కొండపైకి ప్రాకుతున్నట్టు కనిపిస్తోంది. డ్రోన్ పోలీసుల వెనక్కి వెళ్ళిపోయింది . వారి వెనక నుంచి ఒక  నిమిషం చూసి  రెజీనా మొఖం  కేసి చూస్తూ ఎగిరిపోయింది .ఎవరిపని వాళ్లు చేసుకున్నారు.  ఇంకొక పది నిమిషా లతరువాత పైకి చేరుకున్నారు. రెజినా కార్తీక్ భుజంమీద చేయివేసి కుంటుతూ జీప్ దగ్గరికి చేరుకుంది. ఇద్దరు జీప్ లో కూర్చున్నారు. కార్తీక్ డ్రైవ్ చేస్తున్నాడు , పక్కనే  భుజం మీద వాలి కూర్చుంది రెజీనా.


జీప్ బయలు దేరింది. జీప్ వెనుక వెన్లో పోలీసులు.  చల్ల గాలి తగులుతోంది.  సడన్గా రెజీనా మొఖంలో వెలుగు కనిపించింది. " ఎంతో కాలం నుంచి అర్ధం కానీ చిక్కుముడి ఇప్పుడు విడిపోయింది. అంది. ఏంటి అన్నాడు కార్తీక్ . ఆర్మ్స్ డంప్  లో కంటైనర్లు ని తీసుకెళుతున్న ట్రక్ హార్న్ ..అదే అదే ట్రక్ హార్న్ నేను ఒకప్పుడు  రికార్డింగ్స్లో విన్న ఏనుగు ఘీంకారం ." అంది రెజీనా. భలేదానివే  ట్రక్  ఏంటి ఏనుగు ఘీంకారం ఏంటి? అన్నాడు కార్తీక్.  నిన్న రాత్రి కంటైనర్ తీసుకువెళ్లిన ట్రక్ పైన ఏనుగుల పెయింటింగ్ ఉన్న కాన్వాస్ కప్పేరు , ఆ  ట్రక్ హార్న్ కి బదులు  ఏనుగు ఘీంకారం వినిపిస్తుంది .  ఇదే నేను టెలిస్కోప్ లో చూసినప్పుడు కనిపించింది .. ఏనుగుల గుంపు కదులుతున్నట్టు కదిలి ఏనుగు ఘీంకారం వినిపించి మరు క్షణం మాయమవుతుండేది. అంది రెజినా.  కానీ ఈ స్పాట్  మన బంగాళా కి చాలా దూరం  ఎలా చూసావు ? అన్నాడు కార్తీక్ . లేదు కార్తీక్ ఇపుడు మన వెళుతున్న రోడ్ మీద ఆ ట్రక్ వెళ్ళింది . అదే నేను టెలిస్కోప్ లో చూసాను. మన బంగాళా చాలా ఎత్తుగా ఒక దిబ్బమీద  ఉంటుంది.  విలేజ్ మన బంగళాకి చాలా దిగువగా ఉంటుంది. విలేజ్ నుంచి ఈప్లెస్ ని చూడలేము కానీ  బంగాళా నుంచి చూడగలము.

కార్తీక్ జీప్ ఆపేడు . చూడమ్మా కాస్సేపు నువ్వు చెప్పినిదే నిజం అనుకుందాము అంతదూరం నుంచి  ఏనుగు ఘీంకారం రికార్డింగ్ సాధ్యమా ? మరీ సిల్లీ గా ఉందే!  అన్నాడు కార్తీక్ . " కార్తీక్ , నువ్వు క్రిమినాలజీ చదివేవు నేను రికార్డింగ్ ఎక్స్పర్ట్ ని " అంది రెజీనా. ఐ యామ్ సారీ  అన్నాడు కార్తీక్. జీప్ ముందుకి పోనిచ్చాడు. కొంత సేపు మౌనం. "కోపం తగ్గిందా" అని అడిగాడు కార్తీక్ .  మైక్రోఫోన్ ఎంత దూరం వరకు శబ్దాన్ని లాగుతుంది ? అన్నాడు కార్తీక్.  ఏ మైక్రోఫోన్  కూడా శబ్దాన్ని లాగలేదు. ధర్మామీటర్ వేడి తగిలితే పనిచేసినట్టు , శబ్దం దానికి తగిలితే అది రికార్డ్ చేస్తుంది.  శబ్దం ప్రయాణించే దూరం దాని డెసిబుల్స్  అంటే లౌడ్నెస్ మీద , దాని పిచ్ మీద , ఇంకా తరంగ దైర్ఘ్యం అంటే  వేవ్ లెంగ్త్ మీద ఆధారపడి ఉంటుంది.  ఏనుగు ఘీంకార శబ్దం  తరంగ దైర్ఘ్యం తక్కువ ఉండటం వల్ల 20 మైళ్లవరకు వినబడుతుంది. అయితే మామూలు చెవికి వినపడదు. నా దగ్గర ఉండే మైక్ -50 డెసిబుల్స్ కూడా వినగలిగే  సున్నిత మైన మైక్. ఇంకా చెప్పాలంటే స్టేజి మీద ఒక ఆర్టిస్ట్ తలతిప్పి ఇంకొక ఆర్టిస్ట్ వైపు చూస్తే , ఆ తలా తిప్పిన శబ్దం కూడా వినగలదు. ఆ రకంగా ఉదయం ఇంటికి చేరి విశ్రాంతి తీసుకుని , నీట్ గా తయారయ్యి, నిదానంగా ఫైనల్ రిపోర్ట్ తయారు చేసి  సాయంకాలం 6 గంటలకి కార్తీక్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

                                                                     ***

కార్తీక్ పోలీసులకి  ఇచ్చిన ప్లాన్ ప్రకారం పోలీసులు అందరు యూనిఫామ్స్ వదిలి  కెమాఫ్లాజ్ టెక్నీక్ అనుసరించి పొదలు మాదిరిగా , వంటికి రాగులు పూ సుకుని చెట్లమాదిరిగా , రాళ్ళ మాదిరిగా అడవిలో కలిసిపోయారు. అలా సైలెంట్గా కదలకుండా పులి మాటు వేసినట్టు వేశారు. వారి శ్రమ ఫలించింది.  కార్తీక్ గిరి మొబైల్ లో తీసిన మిగితా ఫొటోస్ చూస్తుంటే హౌస్ ఫోటోస్ చాలా కనిపించాయి. ఆ రాత్రి గిరి అన్నీ టైంలేక అన్నీ చెప్పలేకపోయాడు , కానీ ఈ మొబైల్ ఫోటోస్  గిరి చెప్పలేని చాలా విషయాలు చెప్తున్నాయి. ఆ మడ్ హౌస్ లో  కట్టేసిన అమ్మాయిల ఫోటోస్ ఉన్నాయి , పట్టాభి కూడా ఉన్నాడు. ఇది సైకోగాడి అడ్డా  అన్నమాట అనుకున్నాడు కార్తీక్. కానీ ఈ మడ్ హౌస్ ఎక్కడుందో ఎలా కనుక్కోడం ? చాలా గూడేలలో ఇలాటి ఇళ్ళు  చూసాను అని ఆలోచిస్తున్న కార్తీక్ కి తళుక్కున మెరిసిన ఆలోచన - పట్టాభి . పట్టాభిని పట్టుకోవాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్లాలి  , పట్టాభిని తీసుకురావాలి అన్నాడు కార్తీక్. " పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ పట్టాభి గ్రామంలోనే ఉన్నాడు వాడికి బెయిల్ మీద. వెంటనే పట్టాభిని తీసుకొచ్చారు. కార్తీక్ సబ్ ఇన్స్పెక్టర్ మడ్ హౌస్ చేరేటప్పటికి సాయింకాలం 4 గంటలు అయ్యింది  ఆ సైకోగాడు అక్కడే ఉన్నాడు.  వీళ్ళని  చూడగానే కాళ్ళకి స్ప్రింగ్ షూస్ కట్టేసాడు. ఆ తరువాత ఇన్స్పెక్టర్ కార్తీక్ వాడి వెంట పడలేక పడలేక పరిగెడుతుంటే వాడు లేడిపిల్లలా దుముకుతుంటే పట్టాభి నవ్వుతూ అన్నాడు " వాడు మీకు చస్తే దొరకదు." కార్తీక్ పరిగెడుతూనే ఉన్నాడు , పట్టాభి నవ్వుతున్నాడు , సడన్గా అతడి చెంప చెల్లుమంది , పక్కనే సబ్ ఇన్స్పెక్టర్ నిలబడి ఉన్నాడు. పట్టాభి మొఖం జేగురించింది. " ఎలా దొరుకుతాడో నువ్వే చూద్దుగాని. అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.

                                                                     ***


5 గంటల ప్రాంతంలో సైకో ఒక ప్రదేశం లో పరిగెడుతున్నాడు . చుట్టూ ఎవరూ లేరు , పరుగాపి ఒక బండరాయి మీద కూర్చున్నాడు. " ఈ అడవికి రాజు సింహం , నా తర్వాతే అనుకున్నాడు  అహంకారంతో. చుట్టూ ఉన్నపొదలు పొదలు కాదు పోలీసులు. మరుక్షణం కార్తీక్ అటురావడం చూసి ఒకపొదలో దూరేసాడు. కోడిపెట్టాలా ఉక్కిపోయాడు అదిచూసి పట్టాభి మొఖం మాడిపోయింది. ముల్లుని ముల్లుతో తియ్యడం అంటే ఇదే పట్టాభి అన్నాడు కార్తీక్.             
                                                                      ***
                                                                 
సాయింకాలం 6 గంటలు దాటింది ఎదురు చూస్తున్న రేజీనా కంట్లో మెరిశాడు  కార్తీక్ . అతడి కళ్లల్లో విజయ గర్వంతొణికిసలాడింది.   రెజినా కళ్ళలో  కార్తీక్ , రెజీనా దంపతులు అయ్యి సాగిపోతున్న దృశ్యం కనిపించింది.  కార్తీక్ కోసం రెజీనా అన్వేషణ,  సైకోక్రిమినల్ కోసం  కార్తీక్ అన్వేషణ . పక్షి పాట ల్లో  సంగీత స్వరాల మీద పరిశోధన జగపతి అన్వేషణ  అన్ని అన్వేషణలు ఫలించాయి. ఇందులో అనేక విజయాలు , అనేక విజయ గీతాలు దాగి ఉన్నాయి.
                                    శుభం

 Epilogue : James lost his job. He was sentenced to 7 years imprisonment. Pattabhi being accomplice  got 2 years term and Nemali for supporting criminals got 1 year. During police interrogation the psycho criminal vomited the name of the terrorists behind the dump, the police nabbed the  king-pin and days after the arrests the dump was recovered. Satya and Anasuya got married.                                                                   
                                                   

8 comments:

  1. Jagapathi came. What about Regina?
    I am very curious

    ReplyDelete
  2. Excellent sir. Each scene superb. All characters entertained us very well. Regina entertained us with her charm.Karthik is so romantic and adventurous. Jagapathi is a dignified man. The conversation between Giri and Satya are so funny. But I couldn't digest death of Giri. Nemali, chandri, James, Pattabhi how dangerous these forest people are! Hats off to your creation. This story is not only a suspense thriller, it provided valuable information also. You garnished this story with beautiful pictures. I enjoyed a lot and learned a lot. Once again hats off to your efforts. I wish you to write more novels in future.

    ReplyDelete
  3. Sahitya, my heart is now content. This is what for I worked hours and hours. Next novel is sure from tomorrow.

    ReplyDelete
  4. Really excellent novel with 22 chapters. After "our school" the bilingual novel, this is heart touching and suspense thriller. Kudos Mr.Poolabala

    ReplyDelete
  5. Mrs. Varalakshmi, your feedback gave me immense pleasure and served as motivation. Your comparison between Anveshana 2020 and Our school lives in my heart forever.

    ReplyDelete
  6. Ending is nice. One can say Anveshana is a good novel with lot of twists and suspense.

    ReplyDelete
  7. So the forest is under the control of terrorists. Oh nice ending.

    ReplyDelete
    Replies
    1. Sahitya , I am glad that you have red the epilogue and the blue paragraphs

      Delete