Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, August 15, 2020

Bharatavarsha 22

టాలీవుడ్నందు సృజనాత్మకత లోపించుటయేగాకబంధుప్రీతి దురాశ పెచ్చుమీరినదిఇచ్చట కథలకు కొరత ఉన్నదనువారేగానీ కొత్తకథలను ఆహ్వానించువారులేరుసింహభాగము మూసపోత చిత్రములుముతక దర్శకులువృద్ధ కథానాయకులుమిగిలిన యువకులు వారి సంతానమే గాని అన్యులెవ్వరునూ కానరారుఅందుచే దశాబ్దములతరబడి అవే ప్రేమప్రతీకార చిత్రములనటు దిప్పి ఇటు దిప్పి జూపుచున్నారు.  ఎవరైననూ ప్రతిభ గల్గి  మంచి దర్శకుడు,  రచయిత  అవ్వవలెనని ఊవ్విళ్లూరుచూ కథలను పట్టుకుని ఫిల్మ్ నగర్ నందడుగిడిన ఆషాఢభూతులు వాసన పసిగట్టి వారిని కొనిపోయి దర్శకునకు కథ వినిపించెదనని మోసగించిబిడ్డలనెత్తుకుబోవు దొమ్మలగుండులవలె  వారియొద్దనుండి ధనమును దోచుకొను చున్నారు.  చిత్ర నిర్మాణాభిలాషతో వచ్చువారిలో ఒక్క శాతమైననూ  దర్శకులు కాలేకపోవుచున్నారు.  

 పరిస్థితంతయూ తెలిసిననూ నటీ నటులుదర్శకులు కావలెనని ఇంకనూ ఇచ్చటికి వచ్చు యువతీ యువకులకు మతిభ్రమణము కాక వేరేమందుము.” అని యామిని కొత్తగా వచ్చిన సుందరిని మందలించుచుండగా స్నానాలగదినుండి బయటకు వచ్చిన లకుమ “మరి యటులైన నీవెందుకొచ్చినావు?” అని యామినిని ఛేదించెను.“ఇంకొక్క మాసమున్న ఐదేండ్లు నిండును నేను అప్పుడింటికిపోయెదను” అనుచుండగా సుందరి వినుటయే దప్ప నోటిమాట లేక మూగవలె నిలిచియుండెను.“కృష్ణానగర్ లో ఉంటూ ఆపసోపాలు పడుతున్న వారి గురించి నిన్నగాక మొన్నొచ్చిన నీకెట్లు తెలియునుపిల్లకాకికేమి తెలియును ఉండేలు దెబ్బ యనుచు” యామిని స్నానాలగదిలో ప్రవేశించెను.

“యామిని మాటలయందు నిజముండిన యుండవచ్చును గానీ మన మనసులలో గంపెడాశ యున్నది. దానిని చంపుకొనగలమా?”యని లకుమ సుందరిని సోఫాపై కూర్చుండబెట్టి ఎచ్చటనుంచి వచ్చినావు? ఎంతకాలముండవలెనని వచ్చితివి? పైకమేమైనా తెచ్చితివా? యని అడుగగా “కాకినాడ నుండి వచ్చినాను"అని చెప్పి రంగస్థలమున పూర్వానుభవమును కూడా చెప్పి, "మాదా పురమునందు వసతి గృహమున ప్రవేశించితిని మూడు మాసము లుండుటకు సరిపడా ధనము తెచ్చితిని ఆపిమ్మట…"యని నీళ్లు నములు చుండెను.  “ఆపిమ్మట నీకునూ నావలె నీవునూ పనికి కుదురుకొనవచ్చు, అడ్డగాడిద చాకిరీ చేయవచ్చు” యని అప్పుడే తల్పము దిగిన సమంత చెప్పి తనను తాను పరిచయము చేసుకొనెను. అప్పుడే యామిని స్నానాల గది నుండి బైటకు వచ్చి "నేడాదివారము  మనము కలిసి   గడపవచ్చునేమో" యనెను. 

ఇంతలో కాఫి వచ్చెను. లకుమ, యామిని, సమంత, సుందరి సోఫాలో కూర్చుని కాఫీ సేవించుచుండిరి. ఆ ముద్దుగుమ్మలు నలుగురు గుమ్మమునిడిన రంగవల్లులవలె,  ఒక  వరుసలో నమర్చిన దీపములవలె నుండిరి. లకుమ “నేడు మీతో గడుపుటకు నాకెంత మాత్రము వీలు పడదు.  నాకొరకు ఎందరో దర్శక నిర్మాతలు వేచిచూచుచున్నారు. నాకు నేడు రామబ్రహ్మము గారితో భేటీ కలదు. నేను మీవలె పులిహోరపొట్లమును కాబోను. నేననతి కాలములోనే తారాపథమును చేరుకొందును అనుచుండగానే భవనము ముందొక విలాస వాహనము ఆగెను. వాహన ఝంకృతి విని వాహనమునందున్న నాయుని గాంచి లకుమ పరుగున బోయెను. 

 “ఈమె నెట్లు భరించుచున్నారో? యని సుందరి అనగా, సమంత “మేమెక్కడ భరించుచున్నాము? ఆమే మమ్ము భరించుచున్నది ఈ భవనమునకు అద్దె చెల్లించునది, ఇతరఖర్చులను కూడా చూచుకొనుచున్నది.”అనెను. దీని తల్లి పూర్వాశ్రమమున నటి, నర్తకి, అందుకే బడాయి పోవుచుండును , కాలమే దీనికి పాఠము నేర్పవలెను, మనమెవ్వరమూ దీనికి జెప్పదగ్గవారము కాము"యని యామిని అనెను. " చూచుచుండుము ఆ "రన్ అవే" రామము, షో కామపిశాచులు. నాయుడు, పరువముతో పిటపిట లాడుచున్న దీనిని చూపి పబ్బము గడుపుకొనుచున్నాడు. దీని పరిస్థితి ఏమగునో. యెగదీసిన  బ్రహ్మహత్య దిగదీసిన స్త్రీ హత్య అనునట్లు. దీనికి వారిగురించి  చెప్పిననూ తప్పే చెప్పుకున్ననూ తప్పే.  యే విధముగా చేసినా సంకటముగానే వున్నది.

2 comments:

  1. Nice sir. Waiting for the continuation of the scene

    ReplyDelete
  2. ఈసంఘటన వలన లకుమ విలాసవంతమైన జీవితం గడుపుతూ కలలలో విహరిస్తోందో అర్ధం అవుతుంది
    అల్లాగే మనుషుల మనస్తత్వాలు ఈర్ష్యలు అసూయలు కూడా కళ్ళకు కట్టినట్లుగా దృశ్య సహితముగా ఉన్నది

    ReplyDelete