Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, August 9, 2020

Why is IELTS very difficult for our students?

Reading and Brain Activity

Reading heightens brain connectivity Reading connects parts of your brain. Reading sharpens several brain functions, including intellectual, visual, auditory processes. The phonemic awareness become sharp with reading. The neurological regions of the brain are stimulated by reading. 

కొన్నిసంవత్సరాలుగా ఇటువంటి విద్యార్థులనే చూస్తున్నాను.

నేడు ఎక్కువ శాతం పరీక్షలు పాసైనవారు  (చదువుకున్నవాళ్ళు) పుస్తకాలు చదవలేరు సరికదా పది పేజీలు కూడాచదవలేరు.   అందుకే వాళ్లకి IELTS  చాలా కష్టం  IELTS వ్రాయడం ఎఫ్ బీ లో సొల్లు రాసినట్టు కాదు.  నోటికొచ్చినట్టు అభిప్రాయాలు చెప్పడం కాదు, అడ్డగోలుగా వాదించడం కాదు. శాస్త్రజ్ఞానాన్ని సహేతుకంగా వివరించడం. శాస్త్రవిజ్ఞానం ప్రపంచజ్ఞానం మన దగ్గర లేవు అన్నవిషయం గ్రహించడానికి  ఏళ్ళు పడుతుంది.  ఒప్పుకోడానికి అహంకారం అడ్డొస్తే  పోయేది విద్యార్థే . కానీ IELTS కూర్చుంటున్నప్పుడు కూడా ఈ విషయాలన్నీ చెపితే గాని తెలియవు.  IELTS  ప్రశ్నలు జవాబులు ఇచ్చేస్తే చదివేసుకుంటాడు. దీన్నే IELTS  కోచింగ్ అంటారు.

IELTS 250 words Essay వ్రాయాలంటే పేగులు తెగుతున్నాయి. ప్రశ్న చేంతాడంత (నాలుగైదు వాఖ్యాలు) ఉంటుంది. నేరుగా ఉండదు. ప్రశ్న దేనిగురించో అర్ధం కాక  వాళ్లకు తోచినది మరేదో(ఆఫ్ టాపిక్) వ్రాసేస్తుంటారు.  Essay వ్రాయాలంటే  చారిత్రక, సామాజిక, వైద్య, సంగీత, క్రీడా విషయజ్ఞానంతో పాటు ప్రపంచజ్ఞానం చాలా అవసరం. ప్రపంచంలో జరుగుతున్న జరిగిన వాటిని ఉదాహరణలు చూపుతూ ముగింపులో జడ్జిమెంట్ వ్రాయవలసి ఉంటుంది.

చదావాలనే ఎవరికీ ఇంకితజ్ఞానం ఉండటం లేదు. ఏ చదవాలో తెలియటం లేదు అంటారు. చదవమని లింకులు  పంపినతరువాత చదవలేకపోతున్నామని గుడ్లుతేలేస్తున్నారు. అన్ని రంగాల జ్ఞానము, చరిత్ర - క్లుప్తంగా చెప్పాలంటే ప్రపంచాన్ని- చదివి వినిపించాల్సొస్తోంది. 90 శాతం మంది చదివేశక్తి పోయింది, చదవలేకపోతున్నామని ఒప్పుకుంటున్నారు. చదివిన తరువాత అర్ధం కాకపోడం ఒక సమస్య , అంతకన్నా పెద్ద సమస్య విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకోడం. వెంటనే మర్చిపోవడం. ఇలాటివాళ్లకి చదవమని చెప్పే పెద్దవాళ్ళు, మిత్రులు ఉండకపోవడం పెద్దలోటు. 


2 comments:

  1. మీరు నిజం చెప్పురు సార్ ఇ రోజులలో చాల వరకు ఇలాగే ఉన్నారు ఇ రోజులలో మంచి గురువులు కూడ అరుదుగా ఉన్నరరు

    ReplyDelete