Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, November 19, 2020

Bharatavarsha -73

రాక్షసీ! నీ ప్రియుని కౌగిలి చేరెదనని ఒట్టుపెట్టి నెరవేర్చుకొన్నావు హోటల్లో నీ ప్రియుడు నిన్నెత్తు  కొనెనని , హత్తుకొనెనని మృదుమధుర కుసుమ కావ్యమువలె   వ్రాసినావు.  నేను కూడా ఒక ఒట్టు పెట్టుకొంటిని.  నాకు ప్రియుడు లేడు కానీ విమానమే నా ప్రియుడు.

పట్టణాల్లో తిరుగుతున్నప్పుడు సినిమాలు, కాఫీ హోటల్స్, షాపింగ్ మాల్స్,  వంతెనలు  గురుతులుగా యుండి నీకు మార్గమును సూచించుచుండును. కొత్తగా ఒక నగరంలోకి పోయినప్పుడు త్రోవ మరచు అవకాశము కలదు. అప్పుడు నీవు వాహనమును నిలిపి ఎవరినైననూ అడిగినచో నీకు దారితెలిపెదరు, దయగలవారైనచో గొనిపోయి చూబింతురు. గగన తల మున  మేఘ మార్గమునట్టి దయగలవారెవరుందురు? మార్గమును సూచించు గురుతులుండవు, వ్యోమయానమును నిలప వీలుండదు.  గతించిన కాలము, నాటికల్  ఛార్ట్స్ (ఇవి రోడ్ మేప్స్ వంటివి)  ఆధారముగా వైమానికులు (పైలట్స్) విమాన యానమును (ఏరియల్ నేవిగేషన్) సాగింతురు. ఆందొక్కరవ్వ పొరపాటు జరిగినచో ఏమగునో తెలియునా?

 నేను మొన్న రాత్రాకాశమున ఎగురుచుండగా నాకెందులకో దారితప్పితినని సందేహమొచ్చెను. గతించిన కాలము గణించు పద్ధతిన గమ్యమునకు పోవుచున్న నేను తరంగ మార్గదర్శన నియంత్రణకు తూర్పు దిశగా ఎగురుచున్నానని తెలపగా వారు నేను పశ్చిమాన సముద్రముపై నూరు నాటికల్ మైళ్ళు  పైబడి పోవుచున్ననై తెలిపినారు. హతవిధీ! ఇకపై తరంగ మార్గదర్శనమున ఎగరవలెనని ఒట్టు పెట్టుకొంటిని. 

ఇంతకీ నీప్రియుని ఎట్లు జాలమందు బంధించితివో నాకు చెప్పనే లేదు   

ఉత్తరము పూర్తిచేసి వెనుకకు తిరిగి చూడగా తులశమ్మగారు దూరవాణి సంవాదమునందు చెప్పు మాటలు విని అవాక్కయ్యెను.  

గతించిన కాలము గణించు పద్ధతిన  (TTL. total time lapsed) 

2 comments:

  1. వైమానిక శిక్షణ గురించి మీరు అందిస్తున్న సమాచారం చూస్తుంటే మీరు స్వయంగా శిక్షణ తీసుకున్నారేమో అని పిస్తుంది.

    ReplyDelete