Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, November 17, 2020

Bharatavarsha 72

చెన్నపట్టణము: జగద్విఖ్యాత అర్ధ సహస్ర భాగ్య సంస్థలందు యాక్సెంచర్ యనొక ఒక బహుళజాతి సంస్థ పంచ శత సహస్త్ర ఉద్యోగులను కలిగి నూటఇరవై దేశాలలో ఖాతాదారులకు సేవ లందించుచూ సాలుకు మూడు వందల కోట్ల ఆదాయమును పొందు చున్నది. అట్టి మేటి సంస్థ నందు దళపతిగా పదోన్నతి పొందిన బసవడు సాంకేతిక హరిత వనమందు ప్రమోదసమ్మేళనములో 

నీలి సూటు ధరించి మెడకట్టు (neck tie) తో,  ఉంగరముల జుత్తు తో   వేదికపై నిలచి యుండెను.  వారిలో చురుకుగల సభ్యు డొకడు మరొకడితో "ఈ నీలిసూటునందు బసవడు  ఆకర్షణీయము గానున్ననూ  ఏదోవెలితి కనబడుచున్నది." అని వంక పట్టెను. " ఉద్యోగమందు ఎత్తు పెరిగిననూ ఇతడి ఎత్తు 5 అడుగుల 7అంగుళములు   వద్ద నిలచిపొయినది. పొట్టిగాగా నుండుటయె తప్ప మరి ఏ వంక లేని  నెలవంక." అని మరొకడు బసవని వెనకేసుకువచ్చెను. వారి మాటలు విన్న బసవడు " నా ఎత్తు ఇంగ్లాండ్ ప్రధాని ఎత్తు,  కాని అతడివలె ఉబ్బిన రబ్బరు బంతి వలే లెకుండుట నా అదృష్టము అని చమత్కరించెను" అతడి చేతిలో శబ్ద వర్ధని యుండుటచేఆ మాటలు అందరికి వినబడుటచే ఆ ప్రదేశమంతయూ హాస్య కరతాళ ద్వనులతో నిండెను. సభ చిత్రీకరణ మొదలయ్యెను. బసవడు తన ఉంగరముల జుత్తు  సవరించుకొని. దృశ్య చిత్రీకరణ జరుగుచుండగా  నూర్వురు శిష్టజనము నుద్దేశించి

 " నేటి ఈ సభకు విచ్చేసిన అందరికీ వందనములు  నాకు గురుతుల్య  హితుడు   భాషా కోవిదుడు , సహస్రావధాని  భారతవర్ష  వ్రాసిన  నూరు ఆంగ్ల పద్యములను  హార్పర్ కొలిన్స్  యను  ప్రపంచ ప్రసిద్ధ ప్రకాశకులు రెండు పుస్తకములగా ముద్రించి  దేశ రాజధాని నగరమందు విడుదల  చేసియున్నారు. ఆ పుస్తకములను మీకు అందజేసితిని, మీ చేతుల్లో గల పుస్తకములను చూచుకొన్నచో    సభాముఖహముగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి వ్రాసిన ఈ రెండు సంకలనములందు గల పద్యములను మచ్చుకు కొన్ని చదివి  చర్చిం చుటయే ఈ సాహిత్య గోష్ఠి  ముఖ్యోద్దేశము.

వేదికపై బసవడుకాక చేరువైపులా ఇద్దరిద్దరు కూర్చొని ఉండిరి. ఛాయాగ్రహణము జరుగుచున్నది అందరి చేతులలో పుస్తకములు కల కల లాడు చున్నవి.  విచ్చేసిన వారిలో వేదికనలకరించిన ఆంగ్ల పండితుడు వడివేలు“ నేను మీకు కొత్తకాదు, భారతవర్ష   చెన్నపట్టణమునకు కొత్తకాదు, మన మద్రాసు విద్యాలయమున పలు మార్లు అవధాన కార్య క్రమములను నిర్వహించెను. ఇప్పుడు విడుదల యిన రెండు సంకలనములు    ఒకటి - డెడ్ ట్రీ పొయెమ్స్  - ఇవి   నైరాశ్య కవితలు. రెండు రివర్ సైడ్  సాంగ్స్   ఉత్సాహ, శృంగార  గీతములు. 

Fast and fast I run

The cobble stones are no fun

I have no bouquet in my hand , 

with my heart I wanna stand 

dumb by your tomb. 

ఇవి నాకు నచ్చిన కవిత నుండి ముఖ్యమైన పాదములు. ఈ కవిత లో ప్రేమికుడు తన ప్రియురాలిని చూచుటకు రాత్రి పోవుచున్నాడు, కవిత అతడి పరుగును రాత్రిని రాళ్ళను వర్ణించుచుండును  చివరి వాక్ష్యము చివరి అక్షరము దాకా అతడి ప్రేయసి చనిపోయినదని తెలుపడు

Eternal wait   

Hurry up time run fast  

I am low, you are slow

Oh no, hurry up and go

Ich warte auf dich leide 

bei der Leichenhalle

శాశ్వత నిరీక్షణ అను ఈ పద్యమందు ప్రేయసి కొరకు ఎదురుచూచు కవి సమయమును త్వరపడమని తొందరపెట్టుట వింతగా తోచును. ఈ పద్యమునందుకూడా చివరిదాకా కవి మార్చరీ వద్ద ఎదురు చూచుచున్నాడన్న విషయము తెల్పడు. ఆమెను చూడవలె, కాలమా త్వరపడి నన్ను గొనిపొమ్ము అనగా పరోక్షంగా కడతేర్చమని సరదా స్వరమున అడుగుట అతడి వైరాగ్య నిర్భీతి లను చూపుచున్నదని అందరు ఆంగ్ల కవితను ఆస్వాదించిరి కానీ “ఆంగ్లపద్యములందు జర్మన్ పదములు వాడుట తగునా?” అని ఒకామె తుచ్చ ప్రశ్న సంధించెను. అప్పుడు బసవడు” ఇలియట్ వ్రాసిన వేస్ట్ లాండ్ పద్య సంకలనము చదివితివా అందు బరియల్ ఆఫ్ ద డెడ్ , డెత్ బై వాఁటర్ , గేమ్ ఆఫ్ చెస్ పద్యములను చదివిన అందు సాంబరఁగ్జీ , హోఫ్ట్ గార్టెన్ ,హైమాట్ సు , ఓ వైలెస్ట్ డు వంటి ఎన్నో జర్మన్ మాటలు కనిపించును. అందుచే ఇది సంప్రదాయ విరుద్ధము ఎంత మాత్రము కాదు”

Kick me out of your Heart

Kick me out of your unwilling heart

I may from the apex of love fall apart, 

Let the stones of truth into me pierce

After the dainty bonds of love destroy, 

My blood should speak the truth

ఇది హృదయ విదారకమైన, దుఃఖపూరితమైన కవిత , నీమనసునందు నాకు స్థానమివ్వకున్న నన్ను విసిరి వేయుము, పోయి నిజమను పణుకు కురాళ్ల పై పడి  మరణింతును అని వ్రాసెను. ఇట్లు వ్రాయుటలో కపటప్రేమ పట్ల కవి వైరాగమును ప్రదర్శించుచూ మృత్యువునాశ్రయించెను.

My Honeymoon

I drive slowly on the night of rain,

 Ogling at her sweet mane

The moon is splendor!, 

The nature is wet and naked

She leans her head on my shoulder, 

In her sweet breath I smolder

 No more I can write about my honeymoon

ఇది సున్నిత శృంగారము . శృంగార యాత్రకు పోవు జంటకు తీయని రాత్రి కలుగు అనుభవములను సున్నితముగా వ్రాసెను.ఇంకెంత మాత్రమే వ్రాయలేను అనుటలో సభ్యత తో కూడిన  శృంగారము దాగి యున్నది. 

 Up! up! cheer up my friend, 

Yesterday was not the end

you just learn to transcend, 

you are my beautiful friend

Sad thoughts are like dark spots,

 Right now remove the nasty dots

ఇది ఉల్లాస భరితమైన కవిత , నైరాశ్యమును వదిలించి ఆశను నింపు కవిత ఈ కవితలన్నీ అంత్య ప్రాసను కలిగి యుండి  నిత్యమూ వాడు పదములతో చదువుటకు సులభముగా నున్నవనుచూ బసవడిచ్చిన  విందారగించి పుస్తకములను ఇంటికి గొనిపోయిరి. 

                                                                       ***

హైదరాబాదు:భక్తచింతామణి నాటకమును ప్రదర్శించబోవుచూ అభ్యాసము కొరకు భానోదయ కళాబృందము వారందరూ లాంకో హిల్స్ లో రంజినిగారింట కలిసినారు.  రంజనిగారు అందరికీ  మిఠాయి పొట్లము భారతవర్ష ఆంగ్ల కవితా పుస్తకములు పంచి విషయమును వివరించగా, తమ శ్రీకృష్ణ పాత్రధారి ఉన్నత కీర్తిని పొందెనని తెలిసి హర్షమును తెలియజేసిరి. కేశవుడు రెండు కవితలను చదివి వినిపించెను. భానోజీరావుగారు రంజని ఇచ్చిన జీతాల చెక్కులను పంచిపెట్టిరి.

                                                                     ***

విశాఖపట్నము:  భారత మెడికల్ కౌన్సిల్  విశాఖపట్నం చాఫ్టర్ కొత్త కార్య నిర్వాహక వర్గం ఎన్నికయ్యెను. ఈ కార్య నిర్వాహక వర్గం రెండు సంవత్సరాలు  పాటు కొనసాగును. 1600 సభ్యులు గల విశాఖపట్నం చాఫ్టర్ లో కొత్త ప్రెసిడెంట్ గా డాక్టర్ రాధాకృష్ణ కార్డియాలజిస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ మాధవి , సెక్రెటరీ గా డాక్టర్  చేనులు ఎంపికైనారు. 

 పూర్తిగా నిండిన కాన్ఫెరెన్స్ హాల్ లో అందరూ డాక్టర్లే కాగా డాక్టర్ కానీ డొక్కరే - దామిని,  సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ రాధాకృష్ణ   " నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు నేటినుండి మనము ప్రపంచ ఆరోగ్య సంస్థ  డయాబెటీస్  మరియు కేన్సర్  కార్యక్రమములను చేపట్టి అమలు జరపవలెను అని ప్రారంభించి కొలది సేపు మాట్లాడిన పిమ్మట తన సహాయకుడికి సైగ చేయగా అతడు ఒక బుట్టతో పుస్తకములను తెచ్చి డాక్టర్లందరికీ పంచెను. ప్రపంచ ప్రసిద్ధ ప్రకాశకులచే ముద్రించ బడిన ఈ ఆంగ్ల కవితా సంకలనాలు మీకు కానుకగా ఇచ్చు చున్నాను. ఈ రచయిత  మా అబ్బాయి భారతవర్ష అని సగర్వంగా తెలియజేసెను. రమణకి తాను రావణుడివలేకాక  రమణ వలే  కనిపించెను ,  కార్డియాలజిస్ట్ లో హృదయాలజిస్టు  కానరాలేదు

తిరిగి వెనుకకు బోవుచుండగా దారిలో హృదయాలజిస్ట్ డామినితో "  భారత వర్ష  ఉద్యోగమును తిరస్కరించి  డబ్బును విరాళముగా ఇచ్చివేయుట ఎంత మంచియ్యెనుకదా  అనగా దామిని  "  అవి శ్వీకరించినచో  అతడి వ్యక్తిత్వము  చిన్న బోయెడిది కదా " అనెను  

                                                                       *** 

బెంగళూరు: హోసూర్ మార్గమందు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్ ఒకటి లో గల రాఘవ ఎలెక్ట్రానిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ స్థాపకుడు రాఘవ అబ్బురంగా తన చేతిలో నున్న రివర్సైడ్ సాంగ్స్ , డెడ్ ట్రీ పొయెమ్స్  పుస్తకములను మార్చి  మార్చి చూచు చుండెను. పని ముగిసిన పిదప బయలుదేరుటకు ముందు చెప్పి పోవలెనని వచ్చిన ఇద్దరు డైరక్టర్లను తే నీరు త్రాగి పొండని కూర్చొన మనెను. “ నమగే  ప్రతిదినవూ తుంబ సమస్య గళివే !  ఎ ష్టు బారి కేళ బేకు? (ఎన్ని సార్లు వినవలెను)  టీ   త్రాగిన పాపానికి  నిన్ననే విన్న సమస్యలు మరల వినవలెనన్న..” శేషు అనుచుండగా సంస్థ స్థాపకుని అట్లు అగౌరవపర్చుట తో యమున “నీవు బైసరిద్దరే హోగ బహదు.” అనగా అతడు కూర్చొనెను, పిదప యమున కూడా కూర్చొనెను. టీ తాగిన పిదప

రాఘవ "నాతో చదువుకున్న చిన్న నాటి స్నేహితుడు నేడు ప్రపంచ వ్యాప్తమగుచున్నాడు"
“విలక్షణ వాగిర బేకు (అదృష్టమన్న అట్లుండవలెను)  నాను కూడా సాగష్టు బరిదిద్దేనే (నేను కూడా చాలా వ్రాసితిని ) అని  శేషు అనగా పక్క నున్న యమున ఆగక నవ్వుచూనే ఉండెను. ఛీఛీ ఈరోజు అస్సలు బాగుండలేదు అని లేచి యమునా వైపు గుడ్లురిమి చూచుచూ వెడలిపోయెను. 

మన రంగమందు స్వశక్తి, శాస్త్రపరిజ్ఞానమును నమ్ము వాడు కావలెను కానీ ఎక్కడ దొరికినాడు నీకీ నస హింస ! 
ఎక్కడ దొరికినాడు కాదు ఇప్పుడు వీడి నెట్లు వదిలించుకొన వలెనన్నది ముఖ్యము. సంవత్సరము క్రితము నేనుప్రారంభించునప్పుడు నావద్ద ఏమియునూ లేదు.
ఏమియునూ లేదనుట ఎందుకు బుర్రఉన్నది కదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్  బెంగుళూరు వారు మెచ్చిన బుర్ర  నేడు ఈ సంస్థలో నేనుండుటకు కారణము నీ కొత్త పరికరములు ఈ సంస్థలకు రెక్కలిచ్చుని ఆశతో మాత్రమే .
బుర్ర మాత్రమే ఉండినా చాలునా ? నావద్ద పైసా పెట్టుబడి లేకుండెను. 
ఇదేమి చోద్యము మీది కలిగిన కుటుంబమే కదా , అమెరికా కూడా పంపినారు .
అవును అచ్చట  అంట్లు కూడా తోమినాను, రెండు సార్లు అమెరికా పోయి మోసపోయి వచ్చిన వెధవనెప్పుడైనా చూచితివా? అది నేనే. 2015 లో ఫార్మింగ్టన్  నకిలీ విశ్వవిద్యాలయము గూర్చి వార్తలు వచ్చినవి కదా ?  
అవును విసామోసముల కుట్రను చేదించుటకు రహస్య కార్యాచరణ పథకమును రచించి  ఫార్మింగ్టన్ ను  స్థాపించినది హోంలాడ్ సెక్యూరిటీ అనగా అమెరికా ప్రభుత్వమే. 
ఆ వలలో చిక్కిన 161 మంది భారతీయ విద్యార్థులలో నేనొకడ్ని.  మా తాత ముత్తాతలు జమిందారులు.  దాన ధర్మములు జేసి వారు సింగములవలె జీవించిననూ నా తండ్రి స్త్రీ , చిత్ర వ్యామోహము నందు బడి ఆస్తి సర్వనాశనము  జేసి అప్పులు జెసి నన్ను అమెరికా పంపెను. ఇంట్లో ఈగలమోత  పైన పల్లకీల మోత. 
మీ నాన్న గారి చిత్ర నిర్మాత అని వినియుంటిని. ఎప్పుడడిగిననూ అతడి పేరు ఎందుకు దాటవేయుచున్నావు , నేడెట్లయిననూ చెప్పవలెను !!
నీవెవ్వరితోనూ చెప్ప వలదనుచూ పేరు చెప్పగా యమున ఖంగు తినెను "కానీ అతడు గొప్ప ధనికుడు అని చిత్ర పరిశ్రమ చెప్పుకొనుచున్నదే!
హహ్హ హ్హ హ్హ చిత్రపరిశ్రమలో పెద్దలు మరణించిన పిదపే వారి కథలు బైటకు వచ్చును.మా నాన్నకు లేని షోకులు  చూపుట  వెన్నతో పెట్టిన విద్య నన్ను కూడా ఆమార్గముననే నడిపించెను. నేను కళ్ళు తెరచి నాకాళ్ళ మీద నిలబడ వలెనని చూడగా   పైసా పెట్టుబడి లేకుండెను. ప్రధానమంత్రి కొత్తసంస్థలకిచ్చు ఋణము ఎట్లు తెచ్చుకొనవలెనో తెలియని నాకు  శేషు మార్గ దర్శనకు చేసి పుణ్యము కట్టుకొనెను. 
మరి నీ మిత్రుడు ఎవరో ఆర్ధిక  సహాయము చేసెనని అప్పట్లో  చెప్పినావు కదా.
అవును ప్రభుత్వమూ ఋణము ఇచ్చిననూ మనము పెట్టుబడి పెట్టవలెను కదా ప్రారంభ పెట్టుబడి ఇచ్చి దైవము వలే ఆదు కొన్న మిత్రుడు ఇదిగో అని చిత్రమును చూపెను. కానీ నేటి వరకు నాతొ ఆడుకొనుచున్నాడు.  వాడి బుర్రఎలక్ట్రానిక్స్ నందు పాదరసము వలే పని చేయును. 

అతడు ఇచ్చటికి వచ్చి నాతొ చేదోడు వాదోడుగా ఉండవచ్చుకదా ?

అట్లుండవలెనన్న వాడి తండ్రి వాడిని వదలవలెను కదా, అచ్చట వాడొక జాలమందు చిక్కెను లే అది యొక్క పెద్దకథ. “చూచినచో పెద్దలే పిల్లలను పాడు చేయుచున్నారని సందేహముగా యున్నది. సరే నేను ఇంకనూ 16 కిలోమీటర్ల దూరమునున్న వైట్ఫీల్డస్ కు   పోవలెను అని యమున బయలు దేరెను.

                                                               ***

బెంగుళూరు వైట్ఫీల్డస్ : ఓక్ వుడ్ రెసిడెన్సీ - యమున పిల్లిలా అడుగులేసుకుంటూ మెల్లగా వంటగదిలో వంట చేయుచున్న స్త్రీ కళ్ళు మూసెను " ఏయ్ వదులు, వేపుడు మాడిపోవును  " నేను వదలను మీకొరకేమి తెచ్చితినో  చెప్పినచో వదిలెదను. ” "అటులనా అంటూ ఆమె అట్ల కాడ యమున చేతిమీద పెట్ట గనే "అమ్మా!  ఇట్లు రోజూ వాత లు పెట్టినచో   నన్నెవరు   పెండ్లి చేసుకొందురు? “ఎవడో ఒకడు చేసుకొనును ఎవ్వరూ చేసు కొననిచో నాకొడుకు చేసుకొనును.” “మరి మీ అబ్బాయి మంచి వాడేనా ?” “చాలా మంచివాడు”

 అయినా నీవు మీ సంస్థ అధిపతిని ప్రేమించుచున్నావు కదా? “అవును అతడి తెలివి చురుకు గలవాడు”  అవి  ఉన్నచో  ఏమి లాభము మనసు ఉండవలెను కదా ?
మనసుకూడా యున్నది, నేనొకసారి అతడిని ఇంటికి తీసుకు వచ్చెదను. 
సరే ఇంతకీ ఇప్పుడేమి తెచ్చితివి?
చెప్పు కొనవలెను?  అని పక్కనే బల్ల మీద ఉన్న పుస్తకాలు చూచి “ అరె ఇవెట్లు వచ్చినవి?” 
 “అనగా నీవు తెచ్చినవి కూడా ఈ పుస్తక ములేనా ?” 
అవును, మా సంస్థ అధినేత వీటిని నాకిచ్చెను. అతడు ఈ రచయిత చిన్ననాటి స్నేహితులట 
నాకెంత గర్వముగా ఉన్నదో తెలుసా! మరొక ప్రక్క మీరు ఒక పెద్ద మ్యూజిక్ బ్యాండ్ లో సంగీతకారిణి  !  “  నా సంగత ట్లుండనిమ్ము  , అతడంత  పెద్ద రచయితా ?”
యమున “ఏమి మాట్లాడుచున్నారు  ! టీ వీలో చూచినారా? ఇందాకనే  నేను మాఇంటిలో టీ వీ లో చూచితిని . ఢిల్లీ లో కేంద్రమంత్రి, ఎం పీ గారి చేతుల మీద ఈ పుస్తకాలు విడుదలయినవి!” యమున అట్లనగా మీనాక్షి  “ఓ అట్లయినచో ఈ సారి మన ఇంటికి పిలిచెదము? “మనము పిలిచినా అతడెందుకు వచ్చును?”  “సరే పిలిచి చూచెదముఈ పద్యములు నీవు చదివి వినిపించుము నేను సంగీతము సమకూర్చెదను. అట్లు వారిరువురూ ఆంగ్ల కవితలను పాడుకొనుచుండగా ఇరుగు పొరుగు అంతా చేరి ఆ సంగీత గాన ప్రభావమున మైమరచి ఆనందించిరి.   

                                                                  ***

హైద్రాబాద్ బంజారా హిల్స్ : “అమ్మగారు పని అయిపోయినది నేను వెళ్లుచున్నాను.” 
రెండు రోజులు నీవు రానవసరం లేదు ముంబాయి లో షూటింగ్ కలదు.
అలాగేనమ్మా  బాబు గారు   మీకిమ్మని ఈ పుస్తకాలని ఇచ్చారు. 
ఏ బాబుగారే , కశ్యప్ బాబా , అగస్త్య బాబా ?
మొన్న మీతో గొడవాడి  వెళ్లి పోయిన బాబుగారు .  ఓ ఆ బాబా ఆతను అగస్త్య బాబు, పేర్లు గుర్తుంచుకోవే అని తాగిన మత్తు స్వరమున అని ఆ పుస్తకములను చేతిలోకి తీసుకొని చూచుచూ. “ఏవన్నా అడిగాడా? “ ఇంకా కశ్యప్ బాబుగారు రాత్రి పూట  ఉంటున్నారా ?” అని అడిగారండి   ఇంతలో  కశ్యప్ వచ్చి "ఎంతసేపు  డార్లింగ్  ఈ నస  “యు గో డామ్  సర్వెంట్ మెయిడ్”  “అమ్మగారూ అయ్యగారు బాగా తూలుతున్నారు అమ్మా” "నోర్మూసుకుని నువ్వు వెళ్లవే, ఇదిగో ఈ పుస్తకాలు తీసుకునిపో మీ పిల్లలుచదువుకుంటారు."  అలాగే నమ్మా.


     


1 comment:

  1. ఈ ఎపిసోడ్ నందు భారత వర్ష పుస్తకం అందరి చేతులలో ఉండుటయే కాక వారి వారి స్పందనలు కూడా చక్కగా చిత్రం చూసినంతగా అభివర్ణించారు
    చాలా చాలా బాగుంది

    ReplyDelete