సబ్బవరం : మాతా నిలయం లోనికి ప్రవేశించిన స్వేత వాహనము నుండి పిల్లి గెడ్డము ఫ్రెంచ్ మీసముతో నున్న తెల్లని పొడవైన వ్యక్తి దిగెను. తరువాత వలతి మరిక కుర్రవాడు కూడా దిగి ఆ పిల్లి గెడ్డము వ్యక్తి వెనుక నిలిచిరి. శేషాచలం గారు మరియు పనివారు రాజన్న మారెమ్మ వారికి నమస్కరించిరి.
హలో ఐ యాం ప్రొఫెసర్ శివరామ్ హెడ్ అఫ్ ద డిపార్ట్మెంట్ పేరాసైకాలజీ , యితడు నా ఎం ఫిల్ విద్యార్థి గొడగూచి అని శివరామ్ గారు అనగానే నమస్కారం ప్రొఫెసరుగారు రండి అని రండి బాబూ అని శేషాచలం గొడగూచిని కూడా సాదరంగా ఆహ్వానిం. పనివాడు రాజన్న మారెమ్మ వారివెనక నడుచుచుండిరి "గురువుగారిపేరు శివుడు, శిష్యుడు పేరు గొడగూచి అనగా పరమ శివభక్తుడు, మారెమ్మా చూచితివా పేర్లు ఎంత బాగా నప్పినవో”
శేషాచలం గారు ఆ గురు శిష్యులని తన విశాలమైన గదిలోకి తీసుకు వెళ్లి సోఫాలపై సుఖాసీనులు గావింపజేసినారు. “భవనమద్భుతముగా నున్నది , చిత్ర ఛాయాగ్రహణమునక నుకూలముగానున్నది అని గురువుగారు హహ్హహ్హ అని నవ్వగా వెంటనే గొడగూచి కూడా నవ్వేను. పనివారు తెచ్చ్చిన కాఫీ అందజేసి పక్కననున్న వలతితో " నువ్వు కూడా కాఫీ తీసుకో అమ్మా " అని శేషాచలం గారు అనగా మర్యాదలు ఎందుకండీ అని వలతి అని కాఫీ తీసుకొనక పోవుటతో పనివాడు రాజన్న "తీసుకోండి అమ్మాయిగోరు" అని బ్రతిమాలసాగెను " రాజన్నా వెటకారాలాపి పని జూడుమ” ని పనివానిని పంపివేసి
అమ్మాయి ఇంకనూ గదిలోనే ఉన్నదా ?
అవును ప్రొఫెసరుగారు అన్నము తిని వారము రోజులైనది తన గదిలో తలుపు మూసుకుని కూర్చున్నది. నాకూతురికి ఏమైనది?
ప్రొఫెసరు గారు : ఎప్పుడో తలుపు బద్దలుగొట్టి చూడవలసింది. డాక్టర్ కి చూపించవలసింది
శేషాచలం: మీరు కూడా డాక్టర్ అని వలతి చెప్పియున్నదండీ
గొడగూచి : అయ్యా మీ తెలివి అమోఘము
శేషాచలం: ఆ పాటి తెలివి లేనిచో ఈ ప్రజలను ఎట్లు సంభాళించగలము!
వలతి : ప్రొఫెసరుగారు డాక్టరే కానీ వైద్యులు కాదు ఆయన ప్రొఫెసరుగారు వలతి కి సైగచేసి ఆగమని " వారము రోజులనుండి అట్లే వదిలివేసినారా ? నేను వచ్చినది ఒక కేస్ స్టడీ కొరకు వైద్యము చేయుటకు కాదు " అని శివరాం గారు చెప్పినారు.
శేషాచలం: డాక్టర్ సుబ్బారావు గారికి చూబించినాను, వారే ఇచ్చటకు వచ్చి చూసిరి.
గొడగూచి : వారు వైద్యమేమైనా చేయుదురా లేక వారునూ మా ప్రొఫెసర్ గారివలె
శేషాచలం: అబ్బెబ్బే ఆయన చాలా పెద్ద ప్రభుత్వ వైద్యులు
వలతి : ఎనుబది ఏండ్ల విశ్రాంత వైద్యులు (సన్నాయి నొక్కు నొక్కుచూ)
ప్రొఫెసరు గారు : అమ్మాయి ఆరోగ్యము సంగతి ఏమగునో ! ముందు అది చూడవలెను కదా, తదుపరి ఆమెను నేను స్వయంగా పరీక్షించి విషయములు తెలుసుకొని మీకెరిగించెదను. వలతి నాకు మీ అమ్మాయి అభ్యాసము గూర్చి అప్పుడప్పుడూ చెప్పుచుండగా విని ఆసక్తిని పెంచుకొని స్వయంగా పరిశోధించుటకు రంగమున దిగినాను.
గొడగూచి : 1967 లో మా ఆంధ్రా యూనివర్సిటీ లో పేరా సైకాలజీ విభాగము యు జి సి అనుమతితో మా ప్రొఫెసరుగారు ప్రారంభించారు. భారతదేశమున కేవలమూ మా యూనివర్సిటీ నందుమాత్రమే ఈ విద్య నందు శిక్షణ నిచ్చుచున్నారు. దేశమందే అంతటి శక్తి యుక్తులున్న ఏకైక పరిశోధనాచార్యులు మా ప్రొఫెసరుగారు.
శేషాచలం: పరిశోధన అనగా అది ఎటువంటి పరిశోధన , మాతా నిలయ ప్రతిష్ట సన్నగిల్లి మాకు మొదటికే మోసము రాదు కదా ! నేను స్థానిక వైద్యులని తీసుకు వచ్చుటకు నేనందుకే వెనుకాడెదను. అమ్మాయి ఆరోగ్యము గూర్చి దిగులు చెందవలసిన పనిలేదు ఇంతకూ ముందు ఇట్లు జరిగిన సందర్భములు కలవు .
రాజన్న : గతనెలలో మా మాత ( విదిష) అయ్యగారి బాధ భరించలేక ఎదురుగా నున్న కొండెక్కి నాలుగు రోజులు అచ్చటనే ఉంది పోవుటతో , మా అయ్యగారు దిగులు పడిపోయినారు. కానీ ఆ యమ్మ తిరిగి వచ్చేసారండి.
శేషాచలం: రాజన్నా , నీవు లోపలి పో! రాజన్న లోపలి వెడలిపోయెను.
కొలది సేపు తరువాత ప్రొఫెసర్ గారు శిష్యుడు, శిష్యురాలు గది వద్దకు వచ్చి చెవులు రిక్కించి వినగా గొడగూచి, వలతి ఏమియూ వినపడలేదని పెదవి విరిచిరి. ప్రొఫెసర్ గారు “ విదిష గదిలో ధ్యాన ముద్రలో మునిగి యున్నది.” వేచి యుండక తప్పదు . అని చెప్పగా " అయ్యో ఎన్నిరోజులుండునో ముందుగా తెలుసుకొను మార్గము లేదా " అని శేషాచలం అనగా శివరాం గారు అతనిని మందలించి " కొలది నెలలు ఉన్ననూ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
శేషా: చీకటి గదిలో అట్లుండుట సాధ్యమగునా? చీకటి గదిలో యోగ సాధన చేయవలసిన అవసరము ఏమున్నది?
దీనిని మార్మిక దర్పణ సాధన అందురు. చీకటి గదిలో అద్దం ముందు కూర్చుని ఆ అద్దం ఇరు వైపులా కొవ్వొత్తులను వెలిగించి ఆ అద్దం లో మనం తప్ప మన వెనుక గానీ చుట్టూ గానీ ఏమీ కనిపించ కుండు నట్లు ఏర్పాటు చేసి అద్దంలోకి చూచుట సాధన చేసిన గత జన్మ జ్ఞాపకాలు చూసి అను భూతి చెందవచ్చు. పూర్తిగా ఆ జరుగుతున్న సన్నివేశం లో జీవించ గలము.
గొడగూచి: నిజముగా ఇది అద్భుతము
సృష్టిలో అద్భుతమ మేదియూ లేదు. అద్భుతంగా మనం బావించే ప్రతి సన్నివేశం, ఒక అమేయమైన విధి ప్రకారం జరుగుతుంది. అద్భుతాలు ప్రకృతి నియమాలకు అతీతంగా జరుగుతాయి అని ఆధునిక శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇది సరికాదు భౌతిక శాస్త్రజ్ఞులు కనుగొనని ప్రకృతి నియమాలెన్నో ఉన్నాయి. శాస్త్రజ్ఞుని మేధకు అందనంత మాత్రాన ఆ నియమాలు లేవని చెప్పడం సరికాదు. ప్రకృతి మూడు రూపాలతో ప్రకటితమవుతుంది. మొదటిది ఇంద్రియాలతో తెలిసికోబడే స్థూల ప్రకృతి . రెండవది ఇంద్రియా లకు అతీతమైన సూక్ష్మ ప్రకృతి. ఇది అంతర్గతమైనది, అత్యంత శక్తివంతమైనది. మూడవదైన మూల ప్రకృతి (spirit) ఇది శాశ్వతం, స్థిరము అయింది ఇది సృష్టిలోని అన్ని శక్తులకు మూలాధారం . దీనికి మార్పగానీ , వినాశనము కానీ లేదు.
యోగవిద్య లో ప్రావిణ్యత పొందిన సిద్దపురుషులు తమ శక్తి తో చైతన్యాన్ని స్థూల శరీరా న్నుండి ఉపసంహరించుకొని సమాధి స్థితిని చేరగలరు. ఈ మాధ్యమి ప్రయోగికులకు మరల వారి శక్తి తో స్థూల దేహంను చైతన్యవంతం గావించగలరు. ఆమె తనంతట తానూ వచ్చు వరకు అలికిడైననూ చేయవలదు " అని హెచ్చరించి అరుదైన సాధకురాలిని చూచిన అనుభవము కలిగించినందుకు శిష్యులను మెచ్చుకొనెను. పిదప వారందరూ ఒకే వాహనంలో బయలుదేరిరి.
తే.తలుపు మూసిచీ కటింట తలపు లన్ని
నిలిపి అద్దము ముంగిట నిలిచె మగువ
మసక దివ్వెలు జంటగ వెలుగు చుండె
కనువె లుగునందు అద్దము చూచు చుండె
తే. మగువ యోగధ్యా నమునందు మునిగి బింబ
మందు నిఖిలజ గతి దాటె మరచి తనను
తాను, అద్దము మింగగ దవము కాంచె
విగత జీవుల ఆత్మల పొడగ నడలె
దవము = అడవి ; పొడగని + అడలె
తే. మగువ యోగిని సర్వము మరిచి బింబ
మందు లీలమగు చుగడిపె మరచి తిండి
వెడలె నద్దము లోకిచూ పడగ కాన
అడుగి డనుకోని వింతలు అచట కాంచె
తే. హంపి శిల్పాలు తాకెను హొయలు కురియు
నర్త కీమణు లవిలాస నాట్య భంగి
మలప రవశించి ముత్యాల విపణు లుకనె
ఘోర రణముల తెగిపడ గాంచె తలలు
తే. బ్రహ్మ జ్ఞానము కలిగియు వదిలి ఇల్లు
చేరె రవ్వల కొండ జేసె తపము వ్రాసె
కాల జ్ఞానము దర్శించి గతము కంది
మల్ల యమఠము గుహయందు మసిలె మగువ
తే. బాంబు లమ్రోత బెర్లిను పట్ట ణమున
మ్రోగు చుండగ జనులంత పరుగు దీయ
భీతి నొందగ పరుగిడి ప్రాణ మొదిలె
చూచి చూచిక ప్రియుని జాడ లేక
ఉలిక్కి పడిలే చిన విదిష తానెక్కడున్నది క్రమ క్రమముగా తెలుసుకొని మెల్లగా ఈ లోకము లోకి వచ్చెను. ఆమె వదనమందు దివ్య తేజము తాండవించుచుండెను. విదిష లేచి తలుపు తీయగా మారెమ్మ చూసి పరుగు పరుగున పోయి యజమానికావార్త నందించెను. అతడు సిద్దము గానున్న పండ్ల రసము తీసుకొని కూతురి గదిలోకి బోయెను. గదిలోకి అడుగు పెట్టగానే విదిష తీక్షణముగా అతడి వైపుకు చూడగా అతడి ఒళ్లంతయూ తీవ్ర వేడిమి పొందుచూ అల్లాడెను. అతడి చేతినందున్న గ్లాసు క్రింద పడి పగిలిపోయెను.
విదిష విదుషీమణి అయ్యిందా????
ReplyDeleteవిదిష గత జన్మ జ్ఞానాన్ని సాధించుట ఆమె భవిష్యత్తుకు పునాది వేయుటకా? గత జన్మలో ఆమె జర్మని వాసి అని అర్థం అవుతుంది.బెర్లిన్ పట్టణంలో యుద్ధ సమయంలో ఆమె మరణించెని అర్ధం అవుతుంది.
ReplyDeleteఎన్నెన్నో జన్మన బంధం నీదే నాదీ అనే పాటను కేవలం కవి కల్పనగా విని ఆనందించ వచ్చు , కొంచెం ముందుకెళ్లి సంగీతాన్ని ఆస్వాదించ వచ్చు , ఇంకా ముందుకెళ్లి ఆధ్యాత్మికకోణం లో ఆలింగనం చేసుకోవచ్చు. ప్రేమ కూడా అంతే, సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినది. ఆ సూక్ష్మ ప్రపంచ లోకి అందరికి ప్రవేశంలేదు యోగ సాధకులకు తప్ప. అందుకే ప్రేమ సామాన్య జనానికి ఒక శరీర అవసరం నుంచి మొదలయ్యి మానసిక బంధం దాకా విస్త రించి అక్కడ అంతం అవుతుంది. యోగులకి జన్మ జన్మల బంధం అని స్పష్టంగా అర్ధం అవుతుంది. జర్మనీ లో కూడా విదిష ప్రియుడు భారతవర్షే. గట్టి బంధాలు ఏవీ ఒక్క జన్మవి కావు అని సనాతని నాకిచ్చిన కొద్దిపాటి జ్ఞానంతో తెలుసుకొని అనుభవించి వ్రాస్తున్నాను. విదిష ఇప్పుడు ఏ పాత్రకంటే కూడా శక్తివంతురాలు. తన ప్రేమ కోసం ఆ శక్తులన్నీ పక్కన పెట్టి భారతవర్ష ని ఆలింగనం చేసుకుని ఉన్నతురాలు అవుతుంది. అందరూ కొలిచేస్తాయి కి చేరుతుంది . అది నా విదిష . కాన్సెప్ట్ బాగుందా ?
ReplyDeleteMoney makes many things - common man's concept
DeleteLove and Hope can make miracles - intellectual's concept
యోగ గురించి బాగా చెప్పారు సార్ యోగ వలన చాలా లాభాలు ఉన్నాయి. ప్రకృతీ గురించి చాలా బాగా రాశారు సార్ ఇంద్రియాలతో తెలిసికోబడే స్థూల ప్రకృతి . రెండవది ఇంద్రియా లకు అతీతమైన సూక్ష్మ ప్రకృతి. ఇది అంతర్గతమైనది, అత్యంత శక్తివంతమైనది. మూడవదైన మూల ప్రకృతి (spirit) ఇది శాశ్వతం, స్థిరము అయింది
ReplyDeleteVery Useful Information Sir Thank You So Much
ReplyDeleteMPPSC Notes,Best MPPSC Coaching in Indore, UPSC Coaching in Indore, MPPSC Coaching in Indore
ReplyDelete