కనుపారు మేర చెట్టు చేమలు చుట్టిన క్షేత్ర గృహము ఆమె రాజ్ఞీవాసము. ఆ జమిందారీ వాసమందామె చెరువుగట్టు పై నులకశయ్యననులివెచ్చని భానుకిరణములందు స్త్నాన మాడు కలువవలె పులకరించుచుండగా, "గోపాల నంద గోపాల" యను ప్రభాత గీత ములామె మనసును జుమ్మను భ్రమర ములవలె చుట్ట ఆమె రసాస్వాదన యందు ములిగి పొయెను. ఇంతలో మనసును కలత పెట్టు కేకలు విన వచ్చినవి. తోటమాలి తిన్నడి పై కేకలు వేయుచూ తోలుకొచ్చుచున్న భూపాలుడు(estate manager) భూకాశి కానవచ్చెను.
"నాయాల్ది ! నీకీయాల తొక్కలెక్కలాగెత్తాను, అమ్మగారి పేరు సెప్పెత్తె అడక్కుంటొ గ్గేతానను కొన్నావేటి! నమ్మిడి కొడక, పెద్దయ్యకి సెప్పి ఉజ్జోగమూడ నాగించేత్తాను, పెబువు పాటలు కాకుంట పిచ్చిపాతలెడితే నాయాల్ది.. మాలిని ఒక్క గెంటు గెంటాడు భూపాలుడు.
యానకలగవుతన్నవు..యానకలగవుతన్నవు.. ఒగ్గేస్ కాలరొట్టుకొంతన్నడు, మాయయ్యే నా కాలరొట్టుకోడు అదిగో అమ్మగారక్కడే కూకొన్నరు ఆడగరా!
అమ్మగోరూ ఎట్టేటు మేనేజరని సూడకుంటా అరే ఒరే అంత న్నాడు ....
నువ్వు భూపాలుడివికావు భూకావలివి ఈరొజునుంచి నీవుజ్జోగము ముగిసినది అదియునూ నీ మంచికే ఇచ్చట పని జేయవలెనన్న గోపాలుని గీతములు వినుటయే కాదు పాడవలసి యుండును అని అచ్చట నుండి కొలనుకేసి సాగె ను. ఆమె ఆజ్ఞ అంతిమము. గజాశ్వ భటాదులు లేని మెర్సిడెస్ రాణి. భూకాశి బిక్క మొగము వేసి కొలను నుంచి కూత వేటు దూరమునున్న విలాస భవంతి వైపు సాగిపొయెను.
తామర కొలను యందు మీనము వలె ఈది కొలను ప్రక్కన గల స్త్నానాలగదియందు ఆకుపచ్చని వస్త్రములు ధరించి నిరాభరణముగాకొలను గట్టున కూర్చొనెను. కొద్దిసేపు గడిచిన పిదప వలతి వచ్చుచూ కనిపించెను. అయ్యో ఈమె సంగతి మరచితినే అనుకొనుచుండగా వలతి సమీపించెను.
వలతి: నిన్న రాత్రంతయూ గోపాలుని తలపులతోనే గడిపితివా?
నందిని: తలపులేమి ఖర్మము కౌగిలిలోనే గడిపితిని.
వలతి: నిన్న రాత్రి నీ గదిలో పడుకొన మంటివి. నీ గదంతయూ గోపాలుని చిత్రపటములు చూచితిని. ఎంతయిష్టమున్ననూ అట్లు గదంతయూ నింపవలెనా ? ఎన్ని పద్యములు , కీర్తనలు వ్రాసినావో, ఎంత సమయము వెచ్చించినావో కదా ! రాత్రాంతాయో నేను చదువుచూ ఆ భక్తి రసమున తడిసి పారవశ్యము నొందినాను. వలతి అట్లు అనుచుండగా నందిని
సీ. వాడిచూ పులవాడు వాడేనా వాడేచూ
డామణి యనికొ నియాడ ప్రజలు
వాడవా డల,మరి వడిగల వాడికే
డగరము గల్గకుం డకని పెట్టి
వేడేది వాడిని వాడబ మల్లెతా
కకుం డా చూడ వేడెద నిన్ను
గోపాల నాపాల బడి కూలి కూలిగ
మారగ మురారీ మార్గ మొసగె
వాడి చూపుల వాడు వాడే, నావాడే, చూడామణి యని, కొనియాడ ప్రజలు వాడవాడల, మరి వడిగల వాడికే డగరము ( కీడు , దృష్టి ) గల్గకుం డకని పెట్టి వేడేది వాడిని వాడబమ ( బడబాగ్ని) ల్లెతాకకుండా చూడ వేడెద నిన్ను గోపాల నాపాల బడి కూలి , కూలిగ మారగ మురారీ మార్గ మొసగె. మురారీ మార్గము అనగా కృష్ణుని పాత్ర ధరించి పేరు కీర్తి సంపాదించు మార్గము.
వా - డ - శబ్దముల కర్రసాము జేసితివి. నీకు కావలసినది వాడే వాడు కదా😊 అని నవ్వుచూ. ఈ శబ్దాలంకార పూరిత సీసపద్యమును ఆశువుగా చెప్పిన నీ ప్రతిభకు వందనము. వర్షుని వద్ద చాలా కాలము తెలుగు ఛందస్సు నేర్చు కొంటిని. ఏమి లాభము ! ఆ భారతి కృప నాపై లేదు. నీ కొక నిజము తెలపవలెను. వర్షునిపై నీదంతయూ ఆకర్షణ అని నీ మనసు మార్చమని నీ తండ్రి నన్నర్థించగా ఒప్పుకొంటిని. నాకు గురుస్థానమునుండి నడిపించగల యోగ్యత గలదానివని తెలియక వప్పుకొంటిని. అనుచూ రెండు చేతులూ జోడించగా నందిని వలదని వలతిని వారించి కారిచ్చి సాగనంపెను.
నందిని చెప్పిన సీస పద్యము లో నందిని కనపడుట లేదు.సీస పద్యం రాయడం కష్టమని చెప్పి ఇంత అలవోకగా సీస పద్యం వ్రాసిన పూలబాల గారు కనపడుతున్నారు.
ReplyDeleteక. వ్రాయున దొకహస్త మటమరి
ReplyDeleteవ్రాయగ పలుకును భారతి వాణే
ప్రియము గమెచ్చి బలమిచ్చు
ప్రియను కలనైన మరువగ తరమే
ధన్యవాదములు
ReplyDeleteఎన్ని పద్యములు , కీర్తనలు వ్రాసినావోనేను చదువుచూ ఆ భక్తి రసమున తడిసి పారవశ్యము నొందినాను. పద్యాలు రాయడం చాలా కష్టం పద్ధ్యలు చదువుతున్నపుడు మనసుకు సంతోషాన్ని కలిగిస్తంది
ReplyDelete