Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, November 4, 2020

Bharatavarsha 62

 మెర్సిడెస్ మధురవాడను సమీపించుచుండెను. పున్నమి వెన్నెల లో జగతంత  యూ  వెండి వెలుగుల జిలుగు లీనుచూ మనసులను  మురిపించు చుండెను.  “వెన్నెల సంద్రమున మనసు  కాగితపు పడవ వలే తేలుచున్నది. కాంతి మన మనసును ఎంతగా ప్రభావితము జేయునో మెర్సిడెస్ సంస్థకి తెలిసినట్టు వేరెవరికీ తెలియదు కదా !” అనుచూ వలతి  దారి నుంచి తన దృష్టిని నందినిపైకి సారించెను. 

నందిని నిరాశా చేతనమై మౌనముగా వాహనమును నడుపు చుండెను ఆమె ముఖమునందు చెప్పలేని వేదన ఆందో ళన  కనిపించుచుండెను.  కొంచము మనో పరివర్తనం కలిగించ బూని వలతి “నందు, నీవిప్పుడు ఆందోళన రాగము పాట పాడిన  అతికినట్టు సరిపోవును.” అనెను.  నందిని పొరలి వచ్చు  దుఃఖము ను అదుపు చేసుకొని  వలతి వైపు చూసి మరల నడుపుట యందు నిమగ్న మయ్యెను. 

“ఆశోచ్యా  నవ్యశోచస్త్యం  ప్రజ్ఞావాదాంశ్చ భాషసే 

గతాసూ నగతా సూంశ్చా నాను శోచంతి   పండితాః”

అని సరదాగా  ఘంటసాలను అనుకరిస్తూ పాడి  అనగా “శోకింప దగిన  విషయముల గురించి శోకించుట , జరిగిపో యిన విషయముల గురించి ఆలోచించుట మంచిదికాదని  ఆ శ్రీ కృష్ణుడు గీతయందు భోదిం చెను. అని స్పందనకొరకు చూడనవసరం లేకుండగానే తత్క్షణమే  నందిని

క్లైభ్యం  మాస్మ గమః  పార్థ నై తత్త్య య్యుప పద్య యే

క్షుద్రం హృదయ దౌర్భల్యం త్య క్త్వో త్తిష్ఠ పరం తపః

సాంఖ్యా యోగమందు  వైరాగ్యమును  బోధించిన భగవానుడు ఎటువంటి పరిస్థితులలోను హృదయ దౌర్బల్యము వలదని పోరాడ వలెనని  బోధించెను అని ప్రత్యుత్తరమిచ్చుటతో  నిర్ఘాంత పోయెను. మరల మరొక సారి ప్రయత్నించెదము అని వలతి ఇట్లనెను 

దుఃఖే ష్వనుద్విగ్నమనా స్సుఖేషు విగతస్పృహః 

వీతరాగభయక్రోధః స్థితధీ ర్మని రుచ్యతే.

దుఃఖానికి కలతపడక, సుఖాలకు పరవశించక భావావేశములకు  లోనుగాక స్థితప్రజ్ఞత కలిగి యుండవలెను  తాత్పర్యమును వివరించెను. ఈ సారి ఏమి చెప్పునో యని ఉత్సుకతతో ఎదురు చూచు చుండగా నందిని క్షణము ఆలస్యము జేయక మెరుపు వేగము తో ఇట్లు స్పందించెను.

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీమ్ ।

 తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః

యుద్ధ రంగంలో వీర మరణం పొంది స్వర్గానికి పోయెదవు లేదా విజయుడవై  రాజ్యమును అనుభవించెదవు అని   కర్తవ్య నిర్వహణ చేయమని అందువలన తలెత్తే   పరిణామాలు అంగీకరించమని చెప్పెను.  దీని అర్ధము  ఆవేశమును చంపుకొని చేతులు ముడుచుకొని కూర్చోమని భగవానుడు చెప్పలేదు

మీనాన్న కోడిపెట్టల వ్యాపారము నుండి నిన్నెరుగుదును,  నీకివన్నీ ఎట్లబ్బెను? అవన్నీ పక్క నుంచుము నీది ఇన్ఫాట్యుయేషన్  అనగా ఆకర్షణ.

నా వయసు ఇరువది రెండు  సంవత్సరములు.  చదువులో మొద్దుని కనుకనే  చివరి సంవత్సరము  డిగ్రీ చేరుసరికి ఈ వయస్సు వచ్చినది.  నా వర్షుని కొరకు తపమాచరించుటకైననూ సిద్దమే యని నందిని  అను చుండగా . 

అయ్యో ఇంకొక్క సంవత్సరము చదువు కొనసాగించినచో నీవు పట్టా పుచ్చుకొందువు కదా !

ఈ చదువు మధ్యలో ఆపి పారిపోవు ట మరల ఇంటికి పోక ఇట్లు క్షేత్ర గృహమునుండుట , ఎందులకు ? ఇంకెంత కాలమిట్లుండెదవు?  

ఈ ప్రశ్న లకు సమాధానము నందిని వద్ద లేదని భావించి మాట వలతి మార్చి"మెర్సిడెస్ అనిన నాకు చాలా ఇష్టము  అంతర్గత కాంతి ( ambient light)  అరువది నాల్గు రంగుల మారునట్లు స్వరనియంత్రణ ( voice control) అమరికను  ఏర్పాటు చేసెను.  నేను మాట్లాడుచున్నప్ప్పుడు వాహన  మందు పన్నీటి పుష్పరాగమునుండెను. 

“వెన్నెలను కాంతిని ఆనందించు చూ హాయిగా నుండుము నా బాధతో నీకేమి నిమిత్తము లేకుండెను. నేడేంత  రక్తపోటు పెరిగెను.  నిజముగా   నీవు నా స్నేహితురాలివేనా ?” అని  దుఃఖము తో అడుగుచున్న నందినితో వలతి " ఇప్పటికి ఈ ప్రశ్న ముమ్మారు అడిగితివి " అని హ హ హా .. అని నవ్వు చు   " నువ్వు  ఏడ్చు చున్నప్పుడు కాంతి ఎర్ర బడెను " అని  వలతి అనుచుండగా  నందిని బంగారు చెక్కిళ్ళ పై బడిన కన్నీరు బొట  బొట  కారు చుండెను.  

ముందు నా ప్రశ్నలకి సమాధానము చెప్పిన పిదప నీవడిగిన ప్రశ్నలకి సమాధానము చెప్పెదను అని వలతి అనగా

నీవడిగిన మూడు ప్రశ్నలకు  సమాధానాలు:  పట్టా పుచ్చుకొనుట వల్ల  నాకొనగూరు ప్రయోజనమేమీలేదు.మానాన్న లెక్కింప కష్టమగు ధనమును సంపాదించెను, నేను ఉద్యగములు చేయ నవసర మేమికలదు?  ఇంక జ్ఞానమందువా సంగీత సాహిత్యములను నేర్చుకొనుచూ  గీతాపఠనమును నృత్యమును అభ్యసించుచున్నాను. నీవు ఇంటికి పోయి నీవు ఈ సమయమున ఏమి జేయుదువు? నిద్రింతువు. కానీ నేను ఇప్పుడు నృత్యము నభ్యసింతును. ఇవన్నియూ నా ప్రేమ కొరకు వర్షుని కొరకు  చేయుచున్నాను. 

వలతి " నిజముగా ప్రేమకొరకు ఇట్లు  అహర్నిశలు  శ్రమించు వారుందురా ?"   

నందిని " గమనించినచో యుందురు నాకు తెలిసిన రచయిత  ఇట్లే పని చేయుచుండెను"

వలతి "  ఇవన్నియూ నేను నమ్మ జాలను , అయిననూ నీ శ్రమను  మెచ్చక తప్పదు"

సబ్బవరమున మీ స్వగృహమున కు పోక ఇచ్చట ఉండెదవేమమ్మా?

నందిని: నీ చివరి ప్రశ్న అదేకదా , అందుకు ఒక్కటే కారణము మా నాన్న అతడు మతము పుచ్చుకొనుట ఏ కాక అందరిని మతము మారమని  పోరుచున్నాడు. మా అమ్మ నేటికీ నొక్క రోజు కూడా చర్చికి పోలేదు. ఇంటిలో హిందూ  దేవీ దేవతల పఠము ఒక్క  టి యునూ లేదు . మా అమ్మ గోపాలుడి  పఠము ను తన గదిలో నుంచుకొన్నది. అతడి భాష విన్నచో  ఆత్మ పాతాళమునందు పడి అఘోరించును. వలతి కళ్ళ యందు నీళ్లు తిరుగు చుండెను. 

నేను నందినికి వకాల్తా పుచ్చుకొని పక్షపాత ధోరణితో మాట్లాడియుంటిని నన్ను క్షమింపుము. నీ ప్రేమ సత్యము. నీ కింకొక సత్యమును చెప్పెదను వినుము అనుచూ వలతి “ఇప్పుడు సమయము అర్ధరాత్రి కావచ్చుచున్నది కదా. నేను ఇంటికి పోక నీవెంట ఎందుకు వచ్చుచున్నాను? నాటిక చివరి భాగము చూడక నీవు ఎందుకు వచ్చుచున్నావో  తెలుసా ? నేను నాటిక చూడక నీతో వచ్చుటకు కారణము నీ మెదడుకు పొమ్మని విదిష  సంకేతము నిచ్చినది.   ఆ సంకేతము ను టెలీపతి అందురు.” నందిని అవాక్కయ్యెను. 


1 comment:

  1. స్నేహితుల మధ్య సంభాషణను వారి మనస్సులో భావాలను భగవద్గీతలోని శ్లోకాలు ద్వారా అర్ధాలతో సహా చక్కగా వివరించారు.

    ReplyDelete