Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, November 2, 2020

Bharatavarsha 61

 పిసికాలజిస్ట్ హృదయాలజిస్ట్ కలిసి ఆసుపత్రికి వెళ్లినపిదప దామిని మీనాక్షి సన్నిహితముగా మాట్లాడుకొనిరి. దామిని అడుగగా  మీనాక్షి తన జీవితమును  ఆమెకు  వివరించెను. వారి స్నేహము మీనా, దామి యని పిలుచుకొని వరకు పోయినది. 

Cardiologist and Psychologist - Imaginary Picture

దామి: హృదయాలజిస్ట్ వెళ్ళాక ఇల్లు చల్లగా యున్నది, బడి పిల్లవాడు  బడికెళ్ళిపోయినట్లున్నది.  మరల తిరిగి వచ్చువరకు మనకు విరామము. 

మీనా : మీ పిల్లలు ఎచ్చట?  మీకు పిల్లలెంతమంది? 

దామి: వివాహము అయినది కానీ  పిల్లలు ...   

మీనా :  మీనాక్షి అట్లెందుకు జరిగెను , వైద్య చికిత్స కి ప్రత్నించవలె కదా ?

దామి : అది ఎప్పుడో జరిగెను , మాయిరువరిలో లోపమేమియూ లేదని తేలెను 

మీనా : పోనీ, దైవజ్ఞులను సంప్రదించిన మేలు కలుగునేమో ! 

దామి : మా అత్తగారికి నమ్మకములెక్కువ ఆమె గుళ్ళు గోపురములు చుట్టి రావలెనని , బాబాలను దర్శించమని పోరుచుండెడిది. అత్తమామలు ఇరువురూ ఈ మధ్యనే కాలము జేసిరి. 

మీనా : ఆయ్యో !

దామి  : వారున్నతవరకూ నాబ్రతుకు కూడా, "అయ్యో!"  అనుండెడిది

వారున్నంతకాలము నా భర్త తల్లి చేతులో కీలు బొమ్మవలె నుండెడివాడు. 

మీనా : మానవప్రత్నమే లేనప్పుడు ,మీరు గట్టి ప్రయత్నము చేయనిచో,  దైవమును  వైద్యులను అన  పనిలేదు.

దామి : అయ్యో! నన్ను  సిగ్గు చుట్టచున్నది అనుచు దామిని డాక్టర్ రూంలోకి వెళ్ళిను.

మీనా : అయ్యో!!! అందుకే నీవిట్లున్నది  అనుచూ  మీనాక్షి ఆమెను అనుసరించెను.

దామిని  డాక్టర్ బల్ల పైనున్న ఒక వస్తువును తీసి తన కొంగు మాటున దాచేను  

మీనాక్షి : ఏమి దాచుచున్నావు ?

దామిని :  ఉహు... చూపించిన బాగుండదు అని చేతిని కొంగుచాటున దాచెను.

మీనాక్షి : అట్లయిన  నేనే చూచెదను అని కొంగు చాటుకున్న చేతిని లాగి చూసేను.

దీపావళి పిస్తోలు!!!! అయ్యో!!!  మద్యానం ఇదే హృదయాలజిస్ట్ చేతిలో చూచితిని

దామిని :  అందుకే నేను చూపనన్నది. అనుచున్న  ఆమె మొఖ మెఱ్ఱబారెను.

మీనాక్షి : ఏమో అనుకొంటిని, నీవు  ఉడుకుమోతువే సుమా!!

ఇంతలో రవణ గదిలోకొచ్చి బల్ల తుడుచుచూ బల్ల సొరుగు బైటకు లాగి అందునుండి దీపావళి తుపాకుల్లో వాడెడి శబ్దము చేసేడు మందుగుండు సామాను ( కేప్స్ ) తీసి చూపుచూ

రవణ: అమ్మగారూ మీరింకనూ ఇవి చూచినట్టులేరనెను. ఈయనను డాక్టరని ఎవరూ ఊహించలేరు. ఇది వీరి సొంత భవనము.  ఇది గాక మా డాక్టర్ గారి సొంత ఆసుపత్రి గలదు.  అని తన యజమాని గొప్ప చాటి అతడు వెళ్లిపోయెను. 

దామిని ఇంకనూ మొఖం దాచుకొనెను, మీనాక్షి మౌనముగా తన గదికి వెడలెను . అట్లు గంభీరముగా వెడలిన మీనాక్షిని చూసి దామిని కలవర పడుచూ అట్లే నిలిచెను. మీనాక్షి గదినుండి హాయి  గొలుపు  సంగీతము వెలువడి హృదయమును తాకుచు ఇట్లున్నది   

. వెన్నెల  గిన్నిలో పోసి వెన్నలా ముఖము  

   ద్ది   ధవళ   వలపు   ట్టగ   పన్నీరు

     చిలికిన   ట్టుగౌర  వమున  శాలు  గప్పి

      మెడకు  చలువ  గంధ  లది   నట్టు

మనసును మెత్తబరుచు సంగీతము దామిని ని పిచ్చుకను  దారము గట్టి లాగినట్టు లాగెను. ఆమె పరుగు పరుగున మీనాక్షి గదిలోకిబోయి ఆమెను చూచుచూ స్థాణువు వలే నిలిచిపోయెను. ఆ సంగీత రాణి ఇంకనూ వాయించుచుండెను.


  తే . మాల వలెయామె కంఠ మందు వాలుచు  

     రవ  శించ బంధ మందార మగుచుండె 

     పిల్ల  గ్రోవి  విన్నగో   పికవోలె  సంగీత 

     తుకు  వేయ జతగట్టె   సిడి మసులు


అట్లు పరవశించ వారి స్నేహ బంధము మందారమగుచుండెను, అనగా బిగుయు చుండెను.  సంగీత  తుకు వేయ జతగట్టె   సిడి మసులు అనగా సంగీతము టంకము వలె వారి బంగారు మనసులకు అతుకువేయుచున్నది. దామిని అట్లే చిత్తరువు వలే నిలిచి ఆమె వాదనమునాటంక పరచక ఆ ఝరిలో స్నానమాడుచుండెను.   మీనాక్షి వాదన ముగించిన పిదప  దామిని ఆమె మెడనల్లుకొని  "నన్ను మాల అనుకొనుము"  అనుచూ ఆమెను అభినందించెను  

మీనా :ఈ మాలని గొనిపోయి నీ విభుని గళ మునలంకరింపుము.

దామి: అమ్మో  అట్లు జేసిన అతడు  దండతో  ఆసుపత్రికి పోయిన పోవచ్చు.

మీనా: నిజమే, అతడు ఆశు పత్రికి నీవు వసతి గృహమునకు ఇట్లయిన ఎవరి పని వారు చూచుకొన్నచో పిల్లలెట్లు కలిగెదరు. నీకు వసతి గృహము నడుపు అవసరమేమి  వచ్చెను ?

దామి: సేవచేయుటందు తృప్తిని బడయుటకు మనసును మళ్లించుటకు  ఏధై ననూ చేయుటవశ్యము కదా! మొదట కొంత కాలము ఆసీలు మెట్ట వద్ద ఏ ఎస్ రాజా రక్తనిధి (బ్లడ్ బ్యాంకు ) నందు పని చేసితిని. అరుణతార యని నా స్నేహితురాలు పెడత్రోవపట్టిన యువతులను ఆదరించుటకు వసతి గృహము నడుపుచూ వారిని సన్మార్గములో పెట్టుట మంచిది అని ప్రోత్సహించగా నేను తన బిడ్డను నా బిడ్డగా భావించుకొని స్త్రీల వసతి గృహము ప్రారంభించితిని  కానీ సంపాదించుటకు కాదు. 

మీనా: అప్పుడే అనుకొంటిని వర్షుడు   మంచి వారితోనే జతగూడును కదా! నీవు ధనము కొరకు వసతి గృహము నడుపుటలేదని నాకు వర్షుడు చెప్పినాడు నీవంటి ఉత్తమురాలిని నొక మారు కలవ దగునని చెప్పగా విని  నేను వచ్చితిని. మీరు కలిగినవారిని పెడత్రోవపట్టిన యువతులను ఆదరించుటకు వసతి గృహము నడుపుచూ వారిని సన్మార్గములో పెట్టుటకు ప్రయత్నించుచున్నారని చెప్పెను.  నేను విన్నది అక్షర సత్యము. 

తే. తనకు మాలిన బేరము దగదె  భామ 

   ఇంట గెలిచిన తగ్గు  ఈండ్రము బోయి 

   అపుడు చేసి  కొలువు అన్యుల నలరింప 

   దగును రచ్చ ముందుత గదుతగ్గు తగ్గు 

అది విని నంతనే దామిని ముఖమును విచారమావరించెను. నాకు   వివాహమయ్యి  పన్నెడు సంవత్సరములు గడిచెను. ఇంట కాలము లేనిది   ఇప్పుడు  పిల్లలెట్లు కల్గుదురు.  ఖేదమునకు దారితీయు యత్నములకు స్వస్తి పల్కి సన్మార్గమున నడుచుట మంచిదని అరుణతార యని నా స్నేహితురాలు ప్రోత్సహించగా నేను తన బిడ్డను నా బిడ్డగా భావించుకొని స్త్రీల వసతి గృహము ప్రారంభించితిని  కానీ సంపాదించుటకు కాదు. 

చూడగనే ఎట్టివారికైననూ   నీవు డబ్బుకొరకు వ్యాపారము నెరుపు   దానవు     గావని అర్ధమగును. నగర నడిబొడ్డున  కోట్లు విలువజేయు విల్లా అట్లే సొంత ఆసుపత్రి కలిగి న నీకా అవసరమెచ్చట కలదు.   

మీనాక్షి కి తనువెల్ల పులకరించుచుండెను. రామచంద్రన్  ,ఆడవన్ ,  విక్రముడు వంటి నీతిమాలిన వేయి సర్పముల విషమును హరించు శక్తి స్వరూపిణి వలే దామిని కనిపించగా ఆదమరచి మీనాక్షి  శిలా ప్రతిమ అయ్యెను. 


  త. ముదము  కల్గును  జంటనే గనపొం     గనుల్ల    ముసాగ   దా    

     దము    పాటగ    అంతరం   గఆభీ    ల మెల్ల        కుదర్చ    గా

      కుదిరె      నాస్వర  ములోని   వినఖం   జరీ స్వ    నమే వి   ధా

     దప      మాచరిం   పంగని   చ్చెసుధా  రసంబు    సరాగ    మే              

ముదము  కల్గును  జంటనే గన  పొం గనుల్లము   సాగదా  పదము పాటగ, అంతరంగ,  ఆభీల మెల్ల (భాదంతా)   కుదర్చ గా, కుదిరె  నాస్వర  ములోని , ఖంజరీ  (వాద్యము)  స్వనమే(శబ్దము) విధాత, దప (తప) మాచరింపంగ, నిచ్చె సుధారసంబు (మధురమే కదా) సరాగ మే (స్నేహము) 

ఇంత చక్కటి జంటతో తియ్యటి స్నేహ బంధము అదృష్టమున్న కాని దొరకదు కదా అనుకొనుచుండగా  తలుపువద్దలికిడి వినవచ్చి చూచినంతలో మంజూష “దామినీ దామినీ” అనుచూ లోపలి వచ్చుచున్న మంజూషను చూసి మీనాక్షికి మతి భ్రమించెను. 

" ఏమే, మీనాక్షి ఎట్లున్నదో చూచిరమ్మని మీ అమ్మ పంపెనా లేక  మీ అన్న పంపెనా ?"

అని కసిరెను . “మీనాక్షి నువేమీ అనుకోవలదు ఇది వర్ష చెల్లి దీన్ని పదవ తరగతి వరకు బెత్తము పుచ్చుకొని వడ్డించేడి దానను. వీళ్ళమ్మ మాలిని నా చెలిమి. ఆమె దామిని అని పిలుచుచుండెడిది , ఇది కూడా దామిని అని  పేరు పెట్టి పిలుచుచూ  తన్నులు తినెడిది. తరువాత నేనే అడిగి మరీ పిలిపించు కొనుటతో  ఇదిగో ఇట్లయినది ఎవ్వరున్నానూ  దామినీ అని పిలుచును.”

 మీనాక్షి: మొదట కంగారు పడిననూ మీ అనుబంధము చూడ ముచ్చట గా యున్నది. పిల్ల కూడా ముచ్చటగా యున్నది అనుచూ " నీ వయసెంతమ్మా ?" అని అడిగెను 

"నాకిప్పుడే పెళ్లి వద్దండీ " అనుచున్న మంజూషను చూసి మీనాక్షి ఖంగు తినెను. 

దామి : ఇది పైకి ఎంతో అమాయకంగా కనిపించు పెద్ద  దొంగ. అని మీనాక్షితో చెప్పి 

మంజూష తో "ఒసేయ్ పెద్ద మాటలాడకే.   వయసుకి తగ్గ మాటలాడుము ." 

 అని మందలించిననూ మంజూష పట్టించుకొనక సయ్యాటలాడు చుండెను. 

దామిని : ఈ పిల్లకు నావద్ద  బొత్తిగా భయము నశించెను 

ఇంతలో ఎవరో వచ్చుచున్నట్లు అలికిడయ్యెను. 

మంజు: ఆమ్మో!!  అని అరచి, సోఫా వెనుక నెక్కెను. 

ముంగీసా ముంగీసా అని పిలుచుచూఅప్పుడే వచ్చుచున్న  డాక్టర్ ఆమెను చెవి దొరక బుచ్చుకుని మెలిపెట్టి బైటకు లాగెను. 

దామిని : నేనన్న భయము లేదు కానీ ఆయనన్న భయము కలదు

మంజు: హృదయాలజిస్ట్ గారికి నమస్కారం అని వంగి శిల్ప భంగిమ లో  నమస్కరించెను.

రేపు తులాభారం నాటకమునకు మీకు టికెట్లు ఇచ్చి రమ్మని అమ్మ పంపెను.

హృద: నాటకము రేపు కదా నేటికేమి చేయవలెను అనుచుండగా

మంజు: అంతవరకూ ఒక కోతిని తెచ్చి ఆడించినా ?

హృద: నీముందు కోతి ఏమి పని చేయును ?  నీ ముందు కోతి  దిగదుడుపు!

దామిని :  ముంగీస అనుట , కోతులతో పోల్చుట, అయ్యో ఎంత బాధ పడును ? 

హృద : నిజమే  ఎంత బాధ పడునో కదా ?  కోతి  విన్నచో ఎంత భాదపడునో కదా 

మీనా : నాపేరును ఎట్లు మార్చునో అని మనసులో అనుకొనుచుండగా 

దామిని : మీకు పుణ్యముండును మీనాను ఏమీ అనవలదు 

హృద : మీనాను నేనేమి అనను  అని  వానా అని పిలిచి  కీబోర్డు తో కురిపించావా వాన?

దామిని : ఛి !  ఏం మనషి  కొత్తపాత లేదు !! ఆమె ఏమను కొనునో ( గొణుగుచుండెను)

మీనా : కీబోర్డు పై స్నేహ బంధము ఎంత మధురమూ ! అను గీతము కమ్మగా వినిపించుచుండెను .

2 comments:

  1. హాస్యము సరదా మరియు స్నేహము ముప్పేటలా అలముకొన్నవి భాగములో

    ReplyDelete
  2. ఈ పధ్యలు చాల మధురమైన పధ్యలు ఈ పధ్య బావలలో సంగటనలు చాల బాగునయి మంచి సంగీతం మనసుకు సంతోషాన్ని ఇస్తూంధి మంచి స్నేహం మంచి హాస్యం





















    ReplyDelete