మధురవాడ క్షేత్ర గృహము బాగుగా రంగు పూసిన బొంగరమువలె నీటియందు తేలుచున్న నౌకావలె మెరియుచుండెను. సందీపుడు ఇచ్చటికి వచ్చుట అరుదు. అందు మెర్సిడెస్ మహారాణి వసించుచుండును. అప్పుడే వచ్చుచున్న పెంచలయ్య ను చూచి సందీపుడు "నాన్నా నాన్నా దూరవాణికి దొరకక ఎక్కడ తిరుగుచున్నావు , రాత్రాంతయూ నీకొరకు ప్రయత్నించుచూ నాకు పిచ్చి పట్టినది, " అయ్యో నీకూ పట్టిందేట్రా పిచ్చి . అదృట్టం నాకు పట్టిన పిచ్చిఒగ్గేసింది . అదృష్టం నాకు రేత్రి పట్టిన పిచ్చితో పాటు ఎం ఎల్ ఏ పిచ్చి కూడా ఒగ్గేసింది. నిన్న రాత్రి ఈ క్షేత్ర గృహమునకు నీకొరకు వచ్చి చూడగా అప్పుడే నీవు బైటికి వెడలినావని ఇచ్చటి కావలి బృందం చెప్పగా నీకొరకు వేచియున్నాను. రాత్రి విహారయాత్రలు చేయుచుంటివా ! అతి ముఖ్యమైన విషయమొకటి చెప్పవలెన" ని కోపముతో రేగుతున్న సందీపునికి రాత్రి జరిగిన సంఘటనను వివరించి, పోలీసులను ఎట్లు వేడుకొని పిర్యాదు వెనుకకి తీసుకొనేనో , భారతవర్షను విడిపించి ఎట్లు మాలిని గారిని క్షమాపణ వేడుకొనెనో తెలిపి శాంతిపజేసెను. "రేత్రి నిద్రలేదురా నాను పండుకొంటాను, నువ్వు పడుకోరా ఇంక ఆళ్ళ జోలికెళ్లను. నువ్వు కూడా ఆల్ల గురించి మరిసిపోరా, ఆల్లువద్దు , ఆపిల్ల వద్దు. తొందరలో పాస్టరుగారి అమ్మాయితో నీ పెళ్లి సేసేస్తాను." అని మంచంపైన వాలుచున్న తండ్రితో " నాన్నా ఇప్పుడు పెళ్లి మాటపక్కన పెట్టి నేను చెప్పెడిది వినుము చెల్లి గొంతు కోసుకొనుటచే విశాఖపట్నము ఆశుపత్రిలో వేసినాము. " మాట పూర్తి అగుచుండగానే వాహనము విశాఖపట్నము బయలుదేరెను.
మార్గమంతయూ పెంచలయ్య లబోదిబో మనుచూ వాహనమును నడుపుచుండెనుఆసుపత్రి చేరగానే ఒక్క ఉదుటున లంఘించి వైద్యులని కలిసి నందిని నుంచి న ప్రత్యేక గదికి పోయి ఆమెను చూచి విలపించసాగెను. అక్కడున్న డాక్టరు గారు ఆమె నిద్రించుచున్నదని జెప్పి నోరు పెట్టరాదని హెచ్చరించి ఆపై అతడిని ఓదార్చి వెడలిరి . అప్పుడు గాని అతడు చేతికి కట్టు కట్టుకొని ప్రక్కనే ఉన్న భారతవర్షను గమనించలేదు.
మీరు ఈ దెబ్బలతో విశ్రాంతి తీసుకొనక ఇట్లు వచ్చినారేమీ అని అడుగగా చేతియెముక సూక్ష్మముగా బీటవారినది ,గాయములు మందు రాసి కట్టుకట్టి నేటికి విశ్రాంతి తీసుకొని రేపు పొమ్మనిరి నేను అమ్మ చెల్లితో క్రింది అంతస్తులో నున్నాము , ఇంటికి పోవుచూ నందినిని చూచిపోవలెనని వచ్చితిని
ఏమండీ భారతవర్షగారు నేను చేసిన పొరపాటుకు నాబిడ్డ బలిఅగుచున్నది అని వర్షునితో అనుచుండగా మందులు కొనుటకు క్రిందకి పోయి న పైడమ్మ సందీపునితో కలిసి వచ్చెను. మంజూష మాలినిగారు కూడా వెంట వచ్చిరి.
పైడమ్మ: రేత్రంతా పోనాపీసి తొంగుండిపోనావు ఇప్పుడు తీరికయ్యిందేటి ఆబాబుకి కుడి సెయ్యిరిగిపోనాది బుర్ర కి బొక్కడిపోనాది నువ్వు సేసింది పొరపాటు కాదు పాపం, పాపం సేసినోన్నిఆ పెబువు సమించడు అని పైడమ్మ భర్తను తూర్పారబట్టెను .
మారిపోయినోణ్ని అంటే నీకే పాపమే పైడి “అనుచుండగా సందీపుడు విదిష ఉదంతమునెఱిగించి నాన్న మారుట కాదమ్మా ఆ ఆదిపరాశక్తి నేమి చేయజాలక గత్యంతరం లేక పోలీసులవద్దకి పోయి పిర్యాదు వాపసు తీసుకొనెను. దాసుకి, ఆది మావకి ఆరూపము చూచి జ్వరము వచ్చి నోటిమాట పడిపోయెను.
పైడి :ఓలమ్మోలమ్మో, ఆ దేవుడమ్మ జోలికెల్ల కురా నల్లని నలిపినట్టు నలిపేత్తాది!
నందిని కళ్ళు తెరచి "ఇంకా నన్ను చూడ్డానికి వచ్చారా అమ్మా నామీద మీకు జాలిగిననూ నాపై నాకే అసహ్యము కలుగుచున్నది. నాకు జీవితమూ పై విరక్తి కలుగుచున్నది కలుగుచున్నది.
పైడి :అవన్నీ మరిసిపోయే నువ్వు బతకాలి నువ్వేటి తప్పుసెయ్యనేదే
సందీ : చెల్లి, నీవట్లనినచో నేను వర్షను కొట్టినాను నేనేమి చేయవలె ? నాకునూ బ్రతుకన్న చీదర పుట్టుచున్నది!
పెంచ :ఎట్రా చిన్న తప్పు సేసినోళ్లంతా సచ్చిపోతామంటారు పెంచలయ్య తల్లడిల్లిపోయెను
మాలి: తప్పమ్మా చిన్నపిల్లలు ఏంటో జీవితము మీ ముందున్నది మీరు తల్లిదండ్రులముంద ట్లు మాట్లాడరాదు. మీ కుటుంబము పచ్చగా ఉండవలెను.
నంది: నాన్న మొదట గురువుగారిపై బురద జల్లించితివి , తరువాత వారి తల్లిని అవమానించితివి , తరువాత ఆయనని జైల్లో వేయించితివి. నేడు వారు మనకుటుంబము చల్లగా ఉండవలెనని దీవించుచున్నారు. క్రీస్తు నీ బోధలోనే తప్ప నీ ఆచరణనందెచ్చటనూ కనిపించుటలేదు
వర్ష: నందిని నీవెక్కువ మాట్లాడరాదని డాక్టర్లు చెప్పినారుకదా మాట్లాడవలదు గాయము లోతుగా కానందున కొద్దిగా కుట్లు పడినవి అని పెంచలయ్యవైపు చూచి చెప్పి, నీ అల్లరి ఎక్కువగుచున్నది ఇప్పుడవన్నీ తలచి వగచి పనేమి కలదు ? గతం గతః నేనవి ఎప్పుడో మరిచితిని. అని నందినికి చెప్పెను
మీరుచెప్పినచో తప్పక పాటింతును అని మాటలాపి సైగతో సందీపుని పిలిచి మంజూష చేతిని అతడి చేతులో నుంచెను. పైడమ్మ ఈ బంగారు బొమ్మే నాకోడలు అని మంజూషని దగ్గరకు తీసుకొనగా భారతవర్ష మొఖము ఎర్ర బారెను. అది చూచి నందిని మొఖమున నిరాశ తొంగి చూచూచెను. పెంచలయ్య లోక్యమెరిగిన వాడగుటచే క్షణామా లసించక మాలినిగారి పాదములపై బడి క్షమాపణ వేడెను. అప్పుడు మాలినిగారు చిన్నగా నవ్విరి అది చూచి వర్షుడు నవ్వెను , వర్షుని చూసి నందిని నవ్వెను, నందినిని చూచి పెంచలయ్య నవ్వెను , అది చూచి సందీపుడు తన చేతిలో నున్న మంజూష చేతిని మెల్లగా నొక్కెను , మంజూష సిగ్గిల్లెను. ఆమె బుగ్గలెర్రబారెను.
***
ఇంతలో డాక్టర్ గారు వచ్చి భారతవర్షను తన గదికి పోయి విశ్రాంతి తీసుకొని సాయంత్రము ఇంటికి పంపెదమని తెలిపిరి. పైడమ్మ , మాలిని రాత్రి నిద్రలేమిన బడలికతో ఎక్కువసేపు కూర్చొనలేకపోవుటచే వారునూ సందీపుని మంజూషని తీసుకొని ఇళ్ళకేగిరి. డాక్టరు గారు పెంచలయ్య మాత్రమే నందిని గదిలో నుండగా
పెంచలయ్య : డాక్టరుగారు మా అమ్మాయి కేమీ కాదుకదా ! గొప్ప పండితురాలు
అని మెచ్చుకొనుచూ అతడికేమీ తెలియదనుకొని ఆ వర్షుడి వల్లే నాకూతురికీ
గతి పెట్టెనని అతడిని నిందించుచుండగా డాక్టరు " అయ్యా పెంచలయ్యగారు మీసంగతి మీకుటుంబ సభ్యులు చెప్పుచుండగా ఇప్పుడే తెలిసినది కానీ భారతవర్ష నాకెప్పుడో తెలియును. అతడి గూర్చి నా ఒక్కడికే కాక జగమంతటికీ తెలియును. అనుచుండగా
పెంచలయ్య " మీ యభిమాన మలగుంది , జగమంతా తెలిసిపోయే కత ఎక్కడుంది ?" అని " నా పోగ్రాంలు కూడా టీ వీ లో ఒత్తంతాయి అండీ. , మీరెప్పుడు సూడనేదేటి ?
అయ్యా మీరు డబ్బు చెల్లించి వారి సమయమును కొనుక్కొని ప్రోగ్రామ్లు ఇచ్చుచున్నారు , దానికి మీరింత బడాయి పోవుచున్నారు. ఆయనకీ సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించబడెను. ఆయనకీ తెలిసిననూ సందర్భము కాదని మీకు చెప్పలేదు .
ఎందుకు సెప్పనేదు అవునెందుకు సెప్పనేదు అని అతడి ప్రాణము తీయుచుండగా " Empty vessels make much noise" అను సామెత కర్దము తెలియునా? అని అడిగెను తెలియదని పెంచలయ్య చెప్పగా మీ అమ్మాయి నడిగి తెలుసుకొనుడని చెప్పి వెడలిపోయెను. నందిని అంతయూ విని ముసిముసి నవ్వులు నవ్వు చుండెను. ఇంతలో పెంచలయ్య వాహనమును చూసి పసిగట్టిన వర్షుని అభిమానులు పెంచలయ్య నశించాలి అని అతడి కారు వద్ద అరుచు చుండగా రక్షణ అధికారులు వారిని ఆసుపత్రి బయిటకు పంపివేసిరి . అయిననూ వారు కదలక ఆసుపత్రి ముందు నిలిచి అరుచుచుండిరి. రెండవ అంతస్తునుండి ఇది చూచినా పెంచలయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పది నట్లయ్యెను. అతడాముదము తాగినట్టు మొఖం పెట్టగా నందిని " నాన్న విచారించ పనిలేదు ఈ ఆసుపత్రికి వెనుక త్రోవ ఎచ్చటున్నదో తెలుసుకొనుము " అనగా పెంచలయ్య మొఖం వెలిగిపోయెను.
అతడు వెడలినపిమ్మట నందిని వర్షుని గదిలోకి పోయిఅతడి చెక్కిట ముద్దిడగా వర్షుడు తీవ్ర కలతనొందెను నీవు పడుకొని యుండక ఇచ్చటికేలా వచ్చితివి అని ముద్దుగా కసరగా "ఇప్పుడు పోవుచున్నాను మనమిద్దరమూ ఒక కుటుంబమగుచున్నాము, అప్పుడు అధికారికంగా మీ ఇంటికొచ్చెదను, మరదలినప్పుడెట్లు పొమ్మందురు బావగారు అని కొంటెగా చూచుచూ అభినందనలు తెలిపి తన గదికేగెను.
No comments:
Post a Comment