విశాఖపట్నం ద గ్రీన్ పార్క్ హోటల్ : ఇంద్రభవన తళుకులను పుణికిపుచ్చుకుని పట్టణ నడిబొడ్డున కులుకుచున్నది. ఆదు నక్షత్రముల భావన రాజ మందు పలహార శాలలో విందారగించు వారి నడుమ మందకొడిగా కూర్చున్న నందిని మదహాసమును చూసి
వలతి: ఇక వర్షునికి సాయపడుటసాధ్యము భానోజీ గారు, అరుణతార , రంజిని అందరు గురువుగారి (భారతవర్ష) విద్వత్తు ను ఎంతగానో ప్రేమిం చుచున్నారు. ఎట్లయిననూ సాయపడవలెనని వారు చేయని ప్రయత్న ము లేదు! సన్మాన సభలో ఉక్కు కర్మాగార డైరక్టర్ గారు సలహాదారుగా గౌరవ పదవినివ్వజూపగా వర్షుడు తిరస్కరించెను. చివరికి తనకొచ్చిన నగదు బహుమతిని కూడా మజ్దూర్ సంఘమునకు కానుకగా ఇచ్చివేసెను.
నందిని: మంచి పని జేసెను హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ
తే. మంచి పనిజేసె నెఱకాడు పణము తిప్పి (పణము = డబ్బు)
ఇచ్చె తెలియక వగచెద రేల జనులు (వగచెదరు + ఏల)
జ్ఞాన సిరులున్న వానిక జ్జ్ఞాన మందు (వానికి + అజ్జ్ఞాన)
వలతి వలవల వలసిన వలతు రింక
ఆసువుగా తేటగీతిలు రువ్వుచున్నావే! ఆయన నాకు నీకు గురువు వని మరిచి నవ్వుచున్నావా! రవ్వంత ఉపకార మొనర్పక సాయపడువారిని గేలిచేయుట కసాయితనము. మనసున్న ఆడతనమన్నది చూపుట నేర్వవలెను. కిల్ బిల్ చిత్రము నందు ఉమా థుర్మాన్ వాలే నగుపించుచున్నావు !
ఇంకా నయము సైకోలో నార్మన్ బేట్స్ లా ఉన్నాననలేదు. హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ అతడు నాకు ప్రియుడని నీవు మరిచి న నేను మరువను. అతడికి సాయపడుట దుర్లభ మే గాక దుస్సాహసము. సహాయము లను విరాళ ములను స్వీకరించడు నా వర్షుడు. అతడికెట్లు సాయపడవలెనో వారెవ్వరికీ తెలియదు.
అవును ఉద్యోగమూడబీకించుట నీకే తెలియును అనుచుండగా నందిని ఆశువుగా
తే. జంటగ వచ్చిన ధనకీర్తి జూడ పాడు
ఉద్యో గములేల జేతురు ఊడి గముగ
నగుబ డుకొలది సేపుండి నవ్వి పొమ్ము
ఏడ్చి నదిజాలి కవలతి ఏడ్పు విడుము
ఆశువుగా తేటగీతులు రువ్వుచూ, పలుమార్లు వలతీ వలతీ యని (పద్యములందు) నాపేరు పెట్టి పిలుచుచూ హాలీ వుడ్ చిత్రముల అలవోకగా నందిపుచ్చుకొను నందిని వందనమమ్మా ! చిన్నదానివని అనుకొనుట నాదే తప్పు, నీ ప్రియుడు వచ్చు చున్నా డు నేను పోయివత్తును అనుచుండగా “ కొలది సేపు ఉండవమ్మా నేను నాప్రియు నికొరకు ఏమి జేసినానో , ఇప్పుడేమి చేయ బోవుచున్నానో చూడుము నా మనసు నా ఆడతనము చూపెదను” అని నందిని వలతి తో కన్ను గీటుచూ అనెను.
వర్షుడు రాగానే ఒక బల్లవద్ద కూర్చొని యున్న చొక్కాపాన్టున దోపిన శ్వేతజాతి పొడుగరొకడు లేచి అతడి వద్దకేగి కరచాలనం జేసి “హలొ ఐ యాం రేమండ్ ఫ్రమ్ హార్పర్ కొలిన్స్ ఇండియా లిమిటెడ్. హౌ డూ యు డూ మిస్టర్ భారతవర్ష ?”
“ఓ హౌ డూ యు డూ?” అని వర్షుడు కరచాలనం జేయుచుండ రేమండ్ రంగు కాగితమందు చుట్టిన పుస్తకములను వర్షునకిచ్చి తన బల్లవద్దకు కొనిపోయెను.
రేమండ్: వియ్ హాడ్ బీన్ డిస్కసింగ్ థి పబ్లికేషన్ అఫ్ యువర్ వర్క్ . హియర్ ఇట్ ఈస్ టేక్ అ లుక్.
వర్ష : ఫెంటాస్టిక్, మై ఇంగ్లీష్ పోయెమ్స్ అండ్ స్టోరీస్ ఫైనల్లీ గాట్ పబ్లిష్డ్ . ఐ యామ్ సో గ్లాడ్ !!
రేమండ్: వియ్ టూ, హియర్ ఈజ్ వన్ మోర్ గుడ్ న్యూస్ అని ఒక పొట్లమును వర్షుని చేతులో నుంచి ఆ చెక్ రెమ్యూనరేషన్ ఫ్రమ్ హార్పర్ కోలిన్స్ ఓపెన్ అండ్ సీ అనుచుండగా
వర్షుడు దానిని ప్రక్కన బెట్టి “యు ప్రోమిస్డ్ టు ఇంట్రొడ్యూస్ ద నోబెల్ లేడి హు సేంట్ మై వర్క్స్ టు యు ఇన్ యువర్ ఫార్మేట్ కలెక్టింగ్ ఫ్రమ్ మై బ్లాగ్, ఐ మస్ట్ థాంక్ హర్.”
రేమండ్ :షూర్ బట్ హేవ్ యు డెలీట్డ్ ది పబ్లిష్డ్ పోయెమ్స్ ఫ్రొం యువర్ బ్లాగ్
ఎస్ ఐ డిడ్. హావెన్ట్ యు చేక్డ్. ఐ డిలీట్డ్ అల్ ద స్టోరీస్ టూ
ప్రక్కనే మరొక బల్లవద్ద కూర్చొన్న నందిని వలతితో "కవరువిప్పి చూడడే పిచ్చిమొద్దు!" అని అసహనంగా అనుచుండగా
వలతి: ఆ తెల్లవాడు చెక్ అని చెప్పినాడు కదా ఐదు వేలో పది వేలో యుండును అని ఉదాసీనంగా చెప్పిన వలతికి నందిని తన చరవాణియందు హాప్పర్ కొలిన్స్ వారిచ్చు ప్రతిఫలము చూపెను " Harper Collins pays authors $55,000 annually which is 8% higher than the national average" అని గూగుల్ లో చూపగా వలతి కి కళ్ళు తిరిగెను. ఇంతలో మిస్ నందిని నందిని అని గట్టిగ రేమాండ్స్ పిలవగా నందిని వారివద్దకు పోయెను
"ఈమె నాశిష్యురాలే" యని వర్షుడామెను అభిమానంతో దగ్గరకి తీసుకొనగా నందిని వర్షునికి అతుకుకొని వలతి వైపు చూసెను. పిమ్మట పుస్తకావిష్కరణ కు ఢిల్లీ రావలసిందిగా భరతవర్షను ఆహ్వానించి రేమండ్ నిష్క్రమించెను.
నందిని రెండు పుస్తకములను వర్షుని చేతిలో నుంచుచూ " గురువుగారు నేను మీ ఆంగ్ల పద్యములను , కథలను తెలుగీకరించితిని ముద్రణ చేయించితిని " అని పుస్తకములనిచ్చి అతడి కాళ్లకు నమస్కరించెను.
వర్షుడు ఆమెను జబ్బలు పట్టి పైకి లేపి " కథలు తెలుగీకరించడమనిన సరే , కానీ వంద పద్యములను ఎట్లు తెలుగీకరించినావే పిల్లా" అని పుస్తకము విప్పి చూసిన ఒక పద్యమును చదివిన వర్షుని నోరు అచ్చెరువున క్షణ కాలము తెరుచుకొనెను.
పిదప వర్షుడు తన మెడలో నున్న బంగారు గొలుసును తీసి బహుమతి గా నందిని కివ్వగా నందిని మెడ నందించెను. వర్షుడామె మెడలో వేయుచుండగా ఆమె కళ్ళు వర్షిచుచున్నవి. వర్షుడు డామె చెక్కిళ్ళపైగారు అశ్రుధారలతుడిచి ఆమెను ఓదార్చెను. ఎన్నిదినములు , రాత్రులు శ్రమించినావో కదా అని అతడు ఆమె చేతుల నందుకొని “ నేను బహుమతిగా వచ్చిన ధనము స్వీకరించ నందుకు ఎందరో బాధపడిరి. ధనము సంపాదించుటకు మార్గము ఉన్నతమైనదై యుండవలను కదా అనుచున్న అతడితో నందిని ఆశువుగా ఒక శార్దూల పద్యమును చెప్పెను.
శా.రూపాయే తనదే వుడంచు ఖలుడా రూపాయి నర్చించ డే
రూపాయే తనల క్ష్యమంచు జనులా రూపాయి నార్జించ రే
పాపాల భైర వుం డుమార్చు మతమా రూపాయి నాశించు చూ
గోపాలా మరిసా హితీప్రి యుని కా గామేది గాలించ గా
“గురువును మించిన శిష్యురాలివగుము” అని పండిత కీర్తనీయురాలివై వర్ధిల్లమని ఆశీర్వదిం చుచుండగా వలతి వచ్చి చెంగట నిలిచెను. భారతవర్ష అబ్రమున నామెను చూచుచుండ వెంటనే నందిని కళ్ళు తిరిగి క్రింద పడిపోయెను వర్షుడు ఆమెను రెండు చేతులలో నెత్తుకొనగా నందిని ప్రియుని హత్తుకొని వలతి వైపు కొంటెగా చూసెను.
గామేది ( గాము + ఏది ) = మోహమేది
No comments:
Post a Comment