తే.చెంపకు చారెడు కన్నులు, చంద మామ
మోము,కొటేరుము క్కెఱ్ఱని పెదవు లందు
కెంపులు, మొఖమున భానుని కాంతి చిందు
చిరునవ్వు చూడగ మోహము చెలగు చుండు.
తే.మూసిన కనురెప్ప లవెనుక మార్మి కజగ 2
మవతరిం చగకాంచె కాశ్మీ ర మందు తానె
యామిని పూర్ణతి లకము యాత డెకవి
బిల్హణు డుప్రేమి కుడతడె బాసె నసువు
తే. గీర్వాణ ధీరజ గన్నాథ ఘనక వనఘ 3
టకాంగవి న్యాశమా నసనాథు డొసగ డేల
సమ్మతి ఇంపుగ కెంపులు చవిగొ నేల
రాడేల జవరాలి చెంగట రంజన పొంద
తే.సమత్తు డుపవాస మునుగూడ సడలె రక్తి 4
చేరిగం గాతీర మునర్చించి జాహ్నవి లహరి
విరచించె దినదిన మొకభక్తి పద్యము, రెండు
మాసము లకుభక్తి కీర్తన మాల నల్లె
తే.పద్దెని మిదిపసి మిబ్రియ పడుచు జూచి
గూట గుండె పాడ గూడి పాడి
రంజిల్లె ఫ్రీడ్రిక తిశయించి రాగ మంత
సాగి వెలిగె నొక్క సాలు వరకు
తే.రైను తీరము నందుతీ రైన తార 6
వాలు కన్ను లందు వాడి తూపు
లున్నప సిడిబాల లతికాంత లున్నకు రంగి
కూర్మి గోరుచు చేరెను గూట డొకడు
ఆ.కూరిమి కలిగెను మనసులు కూడ కలిసె 7
వదిలి వెడలె ఇచట వంటరి గానె
ముగిసెను అంతయు ఏడాది ముగియు లోపు
కర్మ కాలి కడకు గాలి నయితి
ఆ. సరిగమ సంగీత సామ్రాజ్య మేలు నాథ 8
యూరి డీసు నాథ ఓర్పీ యాసు
గానప్ర తిభతోడి సురరాజు గాచి నావు
గాన కీర్తి నీది గాంచి చూడ
ఆ.నాచేయి పేర్మితొ నీకివ్వ నాథు డయ్యి 9
ఆలు మగల మయ్యి ఆట లాడ
కాటువే యగపాము ఆశలు కాటి కెళ్లె
వేచి యుగము లన్ని వేగి నాను
తే.నిలిచాను అన్నింట ముందింట నేను గెలిచి 10
బహుమతు లనునీమ నసుఫల మంది దాచి
వ్యోమగా మిగపోయి ఆకాశ బాణ మందు
తిరిగొచ్చి సగమిచ్చు కలకంటి తలచి నతల
మధ్యలో పేలగ భూమిపై బుగ్గి రాలె.
ఒకటి రెండు పద్యములు: 11 వ శతాబ్దమందు కశ్మీరమందు మదనాభిరామ యను రాజుకు "యామినీపూర్ణతిలక" అనే కుమార్తె వుం డెడిది. ఆ రాజు తన కుమార్తెకు విద్య నేర్పించుటకు "బిల్హణుడు"అనే కవిసత్తముని పిలిపిస్తాడు.ఆ కవి సౌందర్యం చూచిన రాజుకు మనసులో ఒక సందేహం కలిగెను. ఇంత అందమైన వానిని చూచిన నా కుమార్తె ఈతని ప్రేమలో పడిపోవును. ఏమి చేయవలెను? అని మంత్రిని సలహా అడిగెను. పండితునికి కుష్టు వ్యాధి వున్నవారిని చూడకూడదనే నియమం వుంది. రాకుమారికి గ్రుడ్డివారిని చూడననే నియమంవుంది. దీనిని సాకుగా చేసుకొని కవి గ్రుడ్డివాడని రాకుమర్తెకు, రాకుమారి కుష్ట వ్యాధిగ్రస్తురాలని కవికి చెప్పి ఒకరినొకరు చూడకుండా మధ్యలో ఒక పరదావంటిది పెట్టించి విద్య మొదలు పెట్టించవలెనని మంత్రి జెప్పగా రాజట్లే చేసెను. ఒకనాటి సాయంత్రం చంద్రోదయ సమయమందు ఆకాశమును చూచుచూ కవి అందమైన పద్యాలు చెప్పుచుండగా అది విన్న రాకుమార్తె గ్రుడ్డివాడు చంద్రుని మీద ఇంత అందంగా పద్యాలు ఎలా చెపుతున్నాడు అని కాండపటం తొలగించి పండితునిచూచెను. ఒకరినొకరు చూచుకొని ఇది రాజు ఆడిన నాటకమని తేలిపోయినది. పిదప వారొకరినొకరు గాఢంగా ప్రేమించు కొనిరి. ఈ సంగతి తెలిసిన రాజు" బిల్హణుని"శిరశ్చేదనం చేయమని ఆదేశించాడు. (మగువలెప్పుడు సురక్షితము శిక్షలన్నీ మగవారికే కదా!)
మూడు నాల్గు పద్యములు: జగన్నాధ రాయలు లేదా జగన్నాథ్ పండిట్ 1590 లో తూర్పు గోదావరి ముంగండ గ్రహంకు చెందిన ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన పండితుడు. అతడ అనేక ఇతర భాషలలో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. అతని తండ్రి పెరు మరియు తల్లి లక్ష్మి ఇద్దరూ సంస్కృత పండితులు. అతని కవితా రచనలో రసా గంగాధర్, గంగా లాహరి, కవితా కామిని, యమునా లాహరి, భామిని విలాస్, విష్ణు లాహరి, ఆసాఫ్-లాహరి మొదలైనవి ఉన్నాయి.
మొఘల్ చక్రవర్తులైన జహంగీర్ మరియు షాజహాన్ కోర్టులలో పనిచేశారు. చక్రవర్తి షా జెహాన్ కుమార్తె యువరాణి లవాంగికా మరియు ప్రిన్స్ దారాషుకోహ్ స్నేహితుడు అతని నుండి సంస్కృతాన్ని నేర్చుకునేవారు. కవిని ఆమె ఆధ్యాత్మిక మార్గదర్శిగా భావించెను. వారిరువురి మధ్య ప్రేమ మొగ్గతొడిగెను. చక్రవర్తి జగన్నాథ్ పండిట్ను ఇస్లాంను తన మతంగా అంగీకరించి, తన కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరాడు జగన్నాథ్కు ఆమోదయోగ్యం కాదని తెలిపెను.
తరువాత అతను భారతదేశంలోని వారణాసిలో నివసించాడు. అతను గంగా నది ఒడ్డున ఉపవాసం ప్రారంభించి ప్రతి రోజు అతను గంగా నది ఒడ్డున కూర్చొని ప్రార్థించుచు ఒక శ్లోకను రచించెను. ప్రతి శ్లోకం పూర్తయిన పిదప నది కొంచెము పెరుగు చుండెను. అట్లు 52 రోజులు జలాలు పెరిగి అతని పాదాలను తాకినవి ఈ 52 శ్లోకాల సమూహమే గంగా లాహిరి.
ఐదు ఆరు ఏడూ పద్యములు: 1770 లో తన విద్యార్థి రోజుల్లో, తరువాత కాలమునమహాకవి గా ప్రపంచ కీర్తి నొందిన, గూఠ, పద్దెనిమిదేళ్ల (లూథరన్ పాస్టర్ కుమార్తె)ఫ్రెడెరిక్ బ్రియాను రైన్ నది సమీపమున, స్ట్రాస్బోర్గ్కు ఉత్తరాన నలభై కిలోమీటర్ల దూరాన గల సెసెన్హీమ్ అనే చిన్న గ్రామాన కలుసుకొనెను. అతను ఫ్రీడ్రికను చూసినప్పుడు మొదటి చూపులోనే ప్రేమ లో పడెను.
గూఠను ఫ్రీడ్రిక కుటుంబానికి పరిచయం చేసెను. బైబిల్ విద్యార్థి గా పరిచయము చేసుకొని పాస్టరుగారిని కాకాపట్టి రాత్రిపూట పార్సనేజ్ వద్ద బసచేసి బ్రియా ప్రేమయందొక సంవత్సరము మునిగి తేలేను. ఉద్వేగభరితమైన ఈ ప్రేమ వ్యవహారం కేవలం ఒక సంవత్సరమే సాగెను. జూన్ 1771 లో గోథే తన న్యాయవాద పట్టాను పొందిన తరువాత ఫ్రాంక్ఫర్ట్లోని ఇంటికి తిరిగి పోయెను. బ్రియా ఎదురుచూచు చు మరణించెను.
ఎనిమిది తొమ్మిది పద్యాలూ : ఆర్ఫియస్, ప్రాచీన గ్రీకు పురాణ వీరుడు మానవాతీత సంగీత నైపుణ్యాలను కలిగి ఉన్నాడు. అతను గొప్ప కవీశ్వరుడు కూడా. తన పవిత్ర రచనల ఆధారంగా ఒక మత ఉద్యమానికి పోషకుడయ్యాడు. అపోలో ఓర్ఫియస్కు తన వీణను బహూకరించెను. ఓర్ఫియస్ పాడటం మరియు ఆడటం చాలా అందంగా యుండెడిది, జంతువులు మరియు చెట్లు మరియు రాళ్ళు కూడా అతని గురించి నృత్య గానములందు కరిగెడివి.
దానవులకు అమరులకు సంగీత పోటీ వచ్చినప్పుడు అమరుల తరుపున గానము చేసి వారి ప్రతిష్టను నిలిపి తిరిగి వచ్చినప్పుడు ఆర్ఫియస్, యూరిడైస్ను వివాహం చేసుకొనెను, కానీ యూరిడైస్ వివాహమైన కొలది దినములకే పాము కాటుతో మరణించెను .
పదవ పద్యము: అన్నింటావిజయము కేతనమేగరేసిన మగువ ప్రేమయందు కూడా విజయము సాధించి ప్రేమ కేతన మెగురవేసి, రాకెట్టు నందు రోదసీలోకి పోయి తిరిగి వచ్చి పెళ్లి చేసుకొనవలెనని కన్న కల రాకెట్టు మధ్యలోనే బూడిదగుటచే భూమిపై బూడిదై రాలెను
***.
శేషా :ఇంత రాత్రి వేళ ఎవరది మన ఇంటివద్దకు వచ్చి నిలచినారు స్త్రీఎవరో స్త్రీ , మారెమ్మ వలే...
రాజన్న: మారెమ్మ కాదు. దయ్యము వలే నున్నది.. బాబోయ్.. శ్రీ ఆంజనేయం ప్రసన్నఅజనేయం అందులకే ఈక్షుద్ర విద్యలు వద్దని మొత్తుకొన్నది. విద్యత్ సరఫరా ఇప్పుడే నిలిచిపోవలెనా!
శేషాచలం గారు ... మీరేనా ?
ఆ ఎవరూ మాలిని గారా ? అంతా కటిక చీకటిగా యున్నది .
మాలిని:ఇంట అర్ధరాత్రి ఎచ్చటికి పోయివచ్చుచున్నారు?
స్మశానమునకు .. ఛీ ఛీ బజారుకి .. ఛీ ఛీ నిమ్మకాయలు
రాజన్న :నిమ్మకాయలు దిష్టి తీసి స్మశానంలో పారవేసి వచ్చుచున్నాము
శేషా :ఇంత అర్ధరాత్రి ... మీరెందుకిచట ... ఎవరికొరకు ?
విదిషను మిమ్మల్ని కలిసి విషయమును తెలపవలెనని
శేషా:కొలది దినముల నుండి మాత మన ధ్యానమందు మునిగి యున్నది , నాకు చెప్పిన ..
మంజూష సందీపునిచే వంచించబడినది తల్లి కాబోవుచున్నది.పెంచలయ్య నన్ను పరాభవించిన ని తెలుసుకొని వర్షుడు వారి పైకి జగడమునకు పోయి వారిని కొట్టెను. పెంచలయ్య పిర్యాదు చేయుటవల్ల భారతవర్షను పోలీసులు కొనిపోయినారు, నేను లాయరుగారితో స్టేషనుకి పోయిచూడగా వర్షుడు అచ్చట లేకుండెను. నాకు చాలా భయముగా నున్నది.
శేషా: ఇటీవల కాలమున పాత్రికేయులను, పౌరులను బంధించిన పిదప ఒక ఠాణా లో ఉంచక రహస్య ప్రదేశమందుచుచున్నారు. ఆ పెంచలయ్యను కలిసి మాట్లాడినచో విషయము బయటపడును కానీ వాడికి సబ్బవరమునే కాక కొమ్మాదియందు స్థావరములున్నవి.
మారెమ్మ: బాబు మీరు రాజన్న స్మశానమునకు పోయిన పిదప అని ఎదో చెప్పు చుండగా కోపముతో రాజన్న "మారెమ్మ ఏంటే ఆ చెప్పడం దిష్టి పారవేయుట కని చెప్పలేవు ,లేకున్నా ఏ శవభేతాళము చేయుటకో అని విన్నవారుకుందురు."
మారెమ్మ: మరె నండీ.. మీరు దిష్టి పారేయడానికిలా వెళ్ళేరో లేదో అలా వచ్చాడండి సందీపుడు. నందినమ్మ గొంతు కోసుకొని ఆసుపత్రి నందు ఉన్నదట. సందీపుడు పలుమార్లు అతడు తండ్రికి ఫోను చేసెనట , ఆ తండ్రి పోవును ఆపుజేసుకొని కూరొండినని నేరుగా సబ్బవరం వచ్చినాడు తిరిగి పోవుచూ విదిషమ్మ సాయము కొరకు వచ్చెను , కానీ మాత ధ్యానములో నుండుటచే వెడలిపోయెను. అయ్యో ఏమి అవసరము పడి వచ్చెనో!
శేషా: మన పిల్ల ని మోసగించిన ఆ సాందీపుని అయ్యో తలుచుచున్నావా ? వాడి ఊసు మనకేల? పెంచలయ్య తప్పక కొమ్మాది పోయుండును నా వాహనమున పోయెదము అని మాలినిగారిని కొనిపోయెను.
***
నెత్తురోడుచున్న భారతవర్ష మొఖము మనోఫలకమున పర్వత పరిమాణము లో కనిపించు చుండగా ఆకాశ మంత అలుముకున్న రుధిర నేత్రములు లొక్క సారిగా తెరుచుకొన్నవి. మారెమ్మ ఇంకనూ గేటు మూసి వెనుదిరుగు చుండగా ప్రళయ భీకర నిర్వికార ఆకారము అంతకంతకూ పెరుగుచూ గేటువైపు వచ్చు ఆ చుండగా మారెమ్మ భీతిల్లి ఓ మూలగా నెక్కెను. కింకిణి లు ఘల్లు ఘల్లులని మొగుచుండగా ఆ కరాళ ఆకారము అడుగు అడుగుకూ నాలుగడుగులు ఎత్తు పెరుగుచూ గేటు తీయునంతలో గడపను దాటినట్టు ఆ గేటును దాటి చీకటిలో కలిసిపోయెను. తనకే తెలియని తన విశ్వ రూపమది దాల్చి కదిలేను మాత జగత్తును శాసించగల యోగ జేత.
No comments:
Post a Comment