Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, November 20, 2020

Bharatavarsha 75

 లకుమ: బల్లిపాడు రావ లె నా కుదరమ్మా. చేతిలో నాలుగు సినిమాలున్నవి తెలుసా! నాలాటి తారలు అచ్చటికి  వచ్చిన జనులు మూగల్లరి చేయవచ్చు అది నీకే నష్టము.

అరుణ : ఒసేయ్ నేను నేతల్లినే! మీ డైరక్టరుతో మాట్లాడినట్లు నాతో మాట్లాడవలదు .

లకుమ: ఇలాటి ఫెస్టివల్స్ బోర్ అమ్మా!

అరుణ : దేవుడి ఉత్సవము నీకు శిరోభారంగా నున్నదా! నీ వేషాలు నావద్ద చూపుచున్నావా! నీభాషిట్లు దిగజారెనేమి! ఆ ఊరితో మన పూర్వీకులకు, మనకు ఎంత సంబంధము కలదో  నీవు తెలుసు కొందువు. బల్లిపాడు చక్కటి పల్లెటూరు. పల్లెటూరు చూచుటయే కాక హరి కథా గానము వినవచ్చు, నృత్యములు తిలకించవచ్చు.

లకుమ సినిమా తారలకు హరి కథలు సరిపడవు సినిమాల్లో ఒక పాట లో అలంకరణలు నృత్యములు కంటే యుండునా ఆ హరి కథా నృత్యములు?

చలన చిత్రములు గూర్చి నాకే భోదించుచున్నావా? మొండి పిశాచమా ఇంకోక్కసారి నీతో మాట్లాడేదనేమో చూడుము. అని దూరవాణినుత్తరించెను. 

లకుమ మరల తల్లిని దూరవాణిలో పిలిచి, అమ్మా తప్పు అయినది, మాట్లాడవూ  అరుణమ్మా అని బ్రతిమాలెను.  “నే చెప్పిన మాట వినినచో, చెప్పినట్లు నడుచుకొన్నచో నీతో మాటలాడెదను”  “నీవేమి చెప్పిననూ వినెదను తప్పునా!"

అరుణ : నా బంగారు కొండ.. హరికథ సినిమాకేమీ తీసిపోదు తల్లి, ఒక పాత్ర దారి మూడు గంటలు కథా గానం చేస్తూ అనేక పాత్రలలో జీవించి, ముఖములో సాత్వికము, కాలితో నృత్యము , చేతులతో ఆంగికము , ఆకర్షణీయమైన ఆహార్యముతో ఏకకాలంలో నటిస్తాడు , ప్రేక్షకులకు విసుగు కలగకుండా మధ్య మధ్యలో పిట్టకథలతో హాస్యరసాని పోషిస్తూ , సమాజంలో ఉండే కుళ్ళును ఎట్టి చూపుతూ వేదాంత భోద చేస్తూ హరికథను గానం చేస్తాడు.

నేను రేపు సాయంత్రము కల్లా అచ్చటకు జెరెదను రాత్రికి మనమచ్చటనే బసఁజేసి మరుసటి దినమునఉత్సవములలో పాల్గొనవలెను. సాయం సంధ్యా సమయాన దేవాలయమునకు  భూరి విరాళములొసగెడి అరుణతార బల్లిపాడు చేరుకొనెను. ఉత్సవ కమిటీ వారు ధర్మకర్తలు అరుణతార ని విడిది గృహమునకు లాంఛనంగా తీసుకొని పోయిరి. సువిశాలమైన ఉద్యానవము ముందరున్న విశాల ప్రాంగణములో పచ్చిక బైలు గల విడిది గృహము చెట్టు చేమలతో పూల మొక్కలతో అలరారుచున్నది. పొడవాటి ఇనప గేట్లు దాటి లోపాలకి ప్రవేశించు అరుణతారకు అప్పటికే చేరిన బంధుమిత్రులను చూచి మనసు పొంగినది. మాలిని, మంజూష, దామిని   రాధా కృష్ణ గారు కనిపించిరి.  వారు ఆ పచ్చిక బైలు పై కూర్చొని ఆ పరిసరములను చూచుచుండిరి.  అరుణతార కూడా వారిపక్కనే కూర్చొనెను , కమిటీ వారు వెనుదిరిగిరి.

 కొద్దీ సేపట్లో భానోజీరావుగారు కొత్త వేనులో తామా బృందమునంతటినీ తరలించుకొని వచ్చిరి. గేటు అవతల వేను ఆగెన.  గేటులోని వారు వచ్చువారిని చూచుచున్నారు మొదట రంజిని తారు వార కేశవుడు తరువాత భానోజీరావు గారు దిగిరి.  రంజని " మావయ్యా  కాళ్ళు జుంగుకొనిపోవుచున్నవి బస్సులో వచ్చువారము కదా , అందరినీ వెనులో కుక్కి తీసుకొచ్చినావు"   కేశవుడు " కొత్త వేను  కొన్నతరువాత ఆపాటి మోజు ఉండదా!"   నక్క నాగేశ్వర్రావు " ఏమండీ వేను మోజు తీరినదా ! తీరినచో వెనుకకు బస్సులో పోయెదము " అందరూ ఘొల్లు  మని నవ్వినారు. వెనుకగా వచ్చుచున్న పిల్లి పాపాయమ్మ వారందరూ తనని చూచి నవ్వు చున్నారనుకొని " నక్కా , నామీద మళ్లీ వెటకారమా  వేనులో అంతా  నామీదే వేళాకోళము జేసినావుకదా  !" ఏనుగు మీదొట్టు నీగురించి కాదు " అన్నాడు అందరూ మళ్లి  నవ్వినారు.  

బంటి బలరాం,  కొత్త సుబ్బారావు కలిసి వచ్చుచున్నారు  కొత్త " అదిగో ద్వారక ఆలమందలవిగో!”  అని చేయి చూబించి పాడుచూ వచ్చుచున్నాడు. “నాయనా ఈ అతిధి గృహమును ద్వారకనిన మాకభ్యంతరము లేదు కానీ మమ్మాలమందలని చూపించ వలదు.”  అని అప్పుడే మోటారు సైకిల్ పై వచ్చిన అగస్త్యుడు బసవడు అనగా నవ్వులు  పూసినవి.  అరుణతార అగస్త్యుని లకుమ ఏదని సైగ చేయగా అతడు దగ్గరకు పోయి " లకుమ తన డైరక్టర్ కశ్యపునితో వచ్చి స్థానిక హోటల్ లో బసజేసెను, రేపు ఇచ్చటకి  వచ్చును" అని చెప్పెను. అరుణతార ఒక నిట్టూర్పు విడిచెను.  పనివారు అందరికీ కాఫీలు అందజేసి అందరి సామానులు లోపల పెట్టినారు. అందరూ విడిది గృహ ముందటి ప్రాంగణములో పచ్చిక పై కూర్చొని సేదతీ రుచున్నారు.  

రంజిని: నేటి యాంత్రిక యుగమున ఒక ఇంటి వారందరూ కలిపి గడుపుటయే గగనమాయెను ఈ రాత్రికి  ఈ సువిశాల  చావిడి లో అందరమూ కలిసి గడుపుట గొప్పవరము. 

దామిని: మీనాక్షి ఉన్నచో బాగుండెడిది.   

కేశవుడు: గురువుగారున్నచో బాగుండెడిది

మాలిని : వర్షుడి జీవితమునందు శుభ గడియలు నడుచుచున్నవి మీనాక్షి జీవితమూ కుదుటబడుచున్నది వారి జీవితములు సుఖశాంతులతో వర్ధిల్లుననెడి భావన ఎంత హ్లాదమును కలిగించును. వారున్నంత స్థానములకు చేరుటయే కదా మనకు కావలసినది. 

అరుణ: మనిషికి కావలసినది దక్క నప్పుడు ఎక్కడున్ననూ లాభమేమి?

హృద: అరుణ అక్క గారు వర్షుని పుస్తకములను విడుదల చేయుట పెను సంచలనము.  మానవ వనరుల (హెచ్ ఆర్ డీ మినిష్టర్) శాఖామాత్యులు సభకు విచ్చేసినారన్న రాజధాని లో అక్కగారి ప్రభ ఎంతున్నదో తెలియుచున్నది.  అక్కగారి గురించి వినుటయే కానీ చూచుట ఇదే మొదటిసారి. అక్కగారికి అందరు జేజేలు చెప్పండి. అందరూ పెద్ద ఎత్తున హర్షనాదములు  చేసిరి. 

మనమందరము ఒకరి గురించి ఒకరు వినియున్నాము ఇప్పుడు మదనగోపాలుని దయవల్ల కలుసుకొనుటకు అవకాశము కలిగెను.   

హృద: అక్కయ్యగారు మీరు వర్షుడు లేడని మరచి ముంగీస లో వర్షుని చూడవలెను 

కేశ: అట్లే మీనాక్షి లేదని మరచి అగస్త్యలో ఆమెను చూడవలెను.   

మంజు: అగస్త్య వచ్చుచున్నాడా! మీనాక్షి గారు వచ్చినచో తల్లి బిడ్డలు కలుసు కొందురు కదా!

మాలిని: నువ్వు తగ్గుమమ్మ తల్లి ఎచ్చటున్నదో యని వాడికి తపన కలగవలెను. తల్లి కొరకు వాడు తహతహ లాడవలెను.  అంతవరకూ ఎవ్వరూ వాడికి అగస్త్యుడికి   మీనాక్షి జాడ తెలపరాదు ఇదే వర్షుడి ఉద్దేశ్యము ఇదే నా ఉద్దేశ్యము.  మాలిని "అరుణా, ఇంకనూ సుందరి రాలేదేమి ?" అనుచుండగా ఆకాశములో  

  శా.  హోరెత్తిం    చెవిమా   నమాక   శమునం    దంగార    చెంగావి లో

     తీ రే చూ    డగసిం     గనాద     మదియే      దట్టంగ     కర్ణంబు   లం      

      తారాడ       ప్రభవిం     చునుర్ర    నుశబ్ద        ప్రకంప    నే హెచ్చు చూ

      పారాడ     అవరో      హణా క్ర     మము లో   భీతిల్ల      రావీక్ష    కుల్ 

హోరెత్తించె  విమాన మాకశము   నందంగార చెంగావిలో, తీరేచూడగ  సింగనాద మదియే   దట్టంగ   కర్ణంబు లం      తారాడ  ప్రభవించు   నుర్రను శబ్దప్ర కంప నేహెచ్చు చూ  పారాడ   అవరోహణా క్రమము లో   భీతిల్లరా వీక్షకుల్ 

మబ్బులలో  మెరియుచున్న  విమానమగుపించగా  అందరూ  తలయెత్తి పైకిచూచుచుండిరి.  అప్పుడు అరుణ " అంగార (నిప్పు) చెంగావి (మనోజ్ఞమైన ఎర్ర రంగు)లో పోవు విమానము నందెవరున్ననూ  సుందరి అని పిలిచినంతనే ఆమెను  గుర్తు చేయుచూ చెవులందు విమాన ఘంకారము  సింగినాదం వలె  వినిపించుట ఎంత విడ్డూరము."అనెను. మాలిని  విమానము క్రిందకి దిగుచున్నట్లున్నది శబ్దము పెరుగుచున్నది  అనెను. బసవడు "దిగినట్టే దిగి మరల పైకి పోయినది  అయిననూ ఈ పల్లె టూరిలొ విమానమెందుకు దిగును?" అనెను.  

 దామిని "సరిగా చూచినచో విమానము దిగుచున్నది”అనెను. “అది సుందరి కావచ్చునేమో" అని హృదయాలజిస్ట్ అనగా  మంజూష  “హాస్యమునకైననూ హద్దుండవలెను కదా దామినీ మీ ఆయనకిక వైద్యము తప్పదు" అనెను. అదివిని కోపముతో మాలిని "ఇంటి వద్ద దామిని అన్నచో ఊరుకొనుచున్నాను ఇచ్చట పేరుపెట్టి పిలిచినచో తాట తీసెదను అక్క అని పిలువుము  " అని మంజూషను హెచ్చరించెను. మంజూష బిక్క మోహము వేయగా దామిని మంజూషను దగ్గరికి తీసుకొని " ఎందుకమ్మా చిన్నదానిని అట్లు బెదిరించెదవు " అనెను. “ఇది చిన్నదా పెండ్లి చేసిన ఇద్దరి పిల్లలను కని  యుండెడిది" అని అరుణతార  దామిని వద్ద 

గారాలు పోవుచున్న మంజూషను చెవి నులిమెను. ఇంతలో కేశవుడు విమానము పడిపోవుచున్నది పడిపోవుచున్నది. అని కేకలు వేసెను, భానోజీరావు గారు మొదట  భయపడి తు.. తు అని ఉమ్ముకొని తరువాత తేరుకొని “ఈ వెదవె వడో గానీ మన నెత్తిపై తారటలాడు చున్నాడు.” అనగా   కళాబృందమంతయూ “మాకెందుకీగోల కూలిన కూలవచ్చు”  అనుచూ విశాల ముందటి  ప్రాంగణము నొదిలి విడిది గృహములోకి పరుగిడిరి నక్క, బంటి, ఏనుగు, కొత్త అందరూ లోనికి పోగా పిల్లి మాత్రము నిర్బీతిగా నిలిచి చూచుచుండెను.

విమానము క్రమముగా క్రిందకు జారుడు బల్ల పైనుండి పిల్లవాడు జారునట్లు జర్రని జారి అందు మనుషులు అగుపడ పిల్లికి కాళ్ళు వణికెను  పిల్లి కూడా లోపలకు పారిపోయెను.  ఆమె లోపలి పరిగెత్తుచుండ అప్పటికే లోపలి చేరిన కళాబృందము " మ్యావ్ .. మ్యాప్ .. " అని అరుచు చుండ అందరూ పెద్దగా పగలబడి నవ్వుకొనిరి.  అరుణ " మన పిల్లే సందేహములేదు చిందులు తొక్కుచున్నది " అనెను. ఈ లోగా పార్వతి తన పెద్దమ్మతో అచ్చటికి చేరెను. పార్వతి "పక్కనున్న హైస్కూల్ ఆటస్థలములో దిగుటకొరకు విమానమును గుండ్రముగా త్రిప్పుచున్నాడు" అనెను. 

పార్వతి  కేశవుని వద్దకుపోయి పలకరించుచుండగా పార్వతి చాలా ఎదిగిపోయెను మంచి ఛాయ దేరి పండువలె నున్నది  అని మాలినిగారు అనగా . “ఏ పండు వలే నున్నది?” అని హృదయాలజిస్ట్ అనగా అరుణతార " మీ ఇంట పండిన సపోటా వలే నున్నది." అనెను   బసవడు అట్లే పార్వతిని  చూచుచూ   మాలినిగారికి దొరికిపోయి తలతిప్పుకొనెను.  అగస్త్యుడు "ఉద్యోగమొచ్చిన పిదప బసవడికి  కూడా కళ  వచ్చెను" అనెను.    

అందరూ పక్కనే ఉన్న విశాల ఆటస్థలమందు ప్రవేశించిరి. అందరూ తలఎత్తి చూచోచూ నిలవగా సుందరి వ్యోమయానమును గుండ్రముగా త్రిప్పుచూ వర్తులాకార సోపానములు దిగునట్లు దింపుచున్నది. దీని వైమానిక వయ్యారమంతయూ వొలక బోయుచున్నది అని మంజూష అనగా ఇప్పుడు దీని వైమానిక కళ అంతయూ చూపిగాని వాలదు అని తార అనెను.  అరుణతార, మాలిని, రంజిని కుటుంబము, కళాబృందమే కాక ఊరి జనులు పిల్లలు అంతా  విమానమును చూచుటకు వచ్చిచేరినారు.

     శా. గాండ్రించం  గపుల     ల్లె మీద       మరియా    గాండ్రింపు   జాల్వారు  చూ

      గుండ్రంగ   దిగుచుం    డగా ప్ర       భలుగాం     గేయాశ్త్ర      నాద శ్రు    తిన్

      చం డ్రాగ్నిన్   కొనివ    చ్చుయాన   మునుకాం   చిరాప్ర     జానీక    మున్

      కండ్రీకా    నవిమా     నమాగ       మగువే      కుప్పించి    లంఘించ   గా         


 గాండ్రించంగ  పులల్లె మీద (ఆకాశములో) మరియా  గాండ్రింపు   జాల్వారుచూ , గుండ్రంగ   దిగుచుండగా  ప్రభలు  గాంగేయాశ్త్ర   నాద శ్రుతిన్ ( భీష్మాస్త్ర శబ్దము తో ) చండ్రాగ్నిన్ కొనివచ్చు  యానమును కాంచి రా ప్రజానీకమున్ కండ్రీకాన( పొలమున)  విమానమాగ మగువే కుప్పించి లంఘించగా. 

సుందరి విమానము నుండి దిగి , తల్లిని దింపి మెల్లగా అరుణతార వద్దకొచ్చి వంగి కాళ్లకు నమస్కరించెను. "ఛీ ఛీ లేమ్మా ఎందుకిదంతా" అని తార అనుచుండగా "అమ్మ మరొక్కసారి నీకాళ్లకు మ్రొక్క నివ్వుము అని వంగిసుందరి తనుసంపాదించిన  పైలట్ అనుమతిని ఆమె కాళ్లవద్ద నుంచి నమస్కరించెను.అయ్యోఇది ప్రభుత్వ(డిజిసిఏ)  మిచ్చిన లైసెన్స్ అమ్మా అని అనుచుండగా  సుందరి కన్నీళ్ల పర్యంతమయ్యెను. 

తే. నీవు గాకప్ర  భుత్వమ నినఎ  టుండు   

మనసు  నిండుగ దయగల మాత  రెండు   

నిమిష  ములునీప దాలంట నిమ్ము, బిడ్డ 

నీఋ  ణమెటులు తీర్చున నెవరి కెరుక

పెద్దల సభలో కూర్చొను పెద్దమ్మ ప్రభుత్వమనిన నీవే కదమ్మా! ఇంకొక రెండు నిమిషములు నీ పాదములంటనిమ్ము తల్లీ, నాబిడ్డ నీ ఋణము ఎట్లు తీర్చునో కదా! యని తులశమ్మగారు వేడుచుండగా అరుణతార పాదములనంటిన బిడ్డ కన్నీరు కార్చుచుండ అరుణతారకు కూడా దుఃఖము పొర్లుకొచ్చెను. దుఃఖమును దాచకుండ పెద్దామె పెట్టునేడ్చు చుండ అందరి నేత్రములు వర్షిచుచుండెను. మానవ సమ్మందముల మాధుర్యమ నిర్వచనీయము. ఇంతలో పిల్లి పాపాయమ్మ” ఇంత  ధైర్య సాహసాలున్న పిల్ల, ఆకాశంనుంచి దిగిన పిల్ల ఇట్లేడ్వవచ్చా?  నేను రంగము మీద తప్ప పైన విడిగా ఏడవనమ్మా? అని సోత్కర్షతో ఓదార్చుచుండెను. ఇదివిని నక్క నాగేశ్వరావుకు కడుపులో దేవి నట్లయ్యెను, "అవునమ్మా సుందరీ ఈవిడ చాలా ధైర్యస్తురాలు ,ఒక్క సారి విమానమెక్కి  స్టార్ట్ చెయ్యమ్మా, ఈవిడ ధైర్యం ఎంతో తెలుస్తుంది ! అనుచుండగా సుందరి నవ్వాపు కొనలేకుండెను.  కొత్తగా వచ్చిన కొత్త సుబ్బారావ్ మ్యాప్ .. అని అరిచెను. దానితో అందరి అశ్రువులు మాయమయ్యి ఎల్లడా నవ్వులు తాండవించెను. అందరు ఆనందముగా విడిది గృహమున కేగిరి.  

3 comments:

  1. సుందరివ్యక్తిత్వం తల్లిపెంపకంకనిపించాయాఅదే కాళ్ళకి నమస్కరించేదృశ్యం అదిలేకపోతే ఈ భాగానికిసుందరికేరక్టర్ కి అర్ధంలేదు

    ReplyDelete
  2. శార్ధూల పద్యము రచయితకు విమానాల పట్ల ఉన్న మక్కువ ను, తేటగీతి పద్యం సుందరికి, ఆమె తల్లికి అరుగుతార పట్ల ఉన్న కృతజ్ఞతను తెలియచేస్తున్నాయి.

    ReplyDelete
  3. నేను తొలి సారి మీ బ్లాగ్ ఈ రోజే చూశసర్,మీ బ్లాగ్ నోటిఫికేషన్ రావాలంటే ఏమి చేయాలి.

    ReplyDelete