నైమిశారణ్యమున గోమతి నది వొడ్డున ఒక చెట్టుక్రింద కూర్చొని ధ్యానమందు నిమగ్నమైయున్న ఒక కాషాయ ధారి అయిన యోగి కనులు తెరచెను. అతడి పెదవుననుండి
అణిమాసిద్దే, లఘిమాసిద్దే, ఈశ్విత్వసిద్దే, ప్రాకామ్య సిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, ప్రాప్తిసిద్దే, సర్వకామసిద్దే - ఏక రేఖాయమ్ - ఒకటవ పాదము గృహము దాటెను
బ్రహ్మ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి ద్వితీయ రేఖ యమ్ రెండవ పాదము మధురవాడ నందు పడెను.
కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి. శబ్దాకర్షిణి, స్సర్శాకర్షిణి¸రూపాకర్షిణి, బీజాకర్షిణి¸ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశాపరిపూరకచక్ర స్వామిని, గుప్తయోగిని మూడవ పాదము క్షేత్ర గృహమునందు పడెను.
“స్వామీ ఎవరి గూర్చి మాట్లాడు చున్నారు.” “ఒక యోగినికి కుండలిని మేల్కొనెను” మీకు నిత్యమూ భోజనము తెచ్చి యుంచుచున్నాము మీరు స్వీకరించుటలేదు. నేడైననూ భోజనము చేయవలెను అనగా “మీరు తెచ్చిన భోజనము నేను ఆరగించుచున్నాను ఆహారం భౌతికంగా స్పృసించ కున్ననూ మీరు నాకు నైవేద్యముగా నర్పించినవి నా ఆకలి తీర్చినవి.”
***
ఒక ఆరుగురు మనుషుల గుంపునుండి ఒక స్వరము అరేయ్ ఎవర్రా అక్కడ గేటు దగర ఎవరో లోపలకి వస్తున్నారు పెంచలయ్యగారు ఎవ్వరినీ లోపాలకి పంపవద్దుఅనారు. “లేదయ్యా ఎవ్వరినీ పంపలేదయ్యా” గేటువద్దనుండి కావలి వారు కేకపెట్టిరి.
ఆరుగురు యోధుల ఆ సమూహమందు ఒకడు " నాకెవరూ కనిపించలేదురా!"
రెండవవాడు " ఎవరో వస్తున్నట్టు అనిపించింది "
మూడవవాడు " ఎహ్ ఎవ్వరూ లేరు అంతా నీ భ్రమ"
నాల్గవవాడు " అందుకే తక్కువ తాగాలి నాలా, నాకు ఎవరో వస్తున్నట్టు అనిపించెను"
ఐదవవాడు " అనిపించడమేటిరా సన్నాసుల్లారా ఎవరో బాబుగారి గదిలోకి కూడా వెళ్ళిపోతేనూ .
ఆరవవాడు:"ఓరినీ యమ్మోరేయ్,లోపల బాబు తుపాకట్టుకొని కూసున్నడు,లోపలికెవరైనా వత్తే మననేసేస్తాన్నాడు"
***
బావా ఎందుకు బావా పోను ఆపీసావు
పెంచలయ్య గుడ్లు మిటకరించి చూచు చుండెను
ఎటి బావా మాటాడకుంటన్నావు , మట్టిబుక్కడంనాఅగయిపోనాడు
చేతిలో టుపాకట్టుకొని కూకోని ఎందుకురా జడుత్తన్నావు
ముందు తుపాకీ పక్కనెట్టి మందేసియాయ్ ఆ వర్సా గాడిని పోలీసులొట్టు కోయారు
మనోడికి పీజులు కొట్టీసినాయి. ఏట్రా ఆడంటే అంట జడుత్త న్నావు
ఒర్ ఆదీ , దాసు పల్లకొండ్రా ఆ వరసాగాడ్ని అరట్టు సేసేరని ఎవడో అభిమాని సూసి అందరితో సెప్పేసాడట , దాంతో అని ఆపి వణకసాగెను
ఆ దాంతో... ఏటైపోద్ది ఇనస్పెట్టరు నీ సీటులో ఉన్నదో
సన్నాసినాకొడకా సెప్పినదినారా , మందు కొంచెం పోయారా .. ఈ రేత్రి కాడ వందలమంది స్టేషను కాడ పోగయ్యారట. వర్ష అక్కడ్నేడు ఎక్కడికటికెల్లిపోనారో సెప్పనేదు గానీ నన్ను పోనాపేసి తొంగోమన్నాడు.
రేత్రి కూసింత జాగ్రత్త ఎవుడైన వొచ్చి గుడ్లు ఎక్కనాగే త్తాడు , మాపూసి ఏటినేదని సెప్పాడ్రా!
ఎవుడై ఆ సెప్పినోడేవుడ్రా " జిల్లా ఎస్ పీ రా "
బావా హాల్లోకి ఎవరో ఆడమనిషి వచ్చింది బావా!
దాసు పోయి సూసి రారా! దాసు పోయి చూసి వచ్చాడు
పెంచ ఆ దేవుడమ్మ సోపాలో కూకోంది , దాని మొఖం సూత్తే భయమేత్తంది!
మంచిపనయ్యిదిరా దానిగురించి ఈ బాధలన్నీ, దాన్నేసేసి ఈ పొలంలో పాతేత్తే అసలు గొడవే ఒగ్గిపోద్ది. అంటూ తుపాకీ పట్టుకుని హాల్లోకి ప్రవేశించెను. బ్రిష్…. వెనుకనుంచి ఒక్కటి కాల్చగా ఆ భీషణాకారం తలత్రిప్పి చూసి నవ్వెను. నివ్వెరపోయిన పెంచలయ్య ముందుకి వెళ్లి బ్రిష్ ... బ్రిష్.. మరి రెండు తూటాలు కాల్చెను. క్రమేపీ ఆమె ఆకారం పెరుగుచున్నది, కళ్ళు అగ్ని గోళ ములవలె మండుచున్నవి. ఏనుగు ముందు నిలచిన పిల్లికూన వలే నున్న పెంచలయ్యను ఆమె ఉరిమి చూచెను. పెంచలయ్య కాళ్ళు వణికినవి, గొంతు తడారెను, వెన్నులో చలి పుట్టెను జడుసుకుని ఆత్మ రక్షణ కొరకు మిగితా మూడు తూ టాలు దగ్గర నుంచి ఆమె గుండెల్లోకి పేల్చి క్రిందకు వాలెను. లోపలి గదిలో గిలక రుచుకుపోయిన ఆది దాసులు పరుగు పరుగున హాల్లోకి వచ్చి పెంచలయ్యను కదపగా అతడు వెంటనే లేచెను.
సంపీసానురా, ఆ సోపా యెనక పడిపోనాది
సంపీడమేటి బావా దేవుడమ్మ ఎల్లిపోనాది తలుపు తీసుకొని నాకల్ల తో నాను సూసాను
ఒరేయ్ దాసు ఎట్రా ఆది ఇలాగంటన్నాడు ?!
నిజమేరా నన్ను కూడా సూసాను
నీ యమ్మ నాకొడకల్లారా మందెక్కువయిపోయి నన్నే పిచ్చోన్ని సేత్తా ర్రా!
ఇద్దరినీ తుపాకి వెనక భాగంతో గుద్దుతూ ఆరు తూటాలు కాలిత్తే ఎవ్వుర్తైనా బతుకుతాదిరా?
సోపా వెనకాలెవ్వులూ లేర్రా పెంచ
ముగ్గురూ బైటి కి పరిగెత్తారు ఒరేయ్ రమేసూ ఇటు ఆడ గుంటెళ్లిందా?
లేదయ్యగారూ, మేమంతా ఇక్కడే ఉన్నాము ఎవ్వరు రాలేదయ్యా
ముగ్గురు లోపాలకి ప్రవేశించారు
సోఫాపై కరి పరిమాణములో కూర్చొన్న దుర్గ రూపు కనిపించెను
ముగ్గురూ ఆమె కాళ్ళమీద పడ్డారు పెంచలయ్య " తల్లే తప్పయిపోనాది ఒగ్గేయి
నాకు ఎం ఎల్ ఏ వొద్దు ఏటొద్దు ఎల్లి వర్ష బాబుని ఇడిపించుకొత్తా, అంతవరకూ ఈళ్ళిద్దరూ నీ కాల్ల కాడే కూకుంటారు" ఊ……మ్ హు….. ఊ……మ్ హు….. అతడు చెప్పుచున్నప్పుడు ఆమె ఊపిరి ధ్వని వాసుకి బుసవలె వినిపించుచూ అంతకంతకూ పెరుగుచూ ఆ గదంతయూ మారుమ్రోగుచుండెను. ఆమె కనులు విస్ఫులింగములు చిమ్ముచుండెను. కాస్సేపటికి ఆమె ఉగ్రత తగ్గి ఆమె పరిమాణము కూడా తగ్గెను. ఆమె లేచి తలుపు తీసుకొని బైటకు నడిచెను.
This episode is really visualised. Excellent description.
ReplyDeleteBeautifully written episode.
Hats off!!!!!!
Thank you very much for your response
ReplyDeleteఈ భాగం ఊహాతీతం.యోగి విదిష కదలికలను వర్ణించిన విధానం అద్భుతం.దర్శించినట్టే అనిపించెను.
ReplyDeleteThank you sahitya garu I got great feelings
ReplyDeleteZomato Careers – Zomato Delivery Boy, Job, Salary, & join,
ReplyDelete